rapaka varaprasad
-
మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..
-
అమలాపురంలో నా సత్తా ఏంటో చూపిస్తా
-
సీఎం జగన్ దాడి పై రాపాక స్ట్రాంగ్ రియాక్షన్...
-
జగన్ అంటే చంద్రబాబుకు అందుకే భయం
-
అమలాపురంలో ఎంపీ అభ్యర్థి రాపాక ప్రచారం
-
రాజమండ్రిలో దుమ్మురేపుతున్న రాపాక ఎలక్షన్ క్యాంపెయిన్
-
ఢిల్లీలో ఎవరినీ వదలలేదు..చంద్రబాబు,పవన్ పై రాపాక సెటైర్లు
-
నన్ను నమ్మి సీటు ఇచ్చిన సీఎం జగన్ కి మాటిస్తున్న..
-
కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తగా బీవై రామయ్య
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెండు పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ సమన్వకర్తలను నియమించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి రాపాక వరప్రసాదరావు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావులను సమన్వయకర్తలుగా నియమించారు. -
ఒకే ఒక్క పిలుపు.. రాపాక స్పీచ్ కి దద్దరిల్లిన రాజోలు
-
లోకేష్ ని ఏకి పారేసిన రాపాక..
-
టీడీపీ, జనసేనపై రాపాక కామెంట్స్
-
పవన్ కళ్యాణ్ కు దిమ్మదిరిగే షాక్
-
రాజోలు నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
టీడీపీ వాళ్ళకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రాపాక
-
కోనసీమ: నూతన వధువరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, కత్తిమండ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్తిమండ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు శ్రీతన్మయి, వెంకట్రామ్లను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్ ఆశీర్వదించారు. -
రేపు సీఎం జగన్ కోనసీమ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకలో భాగంగా సీఎం జగన్ రేపు కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి బయలుదేరి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం చేరుకుంటారు. అక్కడి నుంచి కత్తిమంద గ్రామంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
సీఎం జగన్ దమ్మున్న నాయకుడు
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బేరసారాలు నిజమే!
సఖినేటిపల్లి/మలికిపురం: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ ఆ పార్టీ నుంచి తనకు భారీ ఆఫర్ అందినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు శాసనసభ్యుడు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వెల్లడించారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నీతి, నిజాయితీతో పని చేయాలని, అవినీతికి పాల్పడకూడదని కార్యకర్తలకు తాను సూచించినట్లు చెప్పారు. తాను అక్రమాలకు పాల్పడాలనుకుంటే, తప్పుగా ఓటు వేస్తే కనీసం రూ.10 కోట్లు వచ్చేవని చెప్పానన్నారు. ‘నాకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది. పా ర్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని, ఫైనాన్షియల్ మేటర్ మాట్లాడదామని ఉండి ఎమ్మెల్యే రామరాజు నాతో చెప్పారు. నేను వెంటనే తిరస్కరించా. క్రాస్ ఓటు చేయబోనని చెప్పాను. దాని గురించి నాతో మాట్లాడవద్దని స్పష్టం చేశా. అంతకుముందు రోజు నా స్నేహితుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు కేఎస్ఎన్ రాజుతో కూడా ఆయన ఇదే విషయం ప్రస్తావించారు. మీ ఎమ్మెల్యే మాకు అనుకూలంగా ఓటేస్తే మేం అన్ని రకాలుగా చూసుకుంటామని చెప్పారు. అయితే కేఎస్ఎన్ రాజు.. ఈ విషయం మా ఎమ్మెల్యే(రాపాక)తో చెప్పబోనని, ఇలాంటి వాటికి ఆయన ఒప్పుకోరని స్పష్టం చేశారు. తరువాత రామరాజు నన్ను నేరుగా అప్రోచ్ కావడంతో క్రాస్ ఓటు చేయబోనని తేల్చి చెప్పా’ అని ఎమ్మెల్యే రాపాక వెల్లడించారు. -
ఓటుకు కోట్లు 2.0: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. చంద్రబాబు
చెప్పులు రుచి మరిగిన కుక్కకు చెరకు తీపి రుచిస్తుందా?.. పుట్టుకతో వచ్చిన గుణం పుడమిలో కలిసేదాకా పోదు కదా! బేరసారాలే ఊపిరిగా బతికే నేతల నైజం కూడా అంతే!.. కుమ్మక్కు రాజకీయాలు, కొనుగోళ్లే వారి లక్షణం.. లక్ష్యం! సాక్షి, అమరావతి: ఎనిమిదేళ్ల క్రితం.. తెలంగాణ శాసన మండలికి 2015లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏపీ శాసన మండలి ఎన్నికల్లోనూ అదే విధానాన్ని నమ్ముకుంది. ఓటుకు కోట్లను ఎర వేసింది. గెలిచే బలం లేకపోయినా బేరసారాలకు దిగి నిస్సిగ్గుగా క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించింది. ఆది నుంచి తాను నమ్ముకున్న కొనుగోళ్లు, కుమ్మక్కు రాజకీయాలనే మరోసారి అనుసరించింది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడంలో విఫలమైన వారితోపాటు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్ దక్కదనే సంకేతాలున్న వారిని ప్రలోభాలకు గురి చేసి అనైతిక చర్యలకు పాల్పడింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వాస్తవాలను వెల్లడించడంతో చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం అమలైన ‘ఓటుకు కోట్లు స్కాం 2.0’ బహిర్గతమైంది. బలం లేదని స్పష్టంగా తెలిసినా.. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ద్వారా టీడీపీ తన అభ్యర్థి పంచుమర్తి అనూరాధను గట్టెక్కించుకోగలిగింది. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా వైఎస్సార్సీపీకి 151 మంది సభ్యులున్నారు. టీడీపీ తరపున గెలిచిన 23 మందిలో నలుగురు ఆదిలోనే ఆ పార్టీకి దూరంగా జరగడంతో సాంకేతికంగా ఉన్న సభ్యులు 19 మంది మాత్రమే. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక కూడా ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. టీడీపీ, జనసేన విధానాలతో విబేధించిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలూ వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నారు. అంటే అధికార పార్టీకి సాంకేతికంగా ఉన్న సభ్యులు 156 అని స్పష్టమవుతోంది. ఒక్కో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపొందాలంటే 22 మంది ఎమ్మెల్యేల ప్రథమ ప్రాధాన్యత ఓట్లు అవసరం. వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్నందున ఖాళీ అయిన ఏడు స్థానాలకు తన అభ్యర్థులను బరిలోకి దించింది. తగిన సంఖ్యా బలం లేకపోయినప్పటికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టారు. సంఖ్యా బలం లేకుండా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించడాన్ని బట్టి చూస్తుంటే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే రూ.కోట్లు ఎర వేసి బేరసారాలకు చంద్రబాబు వ్యూహం రచించినట్లు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఆదిలోనే చెప్పారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.పది కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ వెదజల్లి కొనుగోలు చేసి టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు గెలిపించుకున్నారని సజ్జలతోపాటు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాపాక వాస్తవాలను వెల్లడించడటంతో ఓటుకు కోట్లు స్కాం 2.0 బట్టబయలైంది. అసెంబ్లీ లాబీ వేదికగా పదేపదే ప్రలోభాలు.. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన నుంచి గెలుపొందినా పవన్ కళ్యాణ్ పోకడలను నిరసిస్తూ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ వెంట ప్రజాభీష్టం ప్రకారం నడుస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాపాకను ప్రలోభాలకు గురి చేసి తమ వైపునకు తిప్పుకునేందుకు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజును చంద్రబాబు బరిలోకి దించారు. తన మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఎమ్మెల్యే రాపాక తాజాగా మీడియాకు బహిర్గతం చేశారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే పెద్ద ఎత్తున డబ్బులతో పాటు పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని రామరాజు తనకు ప్రతిపాదన పంపారని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజు కూడా లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు తనను పక్కకు పిలిచి మరోసారి ప్రలోభపెట్టారని రాపాక చెప్పారు. తనను పదేపదే ప్రలోభాలకు గురి చేసినా డబ్బులకు అమ్ముడుపోయి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోలేనని మరోసారి తేల్చి చెప్పినట్లు రాపాక పేర్కొన్నారు. అనంతరం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా టీడీపీ ప్రలోభాలకు గురిచేసిన విషయం తెలిసిందన్నారు. కాగా ఈ అంశంపై ఉండి ఎమ్మెల్యే రామరాజు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే రాపాకను కలసి మాట్లాడిన విషయం వాస్తవమేనని అంగీకరించడం గమనార్హం. అయితే రాపాకను ప్రలోభపెట్టలేదంటూ దాటవేసే యత్నం చేశారు. ప్రలోభాలకు ఆదిగురువు రాజకీయాల్లో ప్రలోభాల పర్వం చంద్రబాబుతోనే మొదలైందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ శాసన మండలికి 2015లో ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ అభ్యర్థి వేం నరేంద్రరెడ్డిని చంద్రబాబు బరిలోకి దించారు. రూ.కోట్లు ఎర వేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తన శిష్యుడు రేవంత్‌రెడ్డిని పురమాయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బుల కట్టలతో కూడిన బ్యాగ్‌ను అందచేస్తుండగా తెలంగాణ ఏసీసీ సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండెడ్‌గా 2015 మే 31న పట్టుకుంది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు తాకట్టుపెట్టి మరీ రాత్రికి రాత్రే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పరారై కృష్ణా కరకట్టపై ఉండవల్లి వద్ద ఉన్న అక్రమ నివాసానికి చేరుకున్నారు. తాజాగా శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే రీతిలో ఓటుకు నోట్లు కుంభకోణానికి చంద్రబాబు పాల్పడటం గమనార్హం. అందుకే పుట్టుకతో వచ్చిన గుణం చచ్చే దాకా పోదనే నానుడి ఆయనకు అతికినట్లు సరిపోతుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఓటుకు కోట్లు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం
అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం స్పష్టంగా బట్టబయలైంది. అనైతికంగా ఒక ఎమ్మెల్సీ సీటును గెలిచి ఏదో గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ బాగోతం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సాక్షిగా బయటపడింది. రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాకను కొనేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. రూ. 10 కోట్లు అంటూ రాపాకను కొనేందుకు టీడీపీ పావులు కదిపింది. టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఇందుకు మధ్యవర్తిత్వం వహించారు. రాపాకను ఎలాగైనా తమ వైపుకు తిప్పుకోవాలని యత్నాలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే రూ. 10 కోట్లు అంటూ ఆఫర్ తెచ్చారు. టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్ ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. టీడీపీకి ఓటేస్తే ఎన్నో ప్రయోజనాలు అంటూ రాపాకను ప్రలోభ పెట్టే యత్నం చేశారు ఎమ్మెల్యే మంతెన. అయితే రాపాక మాత్రం కుదరదని తేల్చి చెప్పడమే కాకుండా తాజాగా ఆ విషయాన్ని మీడియా ముఖంగా బయటపెట్టడంతో టీడీపీ బండారం బట్టబయలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ తనకు రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. తన ఓటు అమ్మితే రూ. 10 కోట్లు వచ్చేదని, తన వద్ద డబ్బు ఉండి వద్దనలేదని, ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేమనే తనకు ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. ‘నా ఓటు కోసం నా మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారు. అసెంబ్లీ దగ్గర కూడా టీడీపీకి ఓటేయమని ఓ రాజుగారు కోరారు. టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్ ఉంటుందని చెప్పారు. సిగ్గు, శరం విడిస్తే నాకు రూ. 10 కోట్లు వచ్చేవి. ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేం’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేయాలని మొదటి ఆఫర్ తనకే వచ్చిందన్నారు రాపాక. కాగా, గతంలో తెలంగాణలో ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడానికి నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసే యత్నంలో టీడీపీ అధినేత చంద్రబాబే డైరెక్ట్‌గా మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఇదే ప్రలోభాలకు పాల్పడటం గమనార్హం. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాకు రూ.10 కోట్లు ఆఫర్ చేసింది: రాపాక
-
‘టీడీపీ నాకు రూ. 10 కోట్లు ఆఫర్ చేసింది’
రాజోలు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ తనకు రూ. 10 కోట్లు ఆఫర్ చేసిందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. తన ఓటు అమ్మితే రూ. 10 కోట్లు వచ్చేదని, తన వద్ద డబ్బు ఉండి వద్దనలేదని, ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేమనే తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. ‘ నా ఓటు కోసం నా మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారు. అసెంబ్లీ దగ్గర కూడా టీడీపీకి ఓటేయమని ఓ రాజుగారు కోరారు. టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్ ఉంటుందని చెప్పారు. సిగ్గు, శరం విడిస్తే నాకు రూ. 10 కోట్లు వచ్చేవి. ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేం’ అని పేర్కొన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
సీఎం జగన్ పాలనపై రాపాక ప్రశంసలు
-
Director Sukumar: తండ్రిని తలచుకొని భావోద్వేగానికి లోనైన సుక్కూ
మలికిపురం: ఉద్యోగాన్ని వదిలి సినీ పరిశ్రమకు వెళుతున్నప్పుడు తన తండ్రి ఎంతో ప్రోత్సహించి ధైర్యం చెప్పారని సినీ దర్శకుడు సుకుమార్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలోని స్వగ్రామం మట్టపర్రులో పాఠశాల భవనం అదనపు గదుల నిర్మాణానికి తన తండ్రి తిరుపతినాయుడు పేరిట సుకుమార్ గతంలో రూ.18 లక్షల విరాళం అందించారు. ఆ నిధులతో నిర్మించిన భవనాన్ని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పాఠశాలలోనే తాను చదివానని.. తన తండ్రి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చినట్టు తెలిపారు. ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ స్వగ్రామానికి సుకుమార్ చేస్తున్న సేవలను కొనియాడారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన రాపాక వెంకట్ రామ్
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సందర్భంగా వెంకటరామ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా పాల్గొన్నారు. -
జగన్‌లాంటి నాయకుడు ఉండటం మన అదృష్టం: రాపాక వరప్రసాద్
-
నేను బ్రతికున్నంత వరకు జగనే సీఎం: రాపాక
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నాలుగో రోజు చర్చలో భాగంగా గురువారం ప్రభుత్వ పథకాలపై ప్రసంగించిన రాపాక.. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోని ప్రజా సంక్షేమ నిర్ణయాలను చిన్న వయసులోనే అమలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్మరణీమైన స్థానం దక్కించుకున్నారని పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రజల శ్రేయస్సు గురించి ఇంతగా పరితపించే సీఎంను తానెప్పుడూ చూడలేదని, తాను బ్రతికున్నంత వరకు వైఎస్ జగనే ముఖ్యమంత్రి అన్నారు. సీఎం జగన్ లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారని పేర్కొన్నారు. సచివాలయం ద్వారా ప్రతి గ్రామంలోనూ 30 నుంచి 40 మంది వాలంటీర్లను నియమించడం ప్రశంసనీయమని కొనియాడారు. (టీడీపీ ఎమ్మెల్యేపై సీఎం జగన్ ఆగ్రహం) ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే అనేక హామీలను అమలు చేస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఆయన నాయకుడిగా ఉన్న అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణ యుగంలా ఉండేదని, వైఎస్ జగన్ అదే దారిలో నడుస్తున్నారని వర్ణించారు. ఇలాంటి నాయకుడు పదికాలాల పాటు సీఎంగా ఉండాలని రాపాక ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారని ప్రశంసించారు. దేశమే ఆశ్చర్యపోయే విధంగా ప్రతినెలా పెన్షన్ ఇస్తున్నారని అన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ, 14 ఏళ్లపాటు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు ఏనాడు ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని విమర్శించారు. కాగా రాపాక ప్రసాద్ ప్రసంగానికి అధికార పక్షం సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ సైతం చిరునవ్వులు చిందించారు. (పోలవరం నేనే పూర్తి చేస్తా) -
వైఎస్ జగన్‌కు రాపాక శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసి నేటికి (శుక్రవారం) మూడు సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాసంకల్ప యాత్రం ఓ చరిత్రను లిఖించిందని అన్నారు. వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఆయన వెంట వైఎస్సార్సీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఆయనకు మద్దతుగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. 17 నెలల పాలనలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయని, బ్యాంకుల ద్వారా ప్రత్యేక మైన నిధులు మంజూరు చేసి ఏప్రిల్ నాటికి బాగుచేస్తానని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు ‘గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రోడ్లు కూడా వేసిన పరిస్థితి లేదు. అటువంటి రోడ్లను కూడా బాగు చెయ్యటానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు. అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ప్రభుత్వ పాలన ఉంది. పాదయాత్ర ఇచ్చిన హమీ మేరకు 56బీసీ కులాలకు కార్పొరేషన్లు ఎర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఎవరు చేయని సాహసం సీఎం జగన్ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో కరోనా పేరుతో ఎన్నికలను నిలుపుదల చేశారు. వాస్తవానికి అప్పుడు కరోనా కేసులు అంతగా లేవు. ఇప్పుడు వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలి అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేవలం తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి గ్రామంలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యహారం పై ప్రజల నుండి పూర్తి వ్యతికత ఉంటుంది. స్దానిక సంస్థలు ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పరిస్థితి లేదు’ అని అన్నారు. -
కొత్త మంత్రులకు జనసేన ఎమ్మెల్యే అభినందనలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద పుష్ప గుచ్ఛాలతో కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు. మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కూ పుష్ప గుచ్ఛం అందించారు. (మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం) ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, అన్ని వర్గాలకు న్యాయం చేసిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ‘ఇద్దరు బీసీ నేతలను రాజ్యసభకు పంపారు. నాకు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించార’ని కృష్ణదాస్ అన్నారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన చెప్పారు. (‘రాజు’ మంత్రి అయ్యారు! ) -
జనసేనకి దూరంగా లేను.. దగ్గరగా లేను
సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన బాగుందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నారు. విశాఖపట్నం రాజధానిగా ఉంటే గోదావరి ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలన్ని అభివృద్ధి చెందుతాయని తెలిపారు. గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్, తాను ఈ మధ్య కాలంలో కలవలేదని.. ఎటువంటి సమాచారం రాలేదని చెప్పారు. తాను జనసేన పార్టీకి దూరంగా లేను..దగ్గరగా లేను.. జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నానన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చితే మద్దతు తెలుపుతానని ముందే చెప్పానని ఎమ్మెల్యే రాపాక పేర్కొన్నారు. చంద్రబాబు రాక్షస పాలన చేశారు: నారాయణ స్వామి సీఎం వైఎస్ జగన్ నవరత్నాలను బైబిల్, ఖురాన్, భగవద్గీతలా ముందుకు తీసుకెళ్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. గురువారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దశలవారీగా మద్యపాన నిషేధంతో పాటు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 14 సంవత్సరాల చంద్రబాబు పాలనలో రాక్షస పాలన చేశారని విమర్శించారు. ప్రజలు విసిగి రామరాజ్యం కావాలని వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేశారని పేర్కొన్నారు. కూలి చేసే కార్మికులను మద్యానికి బానిసలుగా చేస్తూ తాగుబోతు సంఘానికి అధ్యక్షుడి చంద్రబాబు తయారయ్యారని నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారు
-
మండలి రద్దు తీర్మానంకు మద్దతు : రాపాక
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా రాపాక వరప్రసాద్ మాట్లాడారు. అసెంబ్లీలో మేధావులు, డాక్టర్లు, ఐపీఎస్ అధికారులు ఉండగా.. ఇక పెద్దల సభ ఎందుకంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నా అని అన్నారు. ఇంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నాక.. మళ్లీ మండలి అవసరం లేదని రాపాక స్పష్టం చేశారు. శాసనసభలో రాపాక మాట్లాడుతూ.. ‘154 మంది శాసన సభ్యలు ఆమోదం తెలిపిన బిల్లును మండలి తిరస్కరించడం దురదృష్టకరం. ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా మండలిలో టీడీపీ అడ్డుకుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన స్థాయికి దిగజారి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా మండలి చైర్మన్ షరీఫ్‌ను కూడా ఆయన ప్రభావితం చేశారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతున్నాను అని చెప్పడానికి చైర్మన్ ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ విధంగా చేయడం చంద్రబాబుకు సరికాదు. అన్నాతమ్ముడిలా.. కలిసి జీవించే మాల, మాదిగలను రెండుగా చీల్చిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. బ్రిటీష్ సాంప్రదాయాలను పాటిస్తూ విభజించి పాలించే అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సీఎం జగన్ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా విద్యాభివృద్ధి కొరకు సీఎం జగన్ చేపడుతున్న చర్యలు అభినందనీయం. అన్ని వర్గాలు, ప్రాంతాలను అయన సమానంగా చూస్తున్నారు’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
అందుకే టీడీపీ అల్లరి చేస్తోంది: రాపాక
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగుతున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగని ప్రకటించిన తర్వాత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ కూడా అదే బాటలో నడుస్తూ రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాపాక మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. వారి సంక్షేమం కోసం సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అయితే టీడీపీ మాత్రం రైతులకు మేలు చేకూర్చే రైతు భరోసా కేంద్రాలు తదితర కీలక అంశాలపై చర్చ జరుగుతుంటే అల్లరి చేస్తోందని విమర్శించారు. స్పీకర్ పట్ల టీడీపీ సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉందని... చేతులు ఊపుకుంటూ స్పీకర్‌ను కొడతామన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాపాక మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచి.. సభను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతుల రక్తం పీల్చిన జలగ చంద్రబాబు... రైతులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చిన చరిత్ర చంద్రబాబుదని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. రైతుల రక్తం పీల్చిన జలగ చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘చంద్రబాబు కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చన్నారు. ఉచిత విద్యుత్ అమలు చేసి చూపించిన ఘనత వైఎస్సార్‌ది. ప్రస్తుతం సీఎం జగన్ అడగకుండానే అన్నీ ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. నాలుగు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు మేలు చేస్తున్నారు. ఈ కేంద్రాలు రైతుల పాలిట వరాలు’ అని పేర్కొన్నారు. ‘అధికారం, అవినీతి లేకపోతే బాబుకు నిద్రపట్టదు’ బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు: కొడాలి నాని ‘బాబు ఉన్నంతసేపు సీమలో కరువు తాండవించింది’ -
