సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయంగా బోస్టన్ కమిటీకి అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థగా పేరు ఉందని... ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కి బీసీజీ అద్భుతమైన నివేదికను అందజేసిందని విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీలుగా బీసీజీ నివేదిక ఉందన్నారు. ఒక్క నగరం నిర్మాణానికే లక్షకోట్లను వెచ్చించడానికి బదులు...ఆ నిధులను అన్ని ప్రాంతాలకు సమానంగా వినియోగించడం... సాగునీటి రంగానికి ప్రాధాన్యతనివ్వడం వంటివి బీసీజీ నివేదికలో ఇచ్చారని తెలిపారు. అమరావతి నిర్మాణాలకి అనుకూలం కాదని మద్రాస్ ఐఐటి శాస్త్రీయంగా అధ్యయనం చేసి తెలిపిందని... అమరావతి ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రాంతీయ అసమానతలు తొలగే విధంగా బీసీజీ నివేదిక ఉందని ప్రసాద రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment