GN Rao
-
విశాఖే బెస్ట్..కొన్ని పత్రికలు వక్రీకరించాయి
-
విశాఖే ఉత్తమం
సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం మెట్రోపాలి టన్ ఏరియాలో సముద్రానికి దూరంగా ఉన్న వాయవ్య ప్రాంతం సరిగ్గా సరిపోతుంది. ఇదే విషయాన్ని నేను నేతృత్వం వహించిన నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. విశాఖ మెట్రోపాలిటన్ ఏరియా అందుకు అనువైన ప్రాంతం కాదని మా కమిటీ చెప్పిందంటూ చేస్తున్న ప్రచా రం శుద్ధ తప్పు. ఆ ప్రాంతం అనువైనది కాదని నివేదికలో మేం ఎక్కడా పేర్కొనలేదు. అన్ని విధాలా అది యోగ్యమైందనే చెప్పాం’ అని రాజధాని ప్రాంతంపై సిఫారసుల కోసం ఏర్పాటైన నిపుణుల కమిటీకి నేతృత్వం వహిస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు ప్రచురించిన కథనాల్లో వక్రీకరణలను ఆయన ఖండించారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... సాధారణ ప్రజలను కలిశాం.. ‘ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మా కమిటీ మూడు ప్రాంతాలను నివేదికలో పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ పట్నం మెట్రోపాలిటన్ ఏరియాని, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావ తిని, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు పేర్లను సూచించాం. నాతోపాటు కమిటీలో ఏడుగురు నిపుణులైన సభ్యులున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నెల రోజుల పాటు పర్యటించి అధికారు లు, సాధారణ ప్రజలు, ఇతర రంగాలకు చెందిన నిపుణులతో మాట్లాడారు. చారిత్రకంగా ఆయా ప్రాంతాలకు ఉన్న ప్రాధాన్యాలను పరిశీలిం చారు. భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేశారు. ఆ తర్వాతే సమగ్ర వివరాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. తుపాన్లు కోస్తా అంతా వస్తాయి... ప్రతి ప్రాంతానికి కొన్ని ప్రతికూలాంశా లుంటాయి. వాటిని అధిగమించేలా చర్యలు చేపట్టి ముందుకు సాగాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఏ ప్రాంతాలు వేటికి క్యాపిటల్ సిటీగా ఉంటే బాగుంటుందో నివేదిక రూపొందించాం. విశాఖ మెట్రోపాలిటన్ ఏరియాను ఇలా పరిశీలించిన తర్వాతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా> చేస్తే బాగుంటుందని సూచించాం. అక్కడి జనాభా ఒత్తిడి, తుపాన్లు లాంటి ప్రకృతి విపత్తులు, సముద్రపు కోత తదితర పర్యవసానాలను అంచనా వేసే విశాఖ మెట్రోపాలిటన్ ఏరియా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నాం. విశాఖ నగరం మధ్య ప్రాంతంలో కాకుండా సముద్రానికి కాస్త దూరంగా వాయువ్య ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మార్చుకుంటే యోగ్యంగా ఉంటుందని స్పష్టంగా చెప్పాం. సముద్రానికి ఆనుకొని నిర్మాణాలు చేపట్టమని చెప్పలేదు. అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతాన్ని సూచించాం. నగరానికి ఉన్న ప్రతికూలాంశాల ఆధారంగా స్పష్టమైన వివరాలను పొందుపరుస్తూ పేర్కొన్నాం. కానీ దీన్ని వక్రీకరిస్తూ, విశాఖ అనువైన ప్రాంతం కాదని కమిటీ నివేదించిందంటూ ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు. నివేదిక మొత్తం చదివితే ఈ విషయం బోధపడుతుంది. తుపాన్లు రాని ప్రాంతం ఎక్కడా ఉండదు. కోస్తా మొత్తం వస్తాయి. అన్నీ పరిశీలించాకే నివేదిక ఇచ్చాం. మూడు క్యాపిటళ్లు... నాలుగు రీజినల్ కమిషనరేట్లు అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగానే మూడు క్యాపిటళ్లతో నివేదిక రూపొందించాం. దీంతోపాటు ప్రాంతాల వారీగా ప్రగతి కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజినల్ కమిషనరేట్లతో అనుసంధానించాలనీ పేర్కొన్నాం. విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో జోన్–1 ఏర్పాటు చేయాలన్నాం. ఏలూరు కేంద్రంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాతో కలిపి జోన్–2, గుంటూరు కేంద్రంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను జోన్–3గా ఏర్పాటు చేయాలని సూచించాం. కడప కేంద్రంగా రాయలసీమ ప్రాంతాన్ని జోన్–4గా ఉంచాలని సూచించాం. రీజనల్ కమిషనర్లుగా సీనియర్ అధికారులను నియమించి పోలీసు వ్యవస్థతో అనుసంధానించాలని సిఫారసు చేశాం. ఏ ప్రాంతాల్లో ఏ తరహా పురోగతి అవసరమో ప్రత్యేకంగా పేర్కొన్నాం. ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన, కచ్చితమైన అమలు, అందుకు వీలుగా అధికారుల నియామకం చేపట్టాలని సూచించాం. కార్యాలయాల్లో కూర్చుని నిర్ణయించలేదు.. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ నివేదిక రూపొందించాం. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేవు. కార్యాలయాల్లో కూర్చుని ఏకపక్షంగా నిర్ణయించి నిర్ధారించలేదు. మా కసరత్తు అంతా శాస్త్రీయంగానే సాగింది. భూకంప ప్రభావిత జోన్లను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఇక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు అంటే రాజధాని మొత్తం విశాఖకు తరలుతుందని కాదు. ఈ విషయంలోనూ స్పష్టత ఇచ్చాం. అమరావతిలో ఇప్పటికే నిర్మించిన భవనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే వీలుంది. వాటిని వాడుకోవాలని కూడా నివేదికలో పేర్కొన్నాం. గతంలో రైతులకు ఉన్న కమిట్మెంట్స్ (హామీలు) కూడా నెరవేర్చాలని పేర్కొన్నాం. పత్రికా ప్రకటనలు ఇచ్చాకే పర్యటించాం... నివేదిక రూపొందించే విషయంలో ప్రజలందరినీ కలిశారా? అంటూ వితండవాదం ఎత్తుకోవటం సరికాదు. ప్రతి ఇంటికి వెళ్లి మాట్లాడరు. ఆయా ప్రాంతాలకు కమిటీ సభ్యులు వస్తున్నారని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాకే పర్యటించాం. అమరావతిలో కూడా స్థానిక రైతులతో మాట్లాడాం. దాదాపు మూడు నాలుగు వేల మంది అక్కడి ఆఫీసుకు వచ్చి కమిటీ సభ్యులతో మాట్లాడారు. మా నివేదికను కొంత మంది తగలబెట్టడం బాధాకరం’’ -
విశాఖే బెస్ట్
-
విశాఖనే బెస్ట్ ఆప్షన్ : జీఎన్ రావు
సాక్షి, హైదరాబాద్ : తమ కమిటీ నివేదికపై ఈనాడు, ఆంధ్రజ్యోతిలలో వచ్చిన వార్తలను విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు ఖండించారు. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉండాలని తమ నివేదికలో స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై తమ కమిటీ ఇచ్చిన నివేదికపై కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన తప్పుడు వార్తలపై జీఎన్ రావు స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో జీఎన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి 13 జిల్లాల అభివృద్ధికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు తెలిపారు. కొందరు జీఎన్ రావు రిపోర్టును తగలబెట్టడం బాధకరమని అన్నారు. తమ నివేదికపై తప్పుడు వార్తలను ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా పెట్టొద్దని తాము చెప్పలేదన్నారు. తమ కమిటీ సభ్యులను ప్రభావితం చేశారనేది పూర్తిగా తప్పుడు ఆరోపణ అని అన్నారు. కమిటీలో 40 ఏళ్ల అనుభవం కలిగినవారు ఉన్నారని జీఎన్ రావు గుర్తుచేశారు. ప్రలోభాలకు లొంగే సాదాసీదా వ్యక్తులు కమిటీలో లేరని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా వారి వారి రంగాల్లో ఎంతో అనుభవం కలవారని చెప్పారు. మూడు, నాలుగు నెలలు కష్టపడి తాము నివేదికను తయారుచేస్తే.. దానిని తగలబెట్టడం సరికాదన్నారు. విశాఖపట్నంతోపాటు విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు సంబంధిచిన లాభనష్టాలను చర్చించామని వెల్లడించారు. విశాఖలో ఎటువైపు రాజధాని పెట్టుకోవచ్చో రిపోర్టులో స్పష్టంగా చెప్పామని అన్నారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం బెస్ట్ ఆప్షన్ అని తెలిపారు. మూడు ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలనే.. మూడు ప్రాంతాల్లో రాజధానులు సూచించినట్టు చెప్పారు. అభివృద్ది వికేంద్రీకరణ కోసం 4 స్థానిక కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని రిపోర్టులో స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. ఈ కమిషనరేట్లలో సీనియర్ అధికారాలను నియమించి.. వాటికి పూర్తి అధికారాలు ఇవ్వాలని సూచించినట్టు వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు పెడితే.. నాలుగు జిరాక్స్ సెంటర్లు మాత్రమే వస్తాయని అనడం చాలా తప్పని అన్నారు. హైకోర్టుతో ట్రిబ్యునల్స్ కూడా ఏర్పడతాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే సూచనలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారుల, వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. భౌతికంగా, ఆన్లైన్ పద్ధతుల్లో అభిప్రాయాలు స్వీకరించామని.. ఆ తర్వాత డేటాను పూర్తిస్థాయిలో విశ్లేషించామని తెలిపారు. చదవండి : ఎల్లో మీడియాకు ఇప్పుడు అది భగవద్గీత..? -
విశాఖనే బెస్ట్ ఆప్షన్
-
వరదొస్తే మునుగుడే!
-
చంద్రబాబువి నిరాధార ఆరోపణలు
సాక్షి, అమరావతి: రాజధానితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై తన నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను కమిటీ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు ఖండించారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం చెప్పినట్టుగా నివేదిక ఇచ్చారని చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. చంద్రబాబు ఆరోపణలన్నీ నిరాధారం, భ్రాంతితో కూడినవని ఆదివారం ఒక ప్రకటనలో జీఎన్ రావు పేర్కొన్నారు. నిపుణుల కమిటీలో అన్ని రంగాలకు చెందిన అపార అనుభవమున్న నిపుణులు, నిష్ణాతులు ఉన్నారని తెలిపారు. కమిటీలోని సభ్యులకు పట్టణ ప్రణాళిక, డిజైనింగ్, నగరాభివృద్ధి, ప్రపంచ నగరాల అభివృద్ధి అంశాల్లో విశేష అనుభవం, నైపుణ్యం ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజల సలహాలను పరిగణనలోకి తీసుకుని సూచనలు చేశాం.. కమిటీలో సభ్యులను ప్రభావితం చేసి నివేదిక తయారు చేశారనడం అర్థరహితమని జీఎన్ రావు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, ప్రాజెక్టుల పూర్తికి అనుసరిస్తున్న వ్యూహాలపై మాత్రమే ప్రభుత్వంలోని వ్యక్తులతో మాట్లాడాం తప్ప నివేదికలోని అంశాలపై ఎవ్వరితోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతోపాటు ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలను స్వీకరించామని తెలిపారు. రాజధానితోపాటు 13 జిల్లాల్లో మానవాభివృద్ధి సూచికల పరిస్థితులు, అభివృద్ధి, వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ప్రజల ఆకాంక్షలు, సూచనలకు అనుగుణంగా రాజధానితోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేశామని ఆయన వివరించారు. ఎవరి ప్రమేయం లేదు.. నివేదిక తయారుచేసే సమయంలో కమిటీ సభ్యులకు కానీ, తనకు కానీ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు లేదా ప్రభుత్వంలోని వ్యక్తులు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని, వారి నుంచి ఎటువంటి సూచనలు తీసుకోలేదని జీఎన్ రావు స్పష్టం చేశారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం మార్గదర్శకాల ఆధారంగా నివేదిక తయారు చేశామని చంద్రబాబు అనడం నిరాధారం, అవాస్తవం, ఊహాజనితమని స్పష్టం చేశారు. కన్వీనర్‌గా కమిటీలోని సభ్యులకు తాను సహాయ సహకారాలు అందించానని ఆయన పేర్కొన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా కమిటీ సభ్యులందరూ కలసి సమష్టిగా రహస్యంగా నివేదిక రూపొందించారని తెలిపారు. -
‘ఆ రిపోర్టునే ఇచ్చామని చెప్పడం అసంబద్ధం’
సాక్షి, తాడేపల్లి : తమ నివేదికపై చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని రిటైర్డ్ ఐఏఎస్, నిపుణుల కమిటీ కన్వీనర్ జీఎన్ రావు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి తాము ఇచ్చిన నివేదికపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవాలనీ ఆయన కొట్టిపడేశారు. సీఎం సలహాదారు అజేయకల్లాం ఇచ్చిన రిపోర్టునే.. తామిచ్చామని చంద్రబాబు చెప్పడం అసంబద్ధమని జీఎన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. (చదవండి : వికేంద్రీకరణకే మొగ్గు) ‘మా కమిటీలో సభ్యులందరూ అపారమైన అనుభవం కలిగినవారు. అన్ని ప్రాంతాల్లో పర్యటించే నివేదిక రూపొందించాం. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సంప్రదించి, ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించాం. ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, హెచ్వోడీలను సంప్రదించి డేటా సేకరించాం. ప్రజల అభిప్రాయాన్ని చెప్పాలని పత్రికా ప్రకటన ఇచ్చాం. ప్రజల ఆకాంక్షలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నివేదిక రూపొందించాం. నివేదికపై చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తున్నాం. రాజధాని సహా అన్ని ప్రాంతాల అభివృద్ధికి మా కమిటీ సూచనలు చేసింది. అన్ని జిల్లాల్లో ఉన్న సమస్యలకి పరిష్కారాల్ని సూచించాం’అని జీఎన్ రావు పేర్కొన్నారు. (చదవండి : మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!) -
‘స్క్రిప్ట్ చదివేందుకే ఆయన బయటకు వచ్చారు’
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ప్రతిపక్ష నేతగా స్థాయి మరిచి చంద్రబాబు దళిత ఐఏఎస్ అధికారిపై నోరు పారేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను రాజకీయ నేతగా బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరుతామని ఎమ్మెల్యే చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి జీఎన్ రావును పనికిమాలిన వాడు అంటూ చంద్రబాబు మాట్లాడారని సుధాకర్‌బాబు గుర్తు చేశారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. (చదవండి : విజయకుమార్గాడు మాకు చెబుతాడా!) ‘దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ చేసిన తప్పేంటి. మున్సిపల్‌శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయకుమార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. బాబు రాజకీయ కుట్రలో రాజధాని రైతులు చిక్కుకోవద్దు. మూడు రాజధానులు అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శివరామకృష్ణన్, జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ ప్రతినిధులు అధికార వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్‌నకు విశ్వసనీయత లేదు కానీ నారాయణ కమిటీకి విశ్వసనీయత ఉందా. రైతులందరికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారు. గరుడ పురాణం శివాజీ, పవన్ కల్యాణ్ బాబు పెయిడ్ ఆర్టిస్ట్‌లు. ఏడు నెలలుగా జాడలేని గరుడ పురాణం శివాజీ బాబు స్క్రిప్ట్ చదివేందుకు బయటకు వచ్చారు’అని సుధాకర్ బాబు విమర్శించారు. సంబంధిత వార్తలు : చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం చంద్రబాబు క్షమాపణ చెప్పాకే.. బయటకు కదలాలి చంద్రబాబు దళిత ద్రోహి -
‘స్క్రిప్ట్ చదివేందుకే ఆయన బయటకు వచ్చాడు’
-
వికేంద్రీకరణకే పెద్దపీట
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన నూతన రాష్ట్రానికి ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరి కాదు. పాలనను వికేంద్రీకరించాలి. అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. – శివరామకృష్ణన్ కమిటీ మానవ జీవన ప్రమాణాలను పెంచడమే నిజమైన అభివృద్ధి. మెగా సిటీల నిర్మాణం, భూముల ధరలు పెరగడం అభివృద్ధి కాదు. రాష్ట్రంలోని ప్రజలందరి తలసరి ఆదాయం పెరగడం అభివృద్ధి. పాలన వికేంద్రీకరణే ఇందుకు మార్గం. – జీఎన్ రావు కమిటీ పరిపాలన వికేంద్రీకరణతో పాటు బహుళ రాజధానుల వ్యవస్థ వల్ల ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుంది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రజలకు మెరుగ్గా, సులువుగా పౌర సేవలు అందుతాయి. ప్రాంతాల వారీగా అభివృద్ధి జరగాలి. – బోస్టన్ కమిటీ ‘పాలన ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా అందాలి.. అందుకు అభివృద్ధి, పాలన వికేంద్రీకరణే మార్గం కావాలి’ అని రాష్ట్రం విడిపోయాక శివరామకృష్ణన్ కమిటీ, మొన్న జీఎన్ రావు కమిటీ, నిన్న బోస్టన్ కమిటీలు విస్పష్టంగా నొక్కి వక్కాణించాయి. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు కేంద్రంగా పరిపాలన, అసెంబ్లీ, హైకోర్టు వ్యవహారాలు సాగితేనే అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యం సాధ్యమని స్పష్టీకరించాయి. ఒక్క అమరావతిలోనే లక్ష కోట్ల రూపాయలు గుమ్మరించి అభివృద్ధి చేస్తే మిగతా ప్రాంతాల మాటేమిటని ఆందోళన వ్యక్తం చేశాయి. అవకాశాలు అందరికీ రావాలని, ఆర్థిక, ప్రాంతీయ అసమానతలకు తావివ్వరాదని స్పష్టం చేశాయి. అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల జరిగిన అనర్థమేమిటో కళ్లెదుటే కనిపిస్తున్నా, మళ్లీ మళ్లీ ఆ పొరపాటుకు తావివ్వడం సరికాదని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆయా కమిటీల అభిప్రాయాల మధ్య సారూప్యతపై మరోసారి అవలోకనం.. సాక్షి, అమరావతి : నాడు శివరామకృష్ణన్, మొన్న, నిన్న జీఎన్.రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఇచ్చిన నివేదికలు నిజమైన అభివృద్ధికి అద్దం పట్టేలా, వికేంద్రీకరణకు పెద్దపీట వేసేలా ఉన్నాయి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అంటే ఒకే చోట పెద్ద పెద్ద నగరాలు నిర్మించడం కాదనే అభిప్రాయపడ్డాయి. ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు.. రవాణా, మంచి నీరు, విద్య, వైద్యం, విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని చెబుతూ.. ఇందుకు రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడమే మంచి మార్గమని సూచించాయి. అన్ని జిల్లాల సమతుల అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్ సూచించడం ఎంతైనా అవసరమేనని స్పష్టీకరించాయి. అమరావతి రాజధాని నగరం పేరుతో గత ప్రభుత్వం నిర్మాణాలను పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మోడల్‌నే రూపొందించిందనే విషయాన్ని ఎత్తి చూపాయి. మిగతా జిల్లాలు వెనుకబడి ఉన్న నేపథ్యంలో అమరావతిలోనే అన్నీ కేంద్రీకృతం చేయడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నను లేవనెత్తాయి. పలు దేశాల్లో, రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీలు ఉన్నాయని ఉదహరిస్తూ.. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సూచించాయి. ఇంచు మించు ఒకేలా ఉన్న ఈ మూడు కమిటీల నివేదికల సూచనల అమలుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మేధావులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి: జీఎన్ రావు కమిటీ - శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. - పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు.. శ్రీకాకుళంలో ఉండే ఒక పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు. - అమరావతి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి. అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. అమరావతిలో ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. - మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ పరంగా సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్మెంట్లు నిర్మించాలి. - అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంభించాలి. - అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించాం. - రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. రాష్ట్రంలోని గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, మహేంద్రతనయ తదితర నదుల పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. అక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కాలువల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి. - రాయలసీమలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. - వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి. మహానగరం సరికాదు : శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి నివేదిక రూపొందించింది. పాలన వికేంద్రీకరణ రాష్ట్రానికి తక్షణ అవసరమని సిఫారసు చేసింది. ఏకైక అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరయినది కాదంది. - అధికార వ్యవస్థలను వికేంద్రీకరించడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. - ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల్లో మధ్య పాలన వ్యవస్థలను వికేంద్రీకరించాలి. - శాసనసభ, సచివాలయం ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే మరోచోట బెంచ్‌ను నెలకొల్పాలి. - విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే మూడు పంటలు పండే భూములను కోల్పోవాల్సి ఉంటుంది. అన్నపూర్ణగా పేరుగాంచిన రాష్ట్రానికి అది పెద్ద దెబ్బఅవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార భద్రతకూ భంగం కలుగుతుంది. పర్యావరణానికీ ఇబ్బంది కలుగుతుంది. - విజయవాడ– గుంటూరు నగరాల మధ్య మెగా సిటీగా అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం (అప్పట్లో చంద్రబాబు) చెప్పారు. కానీ ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణ పరిరక్షణ కోణంలో ఆ రెండు నగరాల మధ్య మెగా సిటీని విస్తరించడం ఆచరణ సాధ్యం కాదు. - విజయవాడ – గుంటూరు మధ్య రాజధానిని పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. దాంతోపాటు దేశంలో వరి ఉత్పిత్తికి ప్రధానంగా దోహదపడుతున్న సారవంతమైన పంట పొలాలు నాశనమవుతాయి. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. - సారవంతమైన పంట పొలాలకు వీలైనంత తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సారవంతమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తే తీవ్ర ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. - విజయవాడ – గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైన ఉంటుంది. అది భూకంప ముప్పు ఉన్న ప్రాంతం కూడా. ఆ ప్రాంతంలో నేల స్వభావం రీత్యా భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు. - స్థానికంగా లభ్యమవుతున్న సహజ వనరులు, ఆయా ప్రాంతాలకు ఉన్న అనుకూలతలను దృష్టిలో పెట్టుకొని.. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. పాలన వికేంద్రీకరణే మార్గం: బోస్టన్ నివేదిక - పరిపాలన వికేంద్రీకరణ ద్వారా బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది. - తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులభంగా పౌర సేవలు అందుతాయి. - చాలా మంది ప్రజలు మండలం దాటి సచివాలయానికి రారు. సచివాలయానికి వచ్చే వారిలో పైరవీలు లేదా రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసేవారే ఎక్కువ. (ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు అందించాల్సిన పౌర సేవలతో పాటు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను వలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటకే తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యులు సచివాలయానికి రావాల్సిన పరిస్థితి తలెత్తదు) - ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పు 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి 80 వేల కోట్ల రూపాయల నుంచి 1.20 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15 నుంచి 16 శాతం జనాభా వృద్ధి చెందితేనే 2045 నాటికి అమరావతి నుంచి రూ. 8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. అయితే ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ నగరాల్లో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధి రేటు 2 నుంచి 7 శాతం మాత్రమే ఉంది. - ప్రపంచ వ్యాప్తంగా 1970 నుంచి 2012 వరకు 30కి పైగా గ్రీన్ ఫీల్డ్ మెగా సిటీల నిర్మాణాలు చేపడితే అన్నీ కూడా విఫలం చెందాయి. ఇందులో కేవలం రెండు మెగా సిటీలు మాత్రమే లక్ష్యంలో 50 శాతం సాధించాయి. మిగతా మెగా సిటీలన్నీ లక్ష్యంలో 6 నుంచి 7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయి. - ప్రపంచంలో గత 50 ఏళ్లలో ఏడు దేశాల క్యాపిటల్ సిటీల నిర్మాణం చేపడితే అందులో కేవలం ఒకటి మాత్రమే లక్ష్యాన్ని చేరకుంది. మిగతా నగరాలు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేదు. - అమరావతి నగరంపై రూ.లక్ష కోట్లు వ్యయం చేసినా 40 ఏళ్ల వరకు రాబడి వచ్చే అవకాశం లేదు. అది కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సగటున 15 నుంచి 16 శాతం వృద్ధి నమోదు చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల అమరావతిపై భారీగా వ్యయం చాలా రిస్క్‌తో కూడుకున్న విషయం. - అమరావతి నగరంలో లక్ష కోట్ల రూపాయలు వెచ్చించడానికి బదులుగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం వెచ్చిస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టులకు పెట్టిన పెట్టుబడి ఐదేళ్లలోనే వెనక్కి రాబట్టుకోవచ్చు. అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడితే ఇందులో 95 శాతంపైగా అప్పు రూపంలోనే సమకూర్చుకోవాలి. ఇందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 6 నుంచి 8 శాతానికి సమానంగా ఉంటుంది. తొలి 10–15 సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించడానికి బడ్జెట్లో పది శాతం కేటాయించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడం వల్ల అభివృద్ధి పథకాల అమలకు నిధులుండవు. – బోస్టన్ నివేదిక మూడు రాజధానులతో సమ న్యాయం ఒకే పెద్ద రాజధాని బదులు మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ప్రభుత్వంలోని వివిధ శాఖలను వికేంద్రీకరించాలి. హైకోర్టు వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. – ఈఏఎస్ శర్మ, ఐఏఎస్ రిటైర్డ్ అధికారి సమతుల అభివృద్ధి సాధ్యం పాలన వికేంద్రీకరణ వల్ల రాష్ట్రంలో సమతుల అభివృద్ధి జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. పాలన అన్ని ప్రాంతాల వారికి చేరువవుతుంది. ఒకే చోట పాలనా వ్యవస్థలన్నీ కేంద్రీకృతం కావడం మంచిది కాదు. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరుణంలో అన్నీ ఒకే చోట ఉండాలనే ఆలోచనకు అర్థం లేదు. – ప్రొఫెసర్ ఎం.రవీంద్రనాథ్, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ చదవండి: అమరావతి.. విఫల ప్రయోగమే ‘ఆ పొరపాట్లు మళ్లీ జరగకూడదు’ సీఎం జగన్ బ్రహ్మండమైన ఆలోచనలు చేశారు.. మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన పెరుగన్నం అరగక ముందే పవన్ మాటమార్చారు.. మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
మూడు రాజధానులపై ఎమ్మెల్యే రాపాక స్పందన
సాక్షి, తిరుమల: మూడు రాజధానుల ప్రకటనను జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి సమర్థించారు. ఆయన శనివారం ఉదయం తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగి ప్రశ్నకు ఎమ్మెల్యే రాపాక సమాధానమిస్తూ మూడు రాజధానుల నిర్ణయం సబబే అని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు. నవ రత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని... చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యే రాపాక స్పష్టం చేశారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఇబ్బందే అని... అయితే అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రాపాక కోరారు. చదవండి: మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) విస్పష్టంగా పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అందుకు ప్రభుత్వానికి రెండు ఆప్షన్లను సూచించింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధిస్తూ.. అన్ని రంగాల్లో రాష్ట్ర పురోభివృద్దికి ఓ స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించింది. రాజధానితోపాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ శుక్రవారం తన నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించింది. రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రాధాన్యత, సహజ వనరులు, అభివృద్ధి అవకాశాలను విశ్లేషిస్తూ సమగ్రాభివృద్ధికి కీలక సూచనలు చేసింది. రాజధాని విషయంలో వివిధ దేశాల్లోని పరిస్థితులను ఉదహరిస్తూ ఆర్థిక భారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మరీ సిఫార్సులు చేసింది. న్యాయ, శాసన, పరిపాలనా వ్యవస్థలను రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రెండు ఆప్షన్లను సూచించింది. ప్రాంతీయ ప్రాతినిథ్యం, సమన్వయం, వ్యయం, ప్రజల సౌలభ్యం కోణాల్లో రెండు ఆప్షన్ల అనుకూల, ప్రతికూల అంశాలను బీసీజీ విశ్లేషించింది. రెండు ఆప్షన్లనూ పరిశీలించి, రాష్ట సమగ్రాభివృద్ధి, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లోని ఉదాహరణలను పరిశీలించి రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, ప్రధానంగా రాజధాని వ్యవస్థ ఎలా ఉండాలన్నది బీసీజీ సూచించింది. పరిపాలన వికేంద్రీకరణతో బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమని పేర్కొంది. తద్వారానే ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని చెప్పింది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులువుగా పౌర సేవలు అందించగలమని అభిప్రాయపడింది. జర్మనీ, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఈ విధంగానే సమగ్రాభివృద్ధి సాధిస్తూ, ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్నారని ఉదహరించింది. అన్ని అంశాలను పరిశీలించి, విశ్లేషించిన మీదట రాష్ట్రంలో కర్నూలు, అమరావతి, విశాఖపట్నం నగరాలను రాజధాని ఏర్పాటు కోసం పరిగణనలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ప్రతినిధులు, ఉన్నతాధికారులు రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి సూచనలు రాష్ట్ర సుస్థిర, సమతులాభివృద్ధికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూపు సవివర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్షలు, చారిత్రక నేపథ్యాల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి విధానం ఉత్తమమనే అంశాల్ని బీసీజీ సిఫారసు చేసిందని చెప్పారు. విజయవాడలోని ప్రణాళిక శాఖ కమిషనర్ కార్యాలయంలో బీసీజీ నివేదికలోని అంశాలను శుక్రవారం రాత్రి ఆయన మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నివేదికను హైపవర్ కమిటీకి రిఫర్ చేశారని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం, మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సూచీలలో ప్రగతి సాధించేందుకు బీసీజీ సూచనలు.. - రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో తలసరి పారిశ్రామిక స్థూల అదనపు విలువ(జీవీఏ) మరింతగా పెంపొందించవచ్చు. - కృష్ణా, గోదావరి బేసిన్ బయట ఉన్న 9 జిల్లాల్లో వ్యవసాయ ఉద్పాదకతను మరింతగా పెంచవచ్చు. - రాష్ట్రంలో ప్రస్తుతం మత్స్య ఉత్పత్తిలో 60 శాతం రెండు జిల్లాల నుంచే లభిస్తోంది. ఇతర జిల్లాలపై మరింత దృష్టి సారించడం ద్వారా మత్స్య ఉత్పత్తిని వృద్ధి చేయవచ్చు. - ప్రధానంగా మహిళల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాల్సి ఉంది. - ప్రస్తుతం రాష్ట్రానికి ఏటా 0.3 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించవచ్చు. - చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారితోపాటు రాష్ట్రం గుండా వెళ్తున్న అన్ని జాతీయ రహదారులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించాలి. - రాయలసీమలో పంటల విస్తీర్ణాన్ని పెంపొందించాలి. కృష్ణా– గోదావరి బేసిన్లో 60 శాతం నుంచి 80 శాతం వరకు భూములు సాగుబడిలో ఉన్నాయి. కానీ రాయలసీమలో కేవలం 20 శాతం భూములు మాత్రమే సాగులో ఉన్నాయి. గోదావరి–పెన్నా నదుల అనుసంధానించాలి. సచివాలయానికి వస్తోంది ఇందుకే.. - ఏడాదికి మొత్తం లక్ష మంది సచివాలయానికి వస్తే, అందులో 75 శాతం మంది కేవలం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసమే వచ్చారు. - ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చాలా సేవలు అందిస్తున్నా, ఆ సమాచారం తెలియక చాలా మంది సచివాలయానికి వస్తున్నారు. - మిగతావారంతా కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునే వారు, బిల్లుల కోసం వచ్చే వారే. ఉత్తరాంధ్ర అభివృద్ధికి... (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ) - ఎనలిటిక్స్, డాటా హబ్‌గా తీర్చిదిద్దాలి. - వైద్య పరికరాల ఉత్పత్తి, ఆట బొమ్మల తయారీ పరిశ్రమలు నెలకొల్పాలి. - జీడి మామిడి, కాఫీ, పసుపు వంటి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించాలి. - భోగపురం విమానాశ్రయాన్ని నిర్మించాలి. - అరకులో ఎకో, వైద్య టూరిజంను ప్రోత్సహించాలి. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల నిర్వహణ వేదికగా తీర్చిదిద్దాలి. గోదావరి డెల్టా అభివృద్ధికి...(తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి) - పెట్రో కెమికల్, ప్లాస్టిక్, సోలార్ పరిశ్రమలను నెలకొల్పాలి. - ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలి. - ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టాలి. - పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. - రోడ్ కనెక్టివిటీని పెంచుతూ బ్యాక్‌వాటర్ టూరిజం కేంద్రంగా కోనసీమ, హోప్ ఐలాండ్లను అభివృద్ధి చేయాలి. కృష్ణా డెల్టా అభివృద్ధికి... (కృష్ణా, గుంటూరు) - ఫుడ్ ప్రాసెసింగ్, సిరామిక్స్ పరిశ్రమలను నెలకొల్పాలి. - హైటెక్ సేంద్రియ వ్యవసాయం, మత్స్య పరిశ్రమలను ప్రోత్సహించాలి. - బందరు పోర్టును నిర్మించాలి. - బహుళ వినియోగ లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చేయాలి. - వైద్య సేవలకు ప్రధాన కేంద్రంగా చేస్తూ హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలి. - ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలి. దక్షిణాంధ్ర జిల్లాల అభివృద్ధికి... (ప్రకాశం, నెల్లూరు) - ఆటోమొబైల్, టెలికాం ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను నెలకొల్పాలి. - చిన్న తరహా, మధ్యతరహా కాగితం గుజ్జు, చర్మ, ఫర్నిచర్ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలి. - మత్స్య పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలి. - మైపాడు బీచ్‌ను అభివృద్ధి చేయాలి. - గోదావరి – పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. తూర్పు రాయలసీమ అభివృద్ధికి... (వైఎస్సార్, చిత్తూరు) - స్టీల్, ఎలక్ట్రానిక్స్, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. - టమాటో ప్రాసెసింగ్ యూనిట్లు వంటి హైటెక్ వ్యవసాయ పరిశ్రమలను ప్రోత్సహించాలి. - గండికోట, బెలూం గుహల (కర్నూలు జిల్లా) కేంద్రంగా ఎకో–అడ్వంచర్ పర్యాటక రంగ కేంద్రంగా తీర్చిదిద్దాలి. - గోదావరి– పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. పశ్చిమ రాయలసీమ అభివృద్ధికి... (కర్నూలు, అనంతపురం) - టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్ స్పేర్‌పార్ట్స్ పరిశ్రమలను నెలకొల్పాలి. - బిందుసేద్యాన్ని ప్రోత్సహించాలి. ఆర్గానిక్ ఉద్యానవన పంటల సాగును పెంపొందించాలి. - విజయనగర సామ్రాజ్య చరిత్ర ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ పెనుకొండ – రాయదుర్గం టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలి. - గోదావరి– పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. - వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. చదవండి: బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం నిపుణుల కమిటీ నివేదిక పరిశీలనకు హై పవర్ కమిటీ వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు
సాక్షి, అమరావతి: సీనియర్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావుపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నోరుపారేసుకున్నారు. జీఎన్ రావు పనికిమాలిన వ్యక్తి అంటూ అక్కసు వెళ్లగక్కారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన జీఎన్ రావు వివిధ హోదాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు విశేషమైన సేవలు అందించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్నసీనియర్ ఏఐఎస్ జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధి విషయమై ఐఏఎస్ జీఎన్ రావు కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులను.. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్ అధికారిపై నోరుపారేసుకుంటూ.. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడంపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. గతంలోనూ పలు సందర్భాల్లో అధికారులను దుర్భాషలాడుతూ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసింది. -
జీఎన్ రావు కమిటీ నివేదిక ద్వారా ప్రభుత్వనికి స్పష్టమైన సలహాలు
-
జిఎన్ రావు కమిటీ నివేదిక స్వాగతించిన న్యాయవాదులు
-
మహా నగరంగా భీమిలి: విజయసాయి రెడ్డి
సాక్షి, విశాఖ : రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ఆకాంక్షించారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజధాని ఏర్పాటుతో భీమిలి పట్టణం మహా నగరంగా మారుతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. చినగదిలి మండలం కొమ్మాదిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో శనివారం ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను విశాఖకు తరలిస్తున్నామని నిర్ణయం తీసుకుంటే... దానికి చంద్రబాబు నాయుడు అడ్డుపుల్ల వేస్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మహోద్దేశంతో రాజధానిని నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాజధానిని ఇక్కడకు తరలించడం వల్ల ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. భీమిలి ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాసరావు ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి. ఆయన హయాంలోనే రాజధాని విశాఖకు రావడం సంతోషకరమైన విషయం. అలాగే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో, అన్ని సామాజిక వర్గాలకి, అన్నిప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు 13 జిల్లాలు...భవిష్యత్‌లో 25 జిల్లాలు... అన్ని కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్య నారాయణతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు భీమిలి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రభావతి, కొప్పుల రమేష్‌తో పాటు పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ -
మహా నగరంగా భీమిలి: విజయసాయి రెడ్డి
-
‘సీఎం వైఎస్ జగన్ ఆలోచన అభినందనీయం’
సాక్షి, విశాఖ : రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన సూచనలు ఆహ్వానించదగినవని రిటైర్డ్ ఐఏఎస్ ఈఎఎస్ శర్మ అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ.. జీఎన్ రావు కమిటీ నివేదిక అమలు అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అసమానతలు తొలగాలంటే రాజధాని పేరుతో ఒక్కచోటే అభివృద్ధి చేయకూడదని శర్మ అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర, దక్షిణ, మధ్య కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి కమిటీ సూచనలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ కమిటీ సూచనలు అమలైతే పాలన చేరువ అవుతుందనే భావన ప్రజల్లోకి వస్తుందన్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉండటం మంచిదే అని అన్నారు. ‘గత ప్రభుత్వం అమరావతిలోనే అభివృద్ధి చేయాలని చూసి తప్పు చేసింది. అయితే జీఎన్ రావు కమిటీ నివేదికపై ప్రజల్లో చర్చ జరగాలి. గ్రామస్థాయి వరకూ పరిపాలన చేరువ అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. విశాఖలో తక్కువ ఖర్చుతోనే రాజధానిని అభివృద్ధి చేయాలి. గత ప్రభుత్వంలో అమరావతి పేరుతో భారీగా అవకతవకలు జరిగాయి. అందుకే మేము మొదటి నుంచి వ్యతిరేకించాం. అలాగే విశాఖలో నీటి సమస్యను అధిగమించాలి’ అని శర్మ పేర్కొన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ -
పరిపాలన వికేంద్రీకరణకు చిరంజీవి సంపూర్ణ మద్దతు
-
పరిపాలన వికేంద్రీకరణకు చిరంజీవి సంపూర్ణ మద్దతు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణకు మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి శాసన నిర్వాహక, విశాఖ కార్యనిర్వాహక, కర్నూలు న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరు స్వాగతించాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ లేఖను విడుదల చేశారు. ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్ధికై నిపుణుల కమిటీ సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయన్న చిరంజీవి.. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటన్న ఆందోళన అందరిలోనూ ఉందన్నారు. సాగు, తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలస కూలీల బిడ్డల భవిష్యత్‌కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల ప్రతిపాదన భద్రతనిస్తుందన్నారు. అయితే ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు, అభద్రతా భావాన్ని తొలగించాలని చిరంజీవి కోరారు. అమరావతి ప్రాంత రైతులు నష్టపోకుండా, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్థాలు తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. ప్రజల ఆకాంక్షలు, సవాళ్లపై నిపుణుల కమిటీ విస్తృతంగా పరిశీలన చేసినట్లు భావిస్తున్నామని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రాజధాని సహా అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం నిపుణుల కమిటీ సూచించిన వ్యూహాన్ని సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తారని, రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుందని చిరంజీవి ఆకాంక్షించారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు! వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ -
జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గ భేటీలో చర్చిస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. నివేదికకు యథాతథంగా ఆమోదించాలా? ఇంకా ఏమైనా మార్పులు చేయాలా? అన్నది చర్చిస్తామన్నారు. కమిటీలో నిపుణులు సభ్యులుగా ఉన్నారని, అన్ని అంశాలను పరిశీలించాకే నివేదిక సమర్పించారని చెప్పారు. మీ తాబేదార్ల కోసం దోపిడీ చేస్తారా? రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి రాజధాని నిర్మించే ఆర్థిక స్థోమత రాష్ట్రానికి లేదని బొత్స పేర్కొన్నారు. కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తే మిగతా 12 జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీల సిఫార్సులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టి నారాయణ కమిటీతో ముందుకు వెళ్లిందని విమర్శించారు. రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడతాయని బొత్స పేర్కొన్నారు. ‘మీ తాబేదార్ల కోసం దోపిడీ చేస్తారా?’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబును నిలదీశారు. రాజధాని ప్రకటనకు ముందే హెరిటేజ్ సంస్థ అమరావతి ప్రాంతంలో భూములు కొనడం ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ కాదా? అని ప్రశ్నించారు. -
వికేంద్రీకరణకే మొగ్గు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలన రాజధాని(ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో న్యాయ రాజధాని(జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ తన నివేదికలో సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది. విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం.. కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రికి నివేదిక అందచేసిన అనంతరం కమిటీ కన్వీనరు జీఎన్ రావు, సభ్యులు విజయమోహన్, ఆర్.అంజలీ మోహన్, డాక్టర్ మహావీర్, డాక్టర్ సుబ్బారా>వు, కేటీ రవీంద్రన్, అరుణాచలంలు మీడియాతో మాట్లాడారు. (చదవండి : చేనేతలకు ఆపన్నహస్తం) కమిటీ ప్రధాన సిఫార్సులు.. ►మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఉన్నట్టు రాష్ట్రంలో అమరావతి, విశాఖపట్నంలో శాసన(లెజిస్లేచర్) వ్యవస్థ ఉండాలి. అసెంబ్లీ అమరావతిలో ఉన్నా.. వేసవికాల సమావేశాలు విశాఖలో నిర్వహించాలి. విశాఖపట్నంలో సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. అమరావతిలో అసెంబ్లీతో పాటు హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు కార్యాలయం, రాజ్‌భవన్ ఉండాలి. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో నిర్వహించాలి. ►అన్ని ప్రభుత్వ విభాగాలను ఒకేచోట ఉంచాల్సిన అవసరం లేదని కె.సి.శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. అమరావతిలో భూమి తీరు, వరద ప్రభావం తదితర అంశాల కారణంగా రాజధాని కార్యకలాపాల్ని ఇతర నగరాలకు వికేంద్రీకరించాలి. ఇక్కడ దాదాపుగా పూర్తైన నిర్మాణాలను వినియోగంలోకి తీసుకురావాలి. అమరావతిలో ప్రతిపాదిత నిర్మాణాల్ని తగ్గించాలి. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రివర్ ఫ్రంట్ నిర్మాణాలు ఉండరాదు. వరద ముంపు నుంచి రక్షణ కోసం చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేయాలి. సీడ్ యాక్సిస్ రోడ్డును నేషనల్ హైవేకు అనుసంధానించాలి. ►శ్రీబాగ్ ఒడంబడికను గౌరవించేలా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ►పరిపాలన వికేంద్రీకరణ ద్వారా నిరుపేదల సమస్యలకు సత్వరం పరిష్కారం దొరుకుతుంది. ఉదాహరణకు.. శ్రీకాకుళంలో ఉండే ఒక పేదవాడు సమస్య పరిష్కారం కోసం రాజధాని వరకు రావాల్సిన అవసరం లేకుండా.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. అమరావతి ప్రాంతంలో రాజధాని ఎలాగూ ఉంటుంది కాబట్టి, అక్కడ ఏ సమస్యా లేదు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి వృథా కారాదు అమరావతిలో కొన్ని ప్రాంతాలు వరద ముంపునకు గురవుతాయి... అందువల్ల రాజధానికి సంబంధించిన నిర్మాణాలు వద్దు. ఇప్పటికే పెట్టిన వ్యయం వృథా కాకుండా చూడాలి. తుళ్లూరు ప్రాంతంలో గత ప్రభుత్వం చాలా పెట్టుబడి పెట్టింది. అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాల్ని పూర్తి చేసి శాఖల వారీగా వాడుకోవాలి. ప్రస్తుతం అమరావతిలో జరుగుతున్న పనులను సమీక్షించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. మొత్తం నిధులు అమరావతిలోనే కేంద్రీకరించడం సరైంది కాదు. పర్యావరణ సమస్యలున్న చోట అభివృద్ధి పనులు తగ్గించాలి. అవసరం మేరకే క్వార్టర్లు, అపార్ట్మెంట్లు నిర్మించాలి. అమరావతిలో డిజైన్లన్నీ భారీ ఖర్చుతో కూడినవి కావడంతో వీటిని మార్చి.. ఉన్న వనరులతో మిగతా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలి. డిజైన్లను మరోసారి పునఃపరిశీలించాలి. రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ నేపథ్యంలో అవసరాల మేరకు ప్రభుత్వ విభాగాల కోసం భవనాలు నిర్మించాలి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అదే విధానం అవలంబించాలి. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించుకునేలా, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ తర్వాత ఇక్కడ ఉండాల్సిన ప్రభుత్వ విభాగాలు కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు ఉండాలి. అమరావతి ప్రాంతంలో రైతులంతా తమకు భూములు ఇవ్వాలని కోరారు. అదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించాం. 2 వేల మంది రైతులతో మాట్లాడాం: జీఎన్ రావు రాజధాని, అభివృద్ధి అంశాలపై కమిటీ సభ్యులమంతా అధ్యయనం చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాం. ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక ఇచ్చాం. రాష్ట్రంలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడితే.. మరికొన్ని అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వాటి మధ్య సమతూకం సాధించాలి. ఇందుకోసం రెండంచెల వ్యూహాన్ని సూచించాం. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతంతో పాటు పలు నదులు, అడవులు ఉన్నాయి. అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా పలు సూచనలు చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అందుకే అన్ని ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని సూచనలు ఇచ్చాం. మాకు మొత్తం 38 వేల విజ్ఞాపనలు అందగా.. 2 వేల మంది రైతులతో నేరుగా మాట్లాడాం. జిల్లాలకు వెళ్ళి.. అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అన్న దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేశాం. వాటికి అనుగుణంగా అంతా ఒకేచోట కాకుండా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండేలా సూచనలు చేశాం. సమగ్ర పట్టణాభివృద్ధి, ప్రణాళిక కోసం ప్రయత్నించాం. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచించాం. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉంది. రాజధానికి అనుకూలం కాదు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన భూమిని ఇవ్వాలి. రాజధాని ఎక్కడో చెప్పడం మా పని కాదు. సుస్ధిర అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారీగా అభివృద్ధి, సమతుల్యతపై కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. మేము రైతులతో మాట్లాడలేదన్నది అవాస్తవం. ప్రాంతీయ అసమానతల్ని తగ్గించాలి ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మెరుగైన సూచనలు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో పట్టణీకరణ మధ్య, ఉత్తర కోస్తాలోనే ఉంది. అందువల్ల ప్రాంతాల మధ్య అభివృద్ధి– సమతూకంపై అధ్యయనం చేసి సూచనలిచ్చాం. అదే సమయంలో రాష్ట్రంలోని అభివృద్ధి వల్ల పర్యావరణం దెబ్బతినకూడదు. పర్యావరణాన్ని రక్షించుకుంటూనే అభివృద్ధి సాగాలి. రాష్ట్రంలో రాయలసీమ బాగా వెనకబడడంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తీరానికి దూరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. అడవుల్ని పరిరక్షించడంతో పాటు మరిన్ని పెంచాలి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చడాన్ని ప్రోత్సహించకూడదు. బీడు భూములను వినియోగంలోకి తీసుకురావాలి’ అని జీఎన్ రావు చెప్పారు. బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక వచ్చాకే... రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక కూడా వచ్చాకే.. జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరో పది రోజుల్లో బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక రానుంది. ఈ రెండు నివేదికలపై ఒకేసారి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలిసింది. అందువల్ల ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపైనే చర్చించకపోవచ్చని సమాచారం. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలోని విశాల తీర ప్రాంతంతో పాటు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు దాదాపు 900 కి.మీ. తీర ప్రాంతమంతా అభివృద్ధి చేయాలి. ఆర్థిక పురోగతితో పాటు, ఉపాధి కల్పన దిశగా పనులు చేపట్టాలి. గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, మహేంద్రతనయ తదితర నదుల పరీవాహక ప్రాంతాలను అభివృద్ధి చేసి.. అక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఈ ప్రక్రియలో భాగంగా కాలువల్ని అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటి నిర్మాణం చేపట్టాలి. ►రాయలసీమలో అనంతపురం, కర్నూలు జిల్లాలను అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు కృషి చేయాలి. అమరావతిలోని కొన్ని అధికార వ్యవస్థలను ఆ ప్రాంతానికి తరలించడం ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెంది అక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ►అన్ని జిల్లాల్లోని సహజ వనరుల మేరకు సమగ్ర మార్గదర్శకాలను రూపొందించి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించాలి. ►గిరిజనులు, మత్స్యకార వర్గాలకు కూడా తగిన ప్రాధాన్యమిస్తూ వారి అభివృద్ధికి అనుగుణంగా పెట్టుబడి, అభివృద్ధి ప్రణాళిక తయారుచేయాలి. ►రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను అత్యధిక ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలి. ఆ ప్రాంతంలో జలవనరుల్ని పూర్తి సామర్థ్యం మేరకు సద్వినియోగం చేసుకోవాలి. ►పొడవైన తీర ప్రాంతంలోని వైవిద్య భరితమైన పర్యావరణం, మడ అడవులు, బీచ్‌ల్ని పరిరక్షిస్తూ అభివృద్ధి చేయాలి. ►పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ కొత్త పోర్టులు ఏర్పాటు చేయాలి. రెండు పోర్టుల మధ్య కనీస దూరం, రోడ్డు, రైలు సౌకర్యాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పోర్టులు నెలకొల్పాలి. ►విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తకుండా, ప్రభుత్వమే సౌర విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై దృష్టి పెట్టాలి. ప్రాధాన్యతా క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలి ►పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలి. తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అనంతరం అధిక వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టి పూర్తి చేయాలి. తద్వారా ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. ►డెల్టా కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. లీకేజీలు అరికట్టి.. ఆయకట్టుకు సమర్ధంగా నీటిని అందించేందుకు కాలువల వ్యవస్థను ఆధునికీకరించాలి. ►పరీవాహక ప్రాంతం ఆధారంగా గొలుసుకట్టు చెరువులను మైక్రో వాటర్‌షెడ్ విధానంలో అభివృద్ది చేయాలి. నీటి యాజమాన్య పద్ధతులను అమలు చేసి.. అధిక ఆయకట్టుకు నీటిని అందించడంపై దృష్టి సారించాలి. ►రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చెట్లను నరికేస్తున్న నేపథ్యంలో భారీగా చెట్ల పెంపకాన్ని చేపట్టి.. పచ్చదనాన్ని పెంచాలి. ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఇవే.. 1. ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం 2. మధ్య కోస్తా: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 3. దక్షిణ కోస్తా: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 4. రాయలసీమ: వైఎస్సార్, చిత్తూరు, కర్నూలు, అనంతపురం ►అన్ని ప్రాంతాల అభివృద్ధికి వనరులు,అవకాశాలకు అనుగుణంగా విస్తృత విధానాలు, వ్యూహాలు అమలు చేసి ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలని కమిటీ ఆకాంక్షించింది. -
'వైఎస్ జగన్ కర్తవ్య నిర్వహణ చాలా బాగుంది'
సాక్షి, విశాఖపట్నం : రాజధానిపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక సంతోషకరమైనదిగా ఉందంటూ బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. కాగా కమిటీ ఇచ్చిన నివేదిక రాష్ట్ర సమగ్రాభివృద్ధిని సూచించే విధంగా ఉందంటూ ప్రశంసించారు. కమిటీ ఇచ్చిన నివేదికను నిర్లక్ష్యం చేయకుండా అందరు స్వాగతించాల్సిన విషయమని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీఎన్ రావుతో రాష్ట్రమంతా సర్వే చేయించారని, ఒకవేళ నివేదికకు అనుకూలంగా పనిచేస్తే త్వరలోనే ఉత్తరాంధ్ర సస్యశామలమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరుల దృష్యా ఇది అద్భుత విజయమని, ఇది ఒక్క జగన్‌కే సాధ్యమైందని ఆయన వెల్లడించారు.' విశాఖకు చెందిన వాడిగా నేను దీనిని సమర్థిస్తున్నా. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని' ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీతో కలిసి పని చేసినప్పుడు తాను రాజధానికి 35 వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించినట్లు గుర్తుచేశారు. కానీ మా వాదన పట్టించుకోకుండా రైతులను మభ్యపెట్టి చివరకు తాత్కాలిక భవనాలు నిర్మించారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర నుంచి మంత్రిగా అచ్చెనాయుడు పని చేసినప్పటికి శ్రీకాకుళం ప్రాంతం అభివృద్ధి చెందలేదని వివరించారు. వైఎస్ జగన్ మొండి మనిషి అనుకున్నా, కానీ కర్తవ్య నిర్వహణను ఫెంటాస్టిక్‌గా చేస్తున్నారని ప్రశంసించారు. -
13 జిల్లాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం