
అమలాపురం లోక్‌సభ సమన్వయకర్తగా రాపాక
రాజోలు అసెంబ్లీకి గొల్లపల్లి సూర్యారావు
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తల నియామకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెండు పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్‌సీపీ సమన్వకర్తలను నియమించింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి రాపాక వరప్రసాదరావు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావులను సమన్వయకర్తలుగా నియమించారు.