సీఎం జగన్‌ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు.. | Sidiri Appalaraju Slams On Chandrababu In Tadepalli | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు’

Published Sat, Jan 4 2020 1:26 PM | Last Updated on Sat, Jan 11 2020 10:20 PM

Sidiri Appalaraju Slams On Chandrababu In Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: గ్రీన్‌ఫీల్డ్‌ క్యాపిటల్‌ సాధ్యంకాదన్న శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. చంద్రబాబు తన వర్గం నేతలతో మరో కమిటీ వేశారని.. తాను నిర్ణయించుకున్నది ఆ కమిటీతో చెప్పించారని  తీవ్రంగా విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనకబడి ఉన్నాయని.. రాష్ట్రాన్ని ఆరు ప్రాంతాలుగా విభజించాలని బీసీజీ సూచనలు చేసిందని తెలిపారు. సమగ్రాభివృద్ధి కోసం బీసీజీ ప్రభుత్వం ముందుకు రెండు ఆప్షన్లు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వనరులను అధ్యయనం చేసి ఆ కమిటీ నివేదికను వెల్లడించిందని అప్పలరాజు తెలిపారు. అదేవిధంగా పోలవరం, పెన్నా- గోదావరి అనుసంధానం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై దృష్టి పెట్టాలని బీసీజీ సూచనలు చేసిందన్నారు.

శ్రీబాగ్ ఒప్పందంపై చంద్రబాబుకు నమ్మకం లేదా అని అప్పలరాజు సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తప్ప వికేంద్రికరణను అందరూ హర్షిస్తున్నారని అన్నారు. విశాఖలో క్యాపిటల్‌ పెట్టడం చంద్రబాబుకు ఇష్టం ఉందో.. లేదో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. అమరావతిలో చంద్రబాబు ఎందుకు శాశ్వత భవనాలు నిర్మించలేని అప్పలరాజు దుయ్యబట్టారు. లక్షల కోట్లు ఒకే ప్రాంతంలో పెట్టడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేశారని అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు అక్రమాలకు పాల్పడారని ఆయన ధ్వజమెత్తారు.

గతంలో పరిపాలనంతా ఒకేచోట కేంద్రీకృతం అవడంతో నష‍్టపోయమని ఆయన అన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకణ జరుగుతుందని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్రహ్మండమైన ఆలోచనలు చేశారని అప్పలరాజు కొనియాడారు. నీళ్లు, నిధులు, పరిపాలన అందిరికీ అందాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని గుర్తు చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి చంద్రబాబు పబ్బం గడుపుతున్నారని అప్పలరాజు మండిపడ్డారు. చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

చదవండి:

పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు..

మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!

బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు

డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..

జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు

రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం

వికేంద్రీకరణకే మొగ్గు

అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ

అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement