పాకిస్తాన్ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్లు.. తమ వల్లే విడుదల అవుతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళి ఆ దేశం చెరలో చిక్కుకున్నారని.. ఆ విషయాన్ని జాలర్ల కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు.