
మలికిపురం: ఉద్యోగాన్ని వదిలి సినీ పరిశ్రమకు వెళుతున్నప్పుడు తన తండ్రి ఎంతో ప్రోత్సహించి ధైర్యం చెప్పారని సినీ దర్శకుడు సుకుమార్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలంలోని స్వగ్రామం మట్టపర్రులో పాఠశాల భవనం అదనపు గదుల నిర్మాణానికి తన తండ్రి తిరుపతినాయుడు పేరిట సుకుమార్ గతంలో రూ.18 లక్షల విరాళం అందించారు.
ఆ నిధులతో నిర్మించిన భవనాన్ని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పాఠశాలలోనే తాను చదివానని.. తన తండ్రి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చినట్టు తెలిపారు. ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ స్వగ్రామానికి సుకుమార్ చేస్తున్న సేవలను కొనియాడారు.