మూడు రాజధానులకే ప్రజల మొగ్గు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులకే ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి వలసలు ఆగాలంటే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్రెడ్డి బిల్లు తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అమరావతిలో జరిగిన అవినీతిని బట్టబయలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరాన్ని రూ.4 కోట్లకు అమ్మిన చంద్రబాబు ప్రభుత్వం తమ సొంత మనుషులకైతే కేవలం రూ.50 లక్షలకే కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. వికేంద్రీకరణపై రెఫరెండం నిర్వహించాలి: అనగాని పరిపాలనా వికేంద్రీకరణపై రెఫరెండం జరపాలని టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ కోరారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రూ.40వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని.. వికేంద్రీకరణ పేరిట రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో చనిపోయిన రైతులకు సభ నివాళులు అర్పించాలన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలపై విచారణ జరిపించాలే తప్ప తరలించవద్దని కోరారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని సూచించారు. ఆ భవనాల్లో 65 వాళ్లవే: మంత్రి బుగ్గన ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన జోక్యం చేసుకుంటూ అమరావతిని సంపద సృష్టించే కేంద్రంగా టీడీపీ నేతలు మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న 120 భవనాలు ఎవరికి చెందినవో తెలుసుకునేందుకు.. 80 భవనాలపై సర్వే జరిపితే ఆశ్చర్యపరిచే వాస్తవాలు బయటపడ్డాయన్నారు. ఆ 80లో 65 భవనాలు టీడీపీ వాళ్లవేనని వివరించారు. -
మూడు రాజధానులకు పూర్తి మద్దతు : రాపాక
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని ఒకేచోట కేంద్రీకృతమైతే.. ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందుతారని, ఈ నేపథ్యంలో 13 జిల్లాలూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టి పెట్టాలని, అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై రాపాక మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, మన ఆదాయాన్ని సైతం హైదరాబాద్ అభివృద్ధికి వెచ్చించారని, కనీసం అప్పుడు వెనుకబడిన జిల్లాలను పట్టించుకోలేదని రాపాక పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర విభజన తర్వాత మనం తిరిగొచ్చాక ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజల వలస వెళ్తూ రాష్ట్రమంతా పనిచేస్తున్నారని, తినడానికి సరైన తిండి కూడా లేని దుర్భర పరిస్థితుల్లో కడుపునిండా తిండి కోసం వాళ్లు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే.. అక్కడి వలసలు ఆగుతాయని, అదేవిధంగా కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని ద్వారా అనంతపురం ప్రజలు బెంగళూరు వలస వెళ్లడం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రతిపక్షం కూడా ఆలోచించాలని కోరారు. అమరావతిలో జరిగిన అవినీతి గురించి బుగ్గన వివరంగా చెప్పారని, దీంతో అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఎంత మోసం జరుగుతుందో ప్రజలకు కూడా తెలిసిందన్నారు. తనకు రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పడాన్ని స్వాగతించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిననాటి నుంచి వరుసగా పథకాలు అమలుచేస్తున్నారని, అమ్మ ఒడిలాంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా ఇచ్చిన ప్రతి హామీని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 4.50 లక్షల ఉద్యోగాలు సృష్టించి ఇవ్వడం ఒక చరిత్ర అని ప్రశంసించారు. ప్రజలకు మంచి చేయాలన్న దృక్పథం, నిరంతరం ప్రజల కోసం ఆలోచన ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజల జీవితాల్లో వెలుగునింపడం కోసం ఆయన పనిచేస్తున్నారని అన్నారు. మూడు రాజధానులకు రాష్ట్రంలోని ప్రతిచోటా మద్దతు లభిస్తోందని, ప్రజాభిప్రాయం మూడు రాజధానులకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లుకు తన తరఫున, జనసేన తరఫున రాపాక పూర్తి మద్దతు తెలియజేశారు. చదవండి: రాజధానులు ఎంతెంత దూరం శాసనాలు చేసే రాజధానిగా అమరావతి రాజధాని రైతులకు వరాలు 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు... స్పీకర్ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా? భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా? -
ఎమ్మెల్యే రాపాకకు పవన్ కల్యాణ్ లేఖ
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు లేఖ రాశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడితే వాటిని వ్యతిరేకించాలని పార్టీ నిర్ణయించినట్లు పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లేఖను కూడా పవన్ ఎమ్మెల్యే రాపాకకు పంపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుల్ని వ్యతిరేకించాలని పవన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని, అదే సమయంలో పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అయితే గత కొన్ని రోజులుగా జనసేనతో సంబంధం లేదన్నట్లుగా రాపాక వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై ఓటింగ్ జరిగితే దానికి మద్దతుగానే ఓటు వేస్తానంటూ ఎమ్మెల్యే రాపాక ఇప్పటికే స్పష్టం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని ఆయన పేర్కొన్న విషయం విదితమే. రాపాక వర ప్రసాదరావు గారికి.. To, Sri Rapaka Varaprasad.. - JanaSena Chief @PawanKalyan open letter. pic.twitter.com/ban9Bgjtyr — JanaSena Party (@JanaSenaParty) January 20, 2020 చదవండి: మూడు రాజధానులకు నా మద్దతు చదవండి: ఓటింగ్ జరిగితే మద్దతుగా ఓటు వేస్తా: రాపాక -
మూడు రాజధానులకు నా మద్దతు
సాక్షి, అమరావతి : మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ప్రకటించాలని జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు నిర్ణయించారు. సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగితే, అందుకు అనుకూలంగా చర్చలో పాల్గొంటానని ఆయన ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు, పరిపాలనా వికేంద్రీకరణ పరంగానూ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై ఓటింగ్ జరిగితే దానికి మద్దతుగానే తాను ఓటు వేస్తానన్నారు. అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యే మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు ప్రకటించడం ఆసక్తి కలిగిస్తోంది. -
ఓటింగ్ జరిగితే మద్దతుగా ఓటు వేస్తా: రాపాక
సాక్షి, అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ప్రకటించాలని జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు నిర్ణయించారు. సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగితే, అందుకు అనుకూలంగా చర్చలో పాల్గొంటానని ఆయన ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు, పరిపాలనా వికేంద్రీకరణ పరంగానూ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై ఓటింగ్ జరిగితే దానికి మద్దతుగానే తాను ఓటు వేస్తానన్నారు. అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యే మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు ప్రకటించడం ఆసక్తి కలిగిస్తోంది. చదవండి: అమరావతిలో అలజడికి కుట్రలు.. బాబుకు షాక్.. టీడీఎల్పీ భేటీకి పలువురు డుమ్మా -
పవన్‌తో ఎలాంటి చర్చలు ఉండవు :రాపాక
-
పవన్‌తో అలాంటివేం ఉండవు : జనసేన ఎమ్మెల్యే
సాక్షి, విజయవాడ : ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉంటానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సాహసం గొప్పదని ఆయన పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఎన్టీఆర్ టు వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలను మంత్రి కొడాలి నానితో కలిసి ఎమ్మెల్యే రాపాక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా నాయకుడు పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య ఎటువంటి చర్చలు ఉండవు. ఇక్కడకు రావటంలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నా అభిప్రాయాలను నేను కచ్చితంగా చెప్తాను. రాజధాని రైతులు రోడ్డు మీద ధర్నాలు చేసే బదులు ముఖ్యమంత్రిని కలిస్తే న్యాయం జరుగుతుంది. ఎడ్ల పందేలంటే ఇష్టంతోనే గుడివాడ వచ్చాను. నన్ను ఈ పందేలకు ఆహ్వానించిన మంత్రి కొడాలి నాని కి ధన్యవాదాలు’అన్నారు. (చదవండి : మూడు రాజధానులు మంచిదే) గ్రాఫిక్స్ రాజధాని కాదు.. మూడు ప్రాంతాల అభివృద్ధి 23 సీట్లిచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఉద్యమాల పేరుతో బాబు రాజధాని రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబులాగా గ్రాఫిక్స్ రాజధాని కాకుండా మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాజకీయ భవిష్యత్తు కోసం ఎంత మందినైనా వాడుకుని వదిలివేయటం చంద్రబాబు కు అలవాటని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఆయనకు జోలె పట్టుకొని రాజకీయం చేయడం పెద్ద విషయం కాదని అన్నారు. బాబు మాటలు విని రాజధాని రైతులు మోసపోవద్దని కోరారు. రైతులకు ఏమి కావాలో చర్చిస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. రాపాక వరప్రసాద్ నాకు మంచి మిత్రుడని మంత్రి చెప్పారు. -
మూడు రాజధానులు మంచిదే
తిరుమల: మూడు రాజధానుల యోచనను జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సమర్థించారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదుపరి ఆలయం వెలుపల రాపాక మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయం సబబేనన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాల్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గత ప్రభుత్వం అమరావతిలో రైతుల భూముల్ని బలవంతంగా లాక్కుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఇబ్బందేనని, అమరావతి రైతులను సర్కారు ఆదుకోవాలని కోరారు. నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతిస్తామని.. చెడు చేస్తే వ్యతిరేకిస్తామని చెప్పారు. -
మూడు రాజధానుల నిర్ణయం మంచిదే
-
మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన
సాక్షి, తిరుమల: మూడు రాజధానుల ప్రకటనను జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సమర్థించారు. ఆయన శనివారం ఉదయం తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగి ప్రశ్నకు ఎమ్మెల్యే రాపాక సమాధానమిస్తూ మూడు రాజధానుల నిర్ణయం సబబే అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. నవ రత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని... చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యే రాపాక స్పష్టం చేశారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఇబ్బందే అని... అయితే అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాపాక కోరారు. చదవండి: మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
ఏ దరికో.. ఈ పయనం..!
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: ఏ రాజకీయ పార్టీ అయినా దానిని నడిపించే నాయకుడి విశ్వసనీయత, చిత్తశుద్ధి పైనే మనుగడ సాగిస్తుంది. పార్టీ నాయకుడు పూటకో పాట పాడుతూంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎంత కాలమని కొనసాగుతారు! రోజులు, నెలలు.. ఆ తరువాత ఏం చేస్తారు! తలోదారి చూసుకోకుండా ఎలా ఉంటారు! జనసేన పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. జనసేనానిగా చెప్పుకుంటున్న ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విధానాలు, నిర్ణయాలు మొదటి నుంచీ ఎప్పుడూ స్థిరంగా లేవు. రాష్ట్ర విభజన అనంతరం ఉధృతంగా నడిచిన సమైక్యాంధ్ర ఉద్యమం దగ్గర నుంచి తాజాగా మూడు రాజధానుల ప్రతిపాదన వరకూ అన్నింటా ఆయన మాటలు మారుస్తూ వస్తున్నారు. ఆయన అనుసరిస్తున్న ఈ వైఖరి ఆ పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగానే జరగడంతో విభజన అనంతరం మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెబుతాడు. అటువంటి పరిస్థితి మరోసారి ఎదురు కాకూడదనే ముందుచూపుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యాకులు హర్షిస్తున్నారు. కానీ.. ఎన్నికల ముందు తన మనసుకు కర్నూలే రాజధాని అని ప్రకటించిన జనసేనాని ఇప్పుడేమో దానిని వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఒకటీ రెండూ కాదు.. అన్ని విషయాల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబుకు మౌత్‌పీస్‌గా పవన్ మారిపోయారనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా నాటుకుపోయింది. అధినేత అయోమయ, అస్తవ్యస్త విధానాలను జనసేన శ్రేణులు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ తీరు నచ్చక జిల్లాలో ఒకరొకరుగా ఆ పార్టీని వీడిపోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పవన్ కల్యాణ్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ గెలుపొందిన ఏకైక స్థానం షెడ్యూల్ కులాలకు రిజర్వ్ అయిన మన జిల్లాలోని రాజోలు నియోజకవర్గం. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కూడా బొటాబొటీ మెజారిటీతోనే బయటపడ్డారు. అటువంటి నియోజకవర్గంలో సైతం జనసేన నాయకులు అధినేత పవన్ విధానాలు నచ్చక గుడ్‌బై చెబుతున్నారు. జనసేనను వీడుతున్న నాయకులందరూ వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశ్వాసంతో ఆ పార్టీలో చేరుతున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు నియోజకవర్గంలో క్రియాశీలకంగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు, గెడ్డం తులసీ భాస్కర్, కేఎస్ఎన్ రాజు, ముప్పర్తి త్రిమూర్తులు, గుబ్బల మనోహర్, కంచర్ల శేఖర్ వంటి ముఖ్య నాయకులు జనసేనను వీడిపోయారు. ఈ పరిణామాలు ఎమ్మెల్యే రాపాకను అంతర్మథనంలో పడేశాయి. జనసేనకు దూరమైపోతున్న వారిని ‘వెళ్లిపోకండ’ని బుజ్జగించే ప్రయత్నం కూడా రాపాక చేయలేకపోతున్నారు. వరుస వలసలతో పార్టీలో చివరకు ఏకాకిగా మిగులుతారని రాపాక వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. సీఎం జగన్‌కు మద్దతుగా..: ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు రాపాక మద్దతుగా నిలుస్తున్నారు. అమలాపురంలో జరిగిన ‘వాహనమిత్ర’ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌తో పాటు పాల్గొన్నారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకల్లో కూడా రాపాక పాల్గొన్నారు. సీఎం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజారంజకంగా ఉన్నందువల్లనే రాపాక సానుకూలంగా ఉంటున్నారనేది నిర్వివాదాంశం. రాష్టం మొత్త్తంమీద తనను మాత్రమే గెలిపించిన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వ తోడ్పాటు అనివార్యం. అందుకే ప్రభుత్వ ముఖ్యులతో ఆయన టచ్‌లో ఉంటున్నట్టు చెబుతున్నారు. రాపాకకు రాజకీయ భిక్ష పెట్టిన మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు ఇటీవలే వైఎస్సార్ సీపీలోకి తిరిగి వచ్చేశారు. మలికిపురం మండలం చింతలమోరికి చెందిన రాపాక వరప్రసాద్‌కు రాజకీయ వారసత్వం లేకపోలేదు. హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదాయన. ఆయన తండ్రి వెంకట్రావు పీఏసీఎస్ అధ్యక్షుడిగా పని చేశారు. గల్ఫ్‌లో కొంతకాలం ఉండి తిరిగి వచ్చిన వరప్రసాద్ టీడీపీలో చేరి అప్పటి డిప్యుటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజుకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీలకు రిజర్వ్ అయిన రాజోలులో అల్లూరు ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో పోటీ చేయలేదు. తిరిగి 2019లో జనసేన నుంచి పోటీ చేసిన రాపాక.. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడిగా ఉండేవారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావానికి ముందే ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి నడిచారు. వర్తమానంలోకి వస్తే.. జనసేన నాయకులు ఆ పార్టీని వీడిపోతూండడంతో రాపాక డోలాయమాన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆయన రాజకీయ పయనం ఎలా ఉంటుందా అనే చర్చ ప్రస్తుతం జిల్లాలో జోరుగా జరుగుతోంది. పార్టీ అధినేత వైఖరితో విభేదిస్తూ.. : పవన్ ‘రైతు సౌభాగ్య దీక్ష’కు రాపాక దూరంగా ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నందు వల్లనే హాజరు కాలేదని ఆయన చెప్పినా.. ఈ దీక్ష రాజకీయ ప్రచారం కోసమేనన్న అభిప్రాయంతోనే ఆయన దీనికి దూరంగా ఉన్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 48 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తున్నారు. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ తరుణంలో రైతు సమస్యలపై పవన్ అసందర్భంగా చేసిన దీక్షను రాపాక సహా అనేకమంది నేతలు వ్యతిరేకించారని అంటున్నారు. ఆంగ్ల భాష అమలుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం నిర్ణయాన్ని రాపాక సమర్థించడం కూడా అదే సమయంలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ నుంచి రాపాకకు షోకాజ్ నోటీసు జారీ అయిందని, సొంత కేడర్ బలంతోనే తాను గెలుపొందానంటూ పవన్‌కు వ్యతిరేకంగా రాపాక ఘాటైన లేఖ రాశారని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
గత ఐదేళ్లలో ఉపాధి హమీ పనుల్లో భారీ అవినీతి జరిగింది
-
సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా: రాపాక
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం అని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను స్వాగతిస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో దళితులు అభివృద్ధి చెందుతారన్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నామని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు చాలా దారుణమన్నారు. కొన్ని ప్రాంతాల్లో కుల వివక్షత తీవ్రంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు సమాజంలో సమాన స్థానం కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. దళితులను సామాజికంగా, ఆర్థికంగా బాగుపర్చాలని వరప్రసాద్ కోరారు. -
పవన్‌కి నాకు మధ్యలో అడ్డంకి ఉంది : రాపాక
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కి, తనకు మధ్యలో అడ్డంకి ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. తమ మధ్య అడ్డంకి తొలుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాపాక ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోతే ఉన్న ఇబ్బందుల తనకు తెలుసనని అన్నారు. చాలా మంది దళితులు పైవేటు పాఠశాలలో చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతించానని వివరించారు. జనసేన పార్టీకి తనకు మధ్య కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని.. దానిని సరిచేసుకుంటానని రాపాక తెలిపారు. తనలాగే పార్టీకి సంస్థాగత నిర్మాణం చేసి ఉంటే జనసేన అభ్యర్థులు గెలిచేవారేమోనని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపు కోసం తను కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. కాగా, రాపాక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : మేరుగ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. స్పీకర్‌పై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యాల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతుంటే చంద్రబాబు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడే విధంగా ఉన్నాయని తెలిపారు. రైతుల సంక్షేమానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకున్న ఘనత చంద్రబాబుదేనని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన 80 శాతం హామీలను అమలు చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో చంద్రబాబు చేస్తున్న కుయుక్తుల్ని ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పారు. చంద్రబాబును సస్పెండ్ చేయాలి : మధుసూదన్ యాదవ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులంతా ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్ తెలిపారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు వ్యతిరేకించటం బాధకరమని అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం బీసీ వర్గానికి చెందిన వారు కాబట్టే టీడీపీ సభ్యులు చైర్‌ను అగౌరవపరిచేందుకు యత్నించారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చంద్రబాబును సభలో నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తుంటే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం దారుణం అని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలంటే చంద్రబాబు ఎందుకంత చులకన భావమని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనలను రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. -
జనసేన ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు
సాక్షి, తూర్పుగోదావరి : రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావుకు, రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్ ఓట్లలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు హోకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
సీఎం జగన్ ఫ్లెక్సీకి జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం
సాక్షి, అమలాపురం రూరల్: వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద సొంత ఆటోలు కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వడంపై ది సెంట్రల్ డెల్డా ఆటో వర్కర్స్ యూనియన్‌కు చెందిన డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నల్లవంతెన సెంటర్ ఆటోస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలను పాదయాత్రలో జగన్ తెలుసుకున్నారని, అధికారంలోకి రాగానే వారికి ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేయడం అభినందనీయమన్నారు. ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, తదితర నాయకులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రాపాక అరెస్టు.. విడుదల
సాక్షి, తూర్పుగోదావరి(రాజోలు) : చట్టం ముందు అందరూ సమానమేనని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ అన్నారు. మలికిపురం పోలీస్‌స్టేషన్‌కు మంగళవారం ఆయన వచ్చారు. ఈ నెల 11న ఈ స్టేషన్ వద్ద జరిగిన ఆందోళనలో ధ్వంసమైన అద్దాలను పరిశీలించారు. పేకాడుతున్న వారి అరెస్ట్ నేపథ్యంలో, రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు, ఎస్సై కేవీ రామారావు మధ్య వివాదం కారణంగా ఏర్పడిన ఘర్షణ వివరాలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసులు తప్పు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ప్రజాప్రతినిధులకు ఉందన్నారు. ఫిర్యాదులపై విచారణ చేసి తప్పు చేసిన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఐజీ చెప్పారు. అలా కాకుండా ఎమ్మెల్యే స్టేషన్ వద్ద ధర్నా చేయడం, అనుచరులతో స్టేషన్‌పై దాడి చేయడం తగదన్నారు. ఇది యువతను తప్పు తోవ పట్టించి ప్రభుత్వం, వ్యవస్థల పట్ల తప్పుడు సంకేతాలు పంపడమేనని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులందరిపైనా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఆయన వెంట రాజోలు సీఐ మోహన్ రెడ్డి, ఎస్సై రామారావు ఉన్నారు. ఎమ్మెల్యే రాపాకపై కేసు నమోదైన నేపథ్యంలో మలికిపురంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో పోలీసులు కవాతు నిర్వహించారు. కాకినాడ క్రైం: మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసులో నిందితులు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులు ఎనిమిది మందిని మంగళవారం రాజోలు సీఐ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం రాత్రి విలేకర్లకు తెలిపారు. అనంతరం వీరిని బెయిల్‌పై విడుదల చేశామన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులోని వారు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే బెయిల్ రద్దు అవుతుందని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ తెలిపారు. ‘చిన్న విషయమని పవన్‌కల్యాణ్ ప్రకటించడం విచారకరం’ మలికిపురం: స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడి సంఘటన.. జనసేన ఎమ్మెల్యే రాపాక, పోలీసుల మధ్య ఏర్పడిన వివాదమే తప్ప ఇందులో తమ పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు అన్నారు. ఈ విషయంపై కొందరు తమ పార్టీని విమర్శించడం తగదని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు. పేకాడుతున్న వారిని అరెస్ట్ చేస్తే ఆందోళన చేసిన జనసేన నేతలపై చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. జనసేన నేతలు స్టేషన్‌పై దాడి చేసి, దగ్ధం చేయడాన్ని సమర్థించడం పవన్‌కళ్యాణ్‌కు తగదని, ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డి లలిత్‌కుమార్, పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మంగెన సింహాద్రి, సొసైటీ చైర్మన్లు దివ్వి చిట్టిబాబు, బెల్లంకొండ సూరిబాబు ఏఎంసీ మాజీ చైర్మన్ గెద్దాడ సత్యనారాయణ, ఎస్.శాంతికుమారి, రాయుడు విజయకుమార్, ఓగూరి హనుమంతరావు, చేట్ల సత్యనారాయణ, మేడిది రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాపాక అరెస్ట్.. రాజోలులో హైడ్రామా
సాక్షి, రాజోలు(తూర్పు గోదావరి): జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాక రాజోలులో హైడ్రామా నెలకొంది. రాపాక పోలీసులకు లొంగిపోయిన వెంటనే జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యే మద్దతుదారులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ బయట బైఠాయించారు. అనంతరం రాపాకను రాజోలు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. పోలీసులు ఎంత వారించినా వారు వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే రాపక తన మద్దతుదారులతో కలిసి రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు . దీంతో కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు చివరికి ఎమ్మెల్యేను కోర్టుకు తరలించారు. ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్న తొమ్మిది మందిని మలికిపురం ఎస్సై కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంపై రాపాక అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అంతటితో అగకుండా రాపాక తన అనుచరులతో కలిసి పోలీస్ స్షేషన్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మరోవైపు జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయవచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఒకవేళ ఎస్ఐ తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: ‘బాధ్యతా రహితంగా జనసేన ఎమ్మెల్యే తీరు’ పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే -
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే
సాక్షి, తూర్పు గోదావరి : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మంగళవారం రాజోలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. రాజోలు నియోజకర్గం మలికిపురం పోలీస్ స్టేషన్‌పై దాడి కేసులో రాపాకతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్న తొమ్మిది మందిని మలికిపురం ఎస్సై కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంపై రాపాక అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అంతటితో అగకుండా రాపాక తన అనుచరులతో కలిసి పోలీస్ స్షేషన్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాపాక ఏ1గా ఉన్నారు. మరోవైపు జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయవచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఒకవేళ ఎస్ఐ తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి : పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే ‘బాధ్యతా రహితంగా జనసేన ఎమ్మెల్యే తీరు’ -
జనసేన ఎమ్మెల్యేపై డీఐజీ ధ్వజం
సాక్షి, రాజోలు : జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యలు సమాజంలో యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయొచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్ళతాయని తెలిపారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడిన వీడియో ఆధారంగా, పీఎస్ ముట్టడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఒక మండల స్థాయి అధికారి అయిన ఎస్ఐను బాధ్యత గల ప్రజాప్రతినిధి దూషిస్తూ.. దాడికి పాల్పడటం సమంజసం కాదన్నారు. ఎస్ఐ తప్పు చేసి ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి ఆధారాలతో ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకునే వాళ్లమని తెలిపారు. (చదవండి: పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే) -
పోలీసు స్టేషన్‌పై జనసేన ఎమ్మెల్యే దాడి
సాక్షి, తూర్పుగోదావరి(కాకినాడ) : జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మలికిపురంలో పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సోమవారం రాత్రి తెలిపారు. మలికిపురంలో ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్నట్టు వచ్చిన సమాచారంపై మలికిపురం ఎస్సై కేవీ రామారావు తన సిబ్బందితో వెళ్లి పేకాట శిబిరంపై దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారన్నారు. ఈ దాడిలో రూ.37,700 నగదు, ఆరు మోటారు సైకిళ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అస్మీ తెలిపారు. దీనిపై క్రైం నంబర్ 182/2019గా గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. వెంటనే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్ సంఘటన స్థలంలో ఎస్సై రామారావుతో గొడవపడి మోటారు సైకిళ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకునేందుకు వీల్లేదని గొడవపడ్డారన్నారు. దీనిపై ఎస్సై ‘తాను అలా చేయడానికి లేదని, అవకాశం ఉంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేస్తాను’ అని చెప్పినా ఎమ్మెల్యే రాపాక సమక్షంలోనే గెడ్డం తులసీభాస్కర్ ఎస్సైతో వాగ్వివాదానికి దిగి ఇష్టానుసారంగా దూషించినట్టు ఎస్సై తెలిపారు. తరువాత ముద్దాయిలను, స్వాధీనం చేసుకున్న వస్తువులను ఎమ్మెల్యే స్టేషన్‌కు తీసుకువచ్చారు. తరువాత కొందరు వ్యక్తులు ఎస్సై ఎమ్మెల్యేను నిందించినట్టు ప్రచారం చేశారన్నారు. దీంతో ఎమ్మెల్యే రాపాక, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్‌లు సుమారు 100 మంది అనుచరులతో స్టేషన్‌పై దాడి చేసి పోలీసులను నిందించుకుంటూ, పోలీస్‌స్టేషన్‌పై రాళ్లు రువ్వుతూ కిటీకీ అద్దాలు పగలుగొట్టారన్నారు. పేకాడుతూ పట్టుబడిన వ్యక్తులను తక్షణం విడుదల చేయాలని పోలీసుల విధులకు ఆటంక పరిచారని ఎస్పీ నయీం అస్మీ వివరించారు. పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతడి అనుచరులపై ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ ఆదేశాల మేరకు క్రైం నంబర్ 183/2019 కింద సెక్షన్లు 143, 147, 148, 341, 427, 149, అండ సెక్షన్ 3 కింద పీడీపీపీ యాక్ట్ అండ్ క్రిమినల్ ఎమైండ్‌మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ నయీం అస్మీ వివరించారు. -
జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు..!
సాక్షి, తూర్పు గోదావరి : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై మలికిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు సమాచారం. వివరాలు.. పేకాట ఆడుతున్న రాపాక అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంలో మలికిపురం ఎస్సై కేవీ రామారావుకు ఎమ్మెల్యే రాపాకకు మధ్య వివాదం మొదలైంది. ఎమ్మెల్యేకు మద్దతుగా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. స్టేషన్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం జనసేన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చర్యల్లో భాగంగా పార్టీని స్థానికంగా బలోపేతం చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. దీనిలో భాగంగా పొలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, క్రమశిక్షణా సంఘాన్ని ఏర్పాటు చేసింది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్‌గా నాదేండ్ల మనోహర్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. నాదేండ్ల మనోహర్‌తో పాటు రామ్మోహన్ రావు, రాజు రవితేజ్, అర్హంఖాన్‌లకు జనసేన పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. అయితే పొలిట్ బ్యూరోలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు అవకాశం కల్పించకపోవడం గమనార్హం. దీనిపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక 11 మంది సభ్యులతో కూడిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులను కూడా జనసేన అధినేత ఎంపిక చేశారు. పవన్ అన్నయ్య, నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొణిదెల నాగబాబుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అవకాశం కల్పించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా మాదాసు గంగాధరంను నియమించారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు : తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్, కొణిదెల నాగబాబు, కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలసి యశస్విని, పసుపులేటి యశస్విని, పసుపులేటి హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, భరత్ భూషణ్, బి. నాయకర్. -
కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేసిందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ఆయన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని పండగలా చేశారని గుర్తుచేశారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. 7లక్షల పరిహారం ఇవ్వడం గొప్ప విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశించారు. అలాంటి బడ్జెట్‌నే సీఎం వైఎస్ జగన్ రూపొందించారు. పారదర్శకతతో బడ్జెట్‌ను తయారు చేశారు. బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలున్నాయి. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే.. కోరని కోర్కెలు కూడా దేవుడు వైఎస్ జగనన్న అని మత్య్సకారులు చెబుతున్నారు. మత్స్యకారులను ఆదుకోవడానికి సీఎం వైఎస్ జగన్ నిధులు కేటాయించడం సంతోషం. బడ్జెట్లో అన్ని వర్గాల ప్రాధాన్యత ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. 108, 104లతో ప్రజల ఆరోగ్య భద్రత పెరిగింది. కానీ గత ప్రభుత్వం ఆ వాహనాలు తుప్పు పడుతున్న పట్టించుకోలేదు. ఈ బడ్జెట్ కేవలం 50 రోజుల్లో తయారు చేసింది కాదు. పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ బడ్జెట్ రూపొందించార’ని తెలిపారు. -
తూర్పుగోదావరి జిల్లాలో యధేచ్చగా ఇసుక దోపిడీ
-
సీఎం జగన్‌కు సహకరిస్తా: జనసేన ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ తొలిరోజు సమావేశాలు సందర్భంగా బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం జగన్‌తో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తొలిసారి శాసనసభకు వచ్చిన జగన్‌ను మర్యాదపూర్వకంగా పలకరించి, అభినందనలు తెలిపారు. ఆయనతో సీఎం జగన్ కొద్దిసేపు మాట్లాడి సభలోకి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... మంత్రివర్గ విస్తరణలో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటించారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అసెంబ్లీలో జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన గెలిచారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి: రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్) -
అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్
సాక్షి, అమరావతి: ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సొంత పార్టీ నేతల వద్ద అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి జనసేన పార్టీ తరుఫున పోటీ చేసిన అభ్యర్థులతో నిన్న(శుక్రవారం) ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని వారితో చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో గానీ, ఇప్పుడు 2019 ఎన్నికల సమయంలో గానీ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అయినా, ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీలతో పోరాడామన్నారు. ఈ ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకొని ముందుకు వెళ్దామని పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరుఫున గెలిచిన తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను పవన్ అభినందించారు. -
రాజోలులో బిజేపీ 'గోచీ కోసం పేచీ'!
-
రాజోలులో బిజేపీ 'గోచీ కోసం పేచీ'!
తూర్పుగోదావరి జిల్లా రాజోలు రాజెవరు? బిజెపిలో ఇప్పుడు రాజకుంటున్న ప్రశ్న ఇదే. టీడీపీతో పొత్తులో రాజోలు అనే చెల్లని నోటును చంద్రబాబు బీజేపీ జేబులో దోపేశారు. అయితే వింతేమిటంటే ఆ చెల్లని నోటు కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. వారిద్దరి బాహాబాహీ ప్రజలకు వినోదాన్ని పంచేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నట్టుండి కండువా మార్చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెల్చిన రాపాక వరప్రసాద్ ఇటీవలే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. అయితే అంతకు ముందు నుంచీ బిజెపిలో కండువా వేసుకుని ఉన్న మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమాకు ఇది ఇబ్బందికరంగా మారింది. పునర్విభజన ప్రక్రియతో నగరం నియోజకవర్గం పి.గన్నవరంగా మారడంతో, వేమా రాజోలునుంచి పోటీ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ సీటు తనదే అన్న భరోసాలో వేమా ఇంతకాలం ధీమాగా ఉన్నారు. ఇప్పుడు రాపాక రాకతో వేమా ఆశలు అడియాసలయ్యే పరిస్థితి వచ్చింది. అటు రాపాక వరప్రసాద్ కూడా రాజోలులో బిజెపి తరపున పోటీకి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కినట్టు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. ఇంతలో ఈ సీటు పొత్తు లెక్కల్లో బిజెపి ఖాతాలోకి వెళ్తోందని తెలిసి హడావిడిగా కాషాయ కండువా కప్పుకున్నారు. వేమా కూడా తక్కువేం తినలేదు. 1999 ఎన్నికల్లో అప్పటి నగరం నియోకవర్గం నుంచి అయ్యాజీ వేమా బిజెపి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మధ్యలో ఆయన చిరంజీవి ఊపు చూసి పీఆర్ పీ లో చేరి, పోటీ చేసి, ఓడిపోయి, మళ్లీ బిజెపికి వచ్చారు. ఇప్పుడు రాపాక, వేమాల మధ్య రాజోలు రాజకీయం రాజుకుంటోంది. వీరిద్దరే వాదులాడుకుంటూంటే ఇక ప్రత్యర్థులెందుకు అంటున్నారు అక్కడి ఓటర్లు. బిజెపికి ఎలాంటి పట్టూ లేని రాజోలులో జరుగుతున్న ఈ వింత పోరు గోచీ కోసం పేచీ లాంటిదేనంటున్నారు రాజకీయ పండితులు.