సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై ఏర్పాటైన హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. రాజధానిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై కమిటీ చర్చించింది. ఆయా నివేదికలోని వివిధ అంశాలపై కమిటీ భేటీ కావడం ఇది మూడోసారి. ఈనెల 17న మరోసారి కమిటీ భేటీ అవుతుందని మంత్రి పేర్నినాని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారుడు అజేయ్ కల్లాం, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment