
సాక్షి, తిరుమల: మూడు రాజధానుల ప్రకటనను జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సమర్థించారు. ఆయన శనివారం ఉదయం తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగి ప్రశ్నకు ఎమ్మెల్యే రాపాక సమాధానమిస్తూ మూడు రాజధానుల నిర్ణయం సబబే అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు.
నవ రత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని... చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యే రాపాక స్పష్టం చేశారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర‍్ణయంతో రైతులకు ఇబ్బందే అని... అయితే అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాపాక కోరారు.
చదవండి:
మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!
బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు
ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..
జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు
రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం
అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్
Comments
Please login to add a commentAdd a comment