వైఎస్‌ జగన్‌తో జీఎన్‌ రావు కమిటీ సమావేశం | GN Rao Committee Submitted Reports Over AP New Capitals - Sakshi Telugu
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌తో జీఎన్‌ రావు కమిటీ సమావేశం

Published Fri, Dec 20 2019 4:26 PM | Last Updated on Fri, Dec 20 2019 8:44 PM

GN Rao Committee Submits Report On AP capitals To CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో  జీఎన్ రావు కమిటీ శుక్రవారం సమావేశమైంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నిపుణుల కమిటీ సభ్యులు  రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు తాము సందర్శించిన ప్రాంతాలు, అధ్యయనం చేసిన అంశాలను కమిటీ సభ్యులు నివేదిక ద్వారా సీఎంకు నివేదించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు నిపుణుల కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు, సెక్రటరీ చల్లా విజయ్‌ మోహన్, సభ్యులు డాక్టర్‌ అంజలి మోహన్, కె.టి.రవీంద్రన్, డాక్టర్‌ మహావీర్, డాక్టర్‌ సుబ్బారావు పాల్గొన్నారు.సెప్టెంబర్‌ 13న ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 27న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. కేబినెట్‌ భేటీలో కమిటీ నివేదికపై చర్చ జరగనున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement