వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న మార్చ్ ఫాస్ట్ను అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయడంతో.. కడప జిల్లాకు చెందిన రైతు విభాగం నాయకుడు ప్రసాదరెడ్డి తలకు గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న మార్చ్ ఫాస్ట్ను అడ్డుకునే క్రమంలో పోలీసులు అదుపు తప్పి ప్రవర్తించారు. వాళ్లు విచ్చలవిడిగా లాఠీచార్జి చేయడంతో.. కడప జిల్లాకు చెందిన రైతు విభాగం నాయకుడు ప్రసాదరెడ్డి తలకు గాయాలయ్యాయి. కమలాపురానికి చెందిన ప్రసాదరెడ్డి రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు. పోలీసుల విచక్షణా రహితంగా కొట్టడంతో ఆయన దుస్తులు కూడా రక్తంతో తడిసిపోయాయి. ఆయన తలకు వెనుక భాగంలో తీవ్రంగా గాయమైంది. పార్టీ నాయకురాలు రోజా ఆయనను పరామర్శించి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రసాదరెడ్డిని అక్కడినుంచి ఆస్పత్రికి తరలించేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ నాయకత్వంలో మాత్రం నేతలు, కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున మోహరించి.. ఆయనను నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మందితో వైఎస్ జగన్ పార్లమెంటు దిశగా ముందుకు నడుస్తున్నారు.