
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్ కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ నీలం సాహ్ని నేతృత్వంలో ఆర్టీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది. అధికార వికేంద్రీకరణతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని హై పవర్ కమిటీ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ముఖ్య అధికారులు, జీఎన్ రావు హాజరయ్యారు. జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై మంత్రులు, అధికారులు ఈ భేటీలో చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment