సీఎం 'వైఎస్‌ జగన్‌'ను కలిసిన జీఎన్‌ రావు కమిటీ | AP Capital Expert Committee Members Meets YS Jagan in Amaravati - Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన జీఎన్‌ రావు కమిటీ

Published Thu, Nov 28 2019 9:54 PM | Last Updated on Fri, Nov 29 2019 11:03 AM

AP Capital Expert Committee Meets YS Jagan In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో గురువారం భేటీ అయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలను వారు సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తాము సందర్శించిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను కమిటీ సభ్యులు సీఎంకు నివేదించారు. త్వరలోనే తాము అధ్యయనం అంశాలపై సీఎం వైఎస్‌ జగన్‌కు నివేదిక సమర్పిస్తామని తెలిపారు. సీఎంని కలిసిన వారిలో నిపుణుల కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు, సెక్రటరీ విజయ్‌ మోహన్,  సభ్యులు డాక్టర్‌ అంజలిమోహన్, కె.టి.రవీంద్రన్, డాక్టర్‌ మహావీర్, డాక్టర్‌ సుబ్బారావు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement