సాక్షి,విజయవాడ: రెండు వారాల క్రితం ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఐఐటీ ప్రొఫెసర్ మాధవ్‌తో కూడిన నిపుణుల కమిటీ కొండ చరియలు విరిగి పడే ప్రాంతాన్ని పరిశీలించారు. ఒక వారం లోపు నేవిదిక సమర్పిస్తామని తెలిపారు. భక్తుల భద్రత మాకు ముఖ్యమని ఐఐటీ ప్రొఫెసర్ మాధవ్ వెల్లడించారు. (చదవండి: ‘సీఎం జగన్ స్పందన అభినందనీయం’)
ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. ‘12 ఏళ్ల నుంచి కొండ చరియలు గురించి సలహాలు ఇస్తున్నాం. ఘాట్ రోడ్డు విస్తరణ కు కొండను తవ్వారు. అపుడు కొండ ప్రాంతం దెబ్బతింది. ఫెన్సింగ్ ద్వారా కొంత మేరకు కట్టడి చేశారు. ఈ కొండ రాయి రాక్ ఫాల్ టైప్. ఫెన్సింగ్, కేబుల్, హైడ్రో సీలింగ్ చేస్తే ప్రమాద తీవ్రతను తగ్గించ వచ్చు. కొండ గట్టిదే కానీ కొండ మీద వర్షం వచ్చినపుడు నీరు ఆగితే ప్రమాదం. కొండ మీద నీరు నిల్వ లేకుండా బయటకి పంపేందుకు సలహాలిచ్చాం. కొండ చుట్టూ పూర్తిగా ఫెన్సింగ్ వేస్తే కొండ చరియలు పడినా ప్రమాదాలు నివారించ వచ్చు. హైడ్రో సీలింగ్(సీడ్స్ వేసి చిన్న సైజ్ చెట్లు పెంచితే) చేస్తే ప్రమాదాలు జరగవు’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment