Expert Committee
-
చంద్రబాబు తప్పిదం వల్లే.. వాల్ ఢమాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అవగాహనా రాహిత్యం, అస్తవ్యస్థ పనులు మరోసారి బహిర్గతమయ్యాయి. పోలవరం డయాఫ్రమ్ వాల్ ధ్వంసం కావడానికి, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వం తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సాక్షిగా నిర్ధారణ అయింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారని ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు 1,006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించారని పేర్కొంది. అయితే నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకపోవడంతో 2017, 2018లో గోదావరి ప్రవాహం డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించిందని గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రమ్‌వాల్‌పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వరద ఉద్ధృతికి డయాఫ్రమ్ వాల్లో ఐదు చోట్ల 693 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బ తిందని స్పష్టం చేస్తూ ఈనెల 12న కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక అందచేసింది. గతేడాది ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నిర్వహించిన అధ్యయనంలో నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌వాల్ దెబ్బ తిన్నట్లు తేల్చగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరో 208 మీటర్ల మేర అధికంగా దెబ్బ తిన్నట్లు తేల్చడం గమనార్హం. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో(యూఎస్ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్‌బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరుల శాఖ, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం గత నెల 7న ప్రాథమిక నివేదిక అందచేసింది. పూర్తి నివేదికను ఈనెల 12న సీడబ్ల్యూసీకి సమర్పించింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ..క్రమబద్ధంగా పనులు» గాడి తప్పిన పోలవరం పనులను 2019 తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రమ్ వాల్‌పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసింది. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. » ఎగువ కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్‌లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించింది.» దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్‌లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నాయి. 2018లో జెట్ గ్రౌటింగ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించకుండా ఎగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టడం వల్లే సీపేజీ (లీకేజీ) అధికంగా ఉంది.వాస్తవాలకు దర్పణంప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యామ్‌లు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యామ్ పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరం ప్రాజెక్టులో మాత్రం చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యామ్‌లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్‌వాల్ కోతకు గురై దెబ్బతింది.ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్రబాబుదేనని సాగునీటిరంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేయగా తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా అదే అంశాన్ని పునరుద్ఘాటించడం గమనార్హం. ప్రణాళికారాహిత్యం వల్లే..» పోలవరం జలాశయం పనులను 2016 డిసెంబర్లో ప్రారంభించారు. స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనుల కోసం కొండ తవ్వకం పనులకు సమాంతరంగా ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ పనులు ప్రారంభించారు. 2017 జూలైలో వరదలు ప్రారంభమయ్యే సమయానికి ఎడమ వైపు నుంచి 1,006 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్‌ను పూర్తి చేశారు. 2017 జూలై తర్వాత వచ్చిన వరద డయాఫ్రమ్‌వాల్ మీదుగానే ప్రవహించింది. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ నాటికి మిగిలిన 390.6 మీటర్ల పొడవున గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేశారు. 2018లోనూ వరద ప్రవాహం డయాఫ్రమ్‌వాల్ మీదుగానే ప్రవహించింది. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల 2018 నాటికే డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది.» 2017లో వరద ప్రవాహం ముగిశాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లను 2018 జూన్ నాటికి పూర్తి చేశారు. కానీ ప్రవాహ ప్రభావం పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో 2018లో గోదావరి వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతింది. 20 మీటర్ల లోతుతో నిర్మించిన జెట్ గ్రౌటింగ్ వాల్ పటిష్టంగా ఉందో లేదో తెలుసుకోకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించి.. 2019 మార్చి నాటికి పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల గోదావరి కుచించుకుపోయి వాటి మధ్య ప్రవహించాల్సి ఉంటుంది. దీనివల్ల వరద ఉద్ధృతి పెరుగుతుంది. ఆ ప్రభావం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంపై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. దాంతో 2019లో గోదావరి ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో 30 మీటర్ల లోతు వరకూ ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది. డయాఫ్రమ్‌వాల్ పూర్తిగా దెబ్బతింది. దిగువ కాఫర్ డ్యామ్ కూడా కోతకు గురైంది. జగన్ సర్కారు పనులపై కమిటీ సంతృప్తి» పోలవరం పనులను 2019 నుంచి గాడిలో పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం» వరదను మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్ శరవేగంగా పూర్తి» ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహం స్పిల్‌వే మీదుగా మళ్లింపు» దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతంలో జియో బ్యాగ్‌లు ఇసుకతో నింపి పూడ్చివేత» 2023 ఫిబ్రవరికి దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి» స్పిల్‌వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నట్లు నిపుణుల కమిటీ సంతృప్తి » గతంలో జెట్ గ్రౌటింగ్ గోడలో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌లో లీకేజీ ఒకే సీజన్లో.. కొత్త డయాఫ్రమ్‌వాల్ » 2024 నవంబర్ 1 నుంచి 2025 జూలై 31లోగా పూర్తి చేయాలి » పాత డయాఫ్రమ్వాల్కి ఎగువన సమాంతరంగా కొత్తది నిర్మించాలి » కేంద్ర జలసంఘానికి అంతర్జాతీయ నిపుణుల నివేదిక సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్వాల్కి ఎగువన కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని ప్రతిపాదించింది. డయాఫ్రమ్ వాల్ పనులను వరదలు తగ్గాక అంటే 2024 నవంబర్ 1న ప్రారంభించి 2025 జూలై 31లోగా పూర్తి చేసేలా నిరంతరాయంగా చేయాలని స్పష్టం చేసింది. ఒకే సీజన్లో డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ కీలక సిఫార్సులివీ...»గోదావరి వరదల ఉద్ధృతికి గ్యాప్–2లో డయాఫ్రమ్‌వాల్ 693 మీటర్ల పొడవున దెబ్బతింది. మరమ్మతులు చేసినా అది పూర్తి సామర్థ్యం మేరకు పని చేస్తుందో లేదో చెప్పలేం. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా కొత్త డయాఫ్రమ్వాల్ని నిర్మించడమే శ్రేయస్కరం.» ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పటిష్టంగా ఉన్నాయి. పునాది జెట్ గ్రౌటింగ్ వాల్లో లోపాల వల్లే ఎగువ కాఫర్ డ్యామ్‌లో సీపేజీ అధికంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎగువన నది మధ్యలో ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి. » ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన సీపేజీ నీటి మట్టం సముద్ర మట్టానికి 3 మీటర్ల లోపే ఉండాలి. ఆ మేరకు దిగువ కాఫర్ డ్యామ్‌లో ఏర్పాటు చేసిన గ్రావిటీ స్లూయిజ్‌ల ద్వారా సీపేజీ నీటిని బయటకు పంపాలి. గ్రావిటీ ద్వారా పంపడానికి సాధ్యం కాని నీటిని ఎత్తిపోయాలి. ఈ పనులను తక్షణమే ప్రారంభించాలి.» నవంబర్ 1 నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించడానికి వీలుగా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ఇసుక తిన్నెలను యధాస్థితికి తెచ్చేలా వైబ్రో కాంపాక్షన్ పనులను పూర్తి చేయాలి. సముద్ర మట్టానికి 3 మీటర్ల ఎత్తు వరకూ ఈ పనులను అక్టోబర్‌లోగా పూర్తి చేయాలి. » కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం.. గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు, పనులు చేపట్టడంపై వర్క్ షాప్ నిర్వహించాలి.» 2024లో వరదలు తగ్గి పనులు ప్రారంభించడానికి ముందే పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ వర్క్ షాప్ నిర్వహించాలి. సీడబ్ల్యూïÜ, పీపీఏ, జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతిని«దులు పాల్గొనే ఈ వర్క్ షాప్‌నకు అంతర్జాతీయ నిపుణులు కూడా హాజరవుతారు. -
ఇప్పుడే మరమ్మతులొద్దు!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అత్యవసర మరమ్మతుల నిర్వహణకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించడంపై ఆ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించే వరకు ఎలాంటి పనులు చేపట్టరాదని స్పష్టం చేసినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. బ్యారేజీలకు అత్యవసర మరమ్మతుల విషయమై నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఇటీవల నీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్ జలసౌధలో సమావేశం నిర్వహించి చర్చలు జరపడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా, పాలసీకి విరుద్ధంగా మరమ్మతుల విషయంలో ఎలా ముందుకు వెళ్లారు? అనే అంశంపై ఈఎన్సీ అనిల్‌కుమార్‌ను మంత్రి వివరణ కోరారు. ఇలావుండగా.. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ పునర్నిర్మాణం పనులతో పాటు కాఫర్ డ్యామ్ పనులను సొంత ఖర్చుతో చేసేందుకు ఈ సమావేశంలో నిర్మాణ సంస్థ ‘ఎల్ అండ్ టీ’అంగీకరించినట్టు కొన్ని పత్రికల (సాక్షి కాదు)తో పాటు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు రావడంతో సీఎం కార్యాలయం ఆరా తీసింది. ఆ వార్తా కథనాలను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించింది. వర్షాలొస్తే వరదలొస్తాయని.. కాళేశ్వరం బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి పరిష్కారాలను సూచించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫారసు చేసేవరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టబోమంటూ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తమ విధానపర నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించిన అయ్యర్ కమిటీ బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై విస్తృత రీతిలో అధ్యయనం చేపట్టింది. నీళ్లు నిల్వ ఉంటే బ్యారేజీలకు మరింత నష్టం జరిగే ప్రమాదముందని, ఖాళీ చేయాలని సూచించడంతో గతంలోనే బ్యారేజీలను ఖాళీ చేశారు. కాగా మరో నెలన్నర రోజుల్లో వర్షాలు ప్రారంభం కానుండడంతో గోదావరిలో ఎప్పటిలాగే భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. ఈ వరదలతో బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా చేపట్టాల్సిన అత్యవసర మరమ్మతులను సాధ్యమైనంత త్వరగా సూచించాలని అయ్యర్ కమిటీకి సర్కారు విజ్ఞప్తి చేసింది. అయితే కమిటీ రాష్ట్రం నుంచి తిరిగి వెళ్లి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి సూచనలు చేయలేదు. ఈ నేపథ్యంలోనే అత్యవసర మరమ్మతులపై బ్యారేజీల నిర్మాణ సంస్థలతో గత వారం ఆ శాఖ ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్ చర్చలు జరిపారు. విషయం తెలియడంతో మంత్రి ఫైర్! మేడిగడ్డ బ్యారేజీ మరింత కుంగకుండా 7వ బ్లాక్‌కు రెండు వైపులా షీట్‌పైల్స్‌తో అదనపు రక్షణ కల్పించాలని ఈఎన్సీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీని కోరినట్టు తెలిసింది. గోదావరి నదికి అడ్డంగా బ్యారేజీలకు రెండు వైపులా కరై్టన్ వాల్స్ నిర్మించాలని సూచించినట్టు సమాచారం. అలాగే బ్యారేజీల్లో ఏర్పడిన బుంగలను ప్రెషర్ గ్రౌంటింగ్ ద్వారా పూడ్చివేయాలని కాంట్రాక్టర్లను కోరినట్టు తెలిసింది. కాగా ఈ పనులను సొంత ఖర్చుతో చేసేందుకు ఎల్ అండ్ టీతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్‌కి ఎదురుగా నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ కోసం రూ.52 కోట్ల బిల్లులను చెల్లించాలని కూడా ఎల్ అండ్ టీ కోరింది. ఈ విషయాలన్నీ తెలిసిన నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. -
