సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేశాడో చెప్పాలి. మళ్లీ ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతాడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబును ప్రజలు తరిమికొడతారు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు సీరియస్ కామెంట్స్ చేశారు.
మంత్రి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లతో ప్రజలు ఓ మూలన కూర్చోబెట్టారు. 2024లో చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధిచెబుతారు. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగితే కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది. గతంలో ఎమ్మెల్యేలకు ప్యాకేజీలు ఇచ్చి లాక్కున్న చంద్రబాబు.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు వేధించలేదా?. దమ్ముంటే రండి తేల్చుకుందామని చంద్రబాబు తొడగొడుతున్నాడు. 14ఏళ్లు సీఎంగా చేసి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇవి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన హయంలో చంద్రబాబు చేసిన ఒక్క పని గురించైనా చెప్పగలడా.. ఒక్క మంచి పథకం పేరైనా చెప్పగలడా?. ప్రజలకు చంద్రబాబు ఏం మేలు చేశాడో చెప్పాలి. ఒక్క కుటుంబానికైనా మంచి చేశానని చంద్రబాబు చెప్పగలడా?. సైకో చంద్రబాబును ప్రజలు తరిమికొట్టాల్సిన అవసరం ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment