Prasada reddy
-
ఎడెక్స్‌తో ఒప్పందం రాష్ట్ర విద్యార్థులకు వరం
ఏయూక్యాంపస్: ప్రతిష్టాత్మకమైన ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రాష్ట్ర యువతకు వరంగా నిలుస్తుందని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఎడెక్స్ కోర్సులు అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తంచేస్తూ ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు ‘థాంక్యూ సీఎం సార్..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ యువత పోటీపడాలని, ఇందుకనుగుణంగా విద్య ప్రమాణాలు, సామర్థ్యాలను పెంపొందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, వాటిని యువత సద్వినియోగం చేసుకుంటూ నూతన అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. విద్యా విభాగాధిపతి ఆచార్య టి.షారోన్‌రాజు మాట్లాడుతూ మన విద్యార్థులు ఆక్స్ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి నేరుగా కోర్సులు చదివి సర్టిఫికేషన్ పొందే అవకాశం నేడు లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు సైతం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కోర్సులు పూర్తిచేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజి్రస్టార్ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.నరసింహారావు, విద్య విభాగం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్యరంగ అనుబంధ కోర్సులు
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్య రంగానికి అనుబంధంగా కొత్త కోర్సులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తెలిపారు. ఏయూ న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగం, నేషనల్ అసోసియేషన్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అండ్ రేడియేషన్ ఇన్ ఇండస్ట్రీ(నారీ) సంయుక్త ఆధ్వర్యాన గురువారం బీచ్‌రోడ్డులోని ఏయూ సాగరిక కన్వెన్షన్‌లో ‘రీసెంట్ ట్రెండ్స్ ఆన్ ఆప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అండ్ రేడియేషన్ టెక్నాలజీస్’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఉన్నత విద్యాసంస్థలు అన్ని అంశాల్లోనూ భాగస్వాములుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 98 ఏళ్ల ప్రస్థానం కలిగిన ఆంధ్ర వి«శ్వవిద్యాలయంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏయూ ఫార్మసీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, సైకాలజీ వంటి మెడికల్ సంబంధిత కోర్సులను అందిస్తోందని చెప్పారు. ప్రస్తుతం అనేక రంగాల్లో రేడియేషన్ టెక్నాలజీ పాత్ర పెరుగుతోందని, ఈ రంగంలో ఉన్న అద్భుత అవకాశాలను వినియోగించుకునేందుకు యువ పరిశోధకులు కృషి చేయాలన్నారు. డాక్టర్ అబ్రహాం వర్గీస్ మాట్లాడుతూ రేడియేషన్ టెక్నాలజీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అన్ని రంగాలు, పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఈ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువ పరి«శోధకులు, ఆచార్యులు నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. అనంతరం వీసీ ప్రసాదరెడ్డి, ‘నారీ’ ప్రధాన కార్యదర్శి పీజే చాండీ, డాక్టర్ అబ్రహాం తదితరులు సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. రేడియేషన్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలతో కూడిన ఎగ్జిబిషన్‌ను అతిథులు, విద్యార్థులు తిలకించారు. బ్రిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రదీప్ ముఖర్జి, ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.శ్రీని, సదస్సు చైర్మన్ ఆచార్య దుర్గాప్రసాద్, న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాధిపతి ఆచార్య లక్ష్మీనారాయణ, జాతీయ స్థాయిలో వివిధ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. -
ఏపీ సెట్‌కు 80.72 శాతం హాజరు
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్–2021 ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 80.72 శాతం మంది హాజరయ్యారు. పరీక్షను ఆదివారం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 78 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్షకు మెత్తం 36,667 మంది దరఖాస్తు చేయగా 29,596 మంది హాజరైనట్లు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో పరీక్ష కేంద్రాలను ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు పరిశీలించారు. సోమవారం ఏపీ సెట్ వెబ్సైట్లో ప్రాథమిక కీ అందుబాటులో ఉంచనున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. -
బోస్టన్ కమిటీ అత్యున్నత ప్రమాణాలు గల సంస్థ
-
బోస్టన్ కమిటీ నివేదిక అద్భుతం..
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయంగా బోస్టన్ కమిటీకి అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థగా పేరు ఉందని... ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కి బీసీజీ అద్భుతమైన నివేదికను అందజేసిందని విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీలుగా బీసీజీ నివేదిక ఉందన్నారు. ఒక్క నగరం నిర్మాణానికే లక్షకోట్లను వెచ్చించడానికి బదులు...ఆ నిధులను అన్ని ప్రాంతాలకు సమానంగా వినియోగించడం... సాగునీటి రంగానికి ప్రాధాన్యతనివ్వడం వంటివి బీసీజీ నివేదికలో ఇచ్చారని తెలిపారు. అమరావతి నిర్మాణాలకి అనుకూలం కాదని మద్రాస్ ఐఐటి శాస్త్రీయంగా అధ్యయనం చేసి తెలిపిందని... అమరావతి ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. ప్రాంతీయ అసమానతలు తొలగే విధంగా బీసీజీ నివేదిక ఉందని ప్రసాద రెడ్డి తెలిపారు. -
రైతు నేత తల పగలగొట్టిన పోలీసులు
-
రైతు నేత తల పగలగొట్టిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న మార్చ్ ఫాస్ట్‌ను అడ్డుకునే క్రమంలో పోలీసులు అదుపు తప్పి ప్రవర్తించారు. వాళ్లు విచ్చలవిడిగా లాఠీచార్జి చేయడంతో.. కడప జిల్లాకు చెందిన రైతు విభాగం నాయకుడు ప్రసాదరెడ్డి తలకు గాయాలయ్యాయి. కమలాపురానికి చెందిన ప్రసాదరెడ్డి రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు. పోలీసుల విచక్షణా రహితంగా కొట్టడంతో ఆయన దుస్తులు కూడా రక్తంతో తడిసిపోయాయి. ఆయన తలకు వెనుక భాగంలో తీవ్రంగా గాయమైంది. పార్టీ నాయకురాలు రోజా ఆయనను పరామర్శించి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రసాదరెడ్డిని అక్కడినుంచి ఆస్పత్రికి తరలించేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ నాయకత్వంలో మాత్రం నేతలు, కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున మోహరించి.. ఆయనను నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మందితో వైఎస్ జగన్ పార్లమెంటు దిశగా ముందుకు నడుస్తున్నారు. -
పోలీసులు, అధికారుల అండతోనే హత్య
- వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపణ - మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడి కనుసన్నల్లోనే ఈ ఘాతుకం హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేత ప్రసాదరెడ్డిని బుధవారం అనంతపురం జిల్లాలో ఎమ్మార్వో కార్యాలయంలోనే వేటకొడవళ్లతో కిరాతకంగా హత్య చేయటం వెనుక ప్రభుత్వాధికారులు, పోలీసుల సహకారం ఉందని స్పష్టమవుతోందని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడి కనుసన్నల్లోనే రాప్తాడు మండల వైఎస్సార్ సీపీ నేత ప్రసాదరెడ్డిని హతమార్చారని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. సీఎం చంద్రబాబు గద్దె నెక్కిన నాటి నుంచి జరుగుతున్న వరుస దాడులు, రాజకీయల హత్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలు చంద్రబాబు పాలనలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సర్కారు హత్యలను ప్రోత్సహిస్తోందన్నారు. చంద్రబాబు తొమ్మిది నెలల పాలనలో వైఎస్సార్సీపీ నేతలను ఎలా వెంటాడి చంపుతున్నారో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో నిలదీసినా, నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. ఎమ్మార్వో కార్యాలయంలోనే వేటకొడవళ్లతో దాడి చేసి చంపిన తీరు చూస్తుంటే టీడీపీ పాలనలో ప్రభుత్వ కార్యాలయాలు హింసకు నిలయాలుగా మారాయని తేటతెల్లమవుతోందన్నారు. రాజకీయ హత్యలకు పాల్పడే వారికి ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎలా ఉపయోగపడుతున్నారో ప్రసాదరెడ్డి హత్యే నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయనకులను అంతమొందించడం ద్వారా సీఎం చంద్రబాబునాయుడు రాజకీయ లబ్ధికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. -
ప్రసాదరెడ్డిది కచ్చితంగా రాజకీయ హత్యే..
రాప్తాడు(అనంతపురం): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్ రెడ్డిది కచ్చితంగా రాజకీయ హత్యేనని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అన్నారు. టీడీపీ నేతలు ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆక్రమించుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయాలు ఆపార్టీ నేతలకు అడ్డాగా మారాయని గుర్నాథరెడ్డి విమర్శించారు. కాగా రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయంలో ప్రసాద్ రెడ్డిపై దుండగులు వేటకొడవళ్లతో దాడి చేసి పాశవికంగా హతమార్చిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న గుర్నాథరెడ్డి హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని చూసి ఆయన కంటతడి పెట్టారు. గతంలో తనకు ప్రాణహాని ఉందని ప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని గుర్నాధరెడ్డి ఆరోపించారు.మరోవైపు ప్రసాద్‌రెడ్డి హత్యను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు, హత్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.