surya rao
-
కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తగా బీవై రామయ్య
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెండు పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ సమన్వకర్తలను నియమించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి రాపాక వరప్రసాదరావు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావులను సమన్వయకర్తలుగా నియమించారు. -
పవన్ ప్రకటనపై భగ్గుమన్న టీడీపీ
మలికిపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పోటీకి దిగుతారని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటనపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన మలికిపురంలో ఆదివారం జరిగిన సమావేశంలో రాజోలు ఎంపీపీ కేతా శ్రీను మాట్లాడుతూ.. రాజోలు టికెట్ జనసేనకు ఇస్తే ఎంపీపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసి గొల్లపల్లి వెంటే వెళ్తానని ప్రకటించారు. పార్టీ నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షులు కాండ్రేగుల లావణ్య భవాని మాట్లాడుతూ.. తాను కూడా తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గొల్లపల్లి సూర్యారావు వైఎస్సార్సీపీ నుంచి లేదా ఇండిపెడెంట్‌గా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత కుసుకుర్తి త్రినాథ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పరిస్థితిపై మాట్లాడటానికి అచ్చెన్నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరని ప్రశ్నించారు. చివరగా గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కార్యకర్తల మనోభావాలను మరోసారి అధిష్టానానికి చెబుదామని, తరువాతే నిర్ణయం తీసుకుందామని అన్నారు. నియోజకవర్గంలో రూ.1,400 కోట్ల అభివృద్ధి చేశామని, భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానిస్తే ఇంటింటికీ తిరిగి ఖండించానని, అటువంటి తనపట్ల పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దామని అన్నారు. కాగా, జనసేనతో కలసి ఇప్పటివరకూ ఉమ్మడి కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ.. ఈ సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ ఫొటో కానీ, నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెద్దకాపు ఫొటో కానీ వేయకపోవడం గమనార్హం. -
ఆర్ఎస్ఆర్.. ఈజే లెజెండ్..
-ఆస్తులమ్మి విద్యాదానం –ఎమ్మెల్సీ అయినా సాధారణ జీవితం అరవై ఆరు ఎకరాల ఆసామి. రాష్ట్రంలో పేరుగాంచిన ఒక విద్యా సంస్థకు ప్రిన్సిపాల్‌గా పనిచేసిన వ్యక్తి. ఆయన తలచుకుంటే విలాసవంతమైన జీవితాన్ని అనుభవించొచ్చు. ఏడంతస్తుల మేడ, నౌకర్లు, చాకర్లు, కార్లు ఇలా ఏదైనా సమకూర్చుకోవచ్చు. కానీ ఆయన ఆవేమీ కోరుకోలేదు. ఓ సాధారణ మధ్య తరగతి వ్యక్తిలా జీవించాడు. అలాంటి కుటుంబ యజమాని రూపాయి ఖర్చుపెట్టకుండా మేధావుల సభకు ఎన్నికయ్యాడు.. అదికూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థను శాసించే వ్యక్తులు, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిపై పోటీ చేసి గెలిచాడు. ఆయనే ఎమ్మెల్సీ రాము సూర్యారావు(ఆర్ఎస్ఆర్). ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన రాము పేరయ్య, రత్తాల ఏకైక కుమారుడు రాము సూర్యారావు(ఆర్ఎస్ఆర్). సొంతూరులోనే ప్రాథమిక విద్యను పూర్తిచేసిన ఆర్ఎస్ఆర్ డిగ్రీ విద్యను సీఆర్‌రెడ్డి కళాశాలలోనూ, డబుల్ ఎంఏను ఆంధ్ర విశ్వ విద్యాలయంలోనూ పూర్తిచేశారు. 1996 నుంచి 2005 వరకు సీఆర్ఆర్ కాలేజీలో పొలిటికల్ సైన్సు విభాగాధిపతిగా పనిచేశారు. 2005నుంచి 2007వరకు అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా సేవలు అందించి మే 31న పదవీవిరమణ చేశారు. తాను 3వ తరగతి చదువుతున్న నాటి నుంచే తోటి విద్యార్థులకు పుస్తకాలు, ఫీజులకు సాయపడేవారు ఆర్ఎస్ఆర్. తనకు తండ్రి జేబు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బును వారికి ఇచ్చి ఆదుకునేవారు. వయస్సుతో పాటు ఆయనలోని దయాగుణమూ ఎదుగుతూ వచ్చింది. పేద విద్యార్థులను చదివించడానికి తాతల నుంచి సంక్రమించిన ఆస్తిలో 44 ఎకరాల భూమిని ఆయన అమ్మేశారు. ఉద్యోగంలో ఉండగా తనకు వచ్చిన జీతాన్ని ధారపోసేంతగా, పదవీ విరమణ అనంతరం తన పెన్షన్‌ను సైతం విద్యార్థులకే ఖర్చుపెట్టేంతగా ఆయన దయాగుణం ప్రమోట్ అయ్యింది. ఇప్పటికీ ఎమ్మెల్సీగా ఆయన జీతం, పెన్షన్ అన్నీ విద్యకే వినియోగిస్తున్నారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ముందుకువెళుతుందని ఆర్ఎస్ఆర్ విశ్వసిస్తారు. అందుకే పదవీ విరమణ అనంతరం ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని.. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు వైద్య సేవలందే విధంగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. ఆయన రోగులకు చేస్తోన్న సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయన్ని జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమించింది. విద్యాభివృద్ధికి తన జీతాన్ని, జీవితాన్ని ధారపోసిన ఆర్ఎస్ఆర్ మాష్టారు ప్రభుత్వ విద్యా విధానంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. బాల కార్మికుల విద్యకు, వయోజన విద్యకు ప్రభుత్వం విడుదల చేస్తోన్న నిధులు వృథా అవుతున్నాయనే బాధ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇష్టంలేని వారికి బలవంతంగా విద్య చెప్పించే బదులు ఆసక్తిగా చదువుకునే వారి కోసం ఆ నిధులు వినియోగిస్తే మరింత ప్రయోజనముంటుందనేది ఆయన వాదన. ప్రభుత్వ పాఠశాలలను దాతలు, ప్రజా ప్రతినిధులు దత్తత తీసుకోవాలన్నది ఆయన ఆకాంక్ష. అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించేందుకు కృషి చేయాలంటారు. ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు దీనిని గుర్తించుకోవాలని ఆర్ఎస్ఆర్ అభిప్రాయం. కార్పొట్ విద్యా విధానం మారాలి ’కార్పొరేట్ విద్యా సంస్థలు అతి చేస్తున్నాయి. విద్యార్థుల్లో మానసిక పరిపక్వత, సామాజిక చైతన్యం లేకుండా కేవలం బండ చదువులు రుద్దడానికే పరిమితమయ్యాయి. ఆ విధానం మారాలి. అమెరికా, జపాన్ దేశాల్లో ప్రభుత్వ పాఠశాలలే అగ్రస్థానాల్లో నిలుస్తున్నాయి. అటువంటి విద్యా విధానంపై అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేయాల్సిన అవసరముంది.’ అని ఆర్ఎస్ఆర్ అంటారు. రాజకీయాలకు దూరంగా.. సేవకు దగ్గరగా.. ’నేను ఏ పార్టీకీ అనుకూలంకాదు, వ్యతిరేకం కాదు అన్ని వర్గాలనూ కలుపుకుపోతాను. ఏ మతం వారైనా తాము నమ్మిన దేవుణ్ణి పూజిస్తే పుణ్యం రాదు. రోగులకు సేవచేస్తే, విద్యార్థులను చదివిస్తే పుణ్యం వస్తుంది అని నమ్మితే సరిపోతుంది. ఓటు వేయడానికి మన కులపోడా, మనకు ఎంత డబ్బు ఇచ్చాడు అని కాకుండా సేవ చేసేవాడా కాదా, సమాజానికి ఉపయోగపడేవాడా కాదా అని ఆలోచించి ఓటు వేయాలి. కష్టాలు ఎదుర్కొన్నా నీతి, నిజాయితీలకు కట్టుబడి పనిచేస్తే వచ్చే సంతృప్తి అధికారంవల్లనో, డబ్బువల్లనో రాదని గ్రహించాలి’ అన్నది ఆర్ఎస్ఆర్ సందేశం. -
శవానికి వైద్యమంటూ హడావుడి!
విశాఖ: వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన విశాఖ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. చికిత్స కోసం సూర్యారావు అనే వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతడు మృతిచెందాడు. దాంతో సూర్యారావు మృతిచెందిన విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం కప్పిపుచ్చుకునే యత్నం చేసింది. ఏకంగా శవానికే మెరుగైన వైద్యం అందించాలంటూ హడావుడి చేసిన ఆస్పత్రి వైద్యులు మరో ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. ఆస్పత్రి యాజమాన్యం తీరుపై అనుమానం వచ్చిన మృతుని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
పోలీసులను ఆశ్రయించిన వడ్డీ బాధితులు
వడ్డీ వ్యాపారులు తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారంటూ బాధితులు విశాఖ నాలుగో టౌన్ పోలీసులను ఆశ్రయించారు. నగరంలోని నర్సింహనగర్‌కు చెందిన డీఎస్ఎన్ రెడ్డి అనే వ్యక్తి వడ్డీకి అప్పులు ఇస్తుంటాడు. అతడి వద్ద స్థానికులైన బండారు సూర్యారావు, పార్వతి దంపతులు మూడేళ్ల క్రితం రూ.50 వేలు అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వారి నుంచి ఐదు ప్రామిసరీ నోట్లు, ఐదు చెక్కులు తీసుకున్నారు. అప్పటి నుంచి నెలకు వెయ్యి చొప్పున వారు అతడికి వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే, ఆ వ్యాపారి ఇటీవల అసలు మొత్తం వెంటనే చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో బాధితులు తమ ఇంటిని విక్రయానికి పెట్టారు. అయితే, కొంటానంటూ ముందుకు వచ్చిన ప్రసాద్ అనే వ్యక్తి బోగస్ పత్రాలిచ్చారంటూ వారిని బెదిరిస్తున్నాడు. ఇదిలా ఉండగా బాధిత దంపతులు బ్యాంకులో ఉన్న తమ నగలను మరో మహిళ ఆర్థిక సాయంతో విడిపించుకున్నారు. కాగా.. సదరు మహిళ ఆ నగలను తన వద్దే ఉంచుకుని రేపుమాపు అంటూ తిప్పుకుంటోంది. దీంతో బాధిత దంపతులు బుధవారం సాయంత్రం నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. డీఎస్‌ఎన్‌రెడ్డి, ప్రసాద్, మరో మహిళపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. -
వాటీజ్ గుడ్...?
చిక్కడపల్లి లాంటి చోట ఓ క్లర్కు సూర్యారావు లాంటి చిన్న గుమస్తా చాలీచాలని జీతంతో మిడుకుతుంటాడు. ఓ చిట్టీ మీద రూమ్ అద్దె, పాలు, పచారీ సరుకులు, బియ్యం, ఉప్పులూ పప్పులతో పాటు చివర్లో సుఖం అని కూడా రాసుకుంటాడు. అన్నిటికీ పక్కన రేట్లు వేసుకుని ఒబ్బిడిగా బతుకుతుంటాడు. చివర్లో సుఖం కోసం ఓ వేశ్యని బుక్ చేసుకుంటాడు. ఆవిడ నెలకి రెండుసార్లు వచ్చి పోతుంటుంది. ప్రభుత్వం వారు బడ్జెట్ పెట్టినందువల్ల సరుకుల రేట్లన్నీ పెరుగుతాయి. ఒకనాడు వచ్చినావిడ వెళ్లే ముందు చీర సవరించుకుంటూ.. ‘‘యావండీ.. అన్ని రేట్లూ పెరిగాయి. మీ ఇంటికి వచ్చిపోవడానికి బస్సుచార్జీలు కూడా పెంచేశారు. నాక్కూడా మీరు రేటు పెంచాలండీ’’ అంటుంది. మన క్లర్కు రావు మటుకు తలపెకైత్తి ‘‘ఇక నుంచి నెలకు ఒకేసారి రా’’ అని చెప్తాడు. అదీ కథ. పోస్టు కార్డు మీద రాసే కథల పోటీలో చంద్రకి మొదటి బహుమతి వచ్చినట్టు గుర్తు. బడ్జెట్ అంటే గవర్నమెంటువారు మన వాకిట్లోకీ, నట్టింట్లోకీ, వంటగదీ, పడగ్గదిలోకీ తోసుకొచ్చే బాలక్రిష్ణ లాటిదనమాట. అది మన తిండీ తిప్పల్నీ, నవ్వులూ, ఏడుపుల్నీ కంట్రోల్ చేసే యంత్రం. పెద్దమాటగా చెప్పాలంటే రాజ్యాంగయంత్రం. ఒకప్పుడు ఢిల్లీ ఫిలిం ఫెస్టివల్‌కి క్యూబన్ స్టార్ డెరైక్టర్ వచ్చాడు. ఆయన ఫిలిం ఉత్తమ చిత్రంగా ఎన్నికైనందున రిపోర్టర్లంతా చుట్టూ చేరి చాలా ప్రశ్నలేశారు. వర్ధమాన దేశాల్లో డెరైక్టర్లకు సినిమా సబ్జెక్టుల కొరత ఉందని విలేకరులు బెంగపడ్డారు. వెంటనే ఆయన ‘‘సబ్జెక్టులకు లోటేముంది. ఈ పూట మీరు ఎన్ని అన్నం ముద్దలు మింగాలో మీ ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఈ విషయం మీదే సినిమా తియ్యొచ్చు.’’ అన్నాడు. అలాగని ఈ పేపరు చదవడం ముగించి వేంటనే షార్ట్ ఫిలిం లాగుదామని తొందరపడి పోకండి. నెహ్రూ గారి కాలంలో ‘శంకర్స్ వీక్లీ’ అనే కార్టూన్ మ్యాగజీన్ ప్రతివారం వచ్చేది. ఎడిటర్ శంకర్ నెహ్రూకి వీరాభిమాని. కాని కార్టూన్లలో చురకలుండేవి. బడ్జెట్‌కు ముందు పెట్టుబడిదార్లను తృప్తిపరచడం కోసం నెహ్రూ తంటాలు పడుతుంటాడు. టాటాబిర్లాలిద్దరూ మూతి ముడుచుకుని వెనక్కి తిరిగి నుంచునుంటారు. నెహ్రూ తన ఆర్థికమంత్రితో కలిసి ఒక బంగారుపళ్లెంలో కేబినెట్ మినిస్టర్‌ను తీసుకొచ్చి సమర్పిస్తాడు. టాటాబిర్లాలకు ఏమాత్రం గిట్టదు. ఎలాగైనా వాళ్లని మెప్పించాలని వరసగా ఒక్కొక్క మినిస్టర్‌నే తెచ్చి తాకట్టు పెట్టుకున్నా వాళ్లిద్దరూ మొహం మాడ్చుకునే ఉంటారు. చివరికి నెహ్రూనే స్వయంగా పళ్లెంలో కూచుని దాని అంచులు పట్టుకుని సమర్పించుకుంటాడు. అప్పుడు వాళ్లిద్దరి మొహాలు వికసించి నవ్వుతారు. ‘ప్రభుత్వమంటే కొద్దిమంది పెట్టుబడిదార్ల వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ’ మాత్రమేనన్నాడు కారల్ మార్క్స్. వాళ్ల జమాఖర్చులే బడ్జెట్ అనుకోవచ్చు. మార్క్స్ చెప్పినంతటి చిక్కుముడి లేకుండా భారీ బిజినెస్మేన్సే పార్టీలను కొని, టికెట్లు కొని డెరైక్టుగా మంత్రులైపోతున్నారు గనక వాళ్ల తరఫున వేరే గవర్నమెంట్ పని చెయ్యాల్సిన ముచ్చటే లేదు. వీళ్లే గవర్నమెంటు. రిలయన్స్ లాంటి వాళ్లిచ్చిన వేలకోట్లతో, రిలయన్స్ మీడియా ప్రచారహోరులో గెలిచినవాళ్లు ఆ కంపెనీ గీసిన గీత దాటుతారనుకోవడం వెర్రేకాదు సర్రియలిజం కూడాను. అమెరికాలో ఒకప్పుడీ మాట ప్రచారంలో ఉండేది. ‘‘వాటీజ్ గుడ్ ఫర్ జనరల్ ఎలక్ట్రిక్(జి.ఇ.) ఈజ్ గుడ్ ఫర్ అమెరికా’’ఇప్పుడు మనమూ చక్కగా అనుకోవచ్చు. ‘‘వాటీజ్ గుడ్ ఫర్ రిలయన్స్ ఈజ్ గుడ్ ఫర్ ఇండియా’’ ... ఛీర్స్! మోహన్ఆర్టిస్ట్