సాక్షి, తాడేపల్లి : వికేంద్రకరణ ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందే విషయాలను శాస్త్రీయంగా నివేదికలో పొందుపరిచిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రాన్ని ఆరు విభాగాలుగా విభజించి సమగ్రమైన నివేదిక అందించిందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే అమర్నాథ్ శనివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలు కూడా ఉత‍్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయని గతంలోనే చెప్పాయన్నారు. ప్రపంచంలో అనేక గ్రీన్ ఫీల్డ్ రాజధానులు విళమైందని బీసీజీ నివేదికలో పేర్కొన్నారని, రాజధానిపై లక్షా పదివేల కోట్ల పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కష్టమని చెప్పారన్నారు.
విష ప్రచారం చేస్తున్నాయి..
అయితే కొన్ని పత్రికల్లో మూడు ముక్కలు అంటూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే అమర్నాథ్ మండిపడ్డారు. రాజధానులపై కొన్ని వార్తా పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక రాజధాని ఉంటే మరొక రాజధానిని అభివృద్ధి చేయకూడదా అని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం కోసం రాష్ట్రం విడిపోలేదా? అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయితే మళ్లీ విభజన వాదం తెరపైకి వస్తుందని అన్నారు. ప్రాంతాల వారీగా టీడీపీ...ప్రజలను రెచ‍్చగొడుతుందని విమర్శించారు. అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లు, నిధులు, పరిపాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని ఎమ్మెల్యే అమర్నాథ్ పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర, సీమ పరిస్థితి?
‘అమరావతి పెద్ద పెద్ద భవనాల నిర్మాణానికి అనుకూలం కాదని చెపుతున్నారు. డబ్బంతా అమరావతిలో ఖర్చు పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటి?. ఖర్చు అంతా ఒకచోటే పెడితే పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించవద్దా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని ఇక్కడ నిర్మించమంటే ఎలా? విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం వేలాది ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారు. తమ భూములకు రేట్లు తగ్గిపోతాయని చెప్పడం త్యాగమా? తమ వ్యాపారంను కాపాడుకోవడానికి చంద్రబాబు... తన సతీమణి భువనేశ్వరిని అమరావతికి తీసుకువచ్చారు. ప్రజలు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని భావిస్తున్నారు. అందుకే వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారు. పులివెందుల పంచాయతీ అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అన్ని వర‍్గాల ప్రజల నివాస వేదిక విశాఖపట్నం. చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఏమీ మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదు. అద్భుతమైన రాజధాని నిర్మిస్తే నారా లోకేష్ ఎందుకు రాజధానిలో ఓడిపోయాడు. జీఎన్‌రావు, బోస్టన్ గ్రూప్‌కు చట్టబద్ధత లేదు కానీ నారాయణ కమిటీకి చట్టబద్ధత ఉందా? విశాఖలో రాజధానిని వ్యతిరేకించే టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు మాటలు విని అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అశోక్ గజపతి...రాజుగా కాకుండా బంటుగా వ్యవహరిస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ రాజధానిలో పర్యటించి రైతుల పక్షాన ఉంటానని డబ్బాడు పెరుగున్నం తిన్నారు. పెరుగన్నం అరగక ముందే హైదరాబాద్ వెళ్లి మాట మార్చారు. పవన్ పూటకో మాట మాట్లాడుతున్నారు. ఊగడం మానేసి వాస్తవాలు తెలుసుకోవాలి’ అని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
చదవండి:
మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!
బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు
రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం
వికేంద్రీకరణకే మొగ్గు
అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్
Comments
Please login to add a commentAdd a comment