కాళేశ్వరంపై కమిటీ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై కేంద్ర జలసంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, రాష్ట్రంలోని నీటిపారుదల రంగ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై సమగ్ర అధ్యయనం చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లాలని.. తొందరపాటుతో హడావుడి చేసి మరోసారి తప్పులకు తావివ్వవద్దని స్పష్టం చేశారు. సాంకేతికంగా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే మరమ్మ తులు, పునరుద్ధరణ చర్యలపై నిర్ణయం తీసుకోవా లని సూచించారు. శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. కాళేశ్వరం నిర్మణంపై వెంటనే కమిటీ ఏర్పాటు చేసి, రెండు మూడు రోజుల్లోనే సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ వద్ద కుంగిన పియర్లకు మరమ్మతులు చేస్తే సరిపోతుందా? లేక దెబ్బతిన్న పియర్లన్నింటినీ తొలగించి కొత్తగా కట్టాలా? కొన్నింటికి మరమ్మతులు చేసి, మిగతా వాటిని పునర్నిర్మించాలా? అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేయించాలన్నారు. గతంలో అధికారంలో ఉన్నవారు చేసిన తప్పులతో తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. సుమారు రూ.లక్షన్నర కోట్లతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టుకు మరమ్మతుల కోసం అవసరమైతే మరో రూ.పదివేల కోట్లయినా ఖర్చు పెట్టేందుకు ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమన్నారు. ఆరోపణలొస్తే మీరేం చేస్తున్నారు? నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణాబోర్డుకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టుగా వస్తున్న ఆరోపణలు, ప్రచారంపైనా భేటీలో చర్చించారు. బోర్డుకు ఏ ప్రాజెక్టునూ అప్పగించలేదని, ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు చేయలేదని అధికారులు సీఎంకు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం తీవ్రంగా స్పందించారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 45 రోజులే అయింది. ఈ కొద్దిరోజుల్లోనే ఎప్పుడు కృష్ణాబోర్డుతో మీటింగ్‌లు జరిగాయి?ఎవరు హాజరయ్యారు? ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు? మాకు తెలియకుండా అధికారులే ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? శాఖాపరంగా ప్రభుత్వంపై ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు వస్తుంటే మీరేం చేస్తున్నారు?’’ అని నీటిపారుదల శాఖ అధికారులను నిలదీశారు. రాయలసీమకు ఎన్ని నీళ్లు పోతున్నాయో, వాటాకు మించి నీటిని తోడుకుపోతుంటే పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో అఖిలపక్ష భేటీలో చర్చకుపెడదామన్నారు. మండలాల వారీగా ఆయకట్టు తేల్చండి ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో గందరగోళం ఉందని.. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తక్కువ సమ యంలో, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి త్వరగా నీరందించే చర్యలు చేపట్టాల న్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని సూచించారు. ప్రాధాన్యతల వారీగా పెండింగ్ ప్రా జెక్టుల పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నారాయణపేట – కొడంగల్ లిఫ్టుతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయల్‌సాగర్ వంటి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కృష్ణాజలాలపై త్వరలో అఖిలపక్షం కృష్ణా నది జలాల్లో రాష్ట్ర వాటా, కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కృష్ణాజలాలకు సంబంధించి జరిగిన సమావేశాలు, కేఆర్ఎంబీ ఎజెండాలు, చర్చల వివరాలు, మినిట్స్, నిర్ణయాలు, ఒప్పందాలన్నింటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. వీటన్నింటిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిద్దామన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటాలో.. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులకు ఎందుకు ఒప్పుకున్నారు? అప్పుడేం చర్చలు జరిగాయి? ఏమేం నిర్ణయాలు జరిగాయన్న అంశాలపైనా అఖిలపక్ష భేటీలో చర్చించాలని.. వాటన్నింటినీ ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగే సలహాలు, సూచనలను తప్పకుండా స్వీకరిస్తామన్నారు. -
రాడార్ టెక్నాలజీతో నిర్ధారించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడా ర్స్ (జీపీఆర్) వంటి సాంకేతిక లేదా ఇతర పద్ధతులను వినియోగించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని నేషనల్ డ్యా మ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసి న నిపుణుల కమిటీ సూచించింది. కటాఫ్ వా ల్స్‌కి లేదా కటాఫ్ వాల్స్–ర్యాఫ్ట్ (పునాదులు) మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించాల ని తెలిపింది. పగుళ్లను పూడ్చి వేయడానికి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, పునాదుల కింద బుంగలు ఏర్పడి ఉంటే ఆ ప్రాంతాల్లో తవ్వి వాటిని పూడ్చివేయాలని, సమస్యలకు మూలకారణాన్ని గుర్తించి నివారణ చర్యలు తీసుకునే వరకు బ్యారేజీలో నీళ్లను నిల్వ చేయరాదని స్పష్టం చేసింది. అన్నారం బ్యారేజీకి లీకేజీలను నిర్ధారించేందుకు ఈ నెల 2న ఎన్డీఎస్ఏ బృందం అన్నారం బ్యారేజీని సందర్శించింది. ఇటీవల ఎన్డీఎస్ఏకు నివేదిక సమర్పించింది. ఆ నివేదికను ఎన్డీఎస్ఏ రాష్ట్ర నీటిపారుదల శాఖకు పంపించింది. లీకేజీలు పునరావృతం కావడంతో స్పష్టత రాఫ్ట్ కింద భూగర్భంలో నిర్మించిన కటాఫ్ వాల్స్ (బ్యారేజీ గేట్లను మూసివేశాక నీటి ఉధృతితో పీడనం పెరిగి బ్యారేజీ పునాదుల కింద నుంచి నీళ్లు బయటకు ప్రవహించే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా బ్యారేజీ పునాదుల కింద రెండు వైపులా కటాఫ్ వాల్ నిర్మిస్తారు)కు పగుళ్లు వచ్చి ఉంటాయనడంలో సందేహాలు లేవని ఎన్డీఎస్ఏ దక్షిణాది ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.తంగమణి, సీడబ్ల్యూసీ హైదరాబాద్ డైరెక్టర్లు ఎం.రమేశ్‌కుమార్, పి.దేవేందర్‌రావులతో కూడిన కమిటీ తన నివేదికలో తెలిపింది. లీకేజీలు పునరావృతం కావడాన్ని బట్టి కటాఫ్ వాల్స్లలో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ పగుళ్లు వచ్చి ఉంటాయని స్పష్టమవుతోందని పేర్కొంది. చెప్పుకోదగిన రీతిలో నీళ్లు లీక్ ‘బ్యారేజీ 28, 38 గేట్లకు ముందు ప్రాంతం నుంచి చెప్పుకోదగిన రీతిలో నీళ్లు లీక్ అవుతున్నాయి. తాత్కాలికంగా లీకేజీని నివారణకు ఇసుక బస్తాలు, బౌల్డర్లను వేసి రింగ్ బండ్ నిర్మించారు. బ్యారేజీ గేట్ల ముందు భాగంలో కాంక్రీట్ బ్లాకులతో అప్రాన్ నిర్మించగా, దాదాపు బ్లాకులన్నీ కొట్టుకుపోయి చెల్లాచెదురయ్యాయి. కాంక్రీట్ బ్లాకులకు దిగువన నిర్మించిన ఇన్వర్టెడ్ ఫిల్టర్ సైతం కొట్టుకుపోయింది. బ్యారేజీకి 2020/21లో సైతం ఇదే తరహాలో లీకేజీలు చోటుచేసుకున్నట్టు బ్యారేజీ అధికారులు నివేదించారు. 3, 4 బ్లాకులతో పాటు 44వ గేటు ఎదుట అప్పట్లో బుంగలు ఏర్పడగా, ఇసుక బస్తాలు, బౌల్డర్లతో రింగ్‌బండ్‌ను ఏర్పాటు చేసి పూడ్చివేశారు. అనంతరం పాలీమర్ ఆధారిత సీలంట్ అనే రసాయన మిశ్రమంతో లీకేజీని నివారించారు. స్టీల్‌తో కూడిన (స్టీల్ రీఎన్ఫోర్స్డ్), సీŠట్ల్ లేని కాంక్రీట్ పిల్లర్లను ఒకదాని పక్కన మరొకటి పేర్చడం ద్వారా బ్యారేజీల పునాదులకు రెండు వైపులా భూగర్భంలో కటాఫ్ వాల్స్ నిర్మిస్తారు. స్టీల్‌తో రీఎన్‌ఫోర్స్ చేయని పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్‌కు సైతం పగుళ్లు వచ్చి ఉండే అవకాశం ఉంది. సీŠట్ల్ కలిగి ఉన్న, స్టీల్ లేని పిల్లర్ల మధ్య దృఢత్వంలో వ్యత్యాసంతో కటాఫ్ వాల్స్కి నిలువునా పగుళ్లు వచ్చి ఉండే అవకాశం కూడా ఉంది..’అని కమిటీ తెలిపింది. -
అది ‘క్లీన్ చిట్’ కమిటీ: జైరామ్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీతో ఎలాంటి ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తేల్చిచెప్పారు. అది ప్రభుత్వానికి క్లీన్ చిట్ కమిటీగా మాత్రమే తోడ్పడుతుందని అన్నారు. అదానీ విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపే అధికారం చట్టపరంగా నిపుణుల కమిటీకి లేదన్నారు. కేవలం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తోనే నిజాలు వెలుగులోకి వస్తాయని తేల్చిచెప్పారు. జైరామ్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. దర్యాప్తు సంస్థలను దేశ ప్రయోజనాల కోసమా? వ్యక్తిగత అవసరాల కోసమా? దేని కోసం వాడుకుంటారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. 1992లో హర్షద్ మెహతా, 2001లో కేతన్ పరేఖ్ స్కామ్‌లపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదానీ అక్రమాలపై జేపీసీని నియమించాలని చెప్పారు. సభలో రాహుల్ గాంధీని మాట్లాడనివ్వండి లోక్‌సభలో మాట్లాడేందుకు, వివరణ ఇచ్చేందుకు రాహుల్‌కు అవకాశం కల్పించాలని స్పీకర్‌కు జైరామ్ రమేశ్ విజ్ఞప్తి చేశారు. రూల్ 357 కింద సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్‌కు రాహుల్ లేఖ రాశారని, దానిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కాలమే సమాధానం చెబుతుందన్నారు. -
‘స్టాక్ మార్కెట్ల’పై సుప్రీంకోర్టు కమిటీ
న్యూఢిల్లీ: స్టాక్ట్ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను సీల్డ్ కవర్లో స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మదుపరుల ప్రయోజనాలను కాపాడే విషయంలో పూర్తి పారదర్శకత కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతిపాదిత నిపుణుల కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సిట్టింగ్ జడ్జిని నియమించడం సాధ్యం కాదని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత మదుపరులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, ఇందుకోసం సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని, మదుపరుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఎంఎల్ శర్మతోపాటు పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్స్) దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కమిటీ సభ్యుల పేర్లు, విధివిధానాలను శుక్రవారం సీల్డ్ కవర్లో అందజేయగా, ధర్మాసనం స్వీకరించలేదు. ప్రభుత్వం సూచించిన సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తే అది పూర్తిగా ప్రభుత్వ కమిటీ అవుతుందని అభిప్రాయపడింది. పారదర్శకత కావాలి కాబట్టి తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, తద్వారా న్యాయస్థానంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని వెల్లడించింది. ఇకపై సిట్టింగ్ న్యాయమూర్తులు ఈ అంశాన్ని విచారిస్తారని, కమిటీలో మాత్రం వారు సభ్యులుగా ఉండబోరని తెలిపింది. -
అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్లు
న్యూఢిల్లీ: కరోనరీ స్టెంట్లను అత్యవసర ఔషధాల జాతీయ జాబితా(ఎన్ఎల్ఈఎం–2022)లో చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మెటల్ సెంట్లు(బీఎంఎస్), మందు పూత పూసిన స్టెంట్లు(డీఈఎస్)ను ఈ జాబితాలో చేర్చారు. ఇన్నాళ్లూ ‘పరికరాల’ జాబితాలో ఉన్న స్టెంట్లను ఔషధాలుగా అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చడం వల్ల ఎంబీఎస్, డీఈఎస్‌తోపాటు బీవీఎస్, బయోడిగ్రేడబుల్ సెంట్ల ధరలు తగ్గనున్నాయి. ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్, ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో కరోనరీ ఆర్టరీ వ్యాధులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్టెంట్ల ధరల తగ్గుదల వల్ల బాధితులకు ఎంతో ఉపశమనం కలుగనుంది. అత్యవసర ఔషధాల జాతీయ జాబితాలో 2015లో 376 ఔషధాలు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య 384కు చేరింది. ఎన్ఎల్ఈఎంలో ఉన్న మందులను ఎన్పీపీఏ నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించడానికి వీల్లేదు. -
Telangana: తప్పటడుగుల ఇంటర్ బోర్డుకు చికిత్స!
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో ఏటా అబాసుపాలవుతున్న ఇంటర్మీడియెట్ బోర్డును చక్కబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దిశగా ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. లోపాలను సరిచేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. త్వరలో నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఇంటర్ బోర్డు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న నవీన్ మిత్తల్‌కు కార్యాచరణ అప్పగించే అవకాశముందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. బోర్డులో అంతర్గతంగా ఉన్న సమస్యలు, నియంత్రణ వ్యవస్థ లోపించడం, సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం కారణంగా కొన్నేళ్లుగా ఇంటర్ పరీక్షల్లో అనేక లోటుపాట్లు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికీ కారణాలను అన్వేషించి, తప్పులు జరగకుండా పకడ్బందీగా మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్లుగా తప్పిదాలే... 2019 మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తప్పులొచ్చినట్టు గుర్తించారు. వీటిని సరిచేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో 27 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 2020 మార్చిలో జరిగిన పరీక్షల్లో ప్రశ్నపత్రంలో భారీగా తప్పులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫెయిలైన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే, కరోనా రావడం, సప్లిమెంటరీ పెట్టలేకపోవడంతో ఫెయిలైన వారందరినీ పాస్ చేశారు. 2021లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. మొదటి సంవత్సరం మార్కుల ఆధారంగానే రెండో ఏడాది మార్కులను నిర్ధారించారు. ఫస్టియర్ విద్యార్థులకు రెండో సంవత్సరానికి అనుమతించారు. కానీ 2021 అక్టోబర్‌లో రెండో సంవత్సరం చదువుతున్న వారికి ఫస్టియర్ పరీక్షలు పెట్టారు. ఇందులో 49% ఉత్తీర్ణత రావడం, ఆందోళనతో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇదంతా రాజకీయ రంగు పులుముకోవడంతో కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు. ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షల్లోనూ అనేక తప్పులు దొర్లాయి. ఒకచోట సంస్కృతం సబ్జెక్టులో మూడు ప్రశ్నలు రిపీట్ అయ్యాయి. జనగామలో సంస్కృతం పేపర్‌కు బదులు హిందీ పేపర్ ఇచ్చారు. ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో పొరపాట్లు దొర్లాయి. పొలిటికల్ సైన్స్ హిందీ మీడియం ప్రశ్నపత్రం ముద్రించకుండా, చేతిరాతతో అప్పటికప్పుడు ఇవ్వడం విద్యార్థులను కలవరపెట్టింది. ఇలా ప్రతీ ఏటా పరీక్షల నిర్వహణ తలనొప్పిగా మారుతోంది. సమూల మార్పులే శరణ్యమా? పరీక్ష నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్న తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులను మార్చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బోర్డుపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని పరిశీలన కమిటీకి అప్పగించే వీలుంది. దీంతోపాటే పరీక్ష కేంద్రాలను, ఇన్విజిలేటర్లను పెంచడం, జిల్లాస్థాయి నుంచే బాధ్యతాయుతంగా పనిచేసే యంత్రాంగాన్ని నియమించడం వంటి చర్యలూ తీసుకోవాలని భావిస్తున్నారు. (క్లిక్: వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ) -
