సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఏయూ విద్యార్థులు
థ్యాంక్యూ సీఎం సార్... అంటూ ప్లకార్డుల ప్రదర్శన
ఏయూక్యాంపస్: ప్రతిష్టాత్మకమైన ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రాష్ట్ర యువతకు వరంగా నిలుస్తుందని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఎడెక్స్ కోర్సులు అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తంచేస్తూ ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు ‘థాంక్యూ సీఎం సార్..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ యువత పోటీపడాలని, ఇందుకనుగుణంగా విద్య ప్రమాణాలు, సామర్థ్యాలను పెంపొందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, వాటిని యువత సద్వినియోగం చేసుకుంటూ నూతన అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.
విద్యా విభాగాధిపతి ఆచార్య టి.షారోన్‌రాజు మాట్లాడుతూ మన విద్యార్థులు ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి నేరుగా కోర్సులు చదివి సర్టిఫికేషన్ పొందే అవకాశం నేడు లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు సైతం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కోర్సులు పూర్తిచేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజి్రస్టార్ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.నరసింహారావు, విద్య విభాగం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment