సాక్షి, అమరావతి: విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదన అభినందనీయమని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రశంసించారు. కర్నూలులో వరదలు, తుఫాన్లు వస్తాయనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కర్నూలులో రాజధాని పెడితే వరద ముప్పు ఉంటుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానిపై టీజీ వెంకటేష్ స్పందిస్తూ ...అలా అయితే అమరావతిలో ఎండలు తట్టుకోలేక జనాలు చనిపోతారంటూ వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం 200 ఎకరాలు అవసరం అయితే , రాయలసీమలో 400 ఎకరాలు ఖాళీ భూములు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాంతీయ విభేదాలు లేకుండా మూడు ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని కోరారు.
ఇక రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానంటే ...చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అడిగారని, ప్యాకేజీ తీసుకుంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి క్రెడిట్ వస్తుందని ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.
చదవండి:
బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు
రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం
అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్
Comments
Please login to add a commentAdd a comment