fisher mans
-
ఏపీ చేపల వేట నిషేధం
-
సముద్రంలో ఛేజింగ్ సీన్
-
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం
-
పాకిస్థాన్ దుశ్చర్య : 30 మంది భారతీయులను అదుపులోకి..
గాంధీనగర్: భారత్, పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన 30 మంది మత్స్యకారులను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. ఐదు పడవలను పాక్ తీర గస్తీ దళాలు సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, వీరంతా గుజరాత్‌లోని పోరుబందర్ తీరం నుంచి చేపల వేటకు బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, గత 25 రోజుల వ్యవధిలో 20 పడవలు, 120 మంది భారత జాలర్లను దాయాది దేశంలో అదుపులోకి తీసుకుంది. దీంతో భారత జాలర్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా, ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ మత్స్యకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు పాకిస్థాన్ ఆధీనంలో 1200 పడవలు, 500 మందికి పైగా జాలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ పడవలను జనవరి 31వ తేదీన బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. ఈ క్రమంలో ఓ పాక్ పౌరుడితో అదుపులోకి తీసుకుని, మూడు బోట్లను స్వాధీనం చేసుకున్నాయి. -
మత్స్యకారులపై గులాబ్ తుఫాన్ ప్రభావం
-
24 గంటల్లో మత్స్యకారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
సాక్షి, శ్రీకాకుళం: మత్స్యకారులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన ఆదివారం బందరువానిపేట గ్రామానికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుతో కలిసి వచ్చారు. పడవ బో ల్తా పడి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాల ను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షలు మేర ఆర్థిక సాయం అందజేశారు. ప్రమాదం జరిగిన ఒక్క రోజులోనే ఆర్థిక సాయం అందించడంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. మృతులు పుక్కళ్ల గన్నయ్య, పుక్కళ్ల గణేష్, రాయితీ సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు చెక్‌లను అందజేయడంతో పాటు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున నగ దు సాయం కూడా ఆ కుటుంబాలకు అందించారు. మృతుల కుటుంబానికి వైఎస్సా ర్ ఫించను కానుక త్వరితగతిన మంజూరు చేయాల ని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సూచించారు. కార్యక్రమంలో తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, జిల్లా మత్స్యకార సంఘ అధ్యక్షుడు కోనాడ నర్సింహులు, మత్స్యశాఖ జేడీ పీవీ శ్రీనివాసరావు, ఎఫ్డీఓ బగాది సురేష్‌కుమార్, మైలపల్లి జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాకి ఒక హార్బర్ మంజూరు రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో గల ప్రతి జిల్లాకు ఒక హార్బర్ మంజూరు చేసినట్లు మంత్రి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు బుడగట్లపాలేంకు మంజూరు చేశామని, త్వరలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. మంచినీళ్లపేట వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే హార్బర్‌గా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా పనులు జరుగుతున్నాయని తెలిపారు. బందరువానిపేట లేదా కళింగపట్నం, ఇద్దివానిపాలేం, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రాళ్లపేటకు ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి నిపుణుల కమిటీ పర్యటన జరిగిందన్నారు. హార్బర్లు లేదా ఫ్లోటింగ్ జె ట్టీల నిర్మాణం తర్వాత అత్యాధునిక బోట్లు మంజూరు చేసి మత్స్య సంపద దొరికేలా ప్రణాళిక వేస్తున్నామని వెల్లడించారు. -
గల్లంతైన 12 మంది మత్స్యకారులు సురక్షితం..
శ్రీకాకుళం: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 12 మంది మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు ఆధికారులు ధృవీకరించారు. చెన్నై తీరప్రాంతంలో బోటును గుర్తించామని చెన్నై కోస్టుగార్డ్ తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 7న చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఈ నెల 16 నుంచి వీరంతా ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గల్లంతైన మత్స్యకారులంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందినవారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబసభ్యులు పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. ఏపీ నుంచి నేవీ హెలికాప్టర్, తమిళనాడు నుంచి డోర్నియర్ విమానాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక చర్యలను సీదిరి అప్పలరాజు పర్యవేక్షించారు. ఉపాధి కోసం వారంతా చెన్నైకి వెళ్లినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్తుంటారు. సురక్షితంగా బయట పడ్డ మత్స్యకారులు వీరే 1. కోడ సోమేష్ బోట్ డ్రైవర్ 2. కోడ జగన్నాధం 3. మోస సూర్యనారాయణ 4. అంబటి నీలకంఠం 5. నిట్ట జోగారావు 6. కామేష్ 7. రాజు 8. శివాజి 9. బావయ్య 10. రవి 11. అప్పారావు 12. బాబు -
కొత్తగా 9 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కీలక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అదేవిధంగా మత్స్యకారుల కోసం అత్యాధునిక పద్ధతులను తీసుకురావాలని తెలిపారు. రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మత్స్యకారుల ప్రధాన వృత్తి వేట, దాని కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. కొత్తగా 9 చోట్ల రెండు విడతల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. దాదాపు రూ. 2,901.61 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఫేజ్ –2 హార్బర్, నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో మొదటి విడత కింద రూ.1,304 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. (ఏపీలో థియేటర్లు, మాల్స్ బంద్) అదేవిధంగా రెండో విడత కింద రూ. 1597.61 కోట్లతో మరో ఐదు చోట్ల హార్బర్ల నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా వాడ్రేవు, కొత్తపట్నం, శ్రీకాకుళం జిల్లా బూదగట్ల పాలెం, ఎడ్డువాని పాలెం, విశాఖ జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ కోసం ఈ డబ్బును ఉపయోగిస్తూ.. మొత్తంగా 9 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడతామని సీఎం జగన్ తెలిపారు. డీప్ సీ ఫిషింగ్ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి మిగిలి ఉన్న భూసేకరణ సహా అన్ని ప్రక్రియలు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణానికి నష్టం చేకూర్చే ప్రాజెక్టులు బదులుగా పర్యావరణ హితమైన ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని అధికారులకు వైఎస్ జగన్ సూచనలు ఇచ్చారు. (ఆ లేఖపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు) -
మత్స్యకారుల విడుదలకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు..
-
కచ్చలూరు ప్రమాదం : మత్స్యకారులకు ప్రోత్సాహం అందజేత
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 26 మంది టూరిస్టులను రక్షించిన మత్స్యకారులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందజేసింది. 20 మందికి రూ. 25 వేల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నజరానా ప్రకటించగా, శనివారం రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ఈ నగదు ప్రోత్సహాన్ని మత్స్యకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంత ఉదయభాస్కర్, ఐటీడీఏ పీఓ నిశాంత్ కుమార్‌లు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి.. బంధీలయ్యారు!
సముద్రమే వారి ప్రపంచం... చేపల వేటే వారి జీవనాధారం. ఉన్న ఊళ్లో ఉపాధి లేక సుదూర ప్రాంతానికి పయనం. గమ్యం తెలియని సంద్రంలో... ఏది మన దేశ మో... ఏది పరాయి దేశమో... తెలుసుకోలేని అమాయకత్వం. ఇదే వారి కొంప ముంచుతోంది. మొన్న శ్రీలంక... నిన్న పాకిస్తాన్... నేడు బంగ్లాదేశ్.. ఇలా ఏదో ఒక సరిహద్దు దేశంలోకి పొరపాటున చొరబడుతున్నారు. అక్కడి రక్షణశాఖలో బందీలుగా మారుతున్నారు. బతుకు తెరువుకోసం వెళ్లిన తమ వారు ఎప్పుడు ఏ చిక్కుల్లో పడతారో తెలియక ఇక్కడివారు నిరంతరం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బందీలైనవారు విడుదల కాక... మళ్లీ మరో ఎనిమిది మంది వేరే దేశంలో చిక్కుకోవడంతో తిప్పలవలసలో కుటుంబాలు కలవరపడుతున్నాయి. సాక్షి, విజయనగరం : విజయనగరం జిల్లాకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ జలాల్లో ప్రవేశించారు. ఈ విషయం తెలిసి ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దసరా పండగకు వస్తానని చెప్పి వెళ్లిన మత్స్యకారులు బందీలుగా చిక్కడంతో ఆ కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి. వేటకు వెళ్లేటప్పుడు కుటుంబంతో సరదాగా గడిపి వెళ్లిన మత్స్యకారుల కుటుంబాలు తమవారు బందీలుగా చిక్కారని తెలియగానే ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు వస్తారో... అసలు వస్తారో రారో... తెలియక అల్లాడిపోతున్నారు. కనీసం తమవారితో అధికారులు ఫోన్లో మాట్లాడించేలా చూడాలని బోరున విలపిస్తున్నారు. బందీలుగా చిక్కినది ఇలా... భారతదేశ సముద్ర జలాల్లో వేట కోసం తిప్పలవలసకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు వెళ్లారు.. పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి వెళ్లి చేపల వేట చేస్తుండగా ఆ దేశ రక్షణ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. విషయం గురువారం రాత్రి తెలియడంతో తిప్పలవలస గ్రామంలో అలజడి మొదలైంది. పూసపాటిరేగ మండలం తిప్పలవలసకు చెందిన మారుపల్లి పోలయ్య, రాయితి అప్పన్న, వాసుపల్లి అప్పన్న, మారుపల్లి నర్సింహులు, బర్రి రాము, వాసుపల్లి అప్పన్న, రాయితి రాములు, వాసుపల్లి కాములు విశాఖ హార్బర్ నుంచి ఎఫ్‌వీఎస్‌ఎం 800 నంబర్ బోటులో సెప్టెంబర్ 24వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లారు. పొరపాటున వారు భారత సరిహద్దు దాటి బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో ఈ నెల రెండో తేదీ సాయంత్రం నాలుగు గం టల సమయంలో వారిని బంగ్లా రక్షణ దళాలు పట్టుకున్నాయి. ఈ విషయాన్ని వారితోపాటే వేట చేస్తున్న మరికొందరు బోటు యజమాని వాసుపల్లి రాముకు సమాచారం ఇచ్చారు. నిత్య ప్రమాదం ఉన్న ఊళ్లో వేటసాగక పోవడంతో ఇక్కడి మత్స్యకారులు వివిధ రాష్ట్రాల్లో చేపల వేటకు కూలీలుగా మారుతున్నారు. అలా వేటాడే సమయంలో ప్రకృతి ప్రకోపానికి బలై మరణశయ్యపైకి చేరుతున్నారు. కొన్ని ప్రమాదాల్లో మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కావట్లేదు. గతేడాది సెప్టెంబర్‌లో చింతపల్లికి చెందిన మైలపల్లి శ్రీను పారదీప్‌లో వేట చేసుకొని వస్తుండగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. పూసపాటిరేగ మండలం పతివాడ బర్రిపేటకు చెందిన సూరాడ రాము, వాసుపల్లి లక్ష్మణరావు, తమ్మయ్యపాలేనికి చెందిన బడే సత్తియ్య ఒడిశాలో గంజాం జిల్లా రామయ్యపట్నం రేవులో గల్లంతయ్యారు. ఇదే మండలం తిప్పలవలస, భోగాపురం మండలం ముక్కాంకు చెందిన కొంతమంది మత్స్యకారులు 2018 ఆగస్టు 15వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్‌కు వెళ్లారు. గతేడాది నవంబర్ 19వ తేదీన హార్బర్ నుంచి చేపల వేటకు బయలుదేరారు. నవంబర్ 29న పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించడంతో అక్కడి కోస్ట్ గార్డ్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో తిప్పలవలసకు చెందిన నక్క అప్పన్న, బర్రి బవిరీడు, నక్కా నరిసింగు, నక్క దనరాజు, భోగాపురం మండలం ముక్కాంకు చెందిన మైలపల్లి గురువులు ఉన్నారు. వారెవ్వరూ ఇంకా విడుదల కాలేదు.. కుటుంబ సభ్యుల రోదనలు బంగ్లాదేశ్‌లో బందీలుగా చిక్కిన తిప్పలవలసకు చెందిన వాసుపల్లి అప్పన్న ఇద్దరు భార్యలు మారుపల్లి తోటమ్మ, మారుపల్లి దానయ్యమ్మ విషయం తెలిసి బోరుమన్నారు. దసరా పండగకు వేట ముగించుకొని వస్తానని చెప్పి ఇంతలోనే బందీగా చిక్కావా అని కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన పాకిస్తాన్లో బందీలుగా చిక్కిన వారే ఏడాది కావస్తున్నా విడుదల కాలేదు. ఇక తమ వారి పరిస్థితి ఎమిటని గుండెలు బాదుకుంటున్నారు. బందీగా చిక్కిన వాసుపల్లి అప్పన్న తల్లి గురమ్మ రోదించిన తీరు అందరి హృదయాలను కలచివేసింది. 10 రోజుల్లో వేట ముగించుకుని వస్తామని చెప్పి ఇలా చిక్కుకోవడంతో ఆమె కలవరపడుతోంది. ఇంకా బర్రి రాము, వాసుపల్లి కాము, రాయితి రాము, వాసుపల్లి అప్పన్న, మారుపల్లి పోలయ్య, రాయితి అప్పన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విడుదల చేయించండి బాధిత కుటుంబాలను మెరైన్ సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ తారక్, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు బర్రి చినఅప్పన్న, పలువురు అధికారులు పరామర్శించారు. బందీలుగా వున్న మత్స్యకారులను తక్షణమే విడుదల చేయడానికి కేంద్రప్రభుత్వం స్పందించాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి -
కడగండ్ల ఉప్పెనలో ‘కడలి’ బిడ్డలు..
సాక్షి, పిఠాపురం: ఉవ్వెత్తున ఎగసిపడే అలల్ని ఊయలలుగా, అగాధ జలధిని గంగమ్మ ఒడిగా భావించే ధీరులు వారు. కడలి కడుపులోని మత్స్యసంపదను వేటాడడమే వారి బతుకు బాట. సముద్రంపై సునాయాసంగా వేట సాగించే వారికి.. అలా వేటాడి తెచ్చిన చేపలను ఒడ్డుకు చేర్చడం తుపానులో నావను నడపడమంత కష్టతరమవుతోంది. వారి కష్టాలను గట్టెక్కించే మినీ హార్బర్ నిర్మాణం పాలకుల కపటపు హామీలకే పరిమితమవుతోంది. ‘గెలిపిస్తే మీ సమస్యలను చిటికెలో తీరుస్తాం. మినీ హార్బర్ నిర్మిస్తాం’ అని నమ్మించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్వర్మ ఎన్నో వాగ్దానాల్లాగే దాన్నీ విస్మరించారు. దాంతో గంగపుత్రులైన మత్స్యకారులు.. వలలో చిక్కిన చేపల్లా వెతల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మత్స్యకారుల కష్టాలను గట్టెక్కిస్తామన్న సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ‘ఒడ్డు ఎక్కాక నావ తగలేసిన’ చందంగా ద్రోహం చేశారని మత్స్యకారులు మండిపడుతున్నారు. వందల బోట్లు, వేలమంది మత్స్యకారులు ఉన్న జిల్లాలో మూడు మండలాలకు చెందిన మత్స్యకారులకు మినీ హార్బర్ నిర్మాణం జరగకపోవడం పెనుసమస్యగా మారింది. చేపలవేటే ఆధారంగా సుమారు 20 వేల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తుండగా అతి ముఖ్యమైన జెట్టీలు లేక వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రాణాలకు తెగించిన సముద్రంపై చేపల వేట సాగించే వారిని జెట్టీ సమస్య పీడిస్తోంది. కాకినాడ నుంచి విశాఖ వకూ ఉన్న తీర ప్రాంతంలో కాకినాడలో తప్ప ఎక్కడా జెట్టీలు కాని, హార్బర్లు కాని లేవు. దీంతో కొత్తపల్లి, తొండంగి, తుని మండలాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, బోట్లకు లంగరు వేసేందుకు మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ సమీపంలోని హార్బర్లో మాత్రమే ఈ మండలాలకు చెందిన మత్స్యకారుల బోట్లు నిలిపి చేపల క్రయ విక్రయాలు జరిపే అవకాశం ఉంది తప్ప మరే ఇతర సౌకర్యాలు లేవు. ప్రణాళికలకే పరిమితం మత్స్యకారులు తమ అగచాట్లను గతంలో కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు దృష్టికి తెచ్చారు. దాంతో ఆయన మినీ హార్బర్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అనంతరం కొత్తపల్లి మండలం అమీనాబాద్ శివారు పెట్రోలు బంకు వద్ద సముద్రం పక్కనే ఉన్న సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని మినీ హార్బర్ నిర్మాణానికి అనువని అధికారులు గుర్తించారు. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మాణానికి ప్రణాళికలు సైతం సిద్ధమయ్యాయి. అయితే ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతూ రూ.300 కోట్లకు చేరింది. గతంలో కొత్తపల్లి, తొండంగి, తుని మండలాల్లోని మత్స్యకారుల బోట్లను కాకినాడ హార్బర్లోకి అనుమతించక పోవడంతో కొన్ని ఏళ్లుగా వారు ఉప్పాడ సమీపంలో ఉన్న ఉప్పుటేరుని జెట్టీగా ఉపయోగించుకుంటున్నారు. ఏ మాత్రం అనువుగా లేకపోయినా గత్యంతరం లేని స్థితిలో బోట్లను ఉప్పుటేరులోనే లంగరు వేసి, వేటాడిన చేపలు ఒడ్డుకు మోసుకొచ్చి నడి రోడ్డుపైనే విక్రయించుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. తొండంగి, తుని మండలాల మత్స్యకారులకు ఉప్పుటేర్లు లేకపోవడంతో బోట్లను సముద్రంలోనే లంగరు వేయాల్సి వస్తోంది. తుపాన్లు సంభవించినప్పుడు కెరటాల ఉధృతితో సముద్రంలోని బోట్లను ఒడ్డుకు తెచ్చే అవకాశం ఉండదు. జెట్టీ లేక సముద్రంలోనే లంగరు వేస్తే బోట్లు మునిగి తీవ్ర నష్టం చవిచూస్తున్నామని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. మామూలు సమయాల్లో బోట్లపై వేటకు వెళ్లి తిరిగి వచ్చి సముద్రంలోనే లంగరు వేయాల్సి వస్తోంది. విలువైన బోట్లకు రక్షణ కరువు జెట్టీలు లేక వేటాడి తెచ్చిన చేపలను దింపేందుకు బోటును ఒడ్డు వరకూ తీసుకు రావాల్సి వస్తోంది. దాంతో పాటు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అధికారుల హెచ్చరికల నేపథ్యంలో బోట్లు, వలల వంటి విలువైన సామగ్రిని అతి కష్టం మీద తీవ్ర వ్యయప్రయాసలకోర్చి గ్రామాలకు దూరంగా ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఎలాంటి రక్షణా లేకుండా ఒడ్డుకు చేర్చుకోవల్సి వస్తోంది. దీంతో విలువైన బోట్లకు రక్షణ లేకుండా పోతుంది. అత్యవసర పరిస్థితుల్లో బోట్లను ఒడ్డుకు చేర్చుకొనే ప్రయత్నంలో ఉన్న మత్స్యకారులకు హార్బరే సురక్షిత ప్రాంతం అవుతుంది. కానీ ఈ ప్రాంతంలో హార్బర్ లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బోట్లను తీవ్ర వ్యయప్రయాసలకోర్చి ఒడ్డుకు చేర్చుకోవాల్సి వస్తోంది. హార్బరు, జెట్టీలు లేక డీజిల్, ఐస్, వంట సామగ్రిలను కెరటాల అవతల లంగరు వేసిన బోట్ల వద్దకు పట్టుకువెళ్లి నింపుకోవాల్సిన అగత్యం తప్పడం లేదు. కెరటాల అవతల లంగరు వేసిన బోట్లలో డీజీల్, ఐస్, వంట సామగ్రి చోరీ అవుతున్నాయని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. కష్టంతో పాటు నష్టాలే ఎక్కువ.. వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చుకొని అమ్ముకోవడానికి హార్బర్లో అయితే అన్ని సౌకర్యాలూ ఉండడం వల్ల చేపలు పాడవకుండా వెంటనే అమ్మకాలు జరిగి మత్స్యకారులు నష్టపోరు. అయితే పై మూడు మండలాల్లోని మత్స్యకారులకు హార్బర్ లేక చేపల అమ్మకాల్లో తీవ్ర జాప్యం ఏర్పడి నష్టాలు తప్పడం లేదు. వ్యాపారులు కాకినాడ హార్బర్‌కే పరిమితమౌతుండడంతో ఇక్కడ వేటాడిన చేపలను వేరే వాహనాలపై కాకినాడ హర్బర్‌కు తరలించి అమ్ముకోవాల్సి వస్తోందని మత్య్సకారులు వాపోతున్నారు. -
మృత్యుంజయులు
వజ్రపుకొత్తూరు : బోటులో డీజిల్ లేదు. ఎటు వెళుతోందో తెలిపే దిక్సూచి పనిచేయట్లేదు. చుట్టూ రాకాసి అలలు.. ఎటుచూసినా తమను మింగేసేందుకు ఎగసిపడుతున్న సముద్ర ఆటుపోట్లు! అలలు ఎగసిపడుతున్నా మనోధైర్యం చెక్కుచెదరకుండా.. గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని సంద్రంపై కఠిన ప్రయాణం చేశారు. ఏ ప్రాంతంలో ఉన్నామో తెలియక ఆ మత్స్యకారులు నిద్రలేని రాత్రులు గడిపారు. వెంట తెచ్చుకున్న ఆహారమంతా పాడైపోయినా.. అదరలేదు. క్షణక్షణం.. భయంభయంగా నిశిరాత్రులు గడిపిన ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 రోజుల పాటు సముద్రంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన కాకినాడ మున్సిపాలిటీ పరిధి దుమ్ములపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు గరువారం సాయంత్రం 4.30 గంటలకు వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట సముద్ర తీరానికి చేరుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్ములపేటకు చెందిన గరికిన ఆనంద్, ఎరిపిల్లి సత్తిబాబు, పేర్ల సత్తిబాబు, ఎరిపిల్లి లక్ష్మయ్య, దాసరి కోయిరాజు, మారిపిల్లి సింహాద్రి, గరికిని అప్పారావు ఈ నెల 6న చేపల వేటకు బోటులో బయలుదేరారు. కాకినాడ 10వ వార్డు కార్పొరేటర్ మోసా పెత్రోకు చెందిన బోటులో వీరంతా భైరవ పాలెం వద్దకు వేట సాగించేందుకు వెళుతున్నారు. సుమారు 80 నుంచి 90 మైళ్లు ప్రయాణించే సరికి అలల ఉద్ధృతితో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో తెలియకుండానే బోటు 300 మైళ్లు దాటేసింది. బోటులో లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రి లేకపోడడంతో వీరంతా బోటులోనే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఇందులో దాదాపు రూ.3.75 లక్షల విలువైన ట్యూనా చేపలు కుళ్లిపోయాయి. దీంతో 700 కిలోల వరకు సముద్రంలోనే వదిలేశారు. మరో 800 కిలోల వరకు బోటులోనే ఉన్నాయి. దాదాపు రూ.2లక్షల విలువైన వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి. బోటు ప్రస్తుతం మంచినీళ్లపేట మత్స్యకారుల సాయంతో సహకారంతో తీరంలో లంగరు వేశారు. వీరికి నాలుగు రోజులుగా నిద్రాహారాలు లేవు. 10 రోజుల పాటు వారి వెంట తెచ్చుకు 400 లీటర్ల డీజిల్ ఖర్చయిపోగా తెర చాపల సాయంతో ప్రయాణించారు. జీపీఎస్ ద్వారా కళింగపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో వీరి బోటు ఉన్నట్లు గుర్తించి బోటు యజమాని పెత్రోకు సమాచారం ఇచ్చారు. మంచినీళ్లపేట మాజీ సర్పంచ్ గుళ్ల చిన్నారావు, ఇతర మత్స్యకారులు బోటును గుర్తించి అందులో మత్స్యకారులను తెప్పల సాయంతో గ్రామానికి తీసుకువచ్చారు. వారికి భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటుచేశారు. గ్లో సంస్థ ద్వారా వై.వెంకన్నచౌదరి మంచినీళ్లపేట చేరుకుని కాకినాడ మత్స్యకారులతో మాట్లాడారు. దారి ఖర్చుల కోసం రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వజ్రపుకొత్తూరు ఎంపీపీ జి. వసంతరావు, జి. పాపారావు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. -
మత్స్యకారుల సంక్షేమానికి రూ.12కోట్లు
సిరిసిల్ల: జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా రూ.12 కోట్లు కేటాయించామని కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. స్థానిక పొదుపు భవన్లో శుక్రవారం వివిధ కేటగిరీల్లో లబ్ధిదారులను డ్రా పద్ధతిన కలెక్టర్ ఎంపిక చేశారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులను డ్రా పద్ధతిన కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకార్మికులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. 47 సంఘాలకు చెందిన 133 మంది అభ్యర్థులు వివిధ పథకాల ద్వారా దరఖాస్తు చేసుకోగా 57 మందిని ఎంపిక చేశారు. చేపల రవాణాకు సంబంధించి 12 మంది దరఖాస్తు చేసుకోగా 11 మందిని ఎంపిక చేశారు. చేపలు పట్టే సామగ్రి, ద్విచక్రవాహనాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి బి.అంజయ్య, పశుసంవర్థక శాఖ అధికారి రమణమూర్తి, మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు పోలు లక్ష్మణ్, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలి
నెల్లూరు రూరల్ : మత్స్యకార సొసైటీలను ఏర్పాటు చేసుకొని, ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరాలని జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సీతారామరాజు సూచించారు. మత్స్యశాఖ కార్యాలయంలో ముద్ర రుణాలపై సొసైటీ సభ్యులకు బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మత్స్యపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గతేడాది 23.52 లక్షల చేపలు ఉత్పత్తయినా, వార్షిక తలసరి వినియోగం 9.5 కిలోల చేపల మేరే ఉందన్నారు. దీన్ని 13 కిలోలకు పెంచడం ద్వారా పోషకాహార లోపాలన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మార్కెట్లో తాజా చేపల అమ్మకం, ఎండు చేపల విక్రయం, హార్బరులో రిక్షాపై చేపల రవాణా, సంచార చేపల వాహనం, రిటైల్ దుకాణం, బతికిన చేపల అమ్మకం, ఎండు చేపల పరిశ్రమ, చేపల కియోస్క్, తదితర యూనిట్లను ముద్ర రుణాలను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ మేనేజర్ వెంకట్రావు మాట్లాడారు. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని సూచించారు. మత్స్యకార మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. రుణాలను సద్వినియోగం చేసుకుని, సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించాలన్నారు. మత్స్యశాఖ గూడూరు ఏడీ లక్ష్మీనారాయణ, ఎఫ్డీఓ చాంద్‌బాషా, కాలేషా, బీసీ కార్పొరేషన్ ఈడీ, బ్యాంకు అధికారులు, సొసైటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
పాకిస్థాన్ కు ధీటైన జవాబివ్వండి:మోడీ
రాజ్‌కోట్: భారతీయ మత్స్యకారుల పట్ల దారుణంగా వ్యవహరించిన పాకిస్థాన్‌కు దీటైనచర్య ద్వారా కేంద్ర ప్రభుత్వం తగిన బదులు ఇవ్వాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ డిమాండ్ చేశారు. అభివద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భాగంగా రాజ్‌కోట్‌కు వచ్చిన మోడీ మాట్లాడారు. ‘‘12 ఏళ్ల భావిక ప్రధానికి రాసిన లేఖ ప్రతి నాకు అందింది. చేపలు పట్టడానికి వెళ్లిన ఆమె తండ్రిని పాక్ భద్రతా దళాలు అపహరించాయి.మూడు నెలల క్రితం భావిక తండ్రి పాక్ జైల్లో చనిపోయాడు. అతనిని కడసారి చూసేందుకు ఆమె ఎదరు చూస్తోంది. తండ్రి ఎలా మరణించాడో తెలుసుకోవాలని చూస్తోంది. న్యాయం కోసం ఆమె ఆశిస్తోంది' అని మోడీ తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడే పాక్ కు భారత్ ధీటుగా జవాబివ్వాలన్నారు. -
జాలర్లను విడుదల చేసిన భారత్, శ్రీలంక
న్యూఢిల్లీ: భారత్, శ్రీలంకలు తమ అధీనంలోని మత్స్యకారులను సోమవారం విడుదల చేశాయి. ఇరు దేశాలూ చెరో 52 మంది మత్స్యకారులను విడిచిపెట్టాయి. ఈ పరిణామం ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య అవగాహనను మరింత పెంచుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారత్‌కు చెందిన 52 మంది మత్స్యకారుల్లో 20 మందిని మల్లాకం నుంచి 32 మందిని ట్రింకొమలై నుంచి శ్రీలంక విడుదల చేసింది. శ్రీలంకకు చెందిన 52 మంది మత్స్యకారులను భారత ప్రభుత్వం తమిళనాడు నుంచి విడుదల చేసినట్టు అధికార ప్రతినిధి వివరించారు. -
తల్లడిల్లుతున్న తీరప్రాంతం
రేపల్లె, న్యూస్‌లైన్: వరుస తుపానులతో తీరం తల్లడిల్లిపోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మాదీ తుపాను బలపడి తీవ్రంగా మారుతుందనే హెచ్చరికలు తీరప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నిజాంపట్నం హార్బర్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. వేటకు వెళ్లిన మత్య్సకారులు ఒడ్డుకుచేరాలని ఫోన్ మెసెజ్‌లను అందించారు. దీంతో సముద్రంలోకి వేటకు వెళ్లిన బోట్లు ఒక్కొక్కటిగా హార్బర్‌కు చేరుకుంటున్నాయి. వరుసగా గత రెండు మాసాలలో పైలీన్, హెలెన్, అధిక వర్షపాతాలు, లెహర్లతో ఇబ్బందులకు గురైన తీరప్రాంత ప్రజలు ‘మాదీ’ తుపాను హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఆక్టోబర్ మాసంలో పైలీన్, నవంబర్ మొదటివారంలో హెలెన్, చివరి వారంలో లెహర్ తుపానులు సంభవించడంతో సముద్రపు వేట పూర్తిగా నిలిచిపోయింది. ఒక్క తుపాను ప్రభావం నుంచి పూర్తిగా తేరుకోకముందే మరొక తుపాను ముంచుకొస్తుండడంతో తీరప్రాంతంలోని మత్య్సపరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. నిజాంపట్నం హార్బర్లో 150 మెక్‌నైజ్డ్ బోట్లు, నిజాంపట్నం, రేపల్లె మండలాల పరిధిలో 700 వరకు మోటరైజ్డ్ బోట్లలో మత్య్సకారులు నిరంతరం సముద్ర వేట నిర్వహిస్తుంటారు. వరుస తుపానులతో పనులు లేక మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. విపత్కర పరిస్థితుల్లో పనులు కోల్పోతున్న మత్య్సకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి.