సీఎం జగన్‌ నిర్ణయాన్ని సమర్థిస్తున్నా: రాపాక | Janasena MLA Rapaka Varaprasad Speech In AP Assembly | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ నిర్ణయం చరిత్రాత్మకం: రాపాక

Published Mon, Dec 16 2019 2:40 PM | Last Updated on Mon, Dec 16 2019 6:37 PM

Janasena MLA Rapaka Varaprasad Speech In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం అని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అన్నారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను స్వాగతిస్తున్నామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో దళితులు అభివృద్ధి చెందుతారన్నారు. సీఎం జగన్‌ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నామని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు చాలా దారుణమన్నారు. కొన్ని ప్రాంతాల్లో కుల వివక్షత తీవ్రంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు సమాజంలో సమాన స్థానం కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. దళితులను సామాజికంగా, ఆర్థికంగా బాగుపర్చాలని వరప్రసాద్‌ కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement