ఈ కమిటీకి విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్ డాక్టర్ మహావీర్, అర్బన్, రీజనల్ ప్లానర్ డాక్టర్ అంజలీ మోహన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కె.టి.రవీంద్రన్, అహ్మదాబాద్ సెప్ట్ ప్రొఫెసర్ శివానంద స్వామి, చెన్నై చీఫ్ అర్బన్ ప్లానర్ (రిటైర్డ్) కె.వి అరుణాచలంను ప్రభుత్వం సభ్యులుగా ఎంపిక చేసింది. అదేవిధంగా పర్యావరణం, వరద నియంత్రణ అంశాలపై ఒక నిపుణుడిని సభ్యుడిగా చేర్చుకునే అధికారాన్ని ఈ కమిటీకే అప్పగించింది.