
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన హై పవర్ కమిటీ తొలిసారి సమావేశం కానుంది. అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ నీలం సాహ్ని నేతృత్వంలో హై పవర్ కమిటీ భేటీ అవుతోంది. ఈ కమిటీ జీఎన్ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించనుంది. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ హై పవర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కాగా ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) తమ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి.
చదవండి:
మూడింటిలోనూ ఉద్ధండులే!
బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు
రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం
అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్