ఓటింగ్‌ జరిగితే మద్దతుగా ఓటు వేస్తా: రాపాక | AgainMLA Rapaka Varaprasad Supports Three Capitals | Sakshi
Sakshi News home page

మూడు రాజధానులకు నా మద్దతు

Published Sun, Jan 19 2020 8:38 PM | Last Updated on Sun, Jan 19 2020 8:41 PM

AgainMLA Rapaka Varaprasad Supports Three Capitals - Sakshi

సాక్షి, అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటుకు అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ప్రకటించాలని జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు నిర్ణయించారు. సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగితే, అందుకు అనుకూలంగా చర్చలో పాల్గొంటానని ఆయన ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. 

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు, పరిపాలనా వికేంద్రీకరణ పరంగానూ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభలో మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై ఓటింగ్‌ జరిగితే దానికి మద్దతుగానే తాను ఓటు వేస్తానన్నారు. అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మాత్రం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యే మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు ప్రకటించడం ఆసక్తి కలిగిస్తోంది. 

చదవండి:

అమరావతిలో అలజడికి కుట్రలు..

బాబుకు షాక్.. టీడీఎల్పీ భేటీకి పలువురు డుమ్మా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement