అంతర్జాతీయంగా బోస్టన్ కమిటీకి అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థగా పేరు ఉందని... ఏపీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కి బీసీజీ అద్భుతమైన నివేదికను అందజేసిందని విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి వీలుగా బీసీజీ నివేదిక ఉందన్నారు.