అనుచితాలు కాదు: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఉచితమంటే ఏమిటి? దేన్ని ఉచితంగా పరిగణించాలి’’ అనే కీలకమైన మౌలిక ప్రశ్నలను సర్వోన్నత న్యాయస్థానం లేవనెత్తింది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం తదితరాలను ఉచితాలుగా భావించాలా, లేక పౌరుల ప్రాథమిక హక్కుగానా అన్నది లోతుగా ఆలోచించాల్సిన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ వంటి పథకాల ద్వారా దేశ పౌరులకు అందుతున్న ఎనలేని ప్రయోజనాలను ప్రస్తావించారు. తద్వారా గ్రామీణ భారతంలో అపారంగా ఆస్తుల సృష్టి కూడా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీల ఉచిత హామీల అంశాన్ని సమగ్రంగా తేల్చడానికి ఓ నిపుణుల కమిటీ వేసే యోచన ఉందని మరోసారి చెప్పారు. రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలను నియత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు వాగ్దానాలు చేయకుండా రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచనప్రాయంగా పేర్కొన్నారు. ‘‘వాగ్దానాలు చేయకుండా దేశంలోని రాజకీయ పార్టీలను నిరోధించలేమని సూచిస్తున్నాం. ఎందుకంటే సమాజంలోని భిన్న వర్గాల్లో ఆదాయం, హోదా, సదుపాయాలు, అవకాశాలపరంగా అసమానతలను రూపుమాపాలని రాజ్యాంగమే ప్రభుత్వాలకు నిర్దేశిస్తోంది. కాబట్టి గెలిచి అధికారంలోకి వస్తే ఈ నిర్దేశాన్ని సాకారం చేసేందుకు ఉచిత హామీలివ్వకుండా పార్టీలను గానీ, వ్యక్తులను గానీ నిరోధించలేం. కాకపోతే ఏది నిజమైన హామీ నిర్వచనంలోకి వస్తుందన్నదే అసలు ప్రశ్న. అలాగే అసలు ఉచితమంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరముంది. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, తాగునీటి సదుపాయం, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివాటిని ఉచితంగా పొందవచ్చా?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘ప్రజలు గౌరవంగా జీవించడానికి అవసరమైన పథకాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపును కేవలం ఉచిత వాగ్దానాలే నిర్దేశించడం లేదు. కొన్ని పార్టీలు ఎన్ని వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో గెలవడం లేదుగా!’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అందరి అభిప్రాయాలూ తెలుసుకున్న తర్వాతే ఉచితాల మీద ఓ స్పష్టమైన నిర్ణయానికి రాగలమని సీజేఐ స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేశారు. అన్నింటిపైనా చర్చ: విపక్షాలు పిటిషన్‌పై కాంగ్రెస్, ఆప్, డీఎంకే తదితర విపక్ష పార్టీలు భిన్నమైన వ్యాఖ్యలు చేశాయి. ఉచితాలు, దేశ ఆర్థిక పరిస్థితుల మధ్య సంబంధంపై చర్చ జరగాలంటే రాజకీయ నేతలు, చట్టసభ సభ్యులు ఏమేం ప్రయోజనం పొందుతున్నారో కూడా చర్చ జరగాలని ఆప్ తన ఇంటర్వీన్ అప్లికేషన్లో పేర్కొంది. ప్రజలకు రాయితీలివ్వడాన్ని ఉచితంగా పరిగణించరాదని కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ తన అప్లికేషన్లో పేర్కొన్నారు. భారత్‌ను ప్రజాస్వామ్య దేశం నుంచి పెట్టబడీదారీ దేశంగా మార్చాలని పిటిషనర్ ప్రయత్నిస్తున్నారని డీఎంకే తరఫు సీనియర్ న్యాయవాది పి.విల్సన్ వాదించారు. సంక్షేమ పథకాలకు తాము వ్యతిరేకం కాదని కేంద్రం పేర్కొంది. అయితే పార్టీల ఉచిత వాగ్దానాలను నియంత్రించాల్సిన అవసరముందని కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మరోసారి సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ విషయమై చట్టసభల్లో చట్టాలు రూపొందేదాకా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని కూడా మరోసారి సూచించింది. పదవీ విరమణ రోజున ప్రస్తావిస్తా రిజిస్ట్రీ సమస్యలు తదితరాలపై సీజేఐ సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అవలంబిస్తున్న కొన్ని పద్ధతులను నియంత్రించాల్సి ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. బుధవారం విచారణ సందర్భంగా రిజిస్ట్రీతో ఓ కేసు విషయంలో ఎదురైన ఇబ్బందిని న్యాయవాది దుష్యంత్ దవే ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాత్రి ఎనిమిదింటికి దాకా కేసులకు సంబంధించిన అంశాలు విన్నాం. సమావేశాలు కూడా ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఒక కేసును విచారణ జాబితా నుంచి తొలగిస్తేనే ఈ కేసు జాబితాలో చేరింది. ఇది సరికాదు. రిజిస్ట్రీలో ఇలాంటి పద్ధతులను నియంత్రించాల్సించే’’ అన్నారు. ‘‘నా దృష్టికి చాలా సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ నా పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు ప్రసంగంలో చెబుతా’ అని పేర్కొన్నారు. జస్టిస్ రమణ 26న పదవీ విరమణ చేయనుండటం తెలిసిందే. -
6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకాను 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) మంగళవారం అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ అత్యవసర వినియోగానికి కొన్ని పరిమితులు విధించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంతవరకు డీసీజీఐ12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కోవాగ్జిన్ టీకాలు వేసేందేకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గతేడాది డిసెంబర్ 21న ఆమోదం లభించింది. అంతేకాదు టీనేజ్ టీకా కార్యక్రమం ఈ ఏడాది జనవరి మూడు నుంచి ప్రారంభించింది. తదనంతరం మార్చి 16న 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు వేసే కార్యక్రమం ప్రారంభించింది. అయితే గతంలో డీసీజీఐ నిపుణుల కమిటీ 2 నుంచి 12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మరిన్ని వివరాలను సమర్పించాలని కోరిన సంగతి తెలిసిందే. (చదవండి: 2 వేలకు పైగా కొత్త కేసులు...మళ్లీ మాస్క్ ధరించాల్సిందే) -
పెగాసస్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
పెగసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
పెగాసస్ వ్యవహారం.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ వాదనల నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం దీనిపై విచారణకు ఆదేశిస్తూ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటిని నియమించింది. జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది. అలోక్ జోషి, సందీప్ ఒబెరాయ్ సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ.. ఏడు అంశాలపై దర్యాప్తు చేయనుంది. (చదవండి: తమిళనాడులో కేంద్రం కొత్త ఆట.. రసవత్తరంగా రాజ్‌భవన్ రాజకీయం..!) చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్ ప్రత్యక్ష బాధితులని పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వురినియోగంపై పరిశీలన చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడాన్ని సహించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిఘాతో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని ధర్మాసనం పేర్కొంది. (చదవండి: ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా -
పులిచింతలను పరిశీలించిన నిపుణుల కమిటీ
సాక్షి, అమరావతి/అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ బుధవారం ప్రాజెక్టును పరిశీలించింది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి ప్రాజెక్టులో నీటినిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈనెల 5న తెల్లవారుజామున దిగువకు ప్రవాహాన్ని విడుదల చేసేందుకు గేట్లు ఎత్తేటపుడు సాంకేతిక లోపం వల్ల 16వ గేటు ఊడిపోవటం తెలిసిందే. వరద ఉధృతికి కొట్టుకుపోయిన గేటు స్థానంలో రికార్డు సమయంలో స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేసి ప్రాజెక్టులో నీటినిల్వకు మార్గం సుగమం చేసిన ప్రభుత్వం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసింది. గేటు ఊడిపోవడానికి కారణాలు, ప్రాజెక్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఈఎన్సీ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన డిజైన్స్ సలహాదారు గిరిధర్‌రెడ్డి, రిటైర్డ్ సీఈ కె.సత్యనారాయణ, సీడీవో (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్) సీఈ శ్రీనివాస్ సభ్యులుగా, పులిచింతల ఎస్ఈ రమేష్‌బాబు కన్వీనర్‌గా నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బుధవారం పులిచింతల ప్రాజెక్టును పరిశీలించింది. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు కృష్ణా బోర్డు కమిటీ బుధవారం రావడంతో ఆ కమిటీకి వివరాలను అందించేందుకు ఈఎన్సీ నారాయణరెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజైన్స్ సలహాదారు గిరిధర్‌రెడ్డి, రిటైర్డ్ సీఈ సత్యనారాయణ, సీడీవో సీఈ శ్రీనివాస్, పులిచింతల ఎస్ఈ రమేష్‌బాబు బుధవారం పులిచింతల ప్రాజెక్టును పరిశీలించారు. 9వ నంబరు గేటును ట్రయల్ రన్ వేశారు. 23 గేట్లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని తేల్చారు. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయవచ్చని సూచించారు. మరోసారి పరిశీలిస్తాం గేటు ఊడిపోవడానికి దారితీసిన పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేశారు. స్పిల్ వే కాంక్రీట్, స్టీల్ పటిష్టతను తేల్చేందుకు పరీక్షలకు పంపాలని నిర్ణయించారు. పరీక్షల్లో కాంక్రీట్, స్టీల్ పటిష్టతను బట్టి.. గేటు ఊడిపోవడానికి కారణాలను అన్వేషించవచ్చునని డిజైన్స్ సలహాదారు గిరిధర్‌రెడ్డి చెప్పారు. వరద ఉధృతికి ఊడిపోయిన గేటు పూర్తిగా వంగిపోయిందని.. ఆ గేటు మళ్లీ వినియోగించడానికి పనికిరాదని తేల్చారు. ఆ గేటు స్థానంలో కొత్తది తయారుచేసి అమర్చాలని నిర్ణయించారు. గేట్ల నిర్వహణను మరింత మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో కాంక్రీట్, స్టీల్ పటిష్టత తేలాక ప్రాజెక్టును మరోసారి పరిశీలించి, అధికారులతో సమీక్షించి ప్రాజెక్టు భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు చెప్పారు. -
కేంద్ర కౌన్సెలింగ్‌లో చేరలేం
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, పీజీ వైద్య సీట్లకు కేంద్రం నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్ సంక్లిష్టతతో కూడుకున్నదని, కేంద్ర పరిధిలో అమలయ్యే వాటికి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రిజర్వేషన్లకు భిన్నమైన పరిస్థితులున్నాయని నిపుణుల కమిటీ పేర్కొంది. మరోవైపు విభజన చట్టం ఇంకా అమల్లోనే ఉన్నందున 2024 వరకూ ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరలేమని కమిటీ తెలిపింది. వైద్య విద్యలో ప్రవేశాలకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సమ్మతి తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాలకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం లేఖలు రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌లో చేరితే తలెత్తే సమస్యలపై అధ్యయనం కోసం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కూలంకషంగా చర్చించిన అనంతరం కమిటీ తన నివేదికను వెల్లడించింది. కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ... 371–డి రాష్ట్రపతి ఉత్తర్వులున్నాయి.. రాష్ట్రంలో 371–డి అనుసరించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. దీని ప్రకారం 85 శాతం సీట్లు స్థానికులకు, 15 శాతం సీట్లు స్థానికేతరులకు కేటాయించారు. ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్థానిక కోటాను 42ః36ః22 నిష్పత్తి ప్రకారం ఏర్పాటు చేశాయి. ఇప్పుడు కేంద్ర కౌన్సెలింగ్‌లో చేరితే ఈ కోటాకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బీసీ రిజర్వేషన్లలో వ్యత్యాసం ఉంది. రాష్ట్రంలో ఓబీసీ కోటా లేదు. బీసీ కోటా మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ కేటగిరీకి 29 (బీసీ–ఏ, బీసీ–బి, బీసీ–సి, బీసీ–డి, బీసీ–ఇ కలిపి), ఈడబ్లు్యఎస్ (ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు) కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. వీటితోపాటు స్పెషల్ కేటగిరీ కింద మహిళలకు 33.1, దివ్యాంగులకు 5, సైనికుల పిల్లలకు 1, ఎన్సీసీకి 1, క్రీడాకారులకు 0.5, అమరవీరుల కుటుంబాల చిన్నారులకు 0.25 శాతం రిజర్వేషన్లున్నాయి. వీటన్నిటికీ సంబంధించి పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించేందుకు ప్రభుత్వం పలు జీవోలను విడుదల చేసింది. ఇవన్నీ కచ్చితంగా అమలు చేయాలంటే కేంద్రం నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరలేం. ‘ఎంఆర్సీ’ అమల్లో ఉంది.. మెరిట్ ఆఫ్ ఏ రిజర్వ్డ్ కేటగిరీ రాష్ట్రంలో అమల్లో ఉంది. ఒక రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థి ఓపెన్ కేటగిరీకి వెళితే ఆ సీటును అదే కేటగిరీతో వారితో భర్తీ చేయాలి. దీనికోసం 2001లో జీవో 550 ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్లడంతో 2019 ఆగస్ట్ 13న జీవో నెం.111 ఇచ్చారు. తిరిగి 2020 నవంబర్ 13న కొద్దిపాటి మార్పులతో జీవో 159 ఇచ్చారు. ఇవన్నీ ప్రక్రియను బట్టి మారుతూ వచ్చాయి. చివరగా మళ్లీ 2020 డిసెంబర్ 4న జీవో 151 ఇచ్చారు. బీడీఎస్, ఎంబీబీఎస్‌కు విడివిడిగా ఒకేసారి ఆప్షన్లు ఇచ్చి కౌన్సెలింగ్ నిర్వహించాలని దీని సారాంశం. కేంద్ర కౌన్సెలింగ్‌లో చేరితే దీనికి ఇబ్బంది ఎదురవుతుందని భావిస్తున్నాం. చిన్న సమస్యలకూ ఢిల్లీ వెళ్లాలి.. నీట్ జాతీయ ప్రవేశ పరీక్ష అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం 85 శాతం సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. మిగతా 15 శాతం జాతీయ కోటాలో ఇచ్చిన సీట్లకు కేంద్రం కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. పూర్తి సీట్లకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఏవైనా సమస్యలొచ్చినప్పుడు విద్యార్థులు పదేపదే ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే 2024 వరకూ కేంద్ర కౌన్సెలింగ్‌లో చేరే పరిస్థితి లేదని కమిటీ భావిస్తోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కేంద్రానికి స్పష్టత ఇస్తుంది. నిపుణుల కమిటీ ఇదే.. చైర్మన్: డా.శ్యాంప్రసాద్, వైస్ చాన్స్‌లర్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం.మెంబర్ కన్వీనర్: డా.కె.శంకర్, రిజిస్ట్రార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. సభ్యులు: డా.ఐవీ రావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్, డా.ఎం రాఘవేంద్రరావు, వైద్య విద్య సంచాలకులు, ఎస్.నాగవేణి, డిప్యూటీ రిజిస్ట్రార్, ఏపీ ఉన్నతవిద్యా మండలి. పీజీ అడ్మిషన్లకూ ప్రత్యేక విధివిధానాలు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీలో ఒక రకమైన విధానాలుండగా పీజీ వైద్య సీట్ల భర్తీకి మరో రకమైన ఇబ్బందులున్నాయి. బ్రాడ్ స్పెషాలిటీ సీట్లు (పీజీ వైద్య సీట్లు) 2013 మార్చి 13న ఇచ్చిన జీవో 43 ప్రకారం నిర్వహిస్తున్నాం. ప్రాంతాలవారీగా నిర్వహిస్తున్నాం. స్పెషాలిటీ పరంగా, కేటగిరీపరంగా చేస్తున్నాం. 2020 మే 29న ఇచ్చిన జీవో 57 ప్రకారం పీజీ కౌన్సెలింగ్‌లో సవరణలు వచ్చాయి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థి ఓపెన్ సీటుకు ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి వెళ్లేందుకు స్లైడింగ్ విధానం ఉంది. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అమలు చేస్తున్నాం. కేంద్ర కౌన్సెలింగ్ ప్రక్రియలో చేరితే వీటి అమలులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. -
‘స్పుత్నిక్’ అత్యవసర వినియోగానికి అనుమతివ్వండి
న్యూఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) సిఫార్సు చేసింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సంస్థ చేసిన విజ్ఞాపనను నిపుణుల కమిటీ పరిశీలించింది. అనుమతి ఇవ్వొచ్చంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. డీసీజీఐ సైతం ఆమోదిస్తే స్పుత్నిక్ టీకా భారత్‌లో అందుబాటులోకి వస్తుంది. దేశంలో ప్రజలకు అందే మూడో కోవిడ్–19 టీకా ఇదే అవుతుంది. అన్ని అనుమతులు లభిస్తే స్పుత్నిక్ టీకాను అత్యవసర వినియోగం కోసం రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇండియాలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, సరఫరా హక్కులను డాక్టర్ రెడ్డీస్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్‌లో రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్)తో భాగస్వామిగా మారింది. స్పుత్నిక్ వ్యాక్సిన్ 91.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో నిర్ధారణ అయ్యింది. డీసీజీఐ భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిని ప్రస్తుతం లబ్ధిదారులకు అందజేస్తున్నారు. -
వ్యవసాయ చట్టాలు: సుప్రీం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాల రద్దుకోసం సుదీర్ఘ ఉద్యమం చేస్తున్న రైతులు, రైతు సంఘాలకు భారీ ఊరట లభించింది. మూడు వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళనపై దాఖలైన పిటీషన్‌పై విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కొంతకాలం చట్టాల అమలును నిలిపి వేయాలని లేదంటే తామే స్టే విధిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెగేసి చెప్పింది. ఈ చట్టాల పరిశీలనకు గాను ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే రైతులు తమ నిరసనను కొనసాగించుకోవచ్చని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టాల పై స్టే ఇచ్చిన తర్వాత ఆందోళన నిలిపి వేస్తారా ? అని సుప్రీం రైతు సంఘాల ఉద్యమ నేతలను ప్రశ్నించింది. తదుపరి వాదనలను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మక సమస్యగా ఎందుకు చూస్తోందని ప్రశ్నించిన సుప్రీంకోర్టుప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా కేంద్ర వైఖరిపై అసంతృప్తితో ఉన్నామన్నారు. రైతుల ఆందోళన, సమస్యను పరిష్కరించడంలో సరిగా వ్యవహరించలేదన్నారు. పలు దఫాలు చర్చలు విఫలంపై స్పందిస్తూ కేంద్రం పరిస్థితిని సరిగ్గా నిర్వహిస్తోందని, చర్చలు ప్రభావవంతంగా ఉన్నాయని తాము విశ్వసించడలేదంటూ ఘాటుగా స్పందించారు. అందుకే చట్టాల అమలును నిలిపివేయడం ద్వారా వాతావరణాన్ని అనుకూలంగా మార్చడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతు సంఘాలతో ప్రభుత్వ చర్చల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య సీజేఐ వ్యాఖ్యలు ప్రాధన్యతను సంతరించుకున్నాయి. కొంతమంది రైతులు ఆత్మహత్యలను ప్రస్తావించిన సుప్రీం, వీటిపై ఆందోళన వ్యక్తం చేసింది. వీటన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు అసలు ఈ వ్యవహారంలో ఏం జరుగుతోందని కూడా ప్రశ్నించింది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరమూ బాధ్యత వహించాలి. మ ఇకపై ఎవరి రక్తంతోనూ మన చేతులు తడవకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాల పరిశీనలకుగాను ఐసీఎఆర్‌తో సహా నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనిపై వ్యతిరేక, అనుకూల వాదనలను ఈ కమిటీకి అందించుకోవచ్చని, కమిటీ నివేదిక మేరకు వ్యవహరిస్తామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు కేవలం రెండు, మూడు రాష్ట్రాలు మాత్రమే నిరసన తెలుపుతున్నాయని అటార్నీ జనరల్ మెహతా సుప్రీంకు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల రైతులు, ఇతర ప్రాంతాల రైతులు నిరసనల్లో పాల్గొనడం లేదన్నారు. అయితే కమిటీ వేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చట్టాలను నిలుపుదల చేయవద్దని ఆయన కోరారు. -
‘అలా చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు’
సాక్షి,విజయవాడ: రెండు వారాల క్రితం ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఐఐటీ ప్రొఫెసర్ మాధవ్‌తో కూడిన నిపుణుల కమిటీ కొండ చరియలు విరిగి పడే ప్రాంతాన్ని పరిశీలించారు. ఒక వారం లోపు నేవిదిక సమర్పిస్తామని తెలిపారు. భక్తుల భద్రత మాకు ముఖ్యమని ఐఐటీ ప్రొఫెసర్ మాధవ్ వెల్లడించారు. (చదవండి: ‘సీఎం జగన్ స్పందన అభినందనీయం’) ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. ‘12 ఏళ్ల నుంచి కొండ చరియలు గురించి సలహాలు ఇస్తున్నాం. ఘాట్ రోడ్డు విస్తరణ కు కొండను తవ్వారు. అపుడు కొండ ప్రాంతం దెబ్బతింది. ఫెన్సింగ్ ద్వారా కొంత మేరకు కట్టడి చేశారు. ఈ కొండ రాయి రాక్ ఫాల్ టైప్. ఫెన్సింగ్, కేబుల్, హైడ్రో సీలింగ్ చేస్తే ప్రమాద తీవ్రతను తగ్గించ వచ్చు. కొండ గట్టిదే కానీ కొండ మీద వర్షం వచ్చినపుడు నీరు ఆగితే ప్రమాదం. కొండ మీద నీరు నిల్వ లేకుండా బయటకి పంపేందుకు సలహాలిచ్చాం. కొండ చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ వేస్తే కొండ చరియలు పడినా ప్రమాదాలు నివారించ వచ్చు. హైడ్రో సీలింగ్(సీడ్స్ వేసి చిన్న సైజ్ చెట్లు పెంచితే) చేస్తే ప్రమాదాలు జరగవు’ అన్నారు. -
ఇంటర్ ఫలితాల ప్రాసెస్‌పై నిపుణుల కమిటీ: సబిత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఫలితాల ప్రాసెస్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెస్‌లో సాంకేతిక సహకారాన్ని సీజీజీ నుంచి తీసుకుంటున్నామని, దాని నిర్వహణ తీరును ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రి తన కార్యాలయంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిపుణుల సలహాలు తీసుకుంటూ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గతేడాది ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్, మార్చి 4 నుంచి 29 వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా పరీక్షలకు 9,85,840 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరి కోసం 1,994 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పరీక్షల నియంత్రణాధికారి అబ్దుల్ ఖాలిక్ పాల్గొన్నారు. -
వెలుగు రేఖ.. విశాఖ
అందరి మొగ్గు విశాఖవైపే.. అందరి చూపు అందాల నగరిపైనే.. గత కొన్నేళ్ల నుంచి ఆర్థిక రాజధానిగా.. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమ్మేళనాలకు వేదికగా మారిన విశాఖకు రాజధాని కావడానికి కావల్సిన అర్హతలన్నీ ఉన్నాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుంచీ సర్వత్రా వినిపిస్తున్న మాట. తాజాగా ఈ అంశంపై నియమించిన జీఎన్‌రావు కమిటీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో వెల్లడించిన మూడు రాజధానుల ఆలోచన.. ఇప్పుడు నిపుణుల కమిటీ విశాఖ వైపు మొగ్గు చూపుతూ చేసిన సిఫారసులు.. విశాఖతో పాటు మొత్తం ఉత్తరాంధ్రకు మహర్దశ కల్పిస్తాయని ఈ ప్రాంత రాజకీయ పార్టీలు, మేధావులు, సామాన్యులు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులు, మౌలిక వనరులు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు విశాఖకు రాజధాని యోగ్యత కల్పించేందుకు అనుకూలంగా ఉన్నాయన్న బలమైన అభిప్రాయం వినిపిస్తోంది. అందుకు తగినట్లే నిపుణుల కమిటీ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయాలని సూచించింది. సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్తు విశాఖదే. అందమైన నగరాన్ని చూసి ముగ్ధులైన ఎంతోమంది మహామహుల మాట ఇదే. దశాబ్దాలుగా ఈ మాట వింటున్నామే తప్ప విశాఖ సహా ఉత్తరాంధ్రకు సమన్యాయం దక్కట్లేదని సగటు విశాఖ వాసుల అసంతృప్తి మాటల్లో చెప్పలేనిది. విశాఖను విశ్వపటంలో ఆవిష్కరిస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపించిన గత పాలకులకు భిన్నమైన పాలన ఇప్పుడు వచ్చింది. సమన్యాయం చేస్తానన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పాలన పగ్గాలు చేపట్టిన ఆర్నెల్లలోనే ఒక్కొక్క అడుగూ విశాఖ అభివృద్ధి వైపు వడివడిగా వేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదిక ఆయన నిర్ణయాలకు బలం చేకూర్చింది. ప్రాంతీయ అసమానతలను పారదోలేలా పలు సిఫారసులు చేసింది. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్య వస్థలకు విశాఖను కూడా ఒక వేదిక చేయాలనే సూచనలతో నివేదిక సమర్పించింది. సహజ వనరులకు ఆటపట్టు.. సుదీర్ఘ తీర ప్రాంతంతోపాటు పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారి, రైల్వే లైన్ వంటి అనుసంధాన మార్గాలే కాదు.. ఒక రాజధానికి ఉండాల్సిన సహజ సిద్ధమైన లక్షణాలన్నీ విశాఖకు ఉన్నాయనేది మేధావుల అభిప్రాయం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక, పారిశ్రామిక రాజధానిగా అవతరించింది. తాజాగా జీఎన్ రావు కమిటీ పలు అంశాల్లో విశాఖకు పెద్దపీట వేసింది. ప్రాంతాల మధ్య సమతూకం, సమానాభివృద్ధే కొలమానంగా రూపొందించిన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించింది. ఈ సిఫారసుల పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు బెంచ్.. రాష్ట్ర విభజన తర్వాత రాజధానిగా అమరావతిని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించినపుడు కనీసం విశాఖలో హైకోర్టునైనా ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు గట్టిగా కోరుకున్నారు. న్యాయవాదులు ఏకంగా ఉద్యమాలే నడిపారు. ఇప్పుడు జీఎన్ రావు కమిటీ కూడా అనూహ్యమైన సిఫారసులు చేసింది. శ్రీబాగ్ ఒప్పందాన్ని దృష్టిలో ఉంచుకొని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, దాని బెంచ్‌లను అమరావతి, విశాఖలలో నెలకొల్పాలని సూచించింది. ఇది ఒక్క విశాఖకే కాదు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరికీ మేలు చేసే సూచన అనేది మేధావుల అభిప్రాయం. పాలనా నిలయం పాలనలో అత్యంత కీలకమైన రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ (సచివాలయం), ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్‌లోనే ఉండాలనే జీఎన్ రావు కమిటీ సిఫారసుపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాలనకు విశాఖ వేదిక అయితే సర్వతోముఖాభివృది్ధకి నోచుకుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే సాకారమైతే విశాఖలో మౌలిక వసతులు మరింత మెరుగవుతాయి. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు తరలివస్తాయి. వ్యాపార రంగం కొత్తపుంతలు తొక్కుతుంది. అసెంబ్లీ సమావేశాలు మహారాష్ట్ర మాదిరిగా శాసన వ్యవస్థ అటు అమరావతిలో, ఇటు విశాఖలో పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహించాలనే జీఎన్ రావు కమిటీ సిఫారసు కూడా ఇదే. ఇవన్నీ సాకారమైతే విశాఖ పాలనా రాజధాని అవుతుంది. ప్రపంచపటంలో తలెత్తుకుని విశ్వనగరంగా ఆవిర్భవిస్తుందనే వాదనల్లో సందేహమే అక్కర్లేదు. త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో నిపుణుల కమిటీ సూచనలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి అభివృద్ధిలో వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను కలిపి ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ సూచించింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సూచించిన నాలుగు మండళ్లలో ఇదొకటి. దీన్ని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రకు గట్టి మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమిటీ సూచనల్లో కొన్ని ⇒కార్యనిర్వాహక వ్యవస్థ(సచివాలయం) ⇒హైకోర్టు బెంచ్ ⇒సీఎం క్యాంపు కార్యాలయం ⇒అసెంబ్లీ వేసవి సమావేశాల నిర్వహణ ⇒ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి -
13 జిల్లాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
-
అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్
సాక్షి, అమరావతి: ప్రజాభిప్రాయం మేరకే తమ నివేదిక ఉంటుందని జీఎన్ రావు కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులు శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తుది నివేదిక సమర్పించారు. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రాజధాని, అభివృద్ధి అనే అంశాలపై కమిటీ సభ్యులం అధ్యయనం చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాం. ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక ఇచ్చాం. రాష్ట్రంలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడి ఉన్నాయి. మరి కొన్ని ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వీటి మధ్య సమతూకం సాధించాలి. దీని కోసం రెండు అంచెల వ్యూహాన్ని సూచించాం. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అలాగే నదులు, అడవులు ఉన్నాయి,. అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా సూచనలు చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అంటే పర్యావరణాన్ని పాడు చేసుకోవడం కాదు. అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని సూచనలు ఇచ్చాం. వరద ముంపులేని రాజధాని ఉండాలని సూచనలు చేశాం. సుమారు 10,600 కిలోమీటర్లు తిరిగాం. రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేశాం. అంతా ఒకేచోట కాకుండా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండేలా సూచనలు చేశాం. సమగ్రమైన పట్టణాభివృద్ధి, ప్రణాళిక కోసం ప్రయత్నించాం. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా విభజించాలని సూచనలు చేశాం. ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ రీజియన్లు విభజించి అభివృద్ధి చేయాలని సూచించాం ’ అని తెలిపారు. చదవండి: సీఎం జగన్‌తో జీఎన్ రావు కమిటీ భేటీ కమిటీ సిఫార్సులు ఇవే రాష్ట్రాన్ని నాలుగు రీజియన్లుగా చూడాలి ఉత్తరాంధ్ర : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మధ్య కోస్తా : ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా దక్షిణ కోస్తా : గుంటూరు, ప్రకాశం, నెల్లూరు రాయలసీమ : చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కర్ణాటక తరహాలో రీజినల్ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలి పాలనా వ్యవహారాలు విశాఖలో పెట్టాలి తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో రాజభవన్, అసెంబ్లీ సమావేశాలు, హైకోర్టు బెంచ్ విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం, హైకోర్టు బెంచ్ వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విశాఖలో నిర్వహించాలి శ్రీబాగ్ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలులో హైకోర్టు తుళ్లూరులో నిర్మాణంలో ఉన్న భవనాలు పూర్తి చేయాలి మంగళగిరిలో మంత్రులు, అధికారుల క్వార్టర్లు -
సీఎంకు ఆర్టీసీ నిపుణుల కమిటీ నివేదిక
సాక్షి, అమరావతి : ఎలక్ట్రిక్ బస్సులపై నియమించిన ఆర్టీసీ నిపుణుల కమిటీ తన నివేదికను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించింది. ఈ విధానంపై కమిటీ కొన్ని కీలక సిఫారసులను చేసింది. అవి పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చి అందుకు అవసరమైన ఆదాయ వనరుల కోసం ‘పర్యావరణ పరిరక్షణ నిధి’ ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా ఈవీ బాండ్లు జారీ చేయాలి. ఆర్టీసీ ఛార్జింగ్ పాయింట్ల వద్ద సోలార్ పవర్ కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్టీసీ కాంప్లెక్స్‌ల వద్ద అనుకూలంగా ఉన్న చోట సోలార్ పవర్ రూఫ్లను ఏర్పాటు చేసుకోవాలి. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలిపిరి, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు భూములు కేటాయించాలి. ఈ బస్సు టెండర్లలో రివర్స్ టెండరింగ్ పద్దతిని అనుసరించడం ఉత్తమం. విద్యుత్ వాహనాల ద్వారా ఇంధనం ఆదా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులతో వ్యయ నియంత్రణ విద్యుత్ వాహనాల ఛార్జింగ్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన విద్యుత్‌కు బదులుగా సౌర విద్యుత్ వినియోగ అవకాశాలను పరిశీలించాలి. గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి భేటీ కావాలి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రత్యేకంగా ఈ–బస్ బిజినెస్ డెవలప్మెంట్ డివిజన్‌ను ఏర్పాటు చేయాలి. తద్వారా సంబంధిత విభాగంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకునే పరిణామాలను వేగంగా అమలు చేయడంతో పాటు, సంస్థకు అవసరమైన పథకాలను రూపొందించవచ్చు. స్థూల వ్యయ కాంట్రాక్టుల (జీసీసీ)ను సమీక్షించడం కోసం తగిన యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా కాంట్రాక్ట్ సమయంలో ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా చేయవచ్చు. సంస్థలో 350 ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇందులో రాయితీ పొందేందుకు ‘ఫేమ్–2’ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాథాన్యత క్రమంలో వాటిని చేపట్టాలి. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కమిటీ చైర్మన్ ఆంజనేయరెడ్డి, కమిటీ సభ్యులు, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉన్నారు. -
పోలవరం రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు టెండరింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నం ఫలించింది. రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వ సొమ్ము ఆదా కానుంది. పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ పనుల్లో 65వ ప్యాకేజీ టెండర్ ఖరారైంది. టీడీపీ హయాంలో పోలవరం 65వ ప్యాకేజీ పనులను రూ. 292.09 కోట్లకు పనులు దక్కించుకున్న మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ తాజాగా రూ. 231.47 కోట్లకు టెండర్ దక్కించుకుంది. బిడ్‌లో ఆరు కంపెనీలు పోటీపడగా.. 15.6 శాతం తక్కువకి మ్యాక్స్ ఇన్ఫ్రా సంస్థ టెండర్ వేసింది. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే సంస్థ కేవలం 4.8 శాతం ఎక్కువకి టెండర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రభుత్వానికి రూ. 58.53కోట్లు ఆదాకానుంది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు టెండరింగ్‌లో భారీగా అవినీతి జరిగిందని మరోసారి నిర్ధారణ అయింది. పోలవరం ప్రాజెక్టు పనుల అప్పగింతలో అక్రమాలు చోటుచేసుకున్నాయని నిపుణుల కమిటీ తేల్చడంతో జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చదవండి: పోలవరం అక్రమాలపై ‘రివర్స్’ పంచ్ పోలవరం పనులు ఆపేశారంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబుకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. టెండర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు తన అనుచరులకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టుకు 50 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని ఆయన తెలిపారు. పోలవరం పై తప్పుడు ప్రచారం చేయవద్దని నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. చదవండి: రివర్స్ టెండరింగ్! -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించి..ఆ మేరకు జీతాలు పెంచాల్సిందిగా సూచించిన నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా వైద్యుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలను సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం సచివాలయంలో ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌కు.. నివేదికలోని అంశాలను సుజాతారావు వివరించారు. ఈ క్రమంలో కమిటీ చేసిన 100కు పైగా సిఫారసుల గురించి సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న ఒప్పందాల్లోని పలు లోపాలను కూడా కమిటీ బయటపెట్టింది. ఈ క్రమంలో ఈ విషయాలపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మన విద్యావ్యవస్థల్లో సమూల మార్పులు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వృత్తివిద్యా కోర్సు ఏదైనా సరే.. చివరి ఏడాది వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉండాలని.. అప్రెంటిస్ అన్నది పాఠ్యప్రణాళికలో ఒక భాగం కావాలని పేర్కొన్నారు. చదువుకున్నదాన్ని ఏవిధంగా అమల్లో పెట్టాలన్నదానిపై పాఠ్యప్రణాళికలో ఉండాలని..ఈ అంశంపై సూచనలు చేయాల్సిందిగా నిపుణుల కమిటీకి సూచించారు. ఆయన కొనసాగిస్తూ... ‘ప్రభుత్వాసుపత్రుల దశ,దిశ మారుస్తాం. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతలేకుండా, సదుపాయాలు కల్పించగలిగితేనే వ్యవస్థ బతుకుతుంది. రోగులు ఆస్పత్రికి రాగానే వారికి నమ్మకం కలిగించేలా ఉండాలి. బెడ్లు, దిండ్లు, బెడ్షీట్లు, బాత్రూమ్స్, ఫ్లోరింగ్, గోడలు వీటన్నింటినీ కూడా మార్చాలి. ఫ్యాన్లు, లైట్లు అన్నీకూడా సరిగ్గా పనిచేయాలి. అవసరమైన చోట ఏసీలు ఏర్పాటు చేయాలి. ఈ మార్పులు చేయగలిగితేనే ప్రభుత్వ ఆస్పత్రుల మీద ప్రజల దృక్పథం మారుతుందని సంబంధిత అధికారులతో పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో కొన్ని సీఎం జగన్ తీసుకున్న కీలక నిర్ణయాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు-నవంబర్ 1 నుంచి ప్రారంభం డిసెంబర్ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు కింద అమలు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్ ప్రాజక్ట్ అమలు మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్ ప్రాజెక్టు కింద అమలు వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు ఏప్రిల్ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు లోటుపాట్లు గుర్తించి పూర్తిస్థాయి అమలుకు కార్యాచరణ ప్రణాళిక ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ జిల్లాల వారీగా అమలు ప్రారంభం ఆపరేషన్ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం కాగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్‌ను విస్తరించడంపై సమావేశంలో చర్చ జరిగింది. ఇక తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రభుత్వం ఇప్పటికే రూ.10వేల పెన్షన్‌ను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇతర దీర్ఘకాలిక వ్యాధులను ఒక కేటగిరీ కిందకు తీసుకు వచ్చి వారికి కూడా నెలకు రూ. 5వేలు ఇవ్వాలని..ఆ మేరకు మార్గదర్శకాలు రూపొందించాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలు ఆరోగ్య రంగంలో ప్రభుత్వం దృక్పథం మారాలి దీర్ఘకాలిక వ్యాధులపై దృషిపెట్టాలి ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజలు పెద్దగా రావడంలేదు జాతీయస్థాయితో పోలిస్తే చాలా తక్కవ మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు: ఆరోగ్యరంగంలో బడ్జెట్ చాలా వరకు జీతాలకే సరిపోతుంది పెద్దసంఖ్యలో ఉన్న సిబ్బంది సేవలను సమర్థవంతగా వాడుకోవాలి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, పరికరాలను కల్పించాలి మందుల కొనుగోలు, వ్యాధినిర్దారణ పరీక్షలు ప్రజలకు భారంగా మారాయి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో స్పష్టత, బాధ్యత రెండూ లేవు సరైన సమీక్ష, పర్యవేక్షణఉండడంలేదు రోజువారీ పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి ఒకరు చేసే పనిని ఇంకొకరు చేస్తున్నారు, డూప్లికేషన్ అధికంగా ఉంది ఆస్పత్రుల్లో పరికరాలన్నీ పాతబడ్డాయి ఇది నాది అన్న భావన ఉండడం లేదు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కనిపిస్తున్నాయి వ్యాధి నిరోధకతపై దృష్టిపెట్టాలి 30 శాతం మంది హృద్రోగ, క్యాన్సర్‌లాంటి వ్యాధుల అంశాలతో బాధపడుతున్నారు మూడు దశల్లో ప్రాథమిక వైద్యం అందించాలి ప్రతి 5వేలమందికి ఒక సబ్ సెంటర్‌ఉండాలి ప్రతి 30 వేల మంది జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి ప్రతివేయి మందికి జనాభాకు విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి చిన్న చిన్న వాటికి అక్కడికక్కడే చికిత్స అందించాలి రాష్ట్రంలో 18 ఏళ్లలోపు ఉన్న వారు సుమారు కోటిమంది ఉన్నారు వారి ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టిపెట్టాలి యూత్ క్లబ్బుల తరహాలో క్లబ్బులను ఏర్పాటుచేసి ఆరోగ్యంపైన అవగాహన కల్పించాలి సబ్సెంటర్లలో సరైన సౌకర్యాలు లేవు, వాటిని కల్పించాల్సి ఉంది ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీస సిబ్బందిని 9 నుంచి 13కు పెంచాలి ప్రతి పీహెచ్సీలో ముగ్గురు వైద్యులు ఉండాలి ఒక కౌన్సెలర్ లేదా సోషల్ వర్కర్ ఉండాలి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వైద్యం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యతను వీరికి అప్పగించాలి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 24 గంటలు నడిచేలా చూసుకోవాలి 2 బెడ్ ఐసీయూ సదుపాయం ఉండాలి ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించాలి..వారి బేసిక్ శాలరీని పెంచాలి ప్రభుత్వ డాక్టరుచేత ప్రైవేటు హాస్పటిల్‌లో ఆరోగ్య శ్రీ కేసు చేయిస్తే సీరియస్‌గా తీసుకుని, ఆ ఆస్పత్రిని జాబితా నుంచి తప్పించాలి ప్రతి లక్ష జనాభాకు కమ్యూనిటీ హాస్పటల్ ఉండాలి కచ్చితంగా ఫ్యామిలీ మెడిసిన్‌లో ఎండీ చేసిన వారి పర్యవేక్షణలో ఆస్పత్రి సామాజిక ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేయడానికి సదుపాయాలు ఆప్తమాలజీ, ఈఎన్టీ కేర్ స్పెషలిస్టులు ఉండాలి అన్ని మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండాలి టీచింగ్, నాన్ టీచింగ్ కేటగిరీలను వేర్వేరుగా చేయాలి హెచ్ఆర్ బాధ్యతలనుంచి వైద్యులను తప్పించాలి ఏడాదికి రెండు వారాలు హెచ్ఆర్లో శిక్షణ ఇవ్వాలి..ఖాళీలను భర్తీ చేయాలి నర్సింగ్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలి మరిన్ని కాలేజీలను ఏర్పాటు చేయాలి రాష్ట్రంలో నర్సింగ్ విద్య పటిష్టంగా లేదు నర్స్ ప్రాక్టీషినర్స్‌కు ప్రత్యేక కేడర్ ఏర్పాటు చేయాలి నర్సింగ్కు దేశవ్యాప్తంగా, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలను, వసతులను పెంచాలి జిల్లా ఆస్పత్రుల స్థాయిని 500 బెడ్లకు పెంచాలి బోధనాసుపత్రుల్లో 2వేల బెడ్లవరకూ పెంచాలి 30 మహిళా ఆరోగ్య కేంద్రాలను 500 బెడ్లతో ఏర్పాటు చేయాలి ప్రసవాలకోసం, మహిళల ఆరోగ్యం కోసం ఈ కేంద్రాలను వినియోగించవచ్చు డ్రగ్ రెగ్యులేటరీ కమిటీ ఉండాలి, దాన్ని బలోపేతం చేయాలి కనీసం 150 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి ప్రతి మందుల దుకాణంలో అమ్ముతున్న మందుల కంప్యూటరీ కరణ ఉండాలి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందుకున్న రోగికి ఏ సేవలు అందాయన్నదానిపై ఒక రశీదు ఇవ్వాలి ఎంత విలువైన వైద్యం ఉచితంగా అందిందన్న దానిపై ఆ రశీదులో పేర్కొనాలి వైద్యం మీద ప్రజల ప్రస్తుతం 62శాతం ఖర్చు చేస్తున్నారు దాన్ని 2025 నాటికి 30 శాతానికి తగ్గించాలి -
ఆరువారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక
-
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రాజధానితోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. వికేంద్రీకరణ దిశగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న పనులను పర్యవేక్షించడంతోపాటు అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించడానికి విశేష అనుభవం ఉన్న నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్ డాక్టర్ మహావీర్, అర్బన్, రీజనల్ ప్లానర్ డాక్టర్ అంజలీ మోహన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కె.టి.రవీంద్రన్, అహ్మదాబాద్ సెప్ట్ ప్రొఫెసర్ శివానంద స్వామి, చెన్నై చీఫ్ అర్బన్ ప్లానర్ (రిటైర్డ్) కె.వి అరుణాచలంను ప్రభుత్వం సభ్యులుగా ఎంపిక చేసింది. అదేవిధంగా పర్యావరణం, వరద నియంత్రణ అంశాలపై ఒక నిపుణుడిని సభ్యుడిగా చేర్చుకునే అధికారాన్ని ఈ కమిటీకే అప్పగించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన సమీక్ష చేయడమే కాకుండా, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను కమిటీ రూపొందించాల్సి ఉంటుంది. ఆరు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. -
అన్నీ అనుమానాలే?
టీడీపీ పాలనలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు సంబంధించి చేపట్టిన పనులపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తొలిరోజు మంగళవారం నిర్వహించిన పరిశీలనల్లో అన్నీ అనుమానాలే వ్యక్తం అయ్యాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. అందుకు విరుద్ధంగా పనులకు ఎలా అనుమతులు ఇచ్చారంటూ ఒక్కో పనిని సునిశితంగా పరిశీలిస్తూ నిపుణులు పర్యటన సాగించారు. సాక్షి, బి.కొత్తకోట / తిరుపతి: గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిపుణుల కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రాజెక్టు పనుల పరిశీలనకు రిటైర్డ్ సీఈ ఐఎస్ఎన్ రాజు, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ అబ్దుల్ బషీర్, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎల్.నారాయణ రెడ్డి, రిటైర్డ్ ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ సుబ్బరాయ శర్మ, ఏపీ జెన్కో డైరెక్టర్ జీ.ఆదిశేషులను ప్రభుత్వం నియమించింది. ఈ బృందం మంగళవారం గాలేరు–నగరిలో భాగమైన మల్లెమడుగు రిజర్వాయర్ పనులు, హంద్రీ–నీవాలో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు పరిశీలించింది. ఎన్నో ప్రశ్నల ను లేవనెత్తింది. తొలుత మల్లెమడుగు రిజర్వాయర్‌ను పరిశీలించి రూ.120కోట్లతో ఇక్కడ పనులు ఎలా చేపట్టారని అధికారులపై అనుమానం వ్యక్తంచేశారు. గాలేరు–నగరి పూర్తి కాలేదు.. ప్రస్తుతానికి ఒక టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే సరిపోతుంది కదా? ఇది తెలిసీ భారీ అంచనాతో పనులు చేపట్టడానికి కారణమేమిటని అనుమానం వ్యక్తంచేశారు. ప్రస్తుతం 17శాతం పూర్తయిన పనులు పరిశీలించాక ఒక టీఎంసీ సామర్థ్యానికే రిజర్వాయర్‌ను నిర్మించాలని సూచనలిచ్చారు. గాలేరు–నగరి పూర్తయి నీటి లభ్యత అందుబాటులోకి రాగానే రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకోవచ్చ ని సూచనచేశారు. అక్కడి నుంచి కుప్పం ఉపకాలువ పరిశీలనకు వచ్చిన కమిటీ ఈ పనులపై అడుగడుగునా అనుమానాలు, అసంతృప్తిని వ్యక్తం చేసింది. రూ.413 కోట్ల పనులను రూ.430.27 కోట్లకు అప్పగించినా నిర్ణీత గడువులో పనిచేయకపోగా అదనంగా రూ.144.7 కోట్ల పెంపు వెనుక పెద్ద వ్యవహారమే నడిచిందని బలంగా అనుమానం వ్యక్తం చేశారని తెలిసింది. కుప్పం ఉపకాలువ 4వ కిలోమీటర్ నుంచి ప్రారంభమైన పరిశీలన చివరిదాకా సాగింది. 4వ కిలోమీటర్‌కు సమీపంలోని ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాక 11వ కిలోమీటర్ వద్ద గ్యాస్ పైప్‌లైన్ దాటేందుకు తవ్విన సొరంగం, పైప్‌లైన్ పనులు చూశారు. 26వ కిలోమీటర్ వద్ద జరిగిన ఇన్వర్టర్ సైఫన్ పైప్‌లైన్ చూశాక కమిటీకి తీవ్రమైన అనుమానాలు తలెత్తినట్టు తెలిసింది. అసలు ఈ సైఫన్ విధానం పని చేపట్టాలని డీటైల్డ్ ప్రాజెక్టు నివేదికలో ఉందా అని ఆరా తీశారు. కాలువను తవ్వాల్సిన చోట సైఫన్ పద్ధతి అమలుచేసే విషయంలో తెర వెనుక ఏదో బలమైన వ్యవహరం నడిచిందని కమిటీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఇక్కడ కాలువను నిర్మించకపోవడం వల్లే అదనంగా రూ.110 కోట్లు పెంచుకొన్నట్టు నిర్ధారించారని తెలిసింది. డీపీఆర్‌లోని పనులు చేపట్టడం నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడం ఒక ఎత్తయితే, దానికి భారీగా చెల్లింపులు చేయడం సాహసమేనని కమిటీ సభ్యులు చర్చించినట్టు తెలిసింది. దీనికి అనుమతులు ఇచ్చిందెవరని అధికారులను అడిగినట్టు తెలిసింది. కాలువ తవ్వకంలోనూ నిబంధనలు పాటించకుండా కాంట్రాక్టర్ల ఇష్టం మేరకు పనులు చేశారని తేల్చారు. అదే సమయంలో చేసిన పనుల్లో 20 కిలోమీటర్ల కాలువ తవ్వకం తగ్గినప్పుడు అంచనాలు తగ్గాలి కదా, అలా కాకుండా రూ.144 కోట్ల అదనపు చెల్లింపులు చేయడమేమిటని ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. 140 కిలోమీటర్ వద్ద సొరంగం, కాలువలోనే పెద్దదైన అక్విడెట్ పనులు పరిశీలించారు. కాలువ పరిశీలన సమయంలో జరిగిన పనులకు నిబంధనలు పాటించలేదని, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని తేల్చారని సమాచారం. నేడు మదనపల్లెలో కమిటీ సభ్యులు రెండో రోజు బుధవారం మదనపల్లె సమీపంలోని 59వ ప్యాకేజీకి చెందిన సొరంగం పనులు, చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పనులను పరిశీలించనున్నారు. -
పోలవరం అక్రమాలపై ‘రివర్స్’ పంచ్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన అక్రమాలపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. హెడ్‌వర్క్స్(జలాశయం) పనుల నుంచి తప్పుకోవాలని నవయుగ సంస్థకు, గేట్ల తయారీ పనుల నుంచి వైదొలగాలని బీకెమ్ సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నామినేటెడ్ ఎల్.ఎస్. కాంట్రాక్టు ఒప్పందంలో జీసీసీ (జనరల్ కండిషన్స్ ఆఫ్ కాంట్రాక్ట్) 89–3 క్లాజ్ ప్రకారం ఒప్పందాన్ని ముందుగానే రద్దు (ప్రీ–క్లోజ్) చేసుకోవాలని సూచిస్తూ నవయుగ, బీకెమ్‌లకు పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు జూలై 29న నోటీసులు జారీ చేశారు. ఒప్పందం రద్దు కోసం పరస్పర అంగీకారాన్ని తెలియచేస్తూ 15 రోజుల్లోగా తమను సంప్రదించాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పుడే ఆర్థికపరమైన లావాదేవీలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని పేర్కొంటూ నవయుగ సంస్థకు ఏపీ జెన్కో (ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ) నోటీసులు జారీ చేసింది. ఇదే అంశాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్ శక్తి శాఖలకు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఈ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేస్తామని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి. కమీషన్ల కోసమే ప్రాజెక్టు బాధ్యతలు.. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే వంద శాతం ఖర్చు భరించి పోలవరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ కమీషన్ల దాహంతో మాజీ సీఎం చంద్రబాబు పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టడంతో పోలవరం బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియక ముందే నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయాన్ని రూ.1331.91 కోట్లు పెంచేస్తూ 2016 సెప్టెంబరు 8న ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి లబ్ధి చేకూర్చారు. ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డం పెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించేసి కమీషన్లు వసూలు చేసుకున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ట్రాన్స్ట్రాయ్ 2017 నాటికి దివాలా తీసింది. నిబంధనల ప్రకారం దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌తో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుని టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలి. ‘డబ్బుల్’ ధమాకా.. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను నవయుగకే కట్టబెట్టాలని ముందుగానే నిర్ణయించిన చంద్రబాబు 2017 జనవరి 7న ఏపీ జెన్కోతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. నిబంధనల సాకుతో 4.83 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.3,220.22 కోట్లకు కోట్ చేసిన నవయుగ సంస్థకు ఆ పనులు కట్టబెడుతూ 2017 డిసెంబర్ 30న ఏపీ జెన్కో ఒప్పందం చేసుకుంది. నిజానికి పోలవరం హెడ్‌వర్క్స్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పునాది పనులు అంతర్భాగమే. హెడ్‌వర్క్స్ ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ దివాలా తీసిన నేపథ్యంలో ఆ పనులనూ నవయుగకే అప్పగించి అటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం, ఇటు హెడ్‌వర్క్స్‌లో కమీషన్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే 60సీ నిబంధన కింద రూ.2,914.66 కోట్ల విలువైన పనులను ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా నవయుగకు నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ మూడు ఒప్పందాలను చేసుకున్నారు. ఇదే రీతిలో గేట్ల పనులను 60సీ నిబంధన కింద విడదీసి రూ.387.56 కోట్ల పనులను బీకెమ్ సంస్థకు నామినేషన్ విధానంలో అప్పగిస్తూ 2018 నవంబర్ 8న మరో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు వెల్లడైంది. తేలిన అక్రమాలు.. టీడీపీ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. పోలవరం పనులపై విచారించిన నిపుణుల కమిటీ ఆర్థికంగా దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌తో నాటి ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈపీసీ ఒప్పందం గడువు ముగియకుండానే అంచనా వ్యయాన్ని పెంచేయడం, నవయుగ, బీకెమ్ సంస్థలకు ఎల్ఎస్ ఓపెన్ పద్ధతిలో నామినేషన్ విధానంలో పనులు అప్పగించడం, జీవో 22, జీవో 63 కింద అదనపు చెల్లింపులు చేయడం, స్పెషల్ ఇంప్రెస్ట్ అమౌంట్ కింద విడుదల చేసిన రూ.170 కోట్లకు లెక్కలు చూపకపోవడం, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో తట్టెడు కూడా మట్టెత్తకుండానే రూ.787.20 కోట్లను దోచిపెట్టడాన్ని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో రూ.2,346.85 కోట్ల మేర అవినీతి జరిగినట్లు నిర్ధారిస్తూ నిపుణుల కమిటీ గత నెల 24న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా కుదుర్చుకున్న కాంట్రాక్టు ఒప్పందాలను రద్దుచేసి హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించడం వల్ల పనుల్లో సమన్వయం కుదురుతుందని, రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యపడుతుందని పేర్కొంది. కమిటీ సిఫార్సుల మేరకు నోటీసులు.. ట్రాన్స్‌ట్రాయ్‌తో 2013 మార్చి 2న జరిగిన ఈపీసీ ఒప్పందాన్ని నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా నవయుగ, బీకెమ్ సంస్థలతో రూ.3,302.22 కోట్ల విలువైన పనులను ఎల్ఎస్–ఓపెన్ పద్ధతిలో నామినేషన్‌పై అప్పగిస్తూ ఒప్పందాలు చేసుకోవడం, డీజిల్ కొనుగోలుకు రూ.50 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయడం, స్టీలు, సిమెంట్‌ను గత ప్రభుత్వమే కాంట్రాక్టర్‌కు సరఫరా చేయడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో నవయుగతో చేసుకున్న మూడు ఒప్పందాలు, బీకెమ్ సంస్థతో చేసుకున్న మరో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సూచిస్తూ ఆ రెండు సంస్థలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసినప్పటి నుంచే అంటే జూలై 29 నుంచి 15 రోజుల్లోగా అంటే ఆగస్టు 12లోగా ఆ ఒప్పందాలను పరస్పర అంగీకారంతో ముందస్తుగా రద్దు చేసుకోవడానికి అంగీకరిస్తూ పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌ను సంప్రదించాలని ఆ రెండు సంస్థలకు సూచించింది. ఈ పనులకు పారదర్శక విధానంలో కొత్తగా టెండర్లు నిర్వహిస్తామని నోటీసుల్లో పేర్కొంది. కాంట్రాక్టు ఒప్పందం చేసుకుని ఇంకా ప్రారంభించని పనులను రద్దు చేస్తూ మే 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పనులు ప్రారంభించని జలవిద్యుదుత్పత్తి కేంద్రం కాంట్రాక్టు ఒప్పందం కూడా రద్దు అయినట్లే లెక్క. అయినప్పటికీ నిబంధనల ప్రకారం ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటూ నవయుగకు ఏపీ జెన్కో నోటీసులు జారీ చేసింది. రివర్స్ టెండరింగ్‌కు కసరత్తు.. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పోలవరం హెడ్ వర్క్స్‌లో మిగిలిన పనులతోపాటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీపీఏ గెజిట్ నోటిఫికేషన్ సెక్షన్ 9–1 ప్రకారం కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయాలన్నా, కొత్తగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలన్నా కేంద్ర జల్ శక్తి, పీపీఏ నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో పోలవరం హెడ్ వర్క్స్‌లో మిగిలిన పనులకు రివర్స్ టెండరింగ్‌కు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పీపీఏ, కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌లకు సోమవారం లేఖ రాయనున్నారు. పోలవరం బాధ్యతలను గత ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో కేవలం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయంతో తమకు సంబంధం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్ నిర్వహించాక పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థతో హెడ్ వర్క్స్ పనులకు జలవనరుల శాఖ, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఏపీ జెన్కో ఒప్పందం చేసుకోనున్నాయి. ఆయా పనులు చేసిన మేరకు జలవనరుల శాఖ, ఏపీ జెన్కోలు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించనున్నాయి. రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని జలవనరుల శాఖ, ఏపీ జెన్కో వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఒకే సంస్థకు అన్ని పనులా!
సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో 60–సీ నిబంధన కింద 268 పనుల నుంచి పాత కాంట్రాక్టర్లను తొలగించటం.. వాటి అంచనా వ్యయం పెంచాక రూ.1,600 కోట్ల విలువైన పనులను సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. ఒకే సంస్థకు అన్ని పనులు ఎలా అప్పగించారని హంద్రీ–నీవా, గాలేరు–నగరి అధికారులను ప్రశ్నించింది. గురువారం హంద్రీ–నీవా పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి.. శుక్రవారం, శనివారం విజయవాడలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. గత సర్కార్ హయాంలో చేపట్టిన ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని పోలవరం అతిథి గృహంలో సమావేశమైంది. పోలవరం కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాల పనులను పర్యవేక్షించే ఎస్ఈలు, ఈఈలు, హంద్రీ–నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాల సీఈలు, ఎస్ఈలు, ఈఈలు ఈ సమావేశానికి హాజరయ్యారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అధిక శాతం పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి 60–సీ నిబంధన కింద తప్పించి.. వాటి అంచనా వ్యయాన్ని పెంచేసి ముగ్గురు కాంట్రాక్టర్లకే అప్పగించడాన్ని నిపుణుల కమిటీ గుర్తించింది. హంద్రీ–నీవాలో పెంచిన అంచనా వ్యయంతో చేపట్టిన పనులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించింది. పోలవరం ఎడమ కాలువ పనుల్లో ఎనిమిది ప్యాకేజీల కాంట్రాక్టర్లను 60–సీ నిబంధన కింద తొలగించి.. కొత్త కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించడాన్ని గుర్తించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగించారని నిలదీసింది. పోలవరం కుడి కాలువ పనుల్లోనూ ఇదే రీతిలో వ్యవహరించడాన్ని తప్పుబట్టింది. శుక్రవారం, శనివారం విజయవాడలో నిర్వహించే సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరుకావాలని ప్రాజెక్టుల అధికారులను కమిటీ ఆదేశించింది. -
ఆర్టీసీకి జవసత్వాలు: మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారవాణాకు గుండెకాయలా ఉన్న టీఎస్ఆర్టీసీకి జవసత్వాలు కల్పించేందుకే నిపుణుల కమిటీని వేసినట్లు రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఇక్కడి బస్‌భవన్‌లో మంత్రి అధ్యక్షతన నిపుణుల కమిటీ సమావేశం జరిగింది. సమాశంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ, నిపుణుల కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ సంస్థలోని లోపాల అధ్యయనానికి, సమూల మార్పులకు, లాభాలబాట పట్టించేందుకు కమిటీ పలు సూచనలు చేస్తుందని పేర్కొన్నారు. నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన ఆర్టీసీని బలోపేతం చేయడం, కాలానుగుణం గా మార్పులు చేయడం, ఖర్చులు తగ్గించుకోవడం తదితర విషయాల్లో చేపట్టాల్సిన సంస్కరణల గురించి కమిటీ సిఫారసు చేస్తుందని చెప్పారు. త్వరలోనే కమిటీ సభ్యులు సీఎంను కలవనున్నట్లు తెలిపారు. చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ సంస్థను రుణభారం నుంచి గట్టెక్కించేందుకే కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారన్నారు. సునీల్‌శర్మ మాట్లాడుతూ త్వరలోనే గ్రేటర్లో సింగిల్ టికెట్ విధానంతో మెట్రో– ఆర్టీసీని అనుసంధానించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఆదాయ మార్గాలు పెంచుకునేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నామన్నారు. సంస్థ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీ కార్మికుల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని టీఎంయూ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు. కమిటీ సభ్యులు ఏమన్నారంటే..? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు సురక్షితమైన రవాణాను కోరుకుంటున్నారని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆధునిక, ఆకర్షణీయమైన బస్సులను నడపాలన్నారు. ఉరుకులు, పరుగుల జీవితంలో డిమాం డ్కు సరిపడా బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సురక్షిత ప్రయాణమంటే ఆర్టీసీ అనే అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికీ ఉన్నందున దాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రజలు అధిక చార్జీలు వెచ్చించి ఆటోలు, క్యాబ్‌ల్లో రక్షణ లేని ప్రయాణం చేస్తున్నారని వాపోయారు. ప్రైవేటు రంగ పోటీని తట్టుకునేందుకు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. -
సర్వేలు బూటకం.. కమిటీలు ఓ నాటకం
మంగళగిరి టౌన్: అభిప్రాయ సేకరణకు వచ్చిన నిపుణుల కమిటీపై రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. మీ సర్వేలన్నీ బూటకమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులతో వేసిన నిఫుణుల కమిటీ.. తమకేమి ప్రయోజనం చేకూరుస్తుందని నిలదీశారు. తక్షణమే గ్రామం నుంచి వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు. దీంతో నిడమర్రు గ్రామంలో అభిప్రాయసేకరణకు వచ్చిన నిపుణుల కమిటీ వెనుతిరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నిడమర్రు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు నిఫుణుల కమిటీ గురువారం గ్రామానికి వచ్చింది. ముందస్తు సమాచారం లేకుండా గ్రామంలోకి రావడంతో పాటు కమిటీ నివేదిక సమర్పించేందుకు సమయం పది రోజులే ఉందని తెలియడంతో రైతులు నిపుణుల కమిటీపై మండిపడ్డారు. 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా సర్వేలు చేయడమే కాకుండా.. ప్రభుత్వ ఉద్యోగులతో నిపుణుల కమిటీని నియమించి రైతులకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. ఎక్స్పర్ట్ కమిటీ అర్థమేమిటో చెప్పాలని, అందులో ఎవరుంటారో వివరించాలని డిమాండ్ చేశారు. నిపుణులైన రైతులు లేకుండా కేవలం ఉద్యోగులతోనే కమిటీ ఎలా వేస్తారని ప్రశ్నించారు. రైతుల ప్రశ్నలతో కమిటీ సభ్యులు మిన్నకుండిపోయారు. గతంలో గ్రామంలో నిర్వహించిన ఎస్ఐఏ సర్వేనే ఒక తప్పుల తడకగా ఉందని, దాని ఆధారంగా అభిప్రాయాలు ఎలా సేకరిస్తారని రైతులు ప్రశ్నించడంతో.. కమిటీ సభ్యులు చివరకు అక్కడ్నుంచి వెనుతిరిగారు. వైఎస్సార్సీపీ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాజధానిలో బూటకపు సర్వేలు నిర్వహించిన టీడీపీ ప్రభుత్వం.. వాటిని అమలుపర్చేందుకు నాటక కమిటీలను రంగంలోకి దించిందని ఎద్దేవా చేశారు. ఇలాంటి కమిటీల వల్ల అన్నదాతలకు ఎలాంటి న్యాయం జరగదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే మళ్లీ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే రైతుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలన్నారు. అలాగే నిఫుణుల కమిటీలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా, నాన్ అఫీషియల్స్‌ను కూడా నియమించాలని డిమాండ్ చేశారు. భూములిచ్చిన రైతులకే న్యాయం చేయలేదు.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకే ప్రభుత్వం ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడేమో మా భూములు కాజేసేందుకు తప్పుడు సర్వేలు, తప్పుడు రిపోర్టులు ఇస్తుండటం దారుణం. – వల్లభాపురపు శ్రీనివాసరావు, రైతు తీసుకున్న భూముల్లో ఏం వెలగబెట్టారు? రైతులను బెదిరించి తీసుకున్న భూముల్లో ఇప్పటివరకు ఏం వెలగబెట్టారు? జరీ భూముల్లో ఏం నిర్మిస్తారో ప్రభుత్వం ముందే చెప్పాలి. చట్టాలను తుంగలో తొక్కి ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ రైతులను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. – ఎం.శివరామ్, రైతు -
సాగు సంక్షోభం, నిరుద్యోగం కీలకం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై సమగ్ర విశ్లేషణతో కూడిన 2 నివేదికలు ప్రధాని మోదీకి చేరాయి. వీటిలో ఒకటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నివేదిక కాగా.. మరోటి ప్రత్యేక నిపుణుల కమిటీ నివేదిక. పార్టీ వర్గాల సమాచారం మేరకు... వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం గుజరాత్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయని బీజేపీ నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపకుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య విభజన ఓటింగ్ సరళిపై ప్రభావం చూపినట్లు ప్రత్యేక కమిటీ పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖి పోరు జరిగే రాష్ట్రాలకు సంబంధించి ఈ బృందం కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నిరాశజనక ప్రదర్శన... మోదీపై వ్యతిరేక ఓటు లేక ప్రధాని నాయకత్వంపై రెఫరెండానికి సంకేతం కాదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. -
నష్టం.. కష్టం కర్ణాటకకే !
బెంగళూరు : కావేరి నదీ పరివాహక రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలపైకి కర్ణాటకలోనే కొంత ఎక్కువ నష్టం జరిగిందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఈమేరకు 39 పేజీల కూడిన నివేదకను దేశ అత్యున్నత న్యాయస్థానానికి సదరు కమిటీ సోమవారం అందజేసింది. అయితే ఎక్కడా కూడా కర్ణాటక తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలా వద్దా ? అన్న విషయంపై స్పష్టత ఇవ్వక పోవడం గమనార్హం. కావేరి నదీ జలాల విడుదలకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా సుప్రీం సూచన మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ ఝూ నేతృ్వంలోని నిపుణుల కమిటీ ఈనెల 8,9 తేదీల్లో కర్ణాటకలో తరువాత రెండు రోజులు తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో వారి దృష్టకి వచ్చిన వివరాలను నివేదిక రూపంలో సుప్రీం కోర్టుకు అందజేశారు. కర్ణాటకలో కావేరి నదీ పరివాహక ప్రాంతంలో 48 తాలూకాలు ఉండగా ఈ ఏడాది ఇందులో 42 తాలుకాలు కరువు ప్రాంతాలుగా గుర్తించబడ్డాయని నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇక ఇరు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుత పంటలకు (స్టాండింగ్క్రాఫ్ట్స్)కు నీటిని పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నారని తెలిపింది. ముఖ్యంగా చెరకు పంటకు సరైన నీటి సదుపాయం కల్పించకపోవడంతో మండ్యలో ఎక్కువ మంది రైతులు బలవన్మరణానికి పాల్పడినట్లు నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. నీటి లభ్యత తక్కువ కావడం వల్ల రైతులే కాకుండా రైతు కూలీలు, జలాశయాల్లో నీరు లేకపోవడం వల్ల చేపల పట్టి పొట్టపోసుకునే వారికి పనిదొరకడం లేదని తేలింది. దీని వల్ల వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. అదే సమయంలో ప్రస్తుతం కర్ణాటకలోని కావేరి నదీ పరివాహక ప్రాంతంలో చెప్పుకోదగ్గ వర్షం పడే సూచనలు లేవని అయితే తమిళనాడులో జనవరి వరకూ వర్షం పడే అవకాశం ఉందని నిపుణుల కమిటీ పేర్కొంది. అంతర్జల మట్టం విషయంలో తమిళనాడు మెరుగ్గా ఉందని పేర్కొంది. కర్ణాటకలో దాదాపు వెయ్యి అడుగుల నీరు వేసినా బోరులో నీటి పరిస్థితి లేదని కమిటీ పేరొంది. అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటకలో తాగు, సాగు నీటి వాడకం విషయంలో అశాస్త్రీయ పద్దతులను పాటించడం వల్ల కావేరి నదీ జలాల వౄ ఎక్కువగా ఉందని కమిటీ అభిప్రాయపడింది. అందువల్ల ప్రజలను జాగృం చేసి బిందు, తుంపర సేద్యాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొంది. మొత్తంగా తమిళనాడుతో పోలిస్తే కర్ణాటకలోనే కావేరి కష్టం ఎక్కువగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ విషయమై రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎం.బీ పాటిల్ ఢిల్లీలో సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘ నిపుణుల కమిటీ దాదాపు ఇరు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిపై 16 పాయింట్లతో కూడిన నివేదిక అందజేసింది. నిపుణుల కమిటీ పేర్కొన్న కొన్ని అంశాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు కావేరి నదీ నీటి వినియోగంలో శాస్త్రీయత పాటించాలని పేర్కొంది. వారి సూచనలపై ప్రజలకు తప్పక అవగాహన కల్పిస్తాం.’ అని పేర్కొన్నారు. నేటి నుంచి విచారణ... కావేరి ట్రిబ్యునల్ 2007లో ఇచ్చిన తుది తీర్పుపై కర్ణాటక ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌పై నేటి (మంగళవారం) నుంచి సుప్రీం కోర్టులో దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య పీఠం విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదికలోని అంశాలను తన వాదన సందర్భంలో ఎంత సమర్థంగా వినియోగించుకుంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఇక కశ్మీర్లో కారం బాంబులు!
నిపుణుల కమిటీ నివేదిక న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో పెల్లెట్ గన్లకు ప్రత్యామ్నాయంగా కారం నింపిన గ్రెనేడ్లు (కారం బాంబులు), స్టన్ లాక్ షెల్స్ వాడాలని దీనిపై ఏర్పాటైన నిపుణుల కమిటీ సూచించింది. అరుదైన సందర్భాల్లో పెల్లెట్ గన్లను వాడాలంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి టీవీఎస్ఎన్ ప్రసాద్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల కమిటీ తన నివేదికను మంగళవారం హోంశాఖ కార్యదర్శికి సమర్పించిందని అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించలేదు. అభిజ్ఞవర్గాల సమాచారం ప్రకారం.. నోనివామైడ్ అని పిలిచే పెలార్గానిక్ యాసిడ్ వానిలైల్ అమైడ్ (పావా)తో పాటు.. స్టన్ లాక్ షెల్స్, లాంగ్ రేంజ్ అకోస్టిక్ డివైజ్ (లార్డ్) వంటి ప్రాణాంతకం కాని మందుగుండును పెల్లెట్ గన్లకు ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చునని కమిటీ సూచించింది. కశ్మీర్లో కర్ఫ్యూ ఎత్తివేత శ్రీనగర్: కశ్మీర్లో 51 రోజుల క ర్ఫ్యూకు తెరపడింది. 3 పోలీస్ స్టేషన్ల పరిధిని మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో సోమవారం నుంచి కర్ఫ్యూను ఎత్తివేశారు. శ్రీనగర్‌లో పలుచోట్ల, బుద్గామ్ జిల్లాలోనూ సోమవారం పలు గొడవలు జరిగినా ఎవరూ గాయపడలేదు. పుల్వామా, శ్రీనగర్‌లోని ఎంఆర్ గంజ్, నౌహాట్టా పోలీసు స్టేషన్ల పరిధిలోనే కర్ఫ్యూ కొనసాగించారు. 4న కశ్మీర్‌కు అఖిలపక్షం హోం మంత్రి రాజ్‌నాథ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం సెప్టెంబర్ 4న కశ్మీర్ పర్యటించనుంది. అఖిలపక్షం ప్రజలు, సంస్థల్ని కలసి పరిస్థితిపై వివరాలు సేకరిస్తుంది. వేర్పాటువాద నేతల్ని కలిసేందుకు అఖిలపక్ష నేతలకు స్వేచ్ఛ ఉండడంతో వారితో చర్చించే అవకాశముంది. రాజ్‌నాథ్ ఆ చర్చల్లో పాల్గొనరు. అఖిలపక్ష బృందం పర్యటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ... బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌లతో ఆదివారం గంట పాటు చర్చించింది. -
ఔషధాల ప్యాకింగ్ కు పెట్ బాటిల్స్ సేఫ్..
తేల్చిచెప్పిన ఎక్స్పర్ట్ కమిటీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్ ప్యాకింగ్‌కు పెట్ బాటిల్స్ భద్రమేనని ఎక్స్పర్ట్ కమిటీ స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నియమించిన కమిటీ ఈ మేరకు తన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు సమర్పించింది. పాలీథిలీన్ టెరిథలేట్ (పెట్) బాటిళ్ల నుంచి రసాయనాలు వెలువడినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని నివేదికలో స్పష్టం చేసింది. పెట్ తయారీ విధానంలో థలేట్స్ లేదా ప్లాస్టిసైజర్లు వాడే అవసరం లేదని తెలిపింది. నేషనల్ టెస్ట్ హౌజ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలాజికల్ రిసర్చ్ పరీక్షల తీరు కఠినంగా లేదని ఆక్షేపించింది. భారత్‌లో మరింత ఉన్నత ప్రమాణాలు తీసుకు రావాలని సూచించింది. కమిటీ రిపోర్ట్ రూ.4,000 కోట్ల విలువైన భారత పెట్ ప్యాకేజింగ్ పరిశ్రమకు పెద్ద ఊరటనిచ్చింది. ఏటా 6 లక్షల టన్నుల పెట్ ఉత్పత్తిలో ఔషధ రంగం 16 శాతం వినియోగిస్తోంది. డ్రగ్ ఫార్ములేషన్ల ప్రాథమిక ప్యాకేజింగ్ ప్రభావం మానవుల ఆరోగ్యంపై, పర్యావరణంపై ఏ విధంగా ఉంటుందో అంచనా వేసేందుకు కమిటీ ఏర్పాటైంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను స్వచ్ఛంద సంస్థ అయిన హిమ జాగృతి ఉత్తరాంచల్ వెల్ఫేర్ సొసైటీ ఆశ్రయించిన నేపథ్యంలో కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు చెందిన బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి భాన్ చైర్మన్‌గా పలువురి నిపుణులతో కమిటీ ఏర్పాటయ్యింది. -
బ్యాంకుల విలీనంపై కమిటీ
బిజినెస్ గుర్గావ్: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన అంశంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఎక్కువ బ్యాంకులకన్నా పటిష్టమైన బ్యాంకులు అవసరమని శనివారమిక్కడ రెండో విడత జ్ఞాన సంగం ముగింపు కార్యక్రమంలో అన్నారు. రూ. 8 లక్షల కోట్ల పైగా పేరుకుపోయిన మొండి బకాయిల సమస్య పరిష్కారం కోసం డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, సంబంధిత చట్టాలను పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులకు ఎసాప్స్(ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్) కూడా ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. బ్యాంకుల కన్సాలిడేషన్ అంశాన్ని కూడా జ్ఞాన సంగంలో చర్చించామని, బ్యాంకర్లే నిపుణుల కమిటీ ఏర్పాటును సూచించారని చెప్పారు. బ్యాంకు ఉద్యోగులకు ప్రోత్సాహకాల కింద షేర్ల కేటాయింపు అంశం కూడా చర్చకు వచ్చిందని, ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తోందని జైట్లీ తెలిపారు. ఇక మొండిబకాయిల కట్టడి దిశగా విద్యుత్, హైవేలు, చక్కెర, ఉక్కు తదితర రంగాల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. బ్యాంకులు సైతం మొండి బకాయిలను రాబట్టడానికి చర్యలు తీసుకుంటున్నాయన్నారు. -
‘గాలేరు-నగరి’పై అధ్యయనం
కాలువ మార్గం మార్పు సాధ్యాసాధ్యాలపై సర్వే ఎక్స్పర్ట్ కమిటీని నియమించిన సర్కార్ రెండు నెలల్లో ప్రభుత్వానికి తుది నివేదిక గాలేరు-నగరి ప్రధాన కాలువ మార్గాన్ని మార్చేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఎక్స్పర్ట కమిటీని నియమించింది. వీరు రెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. తిరుపతి తుడా: గాలేరు-నగరి ప్రధాన కాలు వ మార్గాన్ని మార్చే విషయమై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు డీఎస్‌ఎన్‌రెడ్డి, ఎంకే.రెహమాన్‌తో కూడిన కమిటీని నియమించింది. రైతులు డిమాండ్ చేస్తున్న విధంగా ఎస్వీ జూపార్కు వెనుక నుంచి కల్యాణీ డ్యాం వరకు కాలువను తీసుకెళ్లి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కల్యాణీ డ్యామ్‌లో నీటిని నింపి, అక్కడి నుంచి స్వర్ణముఖి నది ద్వారా తిరిగి గాలేరు-నగరి ప్రధాన కాలువలో కలపడం సాధ్యమేనా అనే దానిపై కమిటీ సర్వే చేస్తోంది. రెండు నెలల్లో సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదికను ఇవ్వనుంది. దీని ఆధారంగా భూసేకరణకు రంగం సిద్ధం చేయనున్నారు. పరిశీలనలో రైతుల ప్రతిపాదనలు.. తిరుపతి రూరల్ మండలంలో ఖరీదైన భూములు ఉన్నాయని, ఎక్కువ మంది సన్నకారు రైతులు ఉన్నారని, గాలేరు-నగిరి ప్రధాన కాలువ అలైన్మెంట్ మార్పు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీఎన్ఎస్ఎస్ కార్యాలయం ఎదుట రెండు పర్యాయాలు ధర్నా చేపట్టారు. రెండు ప్రత్యామ్నాయ అలైన్మెంట్లను ప్రతిపాదించారు. ఇందులో ఒక ప్రతిపాదనను (అలిపిరి ప్రాంతం నుంచి ఎస్వీ జూపార్కు మీదుగా శ్రీనివాసమంగాపురం వెనుక స్వర్ణముఖి నదిలో క లపడం). దీనిపై ఇరిగేషన్ ఎస్ఈ రాధా ప్రభాకర్ బృందం సర్వే చేసి అసాధ్యమని తేల్చింది. ఎస్వీ జూపార్కు వెనుక నుంచి కల్యాణీ డ్యాం వరకు తీసుకె ళ్లి అక్కడి నుంచి డ్యామ్‌కు పంపింగ్ చేసే మరో ప్రతిపాదనను రైతులు సీఈ సుధాకర్ ముందు ఉంచారు. ఈ ప్రతిపాదనను సీఈ ప్రభుత్వానికి అందజేశారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. భూ సేకరణకు బ్రేక్.. తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ భూసేకరణకు ప్రభుత్వం రెండు నెలల క్రితం నోటిఫికేషన్ ఇచ్చింది. మూడు నెలల్లో భూసేకరణ చేయాల్సి ఉండగా అలైన్మెంట్ మార్పు సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ వేయడంతో భూసేకరణకు బ్రేక్ పడింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భూసేకరణ ఉంటుంది. అంతవరకు భూసేకరణ ఉండబోదని ఎస్ఈ రాధా ప్రభాకర్ చె ప్పారు. అలైన్మెంట్ మార్పు సాధ్యమైతే భూసేకరణతో పని ఉండదన్నారు. -
పోలవరంపై ప్రజా ఉద్యమం
భారీ ఎత్తున పోరాటం చేపడతామన్న టీ కాంగ్రెస్ ముంపు మండలాలను తెలంగాణలో చేర్చాలని డిమాండ్ {పాజెక్టు డిజైన్ మార్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం పోలవరంపై సుప్రీంను ఆశ్రయించే యోచన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జితో టీ నేతల భేటీ న్యూఢిల్లీ: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ఉద్యమానికి సిద్ధమైంది. దీనివల్ల గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటాలు చేయాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టును ప్రస్తుత డిజైన్‌లో నిర్మిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని, నిపుణుల కమిటీ ఇదే విషయాన్ని పేర్కొంటూ నివేదిక ఇచ్చిన అంశాన్ని కేంద్రం దృష్టికి తేనుంది. పోలవరం అంశంపై నవంబర్ 22న భద్రాచలంలో బహిరంగ సభ నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. దీంతోపాటు తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఢిల్లీలో భేటీ.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీనివాస్, రేణుకా చౌదరి, పొంగులేటి సుధాక ర్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడాన్ని స్థానికులంతా వ్యతిరేకిస్తున్నారని.. అక్కడి గిరిజనులంతా తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటున్నారని నేతలు దిగ్విజయ్ దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును ప్రస్తుత డిజైన్‌లో నిర్మిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని, నిపుణుల కమిటీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఆయనకు వివరించారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.. ఏడు మండలాలను ఏపీలో కలపడంపై వస్తున్న ఇబ్బందులు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని చట్టపరంగా, రాజ్యాంగపరంగా పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమం చేపట్టాలని నిర్ణయించామని సమావేశం అనంతరం పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. హుదూద్ తుపాను అంశం కూడా చర్చకు వచ్చిందని, బాధితులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించిందని ఆయన తెలిపారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు వివరించారు. కాగా.. కేంద్రం గిరిజనుల హక్కులను కాలరాస్తూ ఏడు మండ లాలను ఏపీలో కలిపిందని.. కానీ అక్కడి స్థానికులంతా తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని, సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నామని తెలిపారు. గిరిజనులకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పోరాడుతుందని ఎంపీ రేణుకా చౌదరి పేర్కొన్నారు. తెగని ఖమ్మం పంచాయితీ.. నేతల అంతర్గత పోరుతో ఖమ్మం కాంగ్రెస్‌లో ఏర్పడిన వివాదాల పరిష్కారంపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టింది. ఖమ్మం డీసీసీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి జిల్లా నాయకులకు, పార్టీ ఎంపీ రేణుకా చౌదరికి మధ్య తలెత్తిన వివాదంపై ఆ జిల్లా నేతలు, రాష్ట్ర నాయకులతో మరో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరితో తమకు వస్తున్న ఇబ్బందులపై పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలు వాదనకు దిగాయి. జిల్లాలో తన వర్గానికి చెందిన ఏడుగురికి ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని దిగ్విజయ్‌ను రేణుకా చౌదరి కోరగా... అందుకు ఆయన అంగీకరించలేదని సమాచారం. ఇక డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలోనూ అందరూ మాట్లాడుకుని ఒక పేరును సూచించాలని దిగ్విజయ్ వారికి చెప్పినా.. ఎవరికి వారు వేర్వేరుగా పేర్లను ప్రతిపాదించారు. రెడ్డి వర్గం అయితే రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి, కమ్మ సామాజిక వర్గం నుంచి అయితే రాధాకిషోర్‌కు ఇవ్వాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రతిపాదించగా... రేణుకా చౌదరి, భట్టివిక్రమార్క మాత్రం పువ్వాడ అజయ్ పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. కాగా.. పార్టీలో చిన్నచిన్న విభేదాలు సహజమేనని ఈ భేటీ అనంతరం పొన్నాల వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: పొన్నాల తెల్ల కాగితాలపై పింఛన్లు, రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోవాలనడం చూస్తుంటే కేసీఆర్‌ది తుగ్లక్ పాలనలా ఉందని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆధార్ కింద సేకరించిన సమాచారాన్ని వినియోగించుకోలేదు.. ప్రజలను ఇబ్బందులు పెట్టి సర్వే చేశారు. ఇప్పుడు రేషన్‌కార్డులకు, పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలనడం తుగ్లక్ పాలనే అవుతుంది..’’అని మండిపడ్డారు. ఇప్పటికే క్యూలో నిలబడి ఒక వృద్ధుడు మరణించాడన్నారు. ‘‘గతంలో ఎవరో హిట్లర్‌లా ఉన్నాడంటే.. తాను హిట్లర్ తాతను అన్నాడు. ఇప్పుడు తాను తుగ్లక్ తాతను అంటాడేమో..!’’ అని పొన్నాల ఎద్దేవా చేశారు. -
షుగర్ ఫ్యాక్టరీల అధ్యయానికి నిపుణుల కమిటీ
హైదరాబాద్: రాష్ట్రంలో షుగర్ ఫ్యాక్టరీల అధ్యయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిపుణుల కమిటీలో సభ్యులుగా సర్వారాయ షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ చౌదరి, మధుకాన్ షుగర్స్ సలహాదారు భరద్వాజ, ఏపీ సీడ్స్ డైరెక్టర్ ఎన్వీ నాయుడు, ఆడిటర్ శ్రీనివాస్‌మోహన్ నియమితులయ్యారు. రాష్త్రంలోని షుగర్ ఫ్యాక్టరీలో నెలకొన్న పరిస్థితులపై నిపుణుల కమిటీ అధ్యయనం చేసి ఓ నివేదికను అందచేయనుంది. నిపుణుల కమిటీ అందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుంది. -
డెల్టా ఆధునీకరణపై నిపుణుల కమిటీ!
* 14న గుంటూరులో ఉన్నతస్థాయి సమీక్ష * 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు రాక * రద్దుకానున్న పనులు.. మరికొన్నింటికి టెండర్లు సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించే యోచనలో ఉంది. ఆరేళ్ల నుంచి పనులు ఆలస్యంగా జరగడానికి గల కారణాలను తెలుసుకుని ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ చేపట్టిన జలయజ్ఞంపై చర్యలు తీసుకుంటే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో డెల్టాల వారీగా సమీక్షలకు కొత్త ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా, ఈనెల 14న గుంటూరులోని జిల్లాపరిషత్ సమావేశ హాలులో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. భారీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరగే ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు హాజరుకానున్నారు. ఆరేళ్ల కిందట నిర్మాణ సంస్థలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం పనులు జరిగి ఉంటే 20 టీఎంసీల నీరు మిగులు ఉండేది. కొన్ని పనులు ఆలస్యం కావడానికి ప్రభుత్వం, మరికొన్నింటికి నిర్మాణ సంస్థలు కారణంగా తెలుస్తోంది. ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు వేయకపోవడంతో పేరు ప్రఖ్యాతులు, సమర్థత కలిగిన నిర్మాణ సంస్థలు కూడా కొన్ని పనులను ప్రారంభించలేదు. ఏడాది పొడవునా నీరు ప్రవహించే కాలువలకు మరమ్మతులు చేయాలని, నల్లరేగడి కలిగిన కాలువలకు సిమెంట్ లైనింగ్ చేయాలని కొందరు ఇంజనీర్లు హడావుడిగా అంచనాలు తయారు చేశారు. ఈ కాలువలకు సిమెంట్ లైనింగ్ చేస్తే బీటలు వారే అవకాశాలు ఎక్కువ. ఈ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా అంచనాలు తయారుచేయాలి. అప్పట్లో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో కొందరు ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు తయారు చేయలేకపోయారు. దీంతో నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించలేదు. భూసేకరణ, డిజైన్ల అనుమతిలో జాప్యం వల్ల కూడా నిర్మాణ సంస్థలు పనులు చేయలేకపోయాయి. దీనికి తాము బాధ్యులం కాబోమని ఆ సంస్థలు చెబుతున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని పనులు ప్రారంభించలేదు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నా ఆ సంస్థల అధిపతులు ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందినవారు కావడంతో అధికారులు మిన్నకుండి పోయారు. ఈ కారణాలతో కృష్ణాడెల్టాలోని 13.35 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం రూ. 4,573 కోట్లను ఆధునీకరణ పనులకు కేటాయిస్తే రూ. 1,178 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికే నిర్మాణ సంస్థల పనితీరు, పనులు జరగకపోవడానికి గల కారణాలపై ఒక అవగాహన వచ్చిన ఇరిగేషన్ ఇంజనీర్లు కొన్నింటిని రద్దు చేసేందుకు నివేదికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేకంటే పనుల పరిశీలన, నివేదిక ఇవ్వడానికి ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పదవీ విరమణ చేసిన చీఫ్ ఇంజనీర్లు, కృష్ణాడెల్టా చీఫ్ ఇంజనీర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు ప్రభుత్వానికి ఇచ్చే నివేదికను ఆధారంగా చేసుకుని అవసరంలేని పనులను రద్దు చేసే అవకాశం ఉంది. పనులు చేయని నిర్మాణ సంస్థల ఒప్పందాన్ని రద్దు చేసి, చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రద్దు కానున్న పనుల్లో రైతులకు అవసరమైనవి ఉంటే వాటికి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
కొత్త రాజధాని కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ
న్యూఢిల్లీ: సీమాంధ్ర నూతన రాజధాని ఎంపిక కోసం ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయనున్నట్టు జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. జీవోఎం భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనపై కేంద్రం తీసుకున్న చర్యలను ఇప్పటివరకు జీవోఎం సమీక్షించిందని వెల్లడించారు. జూన్ 2లోగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన కోసం 19 కమిటీల ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉద్యోగుల కేటాయింపుల కోసం రెండు కమిటీలు వేశామన్నారు. మార్చి 31 లోగా కమిటీలు నివేదిక అందజేస్తాయని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నిర్వహణకు వేర్వేరుగా సర్వోన్నత మండళ్లను రేపు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఏపీ రాజధాని కోసం ప్రణాళిక సంఘంలో ప్రత్యేక విభాగం ఏర్పాటయిందని జైరాం రమేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్... రాజధాని సెల్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. త్వరలో మరోసారి జీవోఎం భేటీ కానుంది.