సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు భేటీ అయిన హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం మంత్రి పేర్ని నాని భేటీ వివరాలను మీడియా ముందు వెల్లడించారు. జిల్లాల వారిగా అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. అలాగే రాజధానిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై కూడా చర్చ జరిపినట్లు మంత్రి తెలిపారు. రాజధాని రైతుల సమస్యలను సీఆర్డీఏ కమిషనర్‌కు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వానికి ఏమి చెప్పదలుచుకున్నారో జనవరి 15లోపు రాత పూర్వకంగా లేదా ఈ-మెయిల్ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లొచ్చని సూచించారు.
‘ఎవరైతే రాజకీయం కోసం ఈ అంశాన్ని వాడుకుంటున్నారో.. వారికి తప్ప అందరికీ న్యాయం జరగబోతుంది. రైతులతో పాటు రాజకీయంగా ప్రేరేపితం చేసిన వారు ప్రీ ప్లాన్డ్ గా కొంతమంది ఆందోళన చెస్తున్నారు. వీటి వెనకాల టీడీపీ నేతలు ఉన్నారు. రైతులు కూడా మంత్రులను వ్యక్తిగతంగా కలుస్తున్నారు. వారి వినతులు కూడా చెప్తున్నారు. వాటన్నింటినీ స్వీకరిస్తాం’ అని అన్నారు. అలాగే ఈనెల 17న మరోసారి కమిటీ భేటీ అవుతుందని మంత్రి పేర్నినాని తెలిపారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సినిమాల్లో బ్రహ్మనందంలా తయారయ్యారని వ్యవసాయ శాఖ కన్నబాబు విమర్శించారు. ఆయనకి బాధ కలిగితే పండుగ చేసుకోకూడదు, ఆనందం కలిగితే పండగ చేసుకోవాలా అని ప్రశ్నించారు. అసత్యాలతో పండగపూటైనా వాళ్ళని ప్రేరేపించకుండా ఉంటే చాలని, సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ ని కూడా విమర్శిస్తున్నారు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment