Expert Committee On AP Development
-
జిల్లాల వారిగా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ..
-
హై పవర్ కమిటీ భేటీ వివరాలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు భేటీ అయిన హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి పేర్ని నాని భేటీ వివరాలను మీడియా ముందు వెల్లడించారు. జిల్లాల వారిగా అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. అలాగే రాజధానిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై కూడా చర్చ జరిపినట్లు మంత్రి తెలిపారు. రాజధాని రైతుల సమస్యలను సీఆర్డీఏ కమిషనర్‌కు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వానికి ఏమి చెప్పదలుచుకున్నారో జనవరి 15లోపు రాత పూర్వకంగా లేదా ఈ-మెయిల్ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లొచ్చని సూచించారు. ‘ఎవరైతే రాజకీయం కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారో.. వారికి తప్ప అందరికీ న్యాయం జరగబోతుంది. రైతులతో పాటు రాజకీయంగా ప్రేరేపితం చేసిన వారు ప్రీ ప్లాన్డ్ గా కొంతమంది ఆందోళన చెస్తున్నారు. వీటి వెనకాల టీడీపీ నేతలు ఉన్నారు. రైతులు కూడా మంత్రులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. వారి వినతులు కూడా చెప్తున్నారు. వాటన్నింటినీ స్వీకరిస్తాం’ అని అన్నారు. అలాగే ఈనెల 17న మరోసారి కమిటీ భేటీ అవుతుందని మంత్రి పేర్నినాని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సినిమాల్లో బ్రహ్మనందంలా తయారయ్యారని వ్యవసాయ శాఖ కన్నబాబు విమర్శించారు. ఆయనకి బాధ కలిగితే పండుగ చేసుకోకూడదు, ఆనందం కలిగితే పండగ చేసుకోవాలా అని ప్రశ్నించారు. అసత్యాలతో పండగపూటైనా వాళ్ళని ప్రేరేపించకుండా ఉంటే చాలని, సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ని కూడా విమర్శిస్తున్నారు మండిపడ్డారు. -
ముగిసిన హై పవర్ కమిటీ భేటీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. రాజధానిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై కమిటీ చర్చించింది. ఆయా నివేదికలోని వివిధ అంశాలపై కమిటీ భేటీ కావడం ఇది మూడోసారి. ఈనెల 17న మరోసారి కమిటీ భేటీ అవుతుందని మంత్రి పేర్నినాని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారుడు అజేయ్ కల్లాం, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనానికి ఏర్పాటైన హై పవర్ కమిటీ రెండో భేటీ ముగిసింది. పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలతో పాటు పలు కీలక అంశాలపై కమిటీ చర్చించింది. సుమారు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అలాగే ఈ నెల 13వ తేదీన కమిటీ మరోసారి సమావేశం కానుంది. సమావేశం అనంతరం మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు ప్రజలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికపై క్షుణ్ణంగా చర్చించామన్నారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కమిటీ పరిశీలిస్తోందని, తప్పకుండా రైతుల ప్రయోజనాలను కాపాడతామని తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకూడదని అభిప్రాయపడ్డారు. ఒకేచోట అభివృద్ధితో ఎంత నష్టపోయామో చరిత్ర చెబుతోందన్నారు. 13 జిల్లాల్లో అభివృద్ధి సమాంతరంగా జరగాలని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఇది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు.. కొద్ది రోజుల నుంచి టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు తనదైన శైలిలో డ్రామాకు తెర తీశారు. రైతుల్లో లేనిపోని అపోహలతో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. అమరావతిలో భూ దందాను నడిపి ఆయన లబ్ది పొందాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రబాబుకు పట్టదా? వెనుకబడిన ప్రాంతాలు అలానే ఉండాలా? కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. జోలె పట్టుకొని తిరగడానికి చంద్రబాబుకు సిగ్గులేదా? ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి. ఇది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా... మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, స్వలాభం కోసమే చంద్రబాబు తాపత్రాయపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం మంచిదికాదని సూచించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా ముందుకు వెళతాం అని ఆయన స్పష్టం చేశారు. చదవండి: వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అందరి అభిప్రాయాలు తీసుకుంటాం మూడింటిలోనూ ఉద్ధండులే! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే -
ముగిసిన హై పవర్ కమిటీ భేటీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ నీలం సాహ్ని నేతృత్వంలో ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరిగింది. అధికార వికేంద్రీకరణతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హై పవర్ కమిటీ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ముఖ్య అధికారులు, జీఎన్ రావు హాజరయ్యారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై మంత్రులు, అధికారులు ఈ భేటీలో చర్చించారు. -
రాజధానిపై అధికారం రాష్ట్రానిదే : కిషన్‌రెడ్డి
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఏపీ రాజధాని విషయంలో తాము (బీజేపీ) జోక్యం చేసుకోమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన నివేదిక వస్తే కేంద్రం తరఫున స్పందిస్తామని అన్నారు. సోమవారం అనంతపురంలో కిషర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై స్పందించారు. పార్టీ అభిప్రాయాలకు.. ప్రభుత్వ నిర్ణయాలకు చాలా తేడా ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే దేశంలో మహిళలపై వరుసగా జరుగుతున్న ఆకృత్యాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, సీఆర్పీసీ చట్టాలను మార్చాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. దాని కోసం అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ వేశామని చెప్పారు. కాలం మారినా.. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇప్పటికీ అమలవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిషత్తులో రూపొందించే చట్టాల కోసం అన్ని వర్గాల నుంచి సలహాలు స్వీకరిస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. -
రేపు సమావేశం కానున్న హై పవర్ కమిటీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన హై పవర్ కమిటీ తొలిసారి సమావేశం కానుంది. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ నీలం సాహ్ని నేతృత్వంలో హై పవర్ కమిటీ భేటీ అవుతోంది. ఈ కమిటీ జీఎన్ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించనుంది. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ హై పవర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కాగా ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) తమ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. చదవండి: మూడింటిలోనూ ఉద్ధండులే! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
ముగ్గురి నోట అదే మాట!
-
వికేంద్రీకరణకే పెద్దపీట
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరి కాదు. పాలనను వికేంద్రీకరించాలి. అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. – శివరామకృష్ణన్ కమిటీ మానవ జీవన ప్రమాణాలను పెంచడమే నిజమైన అభివృద్ధి. మెగా సిటీల నిర్మాణం, భూముల ధరలు పెరగడం అభివృద్ధి కాదు. రాష్ట్రంలోని ప్రజలందరి తలసరి ఆదాయం పెరగడం అభివృద్ధి. పాలన వికేంద్రీకరణే ఇందుకు మార్గం. – జీఎన్ రావు కమిటీ పరిపాలన వికేంద్రీకరణతో పాటు బహుళ రాజధానుల వ్యవస్థ వల్ల ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రజలకు మెరుగ్గా, సులువుగా పౌర సేవలు అందుతాయి. ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాలి. – బోస్టన్ కమిటీ ‘పాలన ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా అందాలి.. అందుకు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణే మార్గం కావాలి’ అని రాష్ట్రం విడిపోయాక శివరామకృష్ణన్ కమిటీ, మొన్న జీఎన్ రావు కమిటీ, నిన్న బోస్టన్ కమిటీలు విస్పష్టంగా నొక్కి వక్కాణించాయి. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు కేంద్రంగా పరిపాలన, అసెంబ్లీ, హైకోర్టు వ్యవహారాలు సాగితేనే అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యం సాధ్యమని స్పష్టీకరించాయి. ఒక్క అమరావతిలోనే లక్ష కోట్ల రూపాయలు గుమ్మరించి అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల మాటేమిటని ఆందోళన వ్యక్తం చేశాయి. అవకాశాలు అందరికీ రావాలని, ఆర్థిక, ప్రాంతీయ అసమానతలకు తావివ్వరాదని స్పష్టం చేశాయి. అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల జరిగిన అనర్థమేమిటో కళ్లెదుటే కనిపిస్తున్నా, మళ్లీ మళ్లీ ఆ పొరపాటుకు తావివ్వడం సరికాదని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆయా కమిటీల అభిప్రాయాల మధ్య సారూప్యతపై మరోసారి అవలోకనం.. సాక్షి, అమరావతి : నాడు శివరామకృష్ణన్, మొన్న, నిన్న జీఎన్.రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చిన నివేదికలు నిజమైన అభివృద్ధికి అద్దం పట్టేలా, వికేంద్రీకరణకు పెద్దపీట వేసేలా ఉన్నాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంటే ఒకే చోట పెద్ద పెద్ద నగరాలు నిర్మించడం కాదనే అభిప్రాయపడ్డాయి. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు.. రవాణా, మంచి నీరు, విద్య, వైద్యం, విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని చెబుతూ.. ఇందుకు రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడమే మంచి మార్గమని సూచించాయి. అన్ని జిల్లాల సమతుల అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్ సూచించడం ఎంతైనా అవసరమేనని స్పష్టీకరించాయి. అమరావతి రాజధాని నగరం పేరుతో గత ప్రభుత్వం నిర్మాణాలను పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మోడల్‌నే రూపొందించిందనే విషయాన్ని ఎత్తి చూపాయి. మిగతా జిల్లాలు వెనుకబడి ఉన్న నేపథ్యంలో అమరావతిలోనే అన్నీ కేంద్రీకృతం చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నను లేవనెత్తాయి. పలు దేశాల్లో, రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీలు ఉన్నాయని ఉదహరిస్తూ.. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సూచించాయి. ఇంచు మించు ఒకేలా ఉన్న ఈ మూడు కమిటీల నివేదికల సూచనల అమలుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మేధావులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి: జీఎన్ రావు కమిటీ - శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. - పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు.. శ్రీకాకుళంలో ఉండే ఒక పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు. - అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. - మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ పరంగా సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్మెంట్లు నిర్మించాలి. - అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంభించాలి. - అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించాం. - రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, మహేంద్రతనయ తదితర నదుల పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. అక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కాలువల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి. - రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. - వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి. మహానగరం సరికాదు : శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి నివేదిక రూపొందించింది. పాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి తక్షణ అవసరమని సిఫారసు చేసింది. ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరయినది కాదంది. - అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. - ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి. - శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరోచోట బెంచ్‌ను నెలకొల్పాలి. - విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం కలుగుతుంది. పర్యావరణానికీ ఇబ్బంది కలుగుతుంది. - విజయవాడ– గుంటూరు నగరాల మధ్య మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం (అప్పట్లో చంద్రబాబు) చెప్పారు. కానీ ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కోణంలో ఆ రెండు నగరాల మధ్య మెగా సిటీని విస్తరించడం ఆచరణ సాధ్యం కాదు. - విజయవాడ – గుంటూరు మధ్య రాజధానిని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. దాంతోపాటు దేశంలో వరి ఉత్పిత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పొలాలు నాశనమవుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. - సారవంతమైన పంట పొలాలకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే తీవ్ర ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. - విజయవాడ – గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప ముప్పు ఉన్న ప్రాంతం కూడా. ఆ ప్రాంతంలో నేల స్వభావం రీత్యా భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. - స్థానికంగా లభ్యమవుతున్న సహజ వనరులు, ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని.. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. పాలన వికేంద్రీకరణే మార్గం: బోస్టన్ నివేదిక - పరిపాలన వికేంద్రీకరణ ద్వారా బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. - తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులభంగా పౌర సేవలు అందుతాయి. - చాలా మంది ప్రజలు మండలం దాటి సచివాలయానికి రారు. సచివాలయానికి వచ్చే వారిలో పైరవీలు లేదా రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసేవారే ఎక్కువ. (ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులు సచివాలయానికి రావాల్సిన పరిస్థితి తలెత్తదు) - ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పు 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి 80 వేల కోట్ల రూపాయల నుంచి 1.20 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15 నుంచి 16 శాతం జనాభా వృద్ధి చెందితేనే 2045 నాటికి అమరావతి నుంచి రూ. 8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ నగరాల్లో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధి రేటు 2 నుంచి 7 శాతం మాత్రమే ఉంది. - ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ కూడా విఫలం చెందాయి. ఇందులో కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50 శాతం సాధించాయి. మిగతా మెగా సిటీలన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయి. - ప్రపంచంలో గత 50 ఏళ్లలో ఏడు దేశాల క్యాపిటల్ సిటీల నిర్మాణం చేపడితే అందులో కేవలం ఒకటి మాత్రమే లక్ష్యాన్ని చేరకుంది. మిగతా నగరాలు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేదు. - అమరావతి నగరంపై రూ.లక్ష కోట్లు వ్యయం చేసినా 40 ఏళ్ల వరకు రాబడి వచ్చే అవకాశం లేదు. అది కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సగటున 15 నుంచి 16 శాతం వృద్ధి నమోదు చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల అమరావతిపై భారీగా వ్యయం చాలా రిస్క్‌తో కూడుకున్న విషయం. - అమరావతి నగరంలో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులకు పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడితే ఇందులో 95 శాతంపైగా అప్పు రూపంలోనే సమకూర్చుకోవాలి. ఇందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 6 నుంచి 8 శాతానికి సమానంగా ఉంటుంది. తొలి 10–15 సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించడానికి బడ్జెట్లో పది శాతం కేటాయించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడం వల్ల అభివృద్ధి పథకాల అమలకు నిధులుండవు. – బోస్టన్ నివేదిక మూడు రాజధానులతో సమ న్యాయం ఒకే పెద్ద రాజధాని బదులు మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ప్రభుత్వంలోని వివిధ శాఖలను వికేంద్రీకరించాలి. హైకోర్టు వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. – ఈఏఎస్ శర్మ, ఐఏఎస్ రిటైర్డ్ అధికారి సమతుల అభివృద్ధి సాధ్యం పాలన వికేంద్రీకరణ వల్ల రాష్ట్రంలో సమతుల అభివృద్ధి జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. పాలన అన్ని ప్రాంతాల వారికి చేరువవుతుంది. ఒకే చోట పాలనా వ్యవస్థలన్నీ కేంద్రీకృతం కావడం మంచిది కాదు. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో అన్నీ ఒకే చోట ఉండాలనే ఆలోచనకు అర్థం లేదు. – ప్రొఫెసర్ ఎం.రవీంద్రనాథ్, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ చదవండి: అమరావతి.. విఫల ప్రయోగమే ‘ఆ పొరపాట్లు మళ్లీ జరగకూడదు’ సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు.. మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు.. మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
బంగారు గాజు రహస్యం!
భువనేశ్వరమ్మ చేతి బంగారు గాజును అమరావతి ప్రాంత రైతులకు బంపర్ ఆఫర్‌గా చంద్రబాబు ప్రకటించారు. రాజధాని విభజన వార్తలను ఆయన జీర్ణించు కోలేకపోతున్నారు. తమ ప్రయోజనాలతో ముడిపడి వున్న అమరావతి ప్రయోగం విఫలం కాబోతున్నదన్న బెంగ ఆయనను వెంటాడుతున్నది. ఆరని దీపంలాగా ఆందోళనలు కొనసాగాలని కోరుకుంటున్నారు. అందుకే ఒక వూళ్లో బంగారు గాజును నజరానాగా ప్రకటిస్తే, మరో ఊరిలో నగదు బహుమతి ప్రకటించారు. 28 వేల మంది రైతులకు చెందిన 34 వేల ఎకరాల భూములను జూదంలో పందెంగా ఒడ్డి, అక్కడ ఒక ‘బంగారు గని’ని తవ్వుకోవాలని ఆయన ప్రయత్నించారు. ఈ రాష్ట్రంలోని వయోజనులైన సుమారు రెండుకోట్ల మంది మహిళలు ఒకేసారి తలా ఒక బంగారు గాజును కొనుగోలు చేస్తే ఎంత ఖర్చవుతుందో అంత విలువైన సొమ్మును ఇక్కడ తవ్వుకోవాలని ప్రయత్నించినట్టు క్రమంగా తేటతెల్ల మవుతున్నది. ఈ ‘కర్తవ్య’ నిర్వహణ కోసం రెండంచెల వ్యూహాన్ని రచించారు. తొలి అంచె ఇన్సైడర్ ట్రేడింగ్ గుట్టు కాస్తా రట్టయ్యింది. రాజధానిగా అవతరించ బోయే ప్రాంతం విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి, తన బినామీలూ, అనుయాయులకు మాత్రమే రహస్యాన్ని చెవిలో వేసి అక్కడ నాలుగు వేల ఎకరాలను కారుచౌకగా కొనుగోలు చేసిన అనంతరమే, రాజధానిని ప్రకటించారన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇక రెండవ అంచె మరింత కళ్లు చెదిరే రోబోటిక్ ఆపరేషన్. సింగపూర్‌లోని ఒక ప్రైవేటు కంపెనీని రంగంలోకి దించి ఆ కంపెనీ సొంతంగా ఖర్చేమీ పెట్టకుండానే, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతులిచ్చిన భూమిలో వ్యాపారాలు చేసి ఇబ్బడిముబ్బడిగా సంపాదించే పథకం తయారు చేశారు. ప్రైవేటు కంపెనీ సంపాదనలో భీముని వాటా ఎవరిదో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. హఠాత్తుగా ఈ బంగారు కలలు కరిగిపోయే పరిస్థితి కళ్లముందు నిలవడంతో కలవరం మొదలైంది. భూములు ఇచ్చిన రైతులకు సమాధానం చెప్పుకోవల సిన బాధ్యత తోసుకొచ్చింది. అదిగో, ఆ బాధ్యతలను తప్పించుకోవడానికి కొత్త జూదాన్ని ప్రారంభించారు. ఈ జూదంలో పందెం కాసేది రైతులనే, వారి ప్రాణాలనే. మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలని రాష్ట్రపతిని కోరుతూ రైతుల చేత లేఖలు రాయించారు. ఆ లేఖల నమూనా ప్రతిని తెలుగుదేశం కార్యకర్తలు సరఫరా చేశారు. రైతు లకు ఇక ఆత్మహత్యలే గతి అంటూ గడిచిన పది రోజు లుగా అనుంగు పత్రికలు ఊదరగొడుతున్నాయి. సిండి కేటు వార్తా ఛానెళ్ల అద్దె మైకుల ముందు రైతుల చేత అవే మాటలను చెప్పిస్తున్నారు. కృత్రిమ ఉద్యమానికి ఊపు రావాలంటే ఏదో ‘పెద్ద’ ఘటన జరగాలని ప్రతిపక్ష శిబిరం కోరుకొంటున్నదని చెప్పడానికి దృష్టాంతాలు కనిపిస్తున్నవి. ఉరుములు, మెరుపులు లేకుండా అకాల వర్షం కురి సినట్టు వేళాపాళా లేకుండా భూపాలం పాడినట్టు అక స్మాత్తుగా చంద్రబాబు అండ్ కో లోని శక్తులన్నీ ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఏకమవుతుంటాయి. పత్రికల్లో ప్రత్యేక పేజీల నిండా వార్తలను, వ్యాఖ్యలను వండి వారుస్తారు. చానెళ్లు ఆ వార్తలకే అంకితమై పని చేస్తాయి. వివిధ పార్టీల్లో వుండే స్లీపర్ సెల్స్ నిద్ర లేస్తాయి. సన్నాయి నొక్కులు ప్రారంభిస్తాయి. జుగల్ బందీ కచేరీ ప్రారంభమవుతుంది. కచేరీ ప్రారంభమైం దంటే అదొక హెచ్చరిక. తీతువుపిట్ట ఎదురొచ్చి అరచి గీపెట్టి భయపెట్టిన చందం. ఊరవతల ఊడలమర్రికి వేలాడే గబ్బిలాలు నట్టింట్లో దూరి పుట్టించే కంపరం. ఏదో వైపరీత్యం ముంచుకొస్తున్నదనే ముందస్తు కబురు. మల్లెల బాబ్జీ ఖండిత శిరస్సు చెప్పిన రహస్యం ఇదే. బెజవాడ రాఘవయ్య పార్కుకు వంగవీటి మోహన రంగా ఇచ్చిన మరణ వాంగ్మూలం కూడా ఇదే. వెన్ను పోటును అభిశంసిస్తూ ఎన్టీఆర్ రౌద్ర కంఠం మోగించిన దండోరా సందేశం ఇదే. రాజధాని వికేంద్రీకరణ ప్రతిపాదన రావడంతో ఇప్పుడు మళ్లీ జుగల్బందీ మొదలైంది. కళ్లు చెదిరే కలల సంపాదన చేజారుతుందేమోనన్న బెంగతో కంటికి నిద్ర రావడం లేదు. ఏం చేసైనా ఈ పరిణామాన్ని ఆపాలన్న తెగింపు ధోరణి కనిపిస్తుంది. కొందరు మీడియా ప్రము ఖులు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ లబ్ధిదారులేనని వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రయోజనాలే తమ ప్రయోజనాలని భావించే ఎల్లో మీడియా సంపూ ర్ణంగా రంగంలోకి దిగింది. చంద్రబాబు ఇచ్చే మనోవర్తి మీద ఆధారపడి మనుగడ సాగించే ఉపపార్టీల అధినే తలు పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగారు. ఇతర పార్టీల్లో స్లీపర్ సెల్స్‌గా వున్న చంద్రబాబు కామ్రేడ్స్ కొందరు రాజధాని మార్పును ససేమిరా ఒప్పుకోము అంటూ ఆవులింతలు ప్రారంభించారు. 29 గ్రామాల సమస్య లను 13 జిల్లాల సమస్యగా చిత్రించేటందుకు ప్రయత్ని స్తున్నారు. చిత్తూరు జిల్లాను తమిళనాడులో కలిపేయా లని, కర్నూలు జిల్లాను కర్ణాటకలో కలపాలని తెలుగు దేశం నేతలు కొందరు బెదిరింపులకు దిగుతున్నారు. ఇక్కడి పరిణామాలపై జాతీయ మీడియాను జాతీయ నేతలను తప్పుదోవ పట్టించడం కోసం ఒక ప్రత్యేక బృందం 24/7 పనిచేస్తున్నది. రాజధాని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రత్యక్ష లబ్ధిదారైన తెలుగుదేశం పార్టీ అధికార వికేంద్రీకరణకు ససేమిరా అంటుండగా, అను బంధ మిత్రులు కొందరు తెలివిగా రెండు అంశాలను ముందుకు తోస్తున్నారు. ఒకటి: రాజధానిని మూడు భాగాలుగా చేస్తే భూములిచ్చిన రైతులు నష్టపోతారు, ఆ భూములను ఏం చేస్తారు? రెండు: ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. అధికారంలో ఉన్న పార్టీ మారినంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయం మారకూడదు. ఈ ప్రశ్న లకు దీటైన సమాధానాలు సోషల్ మీడియాలో వెల్లు వెత్తుతున్నాయి. ‘‘కూతురుకు నిశ్చితార్థం చేసిన తండ్రికి, ఆ తర్వాత వరుడు పనికిమాలిన వెధవ అని తెలిసిం దనుకోండి... ఆ తండ్రి ఏం చేస్తాడు? సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాడా... లేక నిశ్చితార్థానికి ఖర్చయిం దని సర్దుకు పొమ్మంటాడా?’’... రాజధాని అంశంపై బాగా ట్రెండ్ అవుతున్న కామెంట్ ఇది. అమరావతి నుంచి సెక్రటేరియట్, కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, సీఎం ఆఫీసు, రాజ్‌భవన్, హైకోర్టు తరలిస్తేనే 30 వేల ఎకరాలు వృధా అవుతాయా? ఒక్కో కార్యాలయానికి వేల ఎకరాలు అవసరమా? అనే ప్రశ్నలు తలె త్తుతాయి. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరో ప్రభుత్వం ఎలా మారుస్తుందని కూడా కొందరు మేధా వులు ప్రశ్నిస్తున్నారు. మరి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎందుకు ఎత్తేశావని చంద్ర బాబును ప్రశ్నించలేని ఆ ‘బలహీనత’ ఏమిటో వివరిం చిన తర్వాతనే ఈ తాజా ప్రశ్నను వారు సంధించవలసి ఉంటుంది. అమరావతిని మార్చాలంటే మళ్లీ ప్రజా తీర్పును కోరవలసిందేనని ఒక కాకలు తీరిన కామ్రేడ్ తన శక్తిమేరకు గర్జించాడు. ఆ గర్జనను పచ్చపత్రికలు ప్రముఖంగా మొదటి పేజీలో వేశాయి. మామూలు రోజుల్లోనయితే ఆ పత్రికల్లో సదరు కామ్రేడ్ ఎప్పుడూ లోపలి పేజీల్లో సింగిల్ కాలమిస్టే. మరయితే కామ్రేడ్... అమరావతిని రాజధానిగా నిర్ణయించిన చంద్రబాబు పార్టీని జనం చిత్తుచిత్తుగా ఓడించారుగా. రాజధానికి భూసమీకరణ జరిపిన రెండు నియోజక వర్గాల్లోనూ టీడీపీ ఓడిపోయిందిగా... చివరకు లోకేశ్ బాబును కూడా ఓడించారుగా... దీనికేం సమాధానం చెబుతారు? సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టుల గురించి కొంచెం చెప్పుకోవాలి. తెలుగు నాట కమ్యూనిస్టుల ప్రస్థానం దున్నేవాడికే భూమి నినాదంతో మొదలైంది. ఇప్పుడు అమరావతి ప్రాంత భూముల రియల్ ఎస్టేట్ ధరల కోసం తపన పడే మజిలీకి చేరుకున్నది. రెండు పార్టీలుగా కమ్యూనిస్టులు చీలిపోయిన తర్వాత ఓ ఇరవై ఏళ్లపాటు ఇరుపక్షాలకు అస్సలు పడేది కాదు. ఎమర్జెన్సీ పూర్తయిన సమయంలో అనుకుంటా, సీపీఐని ఎద్దేవా చేస్తూ సీపీఎం వారు ‘మిత వాద కమ్యూనిస్టులారా మీ ప్రయాణం పూర్తయిందా?’ అనే పుస్తకాన్ని వేసి పంచారు. ఇప్పుడు రెండు పార్టీలను కలిపి ప్రజలు అడిగే రోజు వచ్చింది. ‘‘ఆంధ్ర కమ్యూని స్టులారా... మీ ప్రయాణం పూర్తయిందా?’’ అని. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకుంటారు. ఏడాదికోసారి సభలు పెట్టి తీర్మానాలు చేస్తారు. చంద్రబాబు హయాంలో ప్రైవేటీకరణ అంచులకు చేరిన రోడ్డు రవాణా సంస్థను అక్కున చేర్చుకొని ప్రభుత్వ శాఖగా మార్పు చేసిన జగన్మోహన్రెడ్డిలో వీరికి అభ్యుదయ వాది కనిపించడం లేదు. పేదవర్గాల ప్రజలను కేన్సర్ వ్యాధిలా కాల్చేస్తున్న మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఆదర్శం కని పించడం లేదు. పీడిత ప్రజల సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా చేపడుతున్న ఎన్నెన్నో సంక్షేమ పథకాలను ఏనాడూ స్వాగతించిన పాపాన పోలేదు. కానీ కమ్యూ నిస్టులకు కాలం చెల్లిందని ఈసడించుకున్న చంద్ర బాబుతో కమ్యూనిస్టులకు ఎందుకు ‘కెమిస్ట్రీ’ వర్కవుట్ అవుతుందో ఎప్పటికీ అర్థంకాదు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబు ప్రయోజనాలకు గొడుగు పట్టే పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు రాజధాని వ్యవ హారంలోనూ అంతే. అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఒక అధ్యయన నివేదికను ప్రభు త్వానికి అందజేసింది. అందులోని వివరాలను విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం నియమిం చిన శివరామకృష్ణన్ కమిటీ చేసిన సూచనలను బలపరి చేదిగానే బీసీజీ నివేదిక కూడా ఉన్నది. రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి చేపట్టదగిన కార్యక్రమాలను రేఖా మాత్రంగా ఈ కమిటీ ప్రస్తావించింది. రాజధానిని మూడు ప్రాంతాల్లోని మూడు నగరాల మధ్య విభజిం చాలని సూచించింది. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్య మని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ నగ రాలు ఏ రకంగా విఫలమయ్యాయో సోదాహరణంగా వివరించింది. ఒక్క నగరం మీద లక్షా ఇరవై వేల కోట్లు ఖర్చు చేయడం బూడిదలో పోసిన పన్నీరేనని అభిప్రాయపడింది. ఆ మొత్తాన్ని సాగునీటి రంగంపై ఖర్చుచేస్తే ఐదేళ్లలో తొంభై లక్షల ఎకరాల్లో బంగారం పండు తుందని అంచనా వేసింది. ఇదే విషయంపై ఇంతకు ముందే ప్రభుత్వానికి జిఎన్ రావు కమిటీ ఇంకొక నివేదికను ఇచ్చింది. ఈ రెండు నివేదికల అధ్యయనానికి ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇవ్వబోయే సిఫారసులను కేబినెట్ ఆమోదిస్తే ఈ నెలలోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరిగి శర వేగంగా తదుపరి మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తున్నది. బోస్టన్ గ్రూప్ సూచించినట్టుగా మూడు పువ్వులు (రాజధానులు), ఆరు కాయలు (ప్రాంతా లు)గా ఆంధ్రప్రదేశ్ వికసిస్తుందేమో వేచి చూడాలి. భువనేశ్వరమ్మ వజ్రాలు పొదిగిన బంగారు గాజును వేలం వేస్తారని తుళ్లూరు ప్రాంతం తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటున్నారు. అలా వేలం వేసిన సొమ్మును గొడవలను బాగా రెచ్చగొట్టేవారికో లేదా బలిపశువులయ్యే వారికో బహుమతిగా ఇస్తారని చెప్పు కుంటున్నారు. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
అమరావతిలో నిర్మాణాలు కూడా ఇబ్బందికరమే: ప్రొ. విశ్వనాథమ్
-
బోస్టన్ కమిటీ అత్యున్నత ప్రమాణాలు గల సంస్థ
-
మత్స్యకారుల విడుదలకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు..
-
ఉద్యోగ సంఘాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం చెబుతాం
-
బోస్టన్ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం: ఏయూ రిజిస్ట్రార్
-
బోస్టన్ కమిటీ నివేదిక అద్భుతం..
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయంగా బోస్టన్ కమిటీకి అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థగా పేరు ఉందని... ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కి బీసీజీ అద్భుతమైన నివేదికను అందజేసిందని విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీలుగా బీసీజీ నివేదిక ఉందన్నారు. ఒక్క నగరం నిర్మాణానికే లక్షకోట్లను వెచ్చించడానికి బదులు...ఆ నిధులను అన్ని ప్రాంతాలకు సమానంగా వినియోగించడం... సాగునీటి రంగానికి ప్రాధాన్యతనివ్వడం వంటివి బీసీజీ నివేదికలో ఇచ్చారని తెలిపారు. అమరావతి నిర్మాణాలకి అనుకూలం కాదని మద్రాస్ ఐఐటి శాస్త్రీయంగా అధ్యయనం చేసి తెలిపిందని... అమరావతి ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రాంతీయ అసమానతలు తొలగే విధంగా బీసీజీ నివేదిక ఉందని ప్రసాద రెడ్డి తెలిపారు. -
‘ఆ పొరపాట్లు మళ్లీ జరగకూడదు’
సాక్షి, తాడేపల్లి: గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకూడదని..అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని బీసీజీ కమిటీ స్పష్టంగా చెప్పిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శనివారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీసీజీ కమిటీ మీద కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని.. బీసీజీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కమిటీ అని పేర్కొన్నారు. చంద్రబాబుతోనూ బీసీజీ కమిటీ కలిసి పనిచేసిందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని..అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే మంచి ఉద్దేశం సీఎం వైఎస్ జగన్‌కు ఉందన్నారు. రాజధాని ప్రాంత రైతుల్లో కొంత ఆందోళన ఉందని.. రైతులకు అన్యాయం జరగకుండా సీఎం చూసుకుంటారన్నారు. ఆ ప్రాంతాల పరిస్థితి ఏమిటీ..? రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. బినామీల పేరుతో చంద్రబాబు, టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారన్నారు. ఐదేళ్ల కాలంలో కేవలం చంద్రబాబు రూ.5వేల కోట్లు ఖర్చు చేశారని..ఆ సొమ్ముకు 700 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. లక్ష 16వేల కోట్లు పెట్టి రాజధాని కడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాజధాని కట్టడంలో చంద్రబాబు వైఫల్యం చెందారన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 6న హై పవర్ కమిటీ సమావేశమవుతుందని.. కమిటీ నివేదికను చట్టసభల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అమరావతికి ఎక్కడికి తరలిపోలేదు..అలాంటి అపోహలు సృష్టించవద్దన్నారు. మత్స్యకారుల విడుదలకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.. పాకిస్తాన్ చెరలో ఉన్న ఆంధ్రా జాలర్లు.. తమ వల్లే విడుదల అవుతున్నారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి మోపిదేవి మండిపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళి ఆ దేశం చెరలో చిక్కుకున్నారని.. ఆ విషయాన్ని జాలర్ల కుటుంబ సభ్యులు వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో ఆయన దృష్టికి తీసుకెళ్లారన్నారు. మత్స్యకారులను విడిపించేందుకు వైఎస్ జగన్ ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రధాని మోదీ, అమిత్‌షా దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం దృష్టికి మత్స్యకారుల కుటుంబాలు ఎన్ని సార్లు తీసుకెళ్లిన పట్టించుకోలేదన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. ఈ నెల 6న మత్స్యకారులు విడుదల అవుతున్నారని మంత్రి మోపిదేవి చెప్పారు. చదవండి: పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు.. మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం -
సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు..
సాక్షి, తాడేపల్లి: గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సాధ్యంకాదన్న శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. చంద్రబాబు తన వర్గం నేతలతో మరో కమిటీ వేశారని.. తాను నిర్ణయించుకున్నది ఆ కమిటీతో చెప్పించారని తీవ్రంగా విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనకబడి ఉన్నాయని.. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించాలని బీసీజీ సూచనలు చేసిందని తెలిపారు. సమగ్రాభివృద్ధి కోసం బీసీజీ ప్రభుత్వం ముందుకు రెండు ఆప్షన్లు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వనరులను అధ్యయనం చేసి ఆ కమిటీ నివేదికను వెల్లడించిందని అప్పలరాజు తెలిపారు. అదేవిధంగా పోలవరం, పెన్నా- గోదావరి అనుసంధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై దృష్టి పెట్టాలని బీసీజీ సూచనలు చేసిందన్నారు. శ్రీబాగ్ ఒప్పందంపై చంద్రబాబుకు నమ్మకం లేదా అని అప్పలరాజు సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తప్ప వికేంద్రికరణను అందరూ హర్షిస్తున్నారని అన్నారు. విశాఖలో క్యాపిటల్ పెట్టడం చంద్రబాబుకు ఇష్టం ఉందో.. లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతిలో చంద్రబాబు ఎందుకు శాశ్వత భవనాలు నిర్మించలేని అప్పలరాజు దుయ్యబట్టారు. లక్షల కోట్లు ఒకే ప్రాంతంలో పెట్టడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు అక్రమాలకు పాల్పడారని ఆయన ధ్వజమెత్తారు. గతంలో పరిపాలనంతా ఒకేచోట కేంద్రీకృతం అవడంతో నష్టపోయమని ఆయన అన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకణ జరుగుతుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్రహ్మండమైన ఆలోచనలు చేశారని అప్పలరాజు కొనియాడారు. నీళ్లు, నిధులు, పరిపాలన అందిరికీ అందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని గుర్తు చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు పబ్బం గడుపుతున్నారని అప్పలరాజు మండిపడ్డారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి: పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు.. మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు..
సాక్షి, తాడేపల్లి : వికేంద్రకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందే విషయాలను శాస్త్రీయంగా నివేదికలో పొందుపరిచిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రాన్ని ఆరు విభాగాలుగా విభజించి సమగ్రమైన నివేదిక అందించిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే అమర్నాథ్ శనివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలు కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని గతంలోనే చెప్పాయన్నారు. ప్రపంచంలో అనేక గ్రీన్ ఫీల్డ్ రాజధానులు విళమైందని బీసీజీ నివేదికలో పేర్కొన్నారని, రాజధానిపై లక్షా పదివేల కోట్ల పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కష్టమని చెప్పారన్నారు. విష ప్రచారం చేస్తున్నాయి.. అయితే కొన్ని పత్రికల్లో మూడు ముక్కలు అంటూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే అమర్నాథ్ మండిపడ్డారు. రాజధానులపై కొన్ని వార్తా పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక రాజధాని ఉంటే మరొక రాజధానిని అభివృద్ధి చేయకూడదా అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం కోసం రాష్ట్రం విడిపోలేదా? అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయితే మళ్లీ విభజన వాదం తెరపైకి వస్తుందని అన్నారు. ప్రాంతాల వారీగా టీడీపీ...ప్రజలను రెచ్చగొడుతుందని విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లు, నిధులు, పరిపాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని ఎమ్మెల్యే అమర్నాథ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, సీమ పరిస్థితి? ‘అమరావతి పెద్ద పెద్ద భవనాల నిర్మాణానికి అనుకూలం కాదని చెపుతున్నారు. డబ్బంతా అమరావతిలో ఖర్చు పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటి?. ఖర్చు అంతా ఒకచోటే పెడితే పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించవద్దా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని ఇక్కడ నిర్మించమంటే ఎలా? విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం వేలాది ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారు. తమ భూములకు రేట్లు తగ్గిపోతాయని చెప్పడం త్యాగమా? తమ వ్యాపారంను కాపాడుకోవడానికి చంద్రబాబు... తన సతీమణి భువనేశ్వరిని అమరావతికి తీసుకువచ్చారు. ప్రజలు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని భావిస్తున్నారు. అందుకే వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారు. పులివెందుల పంచాయతీ అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల నివాస వేదిక విశాఖపట్నం. చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఏమీ మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదు. అద్భుతమైన రాజధాని నిర్మిస్తే నారా లోకేష్ ఎందుకు రాజధానిలో ఓడిపోయాడు. జీఎన్‌రావు, బోస్టన్ గ్రూప్‌కు చట్టబద్ధత లేదు కానీ నారాయణ కమిటీకి చట్టబద్ధత ఉందా? విశాఖలో రాజధానిని వ్యతిరేకించే టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు మాటలు విని అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అశోక్ గజపతి...రాజుగా కాకుండా బంటుగా వ్యవహరిస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ రాజధానిలో పర్యటించి రైతుల పక్షాన ఉంటానని డబ్బాడు పెరుగున్నం తిన్నారు. పెరుగన్నం అరగక ముందే హైదరాబాద్ వెళ్లి మాట మార్చారు. పవన్ పూటకో మాట మాట్లాడుతున్నారు. ఊగడం మానేసి వాస్తవాలు తెలుసుకోవాలి’ అని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. చదవండి: మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన
సాక్షి, తిరుమల: మూడు రాజధానుల ప్రకటనను జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సమర్థించారు. ఆయన శనివారం ఉదయం తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగి ప్రశ్నకు ఎమ్మెల్యే రాపాక సమాధానమిస్తూ మూడు రాజధానుల నిర్ణయం సబబే అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. నవ రత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని... చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యే రాపాక స్పష్టం చేశారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఇబ్బందే అని... అయితే అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాపాక కోరారు. చదవండి: మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
అమరావతి.. విఫల ప్రయోగమే
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీల(కొత్తగా భారీ నగరాన్ని నిర్మించడం) నిర్మాణాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్(బీసీజీ) నివేదిక వెల్లడించింది. అమరావతి విషయంలో అలాంటి ప్రయోగం రాష్ట్ర ప్రజలకు నష్టదాయకమని.. సంపదంతా ఒకే చోట పోగై మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించింది. అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికతో పాటు రాష్ట్రంలో 13 జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రపంచంలో గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీలు, రాజధాని నగరాల నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనం చేసిన బీసీజీ ప్రతినిధులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి నివేదిక సమర్పించారు. అమరావతి నిర్మాణం ఆర్థికంగా లాభదాయకం కాదని, పైగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని.. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరవని నివేదిక స్పష్టం చేసింది. అప్పు చేసి ఒకే చోట రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చుపెడితే.. వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడమేనని తేల్చిచెప్పింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం చేయవచ్చని పేర్కొంది. ప్రపంచంలో గత 50 ఏళ్ల అనుభవాల్ని పరిశీలిస్తే.. 30కుపైగా గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీలు నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం రెండు నగరాలు మాత్రమే 50 శాతం లక్ష్యాన్ని సాధించాయని.. మిగతా మెగా సిటీలు 6–7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయని బోస్టన్ అధ్యయనం వెల్లడించింది. అధికార వికేంద్రీకరణ కోసం రెండు ఆప్షన్లు ఇస్తూ.. విశాఖ, అమరావతి, కర్నూలు పట్టణాల్లో పరిపాలనను వికేంద్రీకరించాలని సూచించింది. బోస్టన్ నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ.. రూ.1.20 లక్షల కోట్ల ఖర్చు శక్తికి మించిన భారం ‘ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పు రూ. 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల నుంచి 1.20 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15 నుంచి 16 శాతం జనాభా వృద్ది చెందితే 2045 నాటికి అమరావతి నుంచి రూ. 8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది(ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ నగరాల్లో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధిరేటు 2 నుంచి 7 శాతం మాత్రమే).. కజకిస్థాన్ రాజధాని ‘ఆస్తానా’, దుబాయ్ సిటీల అభివృద్ధికి కారణం పెట్రో ఉత్పత్తుల నుంచి భారీ ఎత్తున ఆ దేశాలకు వచ్చే ఆదాయాన్ని విచ్చలవిడిగా వాటి అభివృద్ధికి ఖర్చు చేయడమే..’ అని బీసీజీ స్పష్టం చేసింది. గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీలతో ఒరిగేది శూన్యం గ్రీన్‌ఫీల్డ్ సిటీలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తప్ప, సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏమాత్రం దోహదపడవని బీసీజీ విశ్లేషించింది. ‘గ్రీన్‌ఫీల్డ్ నగరాలు పర్యావరణ హితం కావు. ప్రపంచంలోని గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీలను అధ్యయనం చేసిన తరువాత కాలుష్యం పెరగడాన్ని గుర్తించాం. రష్యాలో ఇన్నోపోలీస్, ఈజిప్టులో న్యూ కైరో, సదత్, షేక్ జియాద్ సిటీ, పోర్చుగల్‌లో ప్లాన్ ఐటీ వ్యాలీ, ఆస్ట్రేలియాలో మొనార్టో, చైనాలో చెంగాంగ్, కాంగ్‌బసీ ఆర్డోస్, నానుహీ న్యూ సిటీ, లావాసా, లాంజోహు, యూఏఈలోని మస్డర్ మెగా సిటీల నిర్మాణాల్లో లక్ష్యాన్ని చేరుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు’ అని నివేదికలో వెల్లడించారు. ప్రపంచంలో గత 50 ఏళ్లలో 7 దేశాల కేపిటల్ సిటీల నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం ఒకటి మాత్రమే లక్ష్యాన్ని చేరుకుందని, మిగతా నగరాలు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేదని పేర్కొన్నారు. - 1991లో నైజీరియాలో అబూజాను రాజధాని నగరంగా నిర్మించగా.. 20 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం 30 శాతమే చేరుకుని ఆరు లక్షల జనాభాతో ఆగిపోయింది. - శ్రీలంక 1982లో శ్రీ జయవర్ధనెపుర కొట్టేలో రాజధాని నిర్మించగా.. 10 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం లక్ష జనాభా కూడా చేరలేకపోయింది. - 1999లో మలేసియా రాజధానిగా పుత్రజయ నిర్మాణం చేపట్టగా 5 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం లక్ష జనాభాతోనే ఆగిపోయింది. - 2007లో దక్షిణ కొరియాలో సెజాంగ్ సిటీ నిర్మాణం చేపట్టగా 10 లక్షల జనాభా లక్ష్యానికి గాను ప్రస్తుతం 3 లక్షల జనాభా మాత్రమే ఉంది. - అమరావతిలో ఏటా సగటున 15 శాతం మేర జనాభా వృద్ధి ఉంటుందని గత ప్రభుత్వం వేసిన అంచనాలన్నీ ఊహాగానాలే తప్ప వాస్తవ రూపం దాల్చవని అధ్యయన నివేదికలో స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణే పరిష్కారం రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచికల్లో ఏ జిల్లాలు ముందున్నాయి... ఏ జిల్లాలు వెనుకబడ్డాయి.. అభివృద్ధిలో ఏ ప్రాంతాల మధ్య తారతమ్యాలు, వ్యత్యాసాలున్నాయనే వివరాలను బోస్టన్ కన్సల్టెన్సీ తన నివేదికలో వెల్లడించింది. రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడంతో పాటు అన్ని జిల్లాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచించింది. ఇందుకు ఉదాహరణగా జర్మనీలో గ్రీన్‌ఫీల్డ్ మెగా సిటీ నిర్మాణాన్ని ఆపేసి.. రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడాన్ని బోస్టన్ నివేదిక ప్రస్తావించింది. పరిపాలన వికేంద్రీకరణకు బోస్టన్ గ్రూపు రెండు ఆప్షన్లను ప్రభుత్వానికి సూచించింది. మొదటి ఆప్షన్లో విశాఖపట్నంలో సచివాలయం, గవర్నర్, సీఎం కార్యాలయాలు, కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని... అమరావతిలో అసెంబ్లీతో పాటు కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్... కర్నూలులో హైకోర్టు, అనుబంధ కోర్టులు, స్టేట్ కమిషన్లు ఉండాలని సూచించింది. రెండో ఆప్షన్లో విశాఖపట్నంలో సచివాలయం, గవర్నర్, సీఎం కార్యాలయాలు, అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచ్... అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, అనుబంధ కోర్టులు, స్టేట్ కమిషన్లు ఉండాలని అభిప్రాయపడింది. రెండో ఆప్షన్ ఉత్తమమని కమిటీ పేర్కొంది. బీసీజీ.. అత్యుత్తమ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ప్రపంచంలో అత్యుత్తమ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థల్లో బీసీజీ(బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్), మెకన్సీ, బెయిన్ అండ్ కంపెనీలు ప్రధానమైనవి. ఒక దేశం.. ఒక రాష్ట్రం, పరిశ్రమల స్థితిగతుల్ని అధ్యయనం చేసి.. వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు ఇవ్వడంలో ఈ సంస్థలు అత్యత్తమమైనవి. ఇందులో బీసీజీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. అందువల్లే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నడుంబిగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దానికోసం ప్రణాళికను రూపొందించే పనులను బీసీజీకి అప్పగించింది. రాష్ట్ర బడ్జెట్లో 8 శాతం అప్పుకే కట్టాలి ఒకే ప్రాంతంలో అభివృద్ధికి రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తే.. అందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల నుంచి 9 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 6–8 శాతం సమానంగా ఉంటుందని పేర్కొంది. ‘తొలి 10–15 సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించడానికి బడ్జెట్లో పది శాతం కేటాయించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడం వల్ల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు నిధులుండవు. దీనికి బదులు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందిచేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం మొత్తం రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చిస్తే రాష్ట్రంలో కొత్తగా 90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అదే జరిగితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 1.50 లక్షల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు పెరుగుతుంది’ అని బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ అంచనా వేసింది. అప్పుడు ప్రాజెక్టుల పూర్తికి పెట్టిన పెట్టుబడిని 5 సంవత్సరాల్లో వెనక్కి రాబట్టుకోవచ్చని విశ్లేషించింది. అమరావతి నగరంపై రూ. లక్ష కోట్లు వ్యయం చేసినా 40 ఏళ్ల వరకు రాబడి వచ్చే అవకాశం లేదని, అది కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సగటున 15–16 శాతం వృద్ధిరేటు నమోదు చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని, అందువల్ల అమరావతిపై భారీగా వ్యయం చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న విషయమని హెచ్చరించింది. 30కి పైగా నిర్మిస్తే.. అన్నీ విఫలం లక్షల కోట్లు చొప్పున వెచ్చించి ప్రపంచంలో నిర్మించిన 30కి పైగా కొత్త నగరాల్లో అన్నీ కూడా లక్ష్యాలను సాధించలేక చతికలబడ్డాయి. ఆశించిన స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన గానీ, అభివృద్ధి గానీ సాధించలేకపోయారని బీసీజీ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. 1980 దశకంలో చైనాలో ప్రారంభించిన షెన్జెన్, భారత్‌లో నవీ ముంబయి మాత్రమే కొంతమేరకు లక్ష్యాల్ని సాధించాయని పేర్కొంది. మిగిలిన నగరాల నిర్మాణంతో ప్రజాధనం వృథా కావడం తప్ప వేరే ప్రయోజన మేమీ సాధించలేదని నివేదికలో తెలిపారు. చదవండి: మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం నిపుణుల కమిటీ నివేదిక పరిశీలనకు హై పవర్ కమిటీ వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) విస్పష్టంగా పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అందుకు ప్రభుత్వానికి రెండు ఆప్షన్లను సూచించింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధిస్తూ.. అన్ని రంగాల్లో రాష్ట్ర పురోభివృద్దికి ఓ స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించింది. రాజధానితోపాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ శుక్రవారం తన నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించింది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రాధాన్యత, సహజ వనరులు, అభివృద్ధి అవకాశాలను విశ్లేషిస్తూ సమగ్రాభివృద్ధికి కీలక సూచనలు చేసింది. రాజధాని విషయంలో వివిధ దేశాల్లోని పరిస్థితులను ఉదహరిస్తూ ఆర్థిక భారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మరీ సిఫార్సులు చేసింది. న్యాయ, శాసన, పరిపాలనా వ్యవస్థలను రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రెండు ఆప్షన్లను సూచించింది. ప్రాంతీయ ప్రాతినిథ్యం, సమన్వయం, వ్యయం, ప్రజల సౌలభ్యం కోణాల్లో రెండు ఆప్షన్ల అనుకూల, ప్రతికూల అంశాలను బీసీజీ విశ్లేషించింది. రెండు ఆప్షన్లనూ పరిశీలించి, రాష్ట సమగ్రాభివృద్ధి, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లోని ఉదాహరణలను పరిశీలించి రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, ప్రధానంగా రాజధాని వ్యవస్థ ఎలా ఉండాలన్నది బీసీజీ సూచించింది. పరిపాలన వికేంద్రీకరణతో బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమని పేర్కొంది. తద్వారానే ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని చెప్పింది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులువుగా పౌర సేవలు అందించగలమని అభిప్రాయపడింది. జర్మనీ, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఈ విధంగానే సమగ్రాభివృద్ధి సాధిస్తూ, ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్నారని ఉదహరించింది. అన్ని అంశాలను పరిశీలించి, విశ్లేషించిన మీదట రాష్ట్రంలో కర్నూలు, అమరావతి, విశాఖపట్నం నగరాలను రాజధాని ఏర్పాటు కోసం పరిగణనలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ప్రతినిధులు, ఉన్నతాధికారులు రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి సూచనలు రాష్ట్ర సుస్థిర, సమతులాభివృద్ధికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూపు సవివర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్షలు, చారిత్రక నేపథ్యాల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి విధానం ఉత్తమమనే అంశాల్ని బీసీజీ సిఫారసు చేసిందని చెప్పారు. విజయవాడలోని ప్రణాళిక శాఖ కమిషనర్ కార్యాలయంలో బీసీజీ నివేదికలోని అంశాలను శుక్రవారం రాత్రి ఆయన మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నివేదికను హైపవర్ కమిటీకి రిఫర్ చేశారని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం, మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సూచీలలో ప్రగతి సాధించేందుకు బీసీజీ సూచనలు.. - రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో తలసరి పారిశ్రామిక స్థూల అదనపు విలువ(జీవీఏ) మరింతగా పెంపొందించవచ్చు. - కృష్ణా, గోదావరి బేసిన్ బయట ఉన్న 9 జిల్లాల్లో వ్యవసాయ ఉద్పాదకతను మరింతగా పెంచవచ్చు. - రాష్ట్రంలో ప్రస్తుతం మత్స్య ఉత్పత్తిలో 60 శాతం రెండు జిల్లాల నుంచే లభిస్తోంది. ఇతర జిల్లాలపై మరింత దృష్టి సారించడం ద్వారా మత్స్య ఉత్పత్తిని వృద్ధి చేయవచ్చు. - ప్రధానంగా మహిళల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాల్సి ఉంది. - ప్రస్తుతం రాష్ట్రానికి ఏటా 0.3 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించవచ్చు. - చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారితోపాటు రాష్ట్రం గుండా వెళ్తున్న అన్ని జాతీయ రహదారులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించాలి. - రాయలసీమలో పంటల విస్తీర్ణాన్ని పెంపొందించాలి. కృష్ణా– గోదావరి బేసిన్లో 60 శాతం నుంచి 80 శాతం వరకు భూములు సాగుబడిలో ఉన్నాయి. కానీ రాయలసీమలో కేవలం 20 శాతం భూములు మాత్రమే సాగులో ఉన్నాయి. గోదావరి–పెన్నా నదుల అనుసంధానించాలి. సచివాలయానికి వస్తోంది ఇందుకే.. - ఏడాదికి మొత్తం లక్ష మంది సచివాలయానికి వస్తే, అందులో 75 శాతం మంది కేవలం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే వచ్చారు. - ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చాలా సేవలు అందిస్తున్నా, ఆ సమాచారం తెలియక చాలా మంది సచివాలయానికి వస్తున్నారు. - మిగతావారంతా కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునే వారు, బిల్లుల కోసం వచ్చే వారే. ఉత్తరాంధ్ర అభివృద్ధికి... (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ) - ఎనలిటిక్స్, డాటా హబ్‌గా తీర్చిదిద్దాలి. - వైద్య పరికరాల ఉత్పత్తి, ఆట బొమ్మల తయారీ పరిశ్రమలు నెలకొల్పాలి. - జీడి మామిడి, కాఫీ, పసుపు వంటి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించాలి. - భోగపురం విమానాశ్రయాన్ని నిర్మించాలి. - అరకులో ఎకో, వైద్య టూరిజంను ప్రోత్సహించాలి. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల నిర్వహణ వేదికగా తీర్చిదిద్దాలి. గోదావరి డెల్టా అభివృద్ధికి...(తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి) - పెట్రో కెమికల్, ప్లాస్టిక్, సోలార్ పరిశ్రమలను నెలకొల్పాలి. - ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలి. - ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టాలి. - పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. - రోడ్ కనెక్టివిటీని పెంచుతూ బ్యాక్‌వాటర్ టూరిజం కేంద్రంగా కోనసీమ, హోప్ ఐలాండ్లను అభివృద్ధి చేయాలి. కృష్ణా డెల్టా అభివృద్ధికి... (కృష్ణా, గుంటూరు) - ఫుడ్ ప్రాసెసింగ్, సిరామిక్స్ పరిశ్రమలను నెలకొల్పాలి. - హైటెక్ సేంద్రియ వ్యవసాయం, మత్స్య పరిశ్రమలను ప్రోత్సహించాలి. - బందరు పోర్టును నిర్మించాలి. - బహుళ వినియోగ లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేయాలి. - వైద్య సేవలకు ప్రధాన కేంద్రంగా చేస్తూ హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలి. - ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలి. దక్షిణాంధ్ర జిల్లాల అభివృద్ధికి... (ప్రకాశం, నెల్లూరు) - ఆటోమొబైల్, టెలికాం ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను నెలకొల్పాలి. - చిన్న తరహా, మధ్యతరహా కాగితం గుజ్జు, చర్మ, ఫర్నిచర్ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలి. - మత్స్య పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలి. - మైపాడు బీచ్‌ను అభివృద్ధి చేయాలి. - గోదావరి – పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. తూర్పు రాయలసీమ అభివృద్ధికి... (వైఎస్సార్, చిత్తూరు) - స్టీల్, ఎలక్ట్రానిక్స్, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. - టమాటో ప్రాసెసింగ్ యూనిట్లు వంటి హైటెక్ వ్యవసాయ పరిశ్రమలను ప్రోత్సహించాలి. - గండికోట, బెలూం గుహల (కర్నూలు జిల్లా) కేంద్రంగా ఎకో–అడ్వంచర్ పర్యాటక రంగ కేంద్రంగా తీర్చిదిద్దాలి. - గోదావరి– పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. పశ్చిమ రాయలసీమ అభివృద్ధికి... (కర్నూలు, అనంతపురం) - టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ స్పేర్‌పార్ట్స్ పరిశ్రమలను నెలకొల్పాలి. - బిందుసేద్యాన్ని ప్రోత్సహించాలి. ఆర్గానిక్ ఉద్యానవన పంటల సాగును పెంపొందించాలి. - విజయనగర సామ్రాజ్య చరిత్ర ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ పెనుకొండ – రాయదుర్గం టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలి. - గోదావరి– పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. చదవండి: బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం నిపుణుల కమిటీ నివేదిక పరిశీలనకు హై పవర్ కమిటీ వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన హైపవర్ కమిటీ నియమాకాన్ని స్వాగతిస్తున్నానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన విష్ణుకుమార్‌రాజు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే తమ పార్టీ నిర్ణయమని తెలిపారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ. లక్ష కోట్లు ఒక ప్రాంతంలో వెచ్చించి అభివృద్ధి చేయడం సాధ్యమా? అని ప్రశ్నించారు. తాత్కాలిక కట్టడాల పేరుతో చంద్రబాబు చదరపు గజానికి రూ. 12వేలు వెచ్చించారని, అదే విశౠఖలో అయితే రూ. 4వేలతో పూర్తయ్యేదని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్ణయం వల్లే ఇప్పుడు అమరావతి రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేసిన రూ. వందల కోట్లతో విశాఖలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. గతంలోనే విశాఖను రెండో రాజధానిగా చేయాలని శివరామకృష్ణన్ కమిటీ కూడా సూచించిందని చెప్పారు. -
హై పవర్ కమిటీ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
-
నిపుణుల కమిటీ నివేదిక పరిశీలనకు హై పవర్ కమిటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు ఇతర నివేదికలను ఈ హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. 10మంది మంత్రులు సహా మొత్తం 16మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అలాగే ఈ కమిటీ ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు (బీసీజీ) నివేదికల్లోని అంశాల సమగ్ర, తులనాత్మక పరిశీలన చేయనుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. ఇవే అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని బీసీజీని సైతం ఇప్పటికే ప్రభుత్వం కోరింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ సంస్థ నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించడం కోసం మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని శుక్రవారం కేబినెట్ తీర్మానం చేసింది. ఇక ఈ కమిటీలో ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, హోంమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, మత్స్య, మార్కెటింగ్ శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ, పౌర సరఫరాల శాఖమంత్రి కొడాలి నాని, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్,సీసీఎల్ఏ, చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, లా సెక్రటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిమెంబర్ కన్వీనర్‌గా ఉన్నారు. మూడు వారాల్లోగా ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అవసరం అనుకుంటే హై పవర్ కమిటీ అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.