న్యూఢిల్లీ: భారత్, శ్రీలంకలు తమ అధీనంలోని మత్స్యకారులను సోమవారం విడుదల చేశాయి. ఇరు దేశాలూ చెరో 52 మంది మత్స్యకారులను విడిచిపెట్టాయి. ఈ పరిణామం ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య అవగాహనను మరింత పెంచుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారత్‌కు చెందిన 52 మంది మత్స్యకారుల్లో 20 మందిని మల్లాకం నుంచి 32 మందిని ట్రింకొమలై నుంచి శ్రీలంక విడుదల చేసింది. శ్రీలంకకు చెందిన 52 మంది మత్స్యకారులను భారత ప్రభుత్వం తమిళనాడు నుంచి విడుదల చేసినట్టు అధికార ప్రతినిధి వివరించారు.