
సాక్షి, ఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ వాదనల నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం దీనిపై విచారణకు ఆదేశిస్తూ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటిని నియమించింది. జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది. అలోక్ జోషి, సందీప్ ఒబెరాయ్ సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ.. ఏడు అంశాలపై దర్యాప్తు చేయనుంది. (చదవండి: తమిళనాడులో కేంద్రం కొత్త ఆట.. రసవత్తరంగా రాజ్‌భవన్ రాజకీయం..!)
చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్ ప్రత్యక్ష బాధితులని పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వురినియోగంపై పరిశీలన చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడాన్ని సహించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిఘాతో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని ధర్మాసనం పేర్కొంది. (చదవండి: ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్‌మెంట్ ఇవ్వని మోదీ, షా
Comments
Please login to add a commentAdd a comment