మత్స్యకారుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చెక్‌ను అందజేస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులు
సాక్షి, శ్రీకాకుళం: మత్స్యకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన ఆదివారం బందరువానిపేట గ్రామానికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుతో కలిసి వచ్చారు. పడవ బో ల్తా పడి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాల ను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు మేర ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదం జరిగిన ఒక్క రోజులోనే ఆర్థిక సాయం అందించడంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. మృతులు పుక్కళ్ల గన్నయ్య, పుక్కళ్ల గణేష్, రాయితీ సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు చెక్‌లను అందజేయడంతో పాటు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున నగ దు సాయం కూడా ఆ కుటుంబాలకు అందించారు.
మృతుల కుటుంబానికి వైఎస్సా ర్ ఫించను కానుక త్వరితగతిన మంజూరు చేయాల ని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సూచించారు. కార్యక్రమంలో తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా మత్స్యకార సంఘ అధ్యక్షుడు కోనాడ నర్సింహులు, మత్స్యశాఖ జేడీ పీవీ శ్రీనివాసరావు, ఎఫ్‌డీఓ బగాది సురేష్‌కుమార్, మైలపల్లి జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకి ఒక హార్బర్ మంజూరు
రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో గల ప్రతి జిల్లాకు ఒక హార్బర్ మంజూరు చేసినట్లు మంత్రి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు బుడగట్లపాలేంకు మంజూరు చేశామని, త్వరలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. మంచినీళ్లపేట వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే హార్బర్‌గా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా పనులు జరుగుతున్నాయని తెలిపారు.
బందరువానిపేట లేదా కళింగపట్నం, ఇద్దివానిపాలేం, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రాళ్లపేటకు ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి నిపుణుల కమిటీ పర్యటన జరిగిందన్నారు. హార్బర్‌లు లేదా ఫ్లోటింగ్ జె ట్టీల నిర్మాణం తర్వాత అత్యాధునిక బోట్లు మంజూరు చేసి మత్స్య సంపద దొరికేలా ప్రణాళిక వేస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment