సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంశంపై ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ స్పందించారు. విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేషన్ మంచి ఆలోచన అని, ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానులను తాను స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి మద్దతివ్వడం మంచి పరిణామని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతిలోనే జరిగిందని చిన్నికృష్ణ సంచనల వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలే చెప్పారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ ఇప్పటికే నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. (3 రాజధానులను స్వాగతించాలి)
కాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్ క్యాపిటల్), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్ క్యాపిటల్) ఏర్పాటు చేసేందుకు వీలుందని అన్నారు. ఈ ప్రకటపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. సీఎం నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను స్వాగిస్తున్నారు. మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని చిరంజీవి రాష్ట్ర ప్రజలను ఇదివరకే కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే రూ. 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో రూ. లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. (ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!)
Comments
Please login to add a commentAdd a comment