Pegasus
-
ట్యాపింగ్ దుమారం : మీకూ ఇలా అవుతోందా? చెక్ చేసుకోండి!
రాను రాను ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. 2024లో ఫోన్ హ్యాకింగ్ అనేది దాదాపు ప్రతి వినియోగదారుని ఆందోళన రేపుతోంది. డెలాయిట్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో 67శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ గాడ్జెట్స్ భద్రతపై ఆందోళన చెందుతున్నారని కనుగొన్నారు. 2023 ఏడాదితో ఇది పోలిస్తే 54 శాతం పెరిగింది. మొన్నపెగాసెస్ వివాదం ప్రకంపనలు రేపింది. ప్రస్తుతం తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ దుమారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది వినియోగదారుల వ్యక్తిగత వ్యవహారాల గోప్యత, భద్రతపై గుబులు రేపుతోంది. ఈ నేపథ్యలో ఫోన్ హ్యాక్ అయిందని గుర్తించాలి? ముఖ్యంగా అమ్మాయిలు,మహిళలు ఈ విషయంలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఫోన్ ఎవరైనా ట్యాపింగ్ చేస్తున్నారన్న విషయాన్ని ఎలా గుర్తించాలి? ⇒ కాల్స్ మాట్లాడుతున్న సమయంలో అసాధారణ శబ్దాలు, అస్పష్టంగా దూరంనుంచి శబ్దాలు రావడం కెమెరా, మైక్రోఫోన్లు యాదృచ్ఛికంగా ఆన్ కావడం. ఐఫోన్, శాంసంగ్ ఫోన్లలో అయితే స్క్రీన్ పైభాగంలో నారింజ లేదా ఆకుపచ్చ లైట్ వెలుగుతుంది. ⇒ ఉన్నట్టుండి ఫోన్ బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోవడం,బ్యాటరీ కండిషన్ సరిగ్గానే ఉన్నా, పెద్దగా యాప్స్ అవీ వాడపోయినా, తరచుగా ఛార్జ్ చేస్తున్నా కూడా వేగంగా అయి పోతుంటే మాత్రం అప్రమత్తం కావాలి. ⇒ ఫోన్ షట్ డౌన్ కావడానికి చాలా సమయం పడుతోందా? ముఖ్యంగా షట్ డౌన్ కావడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, ప్రత్యేకించి కాల్, టెక్స్ట్, ఇమెయిల్ లేదా వెబ్ బ్రౌజింగ్ తర్వాత ఇలా జరుగుతోంటే. థర్ట్ పార్టీకి మన డేటాను ట్రాన్స్మిట్అవుతోందా అని అనుమానించాలి. ⇒ మొబైల్ స్పైవేర్ ఫోన్‌ని నిరంతరం ట్రాక్ చేస్తూ, డేటాను ఎక్కువ వాడుకుంటుంది.ఫోన్ చార్జింగ్‌లో లేకపోయినా, ఎక్కువ మాట్లాడకపోయినా ఉన్నట్టుండి ఫోన్ వేగంగా వేడెక్కుతోందా? ఇది గమనించాల్సిన అంశమే. మామూలుగా ఉన్నపుడు కూడా ఫోన్ విపరీతంగా వేడెక్కడం కూడా ఒక సంకేతం. సాధారణంగా గేమింగ్ లేదా సినిమాలు చూసినప్పుడు సాధారణంగా ఫోన్లు వేడెక్కుతుంటాయి. హ్యాకర్లు మన ఫోన్ టార్గెట్ చేశారా అని చెక్ చేసుకోవాల్సిందే. ⇒ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ కాల్లు, నోటిఫికేషన్స్ స్వీకరిస్తూ, ఆకస్మికంగా రీబూట్ అవుతున్నా రిమోట్ యాక్సెస్ అయిందనడానికి సూచిక కావచ్చు. జాగ్రత్త పడాలి. ⇒ స్మార్ట్‌ఫోన్ అకస్మాత్తుగా స్లో కావడం. యాప్‌లను ఇన్స్టాల్ చేశారో ట్రాక్ చేసి, మీరు ఇన్స్టాల్ చేయని యాప్‌లు కూడా కనిపిస్తే..అది హ్యాకింగ్‌కు సంకేతం కావచ్చు. ⇒ ఫోన్ తరచుగా సడన్ రీబూట్లు, షట్‌డౌన్, లేదా రీస్టార్ట్ అవుతూ ఉండవచ్చు. స్క్రీన్ లైట్లో మార్పులు కనిపిస్తే ఏదైనా మాల్వేర్ ఎఫెక్ట్ అయి ఉండవచ్చు. జాగ్రత్తలు ఈ జాగ్రత్తలను పాటిస్తూ మొబైల్ భద్రతకోసం విశ్వసనీయ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోండి. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లకు స్పందించకుండా ఉండటం ఉత్తమం. ముఖ్యంగా ట్యాప్ అయిందో లేదో తెలుసుకోవాలంటే.. *#*#4636#*#* – ఈ కోడ్‌ని డయల్ చేయండి. మీ ఫోన్ ట్రాక్ అవుతోందా, లేదా ట్యాప్ అవుతోంది తెలియ చెప్పే కోడ్ (నెట్మోనిటర్) కోడ్. ఫోన్ ఆపరేటింగ్ సిస్టంను బట్టి ఈ కోడ్‌ను డయల్ చేయాల్సి ఉంటుంది. Android యూజర్లు *#*#197328640#*#* లేదా *#*#4636#*#* ని డయల్ చేయాలి. iPhone యూజర్లు అయితే: *3001#12345#* ని డయల్ చేయాలి. -
భారతీయ జర్నలిస్టుల ఫోన్లపై పెగాసస్ నిఘా!
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ నిఘా సాఫ్ట్‌వేర్‌తో కేంద్రప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారంటూ ‘యాపిల్’ నుంచి అప్రమత్తత సందేశాలు అక్టోబర్‌లో వచి్చన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయ జర్నలిస్టులు తమ ఫోన్లను ల్యాబ్ పరీక్షకు పంపించగా అవి పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్‌కు గురయ్యాయని తేలింది. తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయిందని లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురువారం ప్రకటించింది. దీంతో ఆనాడు చాలా మందికి పొరపాటున అలర్ట్‌లు వచ్చాయన్న యాపిల్ ఇచి్చన వివరణ తప్పు అని తేలింది.∙పెగాసస్ తమ నిఘా సాఫ్ట్‌వేర్‌ను కేవలం దేశాల ప్రభుత్వాలకే విక్రయిస్తోంది. భారత్‌కు చెందిన నిఘా విభాగం సైతం ఇదే సంస్థ నుంచి కొంత హార్డ్‌వేర్‌ను 2017లో కొనుగోలుచేసినట్లు వాణిజ్య గణాంకాల్లో వెల్లడైంది. ఈ స్పైవేర్ సాయంతో దేశంలోని ప్రముఖులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తలు, న్యాయమూర్తుల ఫోన్లను హ్యాక్ చేశారని 2021 జూలైæ నెలలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడటం తెల్సిందే. భారత్‌లోనూ ప్రముఖులు ఈ హ్యాకింగ్బారిన పడ్డారని ‘ది వైర్’ వార్తాసంస్థ సంచలన కథనం వెలువరిచింది. ‘ది వైర్’ వెబ్సైట్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్పీ) సౌత్ ఆసియా ఎడిటర్ ఆనంద్ మంగ్నాలే ఫోన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆమ్నెస్టీ వెల్లడించింది. వివాదాన్ని కప్పిపుచ్చే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వమే యాపిల్ సంస్థపై ఒత్తిడి తెచ్చి తప్పుడు అలర్ట్‌లు వచ్చాయని చెప్పించిందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. ‘ భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల ఐఫోన్ యూజర్లకు ఇలా పొరపాటున అలర్ట్‌లు వెళ్లాయి’’ అని యాపిల్ ఆనాడు ప్రకటించింది. రాహుల్ గాం«దీసహా పలువురు విపక్ష నేతలు, జడ్జీలు, సామాజిక కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్ ఉదంతం గతంలో పార్లమెంట్‌నూ కుదిపేసింది. ఇంత జరిగినా ‘‘తాము స్పైవేర్‌ను ఇజ్రాయెల్ సంస్థ నుంచి కొనలేదు. వినియోగించలేదు’’ అని మోదీ సర్కార్ చెప్పకపోవడం గమనార్హం. భారత రక్షణ నిఘా విభాగానికి చెందిన సిగ్నల్ ఇంటెలిజెంట్ డైరెక్టరేట్ గతంలో కాగ్సైట్ అనే సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. -
ఐఫోన్లలో పెగాసస్ స్పైవేర్: అప్డేట్ చేసుకోకపోతే అంతే!
iPhone Spyware Alert యాపిల్ ఐఫోన్లో లోపాలకు సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఐఫోన్లలో డిజిటల్ వాచ్డాగ్ గ్రూప్ సిటిజెన్ ల్యాబ్ కొత్త స్పైవేర్‌ను గుర్తించింది. ఈ లోపాన్ని ఉపయోగించుకునే ఇజ్రాయెల్ పెగాసస్‌కు చెందిన స్పైవేర్ ఐఫోన్, ఇతర డివైస్లలోకి చొరబడినట్టు గుర్తించామని సిటిజెన్ ల్యాబ్ తెలిపింది. అలాగే ప్రతి ఒక్కరూ వెంటనే తమ డివైస్‌లను అప్డేట్ చేయాలని కోరింది. సిటిజెన్ ల్యాబ్ నివేదించిన లోపాలను పరిశోధించిన యాపిల్ కొత్త అప్డేట్స్ను జారీ చేసింది.ఐఫోన్ సాఫ్ట్ వేర్ లో గుర్తించిన లోపాలను 'జీరో డే బగ్స్' గా సిటిజన్ ల్యాబ్ పేర్కొంది. (యాపిల్‌కు భారీ షాక్: టిమ్ కుక్కు నిద్ర కరువు) గత వారం వాషింగ్టన్కు చెందిన సివిల్ సొసైటీ గ్రూప్‌కు చెందిన ఉద్యోగి యాపిల్డివైస్ చెక్ చేస్తున్నప్పుడు, NSO పెగాససస్కు సంబంధించిన స్పైవేర్ ద్వారా తాజా బ్రీచ్ గుర్తించినట్లు సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది.iOS 16.6లో చొరబడుతున్న మూడు కొత్త వైరస్‌ను కనుగొన్నట్టు తెలిపింది. ఇవి యూజర్‌తో సంబంధం లేకుండానే బ్లాస్ట్‌పాస్(BLASTPASS)చేస్తుందని, ఎటాకర్ iMessage ఖాతా నుండి హానికరమైన చిత్రాలతో పాస్కిట్ఎ టాక్ ఉంటుందని తెలిపింది. అధునాతన దాడుల గురించి పౌర సమాజానికి మరోసారి ముందస్తు హెచ్చరిక వ్యవస్థగా పనిచేస్తోందని సిటిజెన్ ల్యాబ్ టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన మంక్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీలోన సిటిజెన్ ల్యాబ్ సీనియర్ పరిశోధకుడు జాన్ స్కాట్-రైల్టన్ పేర్కొన్నారు. సిటిజన్ ల్యాబ్ బాధిత వ్యక్తి లేదా సంస్థపై మరిన్ని వివరాలను అందించలేదు. సిటిజన్ ల్యాబ్ పరిశోధనపై తక్షణ వ్యాఖ్య ఏమీ లేదని NSO ప్రతినిధి తెలిపారు.ఇజ్రాయెల్ సంస్థ పెగాసస్‌పై ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులపై నిఘాతో సహా దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో 2021 నుండి అమెరికా ప్రభుత్వందీన్ని బ్లాక్ లిస్ట్లోపెట్టిన సంగతి తెలిసిందే. Today, Apple released iOS 16.6.1, patching two vulnerabilities exploited by BLASTPASS in Wallet (CVE-2023-41061) and ImageIO (CVE-2023-41064) so update your iPhones! Also, if you're at risk because of who you are or what you do, please enable Lockdown Mode https://t.co/3cqQyWI3pG — Bill Marczak (@billmarczak) September 7, 2023 -
ఐఫోన్లపై పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్: సంచలన రిపోర్ట్
న్యూఢిల్లీ: భద్రతకు పెట్టింది పేరైన ఐఫోన్లు పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్ గురయ్యాయట. ప్రముఖ రాజకీయవేత్తలు, జర్నలిస్టుల ఐఫోన్లను హ్యాకింగ్‌పై షాకింగ్ రిపోర్ట్ ఒకటి సంచలనం రేపుతోంది. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కొంతమంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు చెందిన ఐఫోన్లు ఇజ్రాయెల్ ఆధారిత స్పైవేర్ మేకర్ పెగాసస్ తరహా స్పైవేర్ దాడికి గురైనట్టు మైక్రోసాఫ్ట్ అండ్ డిజిటల్ రైట్స్ గ్రూప్ సిటిజన్ ల్యాబ్ పరిశోధకులు వెల్లడించారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు క్వాడ్రీమ్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేసినట్టు గుర్తించింది. ప్రధానంగా యాపిల్ డివైస్‌లే లక్ష్యంగా ప్రత్యేకంగా ఐవోఎస్ వెర్షన్లు 14.4, 14.4.2 తోపాటు కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లపై మాల్వేర్ DEV-0196 దాడిచేసిందని తెలిపింది. ఉత్తర అమెరికా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, యూరప్ , మిడిల్ ఈస్ట్లలో కొత్త బాధితులను గుర్తించిన తర్వాత పెగాసస్ తరహా స్పైవేర్ దాడి భయం మళ్లీ తెరపైకి వచ్చింది. అలాగే బల్గేరియా, చెక్ రిపబ్లిక్, హంగేరి, ఘనా, ఇజ్రాయెల్, మెక్సికో, రొమేనియా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఉజ్బెకిస్తాన్‌లలో క్వాడ్రీమ్ సర్వర్లను గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే) 'ENDOFDAYS' అని పిలిచే జీరో-క్లిక్ దాడిచేసినట్టు టొరంటో విశ్వవిద్యాలయం సిటిజెన్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లు ఏదైనా హానికరమైన, ఫిషింగ్ లింక్స్ పై క్లిక్ చేయకుండానే జరిగే దాడులను "జీరో-క్లిక్" అని పిలుస్తారు. ఈ స్పైవేర్ ఆపరేటర్ నుండి బాధితులకు అదృశ్య iCloud క్యాలెండర్ ఆహ్వానాలను ఉపయోగించినట్లు కనిపిస్తోందని పేర్కొంది. (Tecno Phantom V Fold వచ్చేసింది: అతి తక్కువ ధరలో, అదిరిపోయే పరిచయ ఆఫర్) కాగా పెగాసెస్ వివాదం నేపథ్యంలో యాపిల్ స్పైవేర్ డిటెక్టర్ టూల్ ‘ఇమేజింగ్’ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఐఫోన్లలో ‘పెగాసెస్ స్పైవేర్’ని కనిపెట్టవచ్చట.ఈ కొత్త టూల్ ఐఫోన్ బ్యాకప్, ఇతర ఫైల్స్‌ను చెక్ చేసి మాల్వేర్ ఏదైనా చొరబడిందా లేదా అని నిర్ధారిస్తుందంటూ అప్డేట్ చేసినసంగతి తెలిసిందే. -
పెగాసస్ మీ మైండ్‌లో ఉంది! ఫోన్లో కాదు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన ఉపన్యాసం.. రాజకీయ విమర్శలకు దారి తీసింది. బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకునే ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రాహుల్‌కి కౌంటరిచ్చారు. పెగాసస్ అనేది రాహుల్ గాంధీ ఫోన్లో లేదని, ఆయన మైండ్‌లోనే ఉందని ఎద్దేవా చేశారు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్. ‘‘పెగాసస్ అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోకి ప్రవేశించింది. రాహుల్ తెలివితేటలు చూసి జాలిపడుతున్నా. ఆయన విదేశాలకు వెళ్తాడు. దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి వచ్చేస్తాడు. విదేశీ రాయబార కార్యాలయాలకు వెళ్లి భారత్‌కి వ్యతిరేకంగా మాట్లాడి.. దేశ పరువు తీయడమేనా? కాంగ్రెస్ ఎజెండా అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. విదేశాల్లో దేశాన్ని విమర్శించడం దేశ వ్యతిరేక చర్య. దేశం గానీ, ప్రజలు గానీ మిమ్మల్ని(రాహుల్‌ను ఉద్దేశించి) ఎప్పటికీ క్షమించరు. కాగా, ఇటీవల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతూ..ఇజ్రాయిల్ స్పైవేర్ అయిన పెగాసన్ గురించి ప్రస్తావించారు. ఈ పెగాసస్ ద్వారా తన ఫోన్ గూఢచర్యం జరుగుతోందని, కాల్స్ మాట్లాడటం గురించి జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనను హెచ్చరించాయని చెప్పారు. పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకుల ఫోన్లో పెగాసస్ ఉందని వ్యాఖ్యలు చేశారు. అలాగే తనపై తప్పుడూ అభియోగాలు మోపి కేసులు పెట్టారన్నారు. అలాగే కేంద్రం ఇంటెలిజెన్సినీ దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలపై కేసులు పెడుతోందన్నారు. ప్రజాస్వామ్య నిర్మిత దేశంలో ఇలాంటి చర్యలు సరికాదని, తాను అందుకోసమే పోరాడుతున్నాని చెప్పుకొచ్చారు రాహుల్. -
కేంద్రంపై రాహుల్ సంచలన ఆరోపణలు.. పెగాసెస్‌పై కామెంట్స్ ఇవే..
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా, రాహుల్.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉపన్యాసం సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రాథమిక నిర్మాణంపై దాడి జరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటిలో మాట్లాడుతూ.. దేశంలో పెద్ద సంఖ్యలో రాజకీయా నేతల ఫోన్లలో పెగాసెన్ స్పైవేర్ ఉందన్నారు. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ తన ఫోన్లోకి స్నూప్ చేయడానికి ఉపయోగించబడుతుందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనకు కాల్ చేశారని ఫోన్లో మాట్లాడే విషయాలను తాము రికార్డు చేస్తున్నట్లు తనకు చెప్పినట్టు తెలిపారు. ఈ విషయమై తనను హెచ్చరించినట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం.. సెంట్రల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్నారు. కేవలం ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై కూడా అనేక అభియోగాలపై కేసులు నమోదు చేశారన్నారు. ప్రజస్వామ్య నిర్మితమైన దేశంలో మీడియా, ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు సరికాదన్నారు. ఇదే సమయంలో గత ఏడాది ఆగస్టులో, స్నూపింగ్ కోసం పెగాసస్‌ను ప్రభుత్వం ఉపయోగించుకుందనే ఆరోపణలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు.. ఓ కమిటీని నియమించింది. ఇక, కమిటీ తాము పరిశీలించిన 29 మొబైల్ ఫోన్లలో స్పైవేర్ కనిపించలేదని పేర్కొంది. కానీ.. ఐదు మొబైల్ ఫోన్లలో మాల్వేర్ కనుగొన్నట్టు నివేదికలో తెలిపారు. ఈ కమిటీ నివేదికపై సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఐదు ఫోన్లలో కొన్ని మాల్వేర్లు కనిపించాయని, అయితే అది పెగాసస్ అని చెప్పలేమని టెక్నికల్ కమిటీ చెబుతోంది. అయితే, టెక్నికల్ కమిటీ నివేదికపై ఆందోళన చెందుతున్నామని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. -
అమృతోత్సవ దీక్షకు ఫలితం?!
కోరేగావ్ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్ష›సభ్యులు పాలకుల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురిచేశారు. గూఢచర్య ‘పెగసస్’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడింది. ఆఖరికి చిన్న దేశమైన భూటాన్ కరెన్సీతో ఇండియా రూపాయి సమానమైంది. ఇలా గడిచిన ఏడాది ఎన్నో పరిణామాల్ని భారతీయ సమాజం చవిచూసింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ పాలకులు, పాలితులు మిగిలిన పాఠాలను స్మరించు కోవలసి ఉంది. గడిచిన 75 ఏళ్ల చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది. భారత స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండిన వేళ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దేశ న్యాయ స్థానాలకూ, పాలక వర్గానికీ, పౌర సమాజానికీ బాధ్యతా యుతమైన కర్తవ్యాన్ని (30 డిసెంబర్ 2022) నిర్దేశించారు. రాబోయే రోజుల్లో దేశ న్యాయ వ్యవస్థలో మహిళలదే ప్రధాన పాత్ర కాబోతున్నదనీ, వలసవాద ఆలోచనా విధానాల నుంచి న్యాయ వ్యవస్థను రక్షించవలసిన సమయం వచ్చిందనీ అన్నారు. వ్యక్తులను అకారణంగా అరెస్టులు చేసి, జైళ్లలో పెట్టడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనంటూ పలువురు పౌరుల విడుదలకు మార్గాన్ని సుగమం చేశారు. కోరేగావ్ దళిత మహాసభ ఉద్దేశాన్ని వక్రంగా చిత్రించి, ఆ సభకు హాజరైన కొందరు వామపక్షాల సభ్యులు పాలకుల్ని హత్య చేయ డానికి కుట్ర పన్నారన్న మిషపైన దేశవ్యాప్తంగా కొందరు పౌర హక్కుల నాయకుల్ని నిష్కారణంగా అరెస్టులు చేసి వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. కోరేగావ్ దళితుల సభలో స్వయంగా పాల్గొన్న న్యాయమూర్తులు ఈ అరెస్టులను, వేధింపులను నిరసించినా పాల కుల కుట్రపూరిత వైఖరి కొనసాగుతూనే వచ్చింది. కాగా జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా పదవిని స్వీకరించిన తర్వాత ఈ వేధింపుల విషయంలో కూడా స్పష్టమైన వైఖరి తీసుకున్నారు. అరెస్టయినవాళ్లు జైళ్లలో నిరవధికంగా విచారణ లేకుండా మగ్గడాన్ని గమనించి, నిష్కారణ పరిణామానికి ఫుల్స్టాప్ పెట్టడానికి నిర్ణయిం చారు. విచారణను త్వరితం చేసి, డిటెన్యూల విడుదలకు క్రమంగా చర్యలు తీసుకోవడం హర్షించదగిన పరిణామం. ఫాదర్ స్టాన్ స్వామి అరెస్టు ఉదంతం పాలక వర్గాల అత్యంత నీచమైన చర్య. భారత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సేకరించానని ప్రకటించిన ‘సాక్ష్యం’ ఫాదర్ స్టాన్ స్వామి, తదితర నిందితుల కంప్యూటర్లలోకి పనిగట్టుకొని చొప్పించిన దొంగ సాక్ష్యాలే నని ప్రసిద్ధ అమెరికన్ డిజిటల్ ఫోరెన్సిక్ కంపెనీ ‘ఆర్సెనల్ కన్సల్టెన్సీ’ విడుదల చేసిన నివేదికలో (10 డిసెంబర్ 2021) పేర్కొంది. విచిత్రమేమంటే, ఏ ఇజ్రాయిల్ స్పైవేర్ ‘పెగసస్’ను భారత పాల కులు ఉపయోగించారో, దాని సంస్థతో ఎన్ఐఏ కూడా సంబంధాలు పెట్టుకుంది. అయితే సుప్రీంకోర్టు (27 అక్టోబర్ 2021) విచారణ కోసం ఒక సాంకేతిక సంఘాన్ని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.వి. రవీంద్రన్ అధ్యక్షులుగా ఉన్న ఈ కమి టీలో ప్రొఫెసర్ పి. ప్రభాకరన్, ప్రొఫెసర్ అశ్వన్ గుమస్తే సభ్యులుగా ఉన్నారు. నిందితుల ఫోన్లను ఇజ్రాయిల్ పెగసస్ స్పైవేర్ ట్యాంపర్ చేస్తున్న విషయం నిజమా? కాదా? అని తేల్చాలని ఈ కమిటీ ఎన్ఐఏను ఆదేశించింది. కానీ, ఇంతవరకూ ఆ విషయాన్ని ఎన్ఐఏ తేల్చకుండా దాటవేసిందని వార్తలు. ఈ ‘కప్పదాట్లు’ అంతటితో ఆగ లేదు. ‘పెగసస్’తో భారతదేశ పౌర సమాజంపై పాలక పక్షం విరుచుకుపడేంతవరకు కొనసాగుతూనే వచ్చింది. అంతేగాదు, కాంగ్రెస్ పాలకుల ‘బోఫోర్స్’ కొనుగోళ్ల వల్ల దేశం నష్టపోయింది రూ. 70 కోట్లు కాగా, బీజేపీ–ఆరెస్సెస్ పాలకుల రఫేల్ (ఫ్రెంచి) విమానాల కొనుగోళ్ల వల్ల దేశం కోల్పోయింది రూ. 70 వేల కోట్లని తేలినా నిగ్గతీయగల చైతన్యాన్ని ప్రతిపక్షాలూ కోల్పోయాయి. ఆ మాటకొస్తే, 2002లో గుజరాత్లో ఏమైంది? పాలకుల అధికారిక దౌర్జన్యాలను, ఆగడాలను ఎండగట్టి, వారు శిక్షార్హులేనని సుప్రీంకోర్టు ప్రత్యేక సలహాదారుగా విచారణకు నియమితులైన ‘ఎమి కస్ క్యూరీ’ ప్రసిద్ధ న్యాయవాది రాజు రామచంద్రన్ సమర్పించిన నివేదికను కూడా పాలకులు తొక్కిపట్టిన ఉదంతాన్ని దేశం మరచి పోలేదు. ఇన్ని రకాల దారుణాలకు, పాలక పక్షాలు ఒడిగట్టిన దేశంలో – స్వాతంత్య్ర దినోత్సవ అమృతోత్సవాలు ముగిసిన వేళలో పాల కులకు, పాలితులకు మిగిలిన గుణపాఠాన్ని స్మరించుకోవలసిన సమయమిది. దేశ స్వాతంత్య్రం కోసం సకల వ్యక్తిగత సౌకర్యాలను గడ్డిపోచగా భావించి ప్రాణాలు సహా సర్వస్వాన్ని త్యాగం చేసిన లక్షలాదిమంది దేశభక్తులను ఒక్కసారి తలచుకోవలసిన సమయం ఇదే. గడిచిన 75 ఏళ్ల పరిణామాల నుంచి గుణపాఠాలు తీసు కోవలసిన ఘడియ కూడా ఇదే! అంతేగాదు, ఈ 75 ఏళ్లలోనే క్రమంగా పత్రికా రంగంలో కూడా జాతీయ ప్రయోజనాల పరిరక్షణ స్పృహకన్నా కార్పొరేట్ ఇండియాలో భాగంగా కార్పొరేట్ మీడియా బలిసింది. పత్రికా రంగంలో ప్రయివేట్ రంగ ప్రయోజనాల ప్రాధాన్యం పెరిగింది. తద్వారా జర్నలిజం స్వరూప స్వభావాలనే అది తారుమారు చేస్తూ వచ్చింది. 1955 నాటికే వర్కింగ్ జర్నలిస్టుల, తదితర వార్తా పత్రికా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ ప్రత్యేక చట్టమే వచ్చింది. ఫలితంగా ఇతర సంస్థలలో పనిచేసే వివిధ వృత్తిదారుల ప్రయోజ నాలను కూడా రక్షించే నిబంధనలు అందులో పొందు పర్చడం జరిగింది. ఇది లేబర్ కోర్టుల ద్వారా ఉద్యోగుల సమస్యల సామరస్య పరిష్కారానికి తోడ్పడింది. తొల్లింటి ప్రయివేట్ మీడియాను జైన్లు, బిర్లాలు, గోయెంకా లాంటి జూట్ వ్యాపారులు నిర్వహించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని నడమంత్రపు ‘సిరి’ పారిశ్రామికవేత్తలు భర్తీ చేశారు. వీళ్లపైన భారత రాజ్యాంగ నిబంధనల ఆజమాయిషీ బొత్తిగా మృగ్యమై పోవడం కూడా కాంగ్రెస్, బీజేపీ–ఆరెస్సెస్ పాలనల ‘పుణ్యమే’. కాబట్టి ఈ సమీక్ష అనివార్యమవుతోంది. చివరికి మన కరెన్సీ కూడా ఈ 75 ఏళ్లలో ఏ స్థాయికి దిగజారి పోయిందో, ఆ దిగజారుడులో కాంగ్రెస్ పాలకులు కూడా భాగ స్వాములయినా ఒక ఆలోచనాపరురాలిగా, కాంగ్రెస్ వాదిగా భావికా కపూర్ నిర్మొహమాటంగా ఇలా వర్ణించారు: మన ప్రగతి ‘వేగం’ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందంటే – ‘‘భూటాన్ కరెన్సీ ఇప్పుడు ఇండియా కరెన్సీతో సమానం. ఒక భూటానీస్ గుల్ట్రమ్ (కరెన్సీ) ఒక రూపాయితో సమానమైంది. భూటాన్ ఒక్కటే కాదు, అఫ్గానిస్తాన్ రూపాయి కూడా ఇండియా రూపాయితో సమానమై కూర్చుంది. అంటే, మనమిప్పుడు తాలిబన్ల రాజ్యానికి సమానమన్నమాట. వావ్ మోదీజీ.. వావ్!’’ (30 డిసెంబర్ 2022) ఏది ఏమైనా, 75 ఏళ్ల భారత అమృతోత్సవాలు ముగిసిన వేళలో ఒక మహాకవి, స్వతంత్ర భారత మానవుడిని తలచుకుని అతని నేటి దుఃస్థితికి స్పందించిన తీరును మరొక్కసారి గుర్తు చేసుకుందాం: ‘‘ఆ మానవమూర్తి ముఖం మీద ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వులేదు! స్వతంత్ర భరతవర్ష వాస్తవ్యుడా మానవుడు అర్ధనగ్నంగా ఆకాశాన్నే కప్పుకొని నిండని కడుపుతో మండుతూన్న కళ్లతో ఇలా ఎంతకాలం ఇంకా నిలబడతాడా ప్రాణి? అందుకే అతణ్ణి జాగ్రత్తగా చూడండి స్వతంత్ర భారత పౌరుడు అతని బాధ్యత వహిస్తామని అందరూ హామీ ఇవ్వండి అతని యోగ క్షేమాలకు / అందరూ పూచీపడండి అతికించండి మళ్లీ / అతని ముఖానికి నవ్వు! స్వాతంత్య్రం ఒక చాలా సున్నితమైన పువ్వు,చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం స్వాతంత్య్రం తెచ్చేవెన్నెన్నో బాధ్యతలు సామర్థ్యంతో నిర్వహిస్తామని / సంకల్పం చెప్పుకుందాం’’ ఇంతకీ మహాకవి ఆశించిన ఆ ‘సామర్థ్యం, సంకల్పం’ మనలో ఏది? అది మనలో కరువయింది కాబట్టే పాలకుల పాలనా సామ ర్థ్యాన్ని గత సుమారు రెండు దశాబ్దాలుగా బొడ్లో చేయివేసి ప్రశ్నిస్తున్న ‘ఏడీఆర్’(అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) నిరంతర నివే దికలు కూడా ‘బుట్టదాఖలు’ అవుతున్నాయి. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
లక్షల ఓట్ల రద్దుకు టీడీపీ యత్నించింది: ఏపీ హౌజ్ కమిటీ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగింది వాస్తవమేనని.. తిరుపతి ఎమ్మెల్యే, పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ధృవీకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ (మంగళవారం) డేటా చోరీ వ్యవహారంపై విచారణ చేపట్టిన హౌజ్ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను ఆయన చదివి వినిపించారు. ప్రాథమిక విచారణలో గత టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు సభా సంఘం నిర్ధారణకు వచ్చిందని భూమన తెలియజేశారు. 2017-19.. మరీ ముఖ్యంగా 2018-19 మధ్యకాలంలో ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి.. తెలుగుదేశానికి చెందిన సేవా మిత్ర యాప్ ద్వారా సుమారు 30 లక్షల ఓట్లు రద్దు చేసే ప్రక్రియకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీనిని తమ విచారణలో సభాసంఘం గుర్తించినట్లు భూమన తెలిపారు. ఓట్లు వేయనివాళ్ల సమాచారాన్ని స్టేట్ డేటా సెంటర్ నుంచి సేవా మిత్ర అనే యాప్ ద్వారా పూర్తిగా చోరీ చేసే యత్నం చేశారని, ఆ చౌర్యం చేసిన చోరులను పట్టుకోవాల్సిన బాధ్యతను తాము లోతుకు వెళ్లి విచారిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ నివేదికను స్పీకర్‌కు చదివి వినిపించారు భూమన. నివేదిక చదివి వినిపిస్తున్న సమయంలో.. టీడీపీ సభ్యులు గోల చేశారు. -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉన్నత విద్యను హక్కుగా మార్చాం: సీఎం జగన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు అప్డేట్స్ 02:15 ప్రపంచంలో విద్యావవస్థ వేగంగా మారుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విద్యారంగంలో నాడు-నేడుపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగిస్తూ.. ఏపీలో విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టామన్నారు. రాజకీయ దుర్బుద్దితో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ బడులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చాకా ఎలా ఉన్నాయనేది పరిశీలించాలని తెలిపారు. ‘గతంలో కార్పొరేట్ స్కూళ్లకు మేలు కలిగించేలా విధానాలు ఉండేవి. డ్రాప్ ఔట్ రేట్ పెరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మేం వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టాం. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నాం. చంద్రబాబు సొంతూరు నారావారి పల్లెలోనూ స్కూళ్లను పట్టించుకోలేదు. కుప్పంలో స్కూళ్లు దీనావస్థలో ఉండేవి. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశాం. మనబడి నాడు-నేడు ద్వారా 57వేల స్కూళ్లు, హాస్టళ్లు అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉన్నత విద్యను హక్కుగా మార్చాం’ అని వ్యాఖ్యానించారు. 1:32PM విద్యారంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నాశనం చేసింది. చైతన్య, నారాయణ సంస్థలకు విద్యా రంగాన్ని ధారాదత్తం చేశారు: సుధాకర్‌బాబు 12:39PM టీడీపీకి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎన్నికల ముందు మాత్రమే చంద్రబాబుకు పథకాలు గుర్తొస్తాయి: ఆదిమూలపు సురేష్ 12:34PM టీడీపీ సంక్షోభంలో ఉన్న పార్టీ. సభను అడ్డుకునేందుకు టీడపీ సభ్యులు వస్తున్నారు.సమస్యలపై చర్చించాలన్న ఆలోచన కూడా టీడీపీకి లేదు: జోగి రమేష్ 12:30PM ►స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల హంగామా ►సభను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యుల ప్రయత్నం ►ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ►టీడీపీ సభ్యులపై ఒక రోజు సస్పెన్షన్ 12:16PM ►రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశారు. సంక్షేమంలో సీఎం జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదు. సంక్షేమ పథకాలు అమలుపై దమ్ముంటే చర్చకు రండి: కన్నబాబు 11:56AM ► డేటా చోరీపై హౌస్ కమిటీ నివేదిక. డేటా చోరీపై మధ్యంతర నివేదికను సభలో ప్రవేశపెట్టారు భూమన కరుణాకర్ రెడ్డి. ► డేటా చోరీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. గత ప్రభుత్వం హయాంలో డేటా చోరీ జరిగింది. 30 లక్షలకుపైగా ఓటర్ల తొలగింపులో భాగంగానే డేటా చోరీ. సేవా మిత్ర యాప్ ద్వారా 30 లక్షల ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారు. టీడీపీ సేవామిత్ర యాప్‌ను దుర్వినియోగం చేసింది. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలి: భూమన 9:18AM విష జ్వరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నాం. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. విష జ్వరాల నియంత్రణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాం. డెంగ్యూ, మలేరియాను ఆరోగ్య శ్రీలో చేర్చాం. ఆరోగ్య శ్రీ పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో డబ్బులు దుబారా చేశారు. చిన్నారి సంధ్య మృతి ఘటన బాధాకరం. వైరల్ డిసీజ్‌తో చిన్నారి మృతి. చిన్నారి మృతిని టీడీపీ సభ్యులు రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. : మంత్రి విడదల రజనీ 9:00AM ►ప్రారంభమైన నాల్గోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు 08:45AM ► ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. నేడు ఏడు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ► ఏపీ అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం).. విద్యావైద్యం, నాడు-నేడుపై స్వల్పకాలిక చర్చ కొనసాగనుంది. 08:30AM ► ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. నేడు శాసనసభ ముందుకు పెగాసెస్ నివేదిక రానుంది. 85 పేజీల ఆధారాలతో సభ ముందు నివేదిక పెట్టనుంది హౌజ్ కమిటీ. టీడీపీ హయాంలో డేటా చౌర్యం జరిగినట్లు ఆరోపణలున్నాయి. -
అది ‘పెగసస్’గా నిర్ధారించలేం
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసస్‌ను కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా ఉపయోగిస్తోందంటూ వెల్లువెత్తిన ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు నియమించిన టెక్నికల్ ప్యానెల్ తన నివేదికను ధర్మాసనానికి అందజేసింది. 29 ఫోన్లను పరీక్షించగా, కేవలం 5 ఫోన్లలో ఒకరకం మాల్వేర్ను గుర్తించినట్లు నివేదికలో వెల్లడించింది. అయితే, అది నిజంగా ఇజ్రాయెల్ పెగసస్ స్పైవేర్ అవునో కాదో నిర్ధారణకు రాలేకపోతున్నట్లు పేర్కొంది. పెగసస్ అంశంపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఆక్షేపించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలోని ప్యానెల్ తన నివేదికను తాజాగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి అందజేసింది. అందులోని వివరాలను ధర్మాసనం గురువారం బయటపెట్టింది. ‘‘దర్యాప్తునకు కేంద్రం సహకరించలేదని కమిటీ(ప్యానెల్) చెప్పింది. పెగసస్ విషయంలో కోర్టులో విచారణకు మీరు(కేంద్రం) సహకరించలేదు. కమిటీకి సహకరించలేదు’ అని పేర్కొంది. పౌరుల గోప్యత హక్కు రక్షణ, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి ఇప్పుడున్న చట్టాలను సవరించాలని సూచించిందని వివరించింది. నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం పరీక్ష కోసం టెక్నికల్ కమిటీకి 29 ఫోన్లు అందజేయగా, అందులో 5 ఫోన్లలో మాల్వేర్ కనిపించడం కొంత ఆందోళనకరమైన విషయమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 29 ఫోన్లు ఇచ్చిన వారికి ఈ నివేదికను అందజేయలేదని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, చట్టవిరుద్ధమైన నిఘా, పౌరుల గోప్యత విషయంలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్యానల్ ప్రతిపాదించిందని చెప్పారు. నివేదికను విడుదల చేయొద్దంటూ ప్యానల్ తమను కోరిందన్నారు. ఇవన్నీ సాంకేతికపరమైన అంశాలని, నివేదికలో ఏయే భాగాలను బహిర్గతం చేయాలో తాము నిర్ణయిస్తామని, వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని వివరించారు. ప్యానెల్ నివేదికను కక్షిదారులకు అందజేయాలని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, రాకేశ్ త్రివేది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. దర్యాప్తునకు కేంద్రం సహరించలేదని ధర్మాసనం చెప్పగా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. ఆ విషయం తనకు తెలియదని బదులిచ్చారు. ధర్మాసనం తదుపరి విచారణకు నాలుగు వారాలకు వాయిదా వేసింది. రాహుల్ క్షమాపణ చెబుతారా?: బీజేపీ పెగసస్ వ్యవహారంలో ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు దుష్ప్రచారం సాగించాయని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ ఇకనైనా క్షమాపణ చెబుతారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు, స్వయం ప్రకటిత మేధావులు, కొన్ని ప్రభుత్వేతర సంస్థలు, ఓ వర్గం మీడియా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేశాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లూ అబద్ధాలు ప్రచారం చేసినట్లు తేటతెల్లమయ్యిందన్నారు. కేంద్రం ఏదో దాస్తోంది: రాహుల్ పెగసస్ ఉదంతంలో కేంద్ర ప్రభుత్వంతో ఏదో దాచేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌కు మోదీ ప్రభుత్వం సహకరించలేదని తప్పుపట్టారు. దీన్నిబట్టి ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తెలిసిపోతోందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని మోదీ సర్కారు కోరుకుంటోందన్నారు. దర్యాప్తునకు సహకరించలేదంటే ఏదో నిజాన్ని దాస్తున్నట్లు అంగీకరించినట్లేనని చెప్పారు. ఈ మేరకు రాహుల్ గురువారం ట్వీట్ చేశారు. -
నిగూఢంగానే మిగిలిన స్పైవేర్
పౌరుల గోప్యతకూ, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకూ పెనుముప్పు కలిగించ గలదని దేశమంతా భావించిన స్పైవేర్ పెగసస్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక నిరాశనే మిగిల్చింది. మన దేశంలో మొత్తం 300 మంది ఫోన్లపై ఈ స్పైవేర్ దాడి చేసిందనీ, అందులో పాత్రికేయులతోపాటు కేంద్రంలోని ఇద్దరు మంత్రులూ, విపక్ష నేతలు ముగ్గురూ, రాజ్యాంగ పదవిలో ఉన్న ఒకరు, వ్యాపారవేత్తలు, పౌరహక్కుల నాయకులు ఉన్నారనీ అప్పట్లో బయటికొచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం నిరుడు అక్టోబర్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీ పరిశీలనకు 29 మంది తమ ఫోన్లు అందజేయగా అందులో అయిదు ఫోన్లలో మాల్వేర్ ఉన్నట్టు గుర్తించారు. అది పెగసస్ సాఫ్ట్‌వేరా కాదా అన్నది కమిటీ తేల్చలేకపోయిందని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తెలిపింది. నిపుణుల కమిటీ నివేదిక, పర్యవేక్షించిన మాజీ న్యాయమూర్తి నివేదిక సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో ఉంచబోతోంది. ఆ తర్వాతగానీ ఈ విచారణ లోతుపాతులు తెలియవు. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ రూపొందించిన పెగసస్ గురించి నిరుడు వెల్లడైనప్పుడు ప్రపంచ దేశాల ప్రజానీకమంతా నివ్వెర పోయింది. పలు ప్రభుత్వాలు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ కంట్లో నలుసుగా మారినవారిపై నిఘా పెట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్పైవేర్‌ను మన ప్రభుత్వం 2017లో కొనుగోలు చేసిందని మొన్న జనవరిలో ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్‌తో రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందంలో భాగంగానే ఇది జరిగినట్టు ఆ పత్రిక కథనం. మరో ఆసక్తికరమైన సంగతేమంటే... ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి చంద్రబాబు సర్కారు ఈ స్పైవేర్‌ను కొన్న దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇలా ఇంటా బయటా అందరూ కోడై కూస్తున్నా కేంద్రం నోరు మెదపలేదు. పార్లమెంటులో అలజడి రేగినా, నిరుడు వర్షాకాల సమావేశాలు ఈ అంశంపైనే తుడిచిపెట్టుకుపోయినా ‘భద్రతా కారణాల రీత్యా’ ఏమీ చెప్పలేమన్న గంభీరమైన ప్రత్యుత్తరంతో సరిపెట్టింది. సర్వోన్నత న్యాయస్థానంలోనూ అదే వైఖరి తీసుకుంది. ఇక చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు. ఆయన మొదటినుంచీ దబాయింపుతో నెట్టుకొస్తున్నారు. మన స్వాతంత్య్రోద్యమం ప్రజాజీవితంలోకి ఎన్నో కొత్త విలువలను మోసుకొచ్చింది. అట్టడుగు పౌరులకు సైతం ప్రజాస్వామ్య ఫలాలు అందాలన్న ఆకాంక్షతో ఆ విలువల ప్రాతిపదికనే మన రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా, సమస్యలెన్ని ఎదురవుతున్నా అవన్నీ సంపూర్ణ రిపబ్లిక్ ఆవిర్భావానికి దేశం పడుతున్న పురుటి నొప్పులుగా మొదట్లో అందరూ భావించారు. కానీ రాను రాను ప్రజాస్వామ్యాన్ని ఛిద్రం చేస్తున్నవారిదే పైచేయి అవుతున్న వైనం కనబడుతూనే ఉంది. ఈ పరిణామాలే చివరకు పెగసస్ వంటి స్పైవేర్ కొనుగోలుకు దారితీసినట్టు భావించాలి. పెగసస్ గురించి అధికారికంగా ఆధారాలేవీ బయటపడకపోయినా భీమా కోరెగావ్ కేసులో ఇరుక్కున్న ఒకరిద్దరి కార్యకర్తల లు, కంప్యూ టర్లలో అవాంఛనీయమైన సాఫ్ట్వేర్ చొరబడటంలో ఆ సాఫ్ట్వేర్ పాత్ర ఉందన్న సంగతి వెల్లడైంది. తమ స్పైవేర్‌ను ‘బాధ్యతాయుత ప్రభుత్వాలకు’ విక్రయించాం తప్ప ప్రైవేటు వ్యక్తులెవరికీ అంద జేయలేదని ఎన్ఎస్ఓ స్పష్టంగా చెబుతోంది. ఆ ‘బాధ్యతాయుత’ ప్రభుత్వాల జాబితా అది బయట పెట్టకపోయినా, వ్యక్తులెవరికీ ఆ సంస్థ విక్రయించలేదన్న సంగతైతే మీడియా సంస్థల అంతర్జాతీయ కన్సార్షియం దర్యాప్తులో తేటతెల్లమైంది. పైగా ధర రీత్యా ఆ సాఫ్ట్వేర్ బడా కోటీశ్వరులకు తప్ప అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇటు కేంద్రం నడత సందేహాలను నివృత్తి చేయకపోగా మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. గూఢచర్యం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను కేంద్రం ఖండిస్తున్న మాట నిజమే అయినా... రాజ్యాంగ పదవిలో ఉన్నవారిపై, కేంద్రమంత్రులపై నిఘా కొనసాగిందన్న అంశంలో అది నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోవడం వింత కాదా? ప్రభుత్వ సంస్థలేవీ ఆ స్పైవేర్‌ను వినియోగించలేదని ప్రకటిస్తున్న ప్రభుత్వం, తామే కాదు... వేరెవరూ కూడా ఆ పని చేయలేదని నిర్ద్వంద్వంగా ఎందుకు చెప్పలేకపోతోంది? కనీసం ఆ విషయంలో దర్యాప్తు చేశామనీ, ఫలానా అంశాలు వెల్లడయ్యాయనీ ఎందుకు వివరించడం లేదు? బహిరంగ అఫిడ విట్‌లో వివరాలు పొందుపరచడం సాధ్యపడదనీ, నిపుణుల కమిటీ నియామకానికి తనను అను మతిస్తే ఆ కమిటీకి నివేదిస్తాననీ నిరుడు కేంద్రం చేసిన వినతిని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. తానే కమిటీ ఏర్పాటుచేసింది. దానికైనా కేంద్రం వివరాలందజేస్తే బాగుండేది. ఆ పని చేయకపోవడం వల్ల కమిటీ నివేదిక కొత్తగా ఏమీ చెప్పలేకపోయింది. దేశం మొత్తాన్ని కుదిపేసిన పెగసస్ వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం ముందు కేంద్ర ప్రభుత్వం నీళ్లు నమలడం, దాటేయడం ఎవరి సలహా పర్యవసానమో గానీ ఈ వైఖరి దాని ప్రతిష్ఠను ఏమాత్రం పెంచదు. దేశ పౌరులనుంచి చట్టబద్ధ ప్రవర్తనను ఆశించే ప్రభుత్వాలూ, చట్ట ఉల్లంఘనకు పాల్పడే పౌరులపై చర్యలు తీసుకునేందుకు సర్వాధికారాలు ఉన్న ప్రభుత్వాలూ రాజ్యాంగ నైతికతకు కట్టుబడి ఉండాలి. ఆదర్శవంతంగా మెలగాలి. రాజ్యమే రాజ్యాంగ ఉల్లంఘ నకు పాల్పడుతుంటే, అది రివాజుగా మారితే ఆ సమాజాన్ని కాపాడటం ఎవరి తరమూ కాదు. -
2016 నుంచి 2019 వరకు పెద్ద కుట్ర జరిగింది: భూమన
సాక్షి, అమరావతి: టీడీపీకి అడ్డదారిలో రాజకీయ లబ్ధి కలిగించేందుకు 2016–2019లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీకి పాల్పడ్డారని డేటా చోరీ అంశంపై విచారణకు శాసనసభ నియమించిన ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఆనాటి సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ల డైరెక్షన్లోనే డేటా చోరీ జరిగినట్లు ఉపసంఘం విచారణలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయిలో పోలీసు దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే నివేదికను శాసనసభకు సమర్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత శాసనసభ సమగ్రంగా చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర హోం, ఐటీ శాఖల ఉన్నతాధికారులతో శాసనసభా ఉపసంఘం వరుసగా రెండో రోజు బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలన్నీ అత్యంత గోప్యమైనవని అధికారులు సభా సంఘానికి తెలిపారు. అటువంటి వివరాలు ‘సేవా మిత్ర’ అనే యాప్ నిర్వహించిన ఓ ప్రైవేటు ఏజెన్సీకి చేరడం అంటే ప్రభుత్వ పెద్దల ద్వారానే జరుగుతుందని అప్పటి ఐటీ, ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులు వివరించినట్టు సమాచారం. చదవండి: (అమ్మ, నాన్నల తర్వాత వైఎస్సారే నాకు స్ఫూర్తి: పంచ్ ప్రభాకర్) సమావేశం అనంతరం ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం ప్రజల భద్రత, వ్యక్తిగత గోప్యత హక్కులకు భంగకరంగా వ్యవహరించిందన్నారు. ప్రజా సాధికారిక సర్వే ద్వారా సేకరించిన వివరాలను టీడీపీకి అనుకూలంగా ఏర్పాటు చేసిన సేవా మిత్ర యాప్‌తో అనుసంధానించారన్నారు. తద్వారా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించేందుకు కుట్ర పన్నినట్టు తమ విచారణలో వెల్లడైందన్నారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది ఓటర్ల తొలగింపునకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నిందని ఆయన చెప్పారు. అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ ఈ వ్యవహారాన్ని గుర్తించి టీడీపీ కుట్రను అడ్డుకుందన్నారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వ అధికారిక సమాచారం టీడీపీకి చెందిన యాప్ నిర్వాహకులకు చేరడం వెనుక చంద్రబాబు, లోకేశ్‌ల హస్తం ఉందన్నారు. ఆ స్థాయి పెద్దల పాత్రతోనే అంతటి గోప్యమైన సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు తమకు వివరించారని భూమన తెలిపారు. గురువారం మరోసారి అధికారులతో సమావేశమైన అనంతరం తమ నివేదికను శాసనసభకు సమర్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి, మొండితోక జగన్మోహనరావు, మద్దాల గిరి తదితరులు పాల్గొన్నారు. -
పెగాసెస్‌కు మించి: మరో స్పైవేర్ ‘హెర్మిట్’ కలకలం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెగాసెస్ రేపిన వివాదం చల్లారకముందే మరో స్పైవేర్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఆండ్రాయిడ్ స్పైవేర్ ‘హెర్మిట్’ను సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు తాజాగా గుర్తించారు. వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు, కొంతమంది ప్రభుత్వ ఉన్నతోద్యోగులను ఆయా ప్రభుత్వాలు 'హెర్మిట్' ఎంటర్ప్రైజ్-గ్రేడ్ ఆండ్రాయిడ్ స్పైవేర్ ద్వారా టార్గెట్ చేసినట్టు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు వెల్లడించారు. సైబర్-సెక్యూరిటీ కంపెనీ లుక్అవుట్ థ్రెట్ ల్యాబ్ టీంఈ మాలావేర్ను గుర్తించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలను అణిచి వేసిన నాలుగు నెలల తర్వాత ఏప్రిల్‌లో కజకిస్తాన్ ప్రభుత్వం ఉపయోగించినట్టు గుర్తించింది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కనుగొన్నామని ఈ బృందం పేర్కొంది. జాతీయ భద్రత ముసుగులో వ్యాపార వేత్తలు, మానవహక్కుల కార్యకర్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులపై గూఢచర్యం చేయడానికి వారిపై నిఘాకు తరచుగా వాడు కుంటున్నారని పరిశోధకులు హెచ్చరించారు. హెర్మిట్ అనేది మాడ్యులర్ స్పైవేర్. ఆడియోను రికార్డ్, ఫోన్ కాల్ల డైవర్షన్ అలాగే కాల్ లాగ్‌లు, ఫ్రెండ్స్, ఫోటోలు, లొకేషపన్లను లాంటి వాటిని ఎస్ఎంఎస్ ద్వారా డేటాను చోరీ చేస్తుంది. ఈ మాలావేర్ టెలికమ్యూనికేషన్ కంపెనీ, స్మార్ట్‌ఫోన్ తయారీదారుల అప్లికేషన్లను కూడా ప్రభావితం చేశాయని లుకౌట్ బృందం తెలిపింది. 'హెర్మిట్' అని పేరు పెట్టిన ఈ స్పైవేర్‌ను ఇటాలియన్ స్పైవేర్ ఆర్సీఎస్ ల్యాబ్,టెలీ కమ్యూనికేషన్స్ సొల్యూషన్స్ కంపెనీTykelab Srl సహకారంతో అభివృద్ధి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నామని పరిశోధకులు బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. అయితే హెర్మిట్ నిఘా ఇదే మొదటిసారి కాదు. 2019లో అవినీతి నిరోధక చర్యలో ఇటాలియన్ అధికారులు దీనిని ఉపయోగించారట.ఆర్సీఎస్ ల్యాబ్ మూడు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉన్న ప్రసిద్ధ డెవలపర్. ఇది కూడా పెగాసస్ డెవలపర్ ఎన్ఎస్వో గ్రూప్ టెక్నాలజీస్, ఫిన్ఫిషర్ని సృష్టించిన గామా గ్రూప్‌ల మాదిరిగానే అదే మార్కెట్లో పనిచేస్తుంది. అలాగే ఇది పాకిస్తాన్, చిలీ, మంగోలియా, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్, తుర్క్మెనిస్తాన్లోని సైనిక, గూఢచార సంస్థలతో నిమగ్నమై ఉన్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. -
చంద్రబాబు పెగాసస్ బండారం బయట పెడతాం: భూమన కరుణాకర్‌రెడ్డి
-
bumana_1655281631.mp4
-
పెగాసస్ గుట్టు తేల్చనున్న ఏపీ ప్రభుత్వం
-
టీడీపీకి వణుకు పెగాసస్ పై హౌస్ కమిటీ విచారణ ప్రారంభం
-
AP: భూమన నేతృత్వంలో పెగాసస్‌పై హౌస్ కమిటీ విచారణ
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ ద్వారా మానవ హక్కులను చోరీచేసిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు నియమించిన ఏపీ శాసనసభా సంఘం (హౌస్ కమిటీ) బుధవారం అసెంబ్లీలో సమావేశమైంది. హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సభ్యులు కరణం ధర్మశ్రీ, భాగ్యలక్ష్మి, మొండితోక జగన్మోహన్రావు, మద్దాళి గిరిధర్ సమావేశమై ఫోన్ ట్యాపింగ్, నిబంధనలకు విరుద్ధంగా రహస్య పరికరాల కొనుగోలుకు సంబంధించి విచారిస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న హోంశాఖ, ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరి నుంచి వివిధ మార్గాల్లో డేటా చోరికి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో అప్పటి ఏపీ (చంద్రబాబు) ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం రహస్య పరికరాలను వినియోగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఏపీ అసెంబ్లీ మార్చిలో సభాసంఘం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం వ్యక్తుల, పార్టీల సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం చేసింది. సాధికార సర్వే ద్వారా సమాచారం సేకరించి అప్రజాస్వామిక విధానాలు అవలంభించారు. దోషులను ప్రజల ముందు నిలబెడతాం. అప్పట్లో ప్రయివేటు వ్యక్తుల ఫోన్లు టాప్ చేసింది. ఇది శాసన సభ నమ్మింది, కమిటీ కూడా నమ్మింది. ఈరోజు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. వచ్చే సమావేశంలో పూర్తి సమాచారం ఇస్తామన్నారు. విచారణకు అప్పటి అధికారులను కూడా పిలుస్తాం. మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు కూడా ఒక అంశం. చంద్రబాబు చేసిన నిర్వాకాన్ని ఎత్తి చూపుతాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దీనిపై ఆరోపణలు చేశామని హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చదవండి: (గ్రూప్-1 ఇంటర్వ్యూల నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ) -
భూమన నేతృత్వంలో పెగాసస్ పై నేడు హౌస్ కమిటీ విచారణ
-
ఏబీ వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
-
ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి: తమ అనుమతి లేకుండా పెగాసస్ స్పైవేర్ అంశంపై ప్రెస్‌మీట్ నిర్వహించిన సీనియర్ మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. గత నెల 21వ తేదీన ఏబీ వెంకటేశ్వర రావు పెట్టిన ప్రెస్‌మీట్‌ను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మీడియాతో మాట్లాడటంపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీడియా సమావేశం పెట్టిన మరుసటి రోజే ప్రభుత్వం నోటీస్ పంపింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టడం తప్పేనంటూ నోటీస్‌లో పేర్కొంది. ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం పెట్టడంపై ఏబీ వెంకటేశ్వరరావుకు నోటీసులు ఇచ్చింది. మెమో అందిన వారంలో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని హెచ్చరించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారంటూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత నెలలో అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు పెదవి విప్పకపోయినా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు మాత్రం ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాతో మాట్లాడటంపై వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిలో భాగంగానే తాజాగా ఏబీ వెంకటేశ్వరరావుకు మెమో జారీ చేసింది రాష్ట్ర ఫ్రభుత్వం. -
ఏపీ: టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై అసెంబ్లీ హౌస్ కమిటీ
సాక్షి, అమరావతి: టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారం హౌస్ కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని నియమించారు. అదే విధంగా కమిటీ సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కొలుసు పార్థసారధి, అమర్నాథ్, మేరుగు నాగార్జున, మద్దాల గిరిధర్‌ను నియమించారు. కాగా రాష్ట్రంలో పెగసస్ స్పైవేర్ బాగోతం గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో దీనిపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్ర శాసనసభలోనూ సోమవారం తీవ్ర దుమారం రేపింది. అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. దీంతో స్పైవేర్ ఉదంతంపై హౌస్ కమిటీ ఏర్పాటుచేయాలని సోమవారమే అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం నాడు టీడీపీ పెగాసెస్ వ్యవహారంపై స్పీకర్ హౌస్ కమిటీ వేశారు. చదవండి: మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చాం: సీఎం జగన్ -
సభా సంప్రదాయాలకు టీడీపీ పాతర
సాక్షి, అమరావతి: ‘కోడిపందాల వద్ద, సినిమా హాళ్లలో విజిల్స్ వేసినట్టుగా శాసనసభలో విజిల్స్ వేస్తూ.. గేలి చేస్తూ టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు. ఇంత బరి తెగింపు ముందెన్నడూ చూడ లేదు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే టీడీపీ సభ్యులు హేయమైన రీతిలో గాలితనంగా వ్యవహరిస్తున్నారు. వీళ్లు శాసనసభ సభ్యులో.. ఆకతాయిలో అర్థం కావడం లేదు’ అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘ఈ రోజు ఇంకా దిగజారి విజిల్స్ కూడా వేస్తూ దారుణంగా ప్రవర్తించారు. ప్రజలు అవకాశం ఇచ్చి ఇక్కడికి పంపినప్పుడు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి సభలో హుందాగా వ్యవహరించాలే తప్ప మరీ ఇంతగా బరి తెగించకూడదు. గత్యంతరం లేక టీడీపీ సభ్యులను సభ నుంచి పంపుతున్నాం. టీవీలో చూస్తోన్న చంద్రబాబును సంతృప్తి పర్చడమే ధ్యేయంగా సభలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ అంటే కోడి పందేల దిబ్బగా దిగజార్చుతున్నామనే స్పృహ కూడా లేదు. ఇలాంటి వాళ్లకు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు’ అని ధ్వజమెత్తారు. కాగా, కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం ఎమ్మెల్యేను గెలిపించి తప్పు చేశామని మాట్లాడటం, చెప్పుతో కొట్టుకోవడం వంటి చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని నాని పేర్కొన్నారు. ఏబీవీ.. పోలీస్ అధికారిగా వ్యవహరించండి ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారిగా కాదు.. కనీసం హోంగార్డుగా కూడా పనికిరాని వ్యక్తి అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇప్పటికైనా టీడీపీ నేతగా కాకుండా ఓ పోలీసు ఆఫీసర్‌గా వ్యవహరిస్తే మంచిదని హితవు పలికారు. ‘ఏబీ వెంకటేశ్వరరావు మా మీద పరువు నష్టం కేసు వేస్తామంటున్నారు. మీతో పాటు టీడీపీ మీద ఐదు కోట్ల ఆంధ్రులు పరువునష్టం దావా వేస్తారు. సీఎంవో ఉద్యోగి శ్రీహరి తన జీవితంతో ఆడుకున్నాడని ఏబీవీ అంటున్నారు. ఐపీఎస్‌గా 30 ఏళ్ల సర్వీసులో ఉండి మిమ్మల్ని మీరే కాపాడుకోకపోతే పోలీస్ అధికారిగా మీరు అన్‌ఫిట్ కదా! పెగసస్ స్పై వేర్‌ను చంద్రబాబు కొనుగోలు చేసినట్టుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ఆమె ఎక్కడా మాట్లాడ లేదని లోకేష్ చెబుతున్నారు. ఆమె ఆ విషయం చెప్పకపోతే నువ్వెందుకు ట్వీట్ చేశావ్ లోకేష్? మీ గెజిట్ ఈనాడులో కూడా వార్తలు వచ్చాయిగా.. కన్పించ లేదా? ఓ సీఎం చెప్పిన విషయంపై చర్చించకుండా ఎలా ఉండగలం? సభలో ఈ అంశంపై చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడి ఉంటే బాగుండేది. ఎందుకో పారిపోయారు. వాళ్లే కొనుగోలు చేస్తారు. మళ్లీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వాళ్లే ఒకరికొకరు వత్తాసు పలుకుతుంటారు’ అని అన్నారు. -
అటు పెగసస్.. ఇటు ‘ప్రెసిడెంట్ మెడల్’
సాక్షి, న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగించుకున్నందున చంద్రబాబు చేసింది ముమ్మాటికీ దేశద్రోహమేనని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆరోపించారు. మరోవైపు ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్ వంటి మద్యం బ్రాండ్లు కూడా చంద్రబాబు హయాంలోనే వచ్చాయని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, తలారి రంగయ్య, ఎన్.రెడ్డెప్ప మాట్లాడారు. నాటి ఏపీ సీఎం చంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణను తీవ్రంగా పరిగణించాలన్నారు. ‘నాడు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కొనుగోలు చేసిన పెగసస్‌పై కేంద్రం చూసీచూడనట్టుగా ఉండడం సరికాదు. దేశ అంతర్గత వ్యవహారాలు, భద్రత గురించి ప్రమాదం పొంచి ఉన్న విషయం కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నాం. మమత చేసిన వ్యాఖ్యలు సుమోటోగా స్వీకరించి దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతున్నాం. ఎంపీలందరం ప్రధాని, రాష్ట్రపతిని కలిసి ఈ అంశంపై డిమాండ్ చేస్తాం. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. హైఓల్టేజీ బీరు, బ్రిటిష్ ఎంపరర్ తదితర బ్రాండ్లు కూడా టీడీపీ హయాంలో వచ్చినవే. దేశద్రోహం కింద చంద్రబాబును అరెస్టు చేయాలి. సుమోటోగా తీసుకుని సుప్రీం కోర్టు దర్యాప్తు చేయాలి. పెగసస్ స్పైవేర్ నాడు కొనుగోలు చేయాలని కోరారంటూ తేలుకుట్టిన దొంగలా లోకేశ్ ఇప్పుడు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ జరపాలి. -
పెగసస్ వ్యవహారంలో దొరికిపోవడం ఖాయం
సాక్షి, అమరావతి: పెగసస్ వ్యవహారంలో ఉత్తరకుమార ప్రగల్భాలు మాని కేసును ఎదుర్కొనేందుకు లోకేశ్ సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. హౌస్ కమిటీ విచారణలో పెగసస్ వినియోగంపై పూర్తి వాస్తవాలు బయటకొస్తాయన్నారు. కోర్టులో స్టే కూడా రాదని.. పూర్తి ఆధారాలతో దొరికిపోవడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికల్లో గెలవాలనే కుట్రతో వైఎస్సార్సీపీ నాయకులు, ఐఏఎస్ అధికారులు, సామాన్య ప్రజలు, సినిమా యాక్టర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని చౌర్యం చేస్తూ దుర్మార్గమైన పాలన సాగించారని విమర్శించారు. దీనిపై అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై కూడా చాలా ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. చంద్రబాబు రోడ్లపైన, కొడుకు లోకేశ్ శాసనమండలిలో సవాళ్లను విసరడం అలవాటుగా పెట్టుకున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఏ కేసులోనైనా స్టే తెచ్చుకోవచ్చనే ధైర్యంతో బతుకుతున్నారు తప్ప.. తప్పు చేయలేదనే ధైర్యం వారిలో లేదని ప్రజలందరికీ అర్థమైందన్నారు. జాతీయ భద్రత, ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశంలో చిన్నపిల్లాడిలా సవాళ్లు విసరడం సరికాదని లోకేశ్‌కు హితవుపలికారు. -
ఐదు కోట్ల ఆంధ్రుల సమాచారం చోరీ? సభా సంఘానికి సై
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెగసస్ స్పైవేర్ బాగోతంపై సోమవారం అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ ఏర్పాటుచేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. గత కొద్దిరోజులుగా ఈ స్పైవేర్ ఉదంతం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. టీడీపీ హయాంలో దీనిని కొనుగోలు చేశారన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో దీనిపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్ర శాసనసభలోనూ సోమవారం తీవ్ర దుమారం రేపింది. అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు, పలువురు సభ్యులు దీనిమీద స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. అందుకు స్పీకర్ జోక్యం చేసుకుని నోటీసు ఇచ్చారా ప్రశ్నించారు. దీంతో.. నోటీసు ఇచ్చినట్లు చీఫ్‌విప్ గడికోట శ్రీకాంతరెడ్డి తెలిపారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం ఈ అంశంపై చర్చ చేపడతామంటూ స్పీకర్ ప్రకటించారు. అనంతరం జరిగిన చర్చలో.. ఈ వ్యవహారం మీద సభా సంఘం ఏర్పాటుచేయాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. దీంతో సభా సంఘం ఏర్పాటుచేయడానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అడ్డగోలుగా ఓట్లను తొలగించారు ఇక చర్చలో పాల్గొన్న ఆర్థికమంత్రి బుగ్గన ప్రధానంగా మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరిగిందని, తమకు అనుకూలంగా లేనివారి ఓట్లను అడ్డగోలుగా తొలగించారని, అందుకోసం ప్రభుత్వ వ్యవస్థలను వాడుకున్నారని వివరించారు. తమ రాజకీయ లబ్ధికోసం అప్పటికప్పుడు కొత్త కంపెనీలను సృష్టించి ఇజ్రాయిల్ నుంచి పెగసస్ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరారు. ఐటీ గ్రిడ్, సేవామిత్ర ద్వారా ప్రజల స్వేచ్ఛకు చంద్రబాబు భంగం కలిగించారని, ఆ సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వేగంగా స్పందించడంతో టీడీపీ కుట్ర భగ్నమైందన్నారు. నిజానికి.. చంద్రబాబు, మమతా బెనర్జీలు కలిసి బీజేపీని ఓడించేందుకు ఒకప్పుడు పనిచేశారని, అలాంటి బెంగాల్ సీఎం ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడరని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అలాగే, పెగసస్ స్పైవేర్ వినియోగించారనడానికి.. ప్రతిపక్ష నాయకులు, పారిశ్రామికవేత్తలపై కూడా నిఘా పెట్టారనడానికి కొన్ని సంఘటనలు ఊతం ఇస్తున్నాయని బుగ్గన తెలిపారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే.. గత కొన్ని నెలలుగా దేశంలో ‘పెగసస్’ గురించి వివాదం రగులుతోంది. దీంతో సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్వీ రవీంద్రన్ చైర్మన్‌గా కమిటీని వేసింది. ఇందులో అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలోఖ్ జోషి, డాక్టర్ సందీప్ ఓబెరాయ్, మరో ముగ్గురితో కూడిన టెక్నికల్ కమిటీని నియమించింది. అలాగే, దేశంలోని ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ డీన్ అయిన డాక్టర్ నవీన్‌కుమార్ చౌదరి, అమృతా విద్యాపీఠం స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకరన్, ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ విభాగం హెడ్ డాక్టర్ అశ్విని అనిల్‌తో కూడిన కమిటీనీ వేసింది. ఈ నేపథ్యంలో.. ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో అక్కడి సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘నాలుగైదేళ్ల క్రితం స్పైవేర్ అమ్మేందుకు ఇజ్రాయిల్ కంపెనీ బెంగాల్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. అప్పట్లో రూ.25 కోట్ల మేర అడిగారు.. మేం తీసుకోలేదు. కానీ, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు స్పైవేర్ తీసుకున్నట్లు నాకు సమాచారం ఉంది’ అని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని ఈనాడు పత్రికలో కూడా వచ్చింది. మానవ హక్కులను చోరీ చేసినట్లే ఇక అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న పోలీసు ఉన్నతాధికారి ఇజ్రాయిల్ వెళ్లడం, ఆ తర్వాత ఆయన తనయుడు అప్పటికప్పుడే ఓ కంపెనీని నెలకొల్పడం పలు అనుమానాలను బలపరుస్తున్నాయి. వేరేవారి వ్యక్తిగత విషయాల్లోకి తొంగిచూడటం ఎంతో తప్పని తెలిసినా పెగసస్ స్పైవేర్ కొనుగోలు చేయడమంటే మానవ హక్కులను చోరీ చేసినట్లే. ఈ సాఫ్ట్వేర్ సాయంతో ఏదైనా ఫోన్‌కు మిస్డ్‌కాల్ ఇస్తే ఆ ఫోన్లోకి సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది. దీనిద్వారా మనం ఎవరికి ఫోన్ చేస్తున్నామో, మెసేజ్‌లు, వాట్సాప్, కాంటాక్టులు అవతలి వారికి తెలిసిపోతుంది. చివరకు ఫోన్ కెమెరాలోకి కూడా ఆ సాఫ్ట్వేర్ ప్రవేశిస్తుంది. మనం ఎక్కడున్నాం.. ఎవరితో మాట్లాడుతున్నాం.. తదితర వివరాలతో పాటు సమస్త సమాచారం తెలుసుకునేంత అత్యంత ప్రమాదకరమైన సాఫ్ట్వేర్ ఈ పెగసస్. ఎంత భద్రతా ప్రమాణాలున్న ఫోన్ అయినా ఈ సాఫ్ట్‌వేర్‌తో ట్రాక్‌చేసే ప్రమాదముంది. ఇలా పెగసస్‌తో మొత్తం 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం మొత్తం 2017, 18, 19లో చోరీకి గురైనట్లు నిర్ధారణ అవుతోంది. దీనిని కొనుగోలు చేశారా? చేసి ఉంటే దీనితో ఏమేం చేశారో చూడాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు జూలై 2020, 21లో చేసిన దర్యాప్తులో అజర్బైజాన్, హంగేరి, కజకిస్థాన్, మెక్సికో, మొరాకో, రువాండా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో పాటు భారత్‌లో కూడా ఈ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను కొని వినియోగించారని తేల్చారు. పెగాసస్‌పై 2019లో వాట్సప్, ఐఫోన్ కంపెనీలు సైతం ఫిర్యాదులు చేశాయి. ఆఘమేఘాలపై ప్రతిపాదనలు.. కంపెనీ ఏర్పాటు.. ఒప్పందం.. భద్రతా అవసరాల కోసం డ్రోన్లు కొనుగోలు చేయాలని అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు 2017 జూన్ 14న నాటి డీజీపీకి ప్రతిపాదించారు. అలాగే, ఆగస్టు 30న ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పటి డీజీపీ లేఖ రాశారు. అందులో భద్రతా అవసరాల కోసం డ్రోన్లు కొనుగోలు చేయాలని.. ఇంటెలిజెన్స్ చీఫ్ అడుగుతున్నందున వాటిని స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. దీంతో టెండర్లు ఆహ్వానించారు. నాలుగు కంపెనీలు.. మెస్సర్స్ రేడియల్ట్ కోరల్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు, మెస్సర్స్ ఆల్సాఫ్ హెలికైడ్స్ లిమిటెడ్ ఇంగ్లండ్, మెస్సర్స్ ఆర్టీ ఇన్ప్లైటబుల్ ఆబ్జెక్టŠస్ లిమిటెడ్ ఇజ్రాయిల్, మెస్సర్స్ ఎన్‌వీఎం స్కైటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురుగ్రామ్ సంస్థలు ముందుకొచ్చాయి. వీటిలో ఆర్టీ ఇన్ప్లైటబుల్ ఆబ్జెక్టŠస్ లిమిటెడ్ తప్ప మిగతావి వెనక్కి వెళ్లిపోయాయి. మరోవైపు.. ఇజ్రాయిల్‌కు చెందిన ఆర్టీ ఇన్ప్లైటబుల్ ఆబ్జెక్టŠస్ లిమిటెడ్ కంపెనీకి ఇండియాలో డీలర్.. ఏబీ వెంకటేశ్వరరావు కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్డ్స్ సిస్టమ్స్ కంపెనీ. దీన్ని 2017 జూలై 11న స్థాపించారు. అదే ఏడాది జూన్ 14న ఏబీ వెంకటేశ్వరరావు డ్రోన్లు కొనాలని ప్రతిపాదించారు. అంతేకాదు.. ఏబీ అదే ఏడాది ఏప్రిల్ 2న, నవంబర్ 19న ఇజ్రాయిల్‌కు వెళ్లారు. పరికరాల కొనుగోలుకు రూ.16 కోట్లు మంజూరైన తరువాత.. అది చాలదని చెప్పారు. రూ.3.37 కోట్ల లెఫ్ట్‌ఓవర్ బడ్జెట్ ఉందని.. అర్జెంట్‌గా రూ.16కోట్లతో వాటిని కలిపి అప్పటికే మంజూరైన ప్రాజెక్టులను రద్దుచేసి వాటికి చెందిన రూ.4.80 కోట్లు ఇవ్వాలని లేఖ రాశారు. అలాగే, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్ డ్రోన్లకు రూ.22.19 కోట్లు, ఎయిరోస్టాట్స్ డ్రోన్లకు రూ.3.31 కోట్లు.. రెండూ కలిపి రూ.25.5 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత పలువురు పోలీస్ ఉన్నతాధికారులు సమావేశమై ఈ డ్రోన్ల ప్రాజెక్టును రద్దుచేశారు. కానీ, ఏబీ వెంకటేశ్వరరావు వాటిని పునరుద్ధరించాలని పదేపదే కోరిన విషయం కూడా కనిపిస్తోంది. ఇజ్రాయిల్ నుంచి పెగసస్ స్పైవేర్, నిఘాకు డ్రోన్లు కొనుగోలు చేసి, వాటితో నాటి ప్రతిపక్ష పార్టీ నేతలపైనా.. సినీ పెద్దలు, పారిశ్రామిక రంగ ప్రముఖులపైనా ప్రయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ నేత సజ్జలతో పాటు పార్టీకి చెందిన పలువురి ఫోన్ నంబర్లు అన్నీ కలిపి 2018 డిసెంబర్ 24న అధికారికంగా ట్యాపింగ్‌లో పెట్టారు. ఉగ్రవాదులు, అంతర్జాతీయ నేరస్తులకు సంబంధించిన జాబితాలో వీరి నెంబర్లు కూడా చేర్చారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లో అఫిడవిట్ సమర్పించారు. వ్యతిరేకులపై పెగసస్ ప్రయోగం అంతేకాదు.. చంద్రబాబు హైదరాబాద్‌లో ఐటీ గ్రిడ్ పేరుతో ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటుచేసి ప్రజలపై ప్రయోగించారు. రాజకీయ నేతలతో పాటు ప్రతి ఓటరుపై నిఘా పెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఐటీ గ్రిడ్ కంపెనీ మీద 2019 మార్చి 2న మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సేవా మిత్ర యాప్ ద్వారా ప్రతీ ఓటరు మీద నిఘా పెట్టి తద్వారా వారు ఏ పార్టీకి ఓటు వేసేందుకు అవకాశం ఉందో తెలుసుకున్న తరువాత వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. అంతకుముందు.. 2016లో టీడీపీ ప్రజా సాధికార సర్వేను మొదలుపెట్టి పథకాల లబ్ధిదారుల వివరాలు తీసుకుంది. తరువాత ఆర్టీజీఎస్ అనే వ్యవస్థ పెట్టి డేటా అంతా ఇంటిగ్రేట్ చేసుకున్నారు. ‘1100’ నెంబర్ ద్వారా పథకాలన్నీ అందుతున్నాయా అని ఫోన్లు చేసేవారు. ఎవరైనా టీడీపీ పాలన బాగోలేదని చెబితే.. వారిని ఓటరు జాబితా నుంచి తొలగించే వారు. నిజానికి.. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు అశోక్ దాకవరం రాష్ట్ర ప్రజల ఆధార్ డేటాను అనైతికంగా, చట్టవిరుద్ధంగా చోరీచేసి ఐటీ గ్రిడ్‌కు ఇచ్చారు. సేవామిత్ర ట్యాబ్‌ల్లో ఆ డేటా అంతా ఉంది. వీటన్నింటి ఆధారాలను సభ ముందుంచుతున్నా. వ్యక్తిగత సమాచారం చోరీ చేయడం, ఓట్లను తొలగించడం, ఫోన్లు ట్యాంపరింగ్ చేయడం వంటి తీవ్ర ఆరోపణలపై లోతుగా విచారణ జరిపి ఈ మొత్తం అంశంపై సభా సంఘం ఏర్పాటుచేసి గత టీడీపీ ప్రభుత్వ నేరాలపై విచారణ చేయాలి.. అని బుగ్గన కోరారు. ‘మండలి’లోనూ పట్టు మరోవైపు.. పెగాసెస్ అంశంపై హౌస్ కమిటీ ద్వారా లేదా మరో రూపంలో విచారణ జరిపించాలని శాసన మండలిలోనూ పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, మహ్మద్ ఇక్బాల్, మొండితోక అరుణ్‌కుమార్, కృష్ణరాఘవ జయేంద్ర భరత్‌లు సభలో దీనిపై మాట్లాడారు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ.. ఏ నిబంధన ప్రకారం ఈ అంశంపై చర్చకు అనుమతించారని చైర్మన్ మోషేన్‌రాజును ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ.. ఇది చర్చకాదని, సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని చెప్పారు. -
చంద్రబాబు చర్యల్ని ఏబీ సమర్థంచడం దుర్మార్గం :అంబటి
-
చంద్రబాబు పెదవి విప్పడం లేదు.. మీరు ప్రెస్‌మీట్ పెట్డడం ఏమిటి?
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొన్నిరోజులు క్రితం అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనిపై ఏపీ అసెంబ్లీలో సోమవారం చర్చ జరగ్గా, ఈ వ్యవహారంపై విచారణకు హౌస్ కమిటీ వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే ఆ వెంటనే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టడం చర్చనీయాంశమైంది. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నాస్త్రాలు సంధించారు. శాసనసభలో హౌస్ కమిటీ వేస్తామని స్పీకర్ ప్రకటించిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు స్పందించాలి కానీ ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకు రావడం ఏమిటని నిలదీశారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘పెగాసెస్‌పై శాసనసభ హౌస్ కమిటీని వేసింది. చంద్రబాబు పెగాసెస్ కొన్నారని మమతాబెనర్జీ స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు. దీనిపై మేము కూడా గత ఎన్నికలకు ముందే చెప్పాం. మమతాబెనర్జీ చెప్పాక టీడీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారు. చంద్రబాబు మాత్రం ఇంతవరకు బయటకు వచ్చి దీనిపై ఎందుకు మాట్లాడలేదు?. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి చంద్రబాబును సమర్ధిస్తూ మాట్లాడటం ఆశ్చర్యం వేసింది. ఒక అధికారి ఇలా మాజీ ముఖ్యమంత్రిని వెనుకేసుకు రావటం ఏంటి?, చంద్రబాబు, లోకేష్ ఆస్తులు ఎలా పెరిగాయో విచారణ జరపమంటే ఎందుకు మాట్లాడటం లేదు?, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్ అయిన అధికారి మాత్రమే. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు?. అక్రమాలు జరగలేదని చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదు?, ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు?.. నేరుగా వెళ్లి టీడీపీ ఆఫీసులో పెట్టుకోవచ్చుగా? 23 మంది మా ఎమ్మెల్యేలను మా పార్టీ నుండి టీడీపీలోకి మార్చలేదా?, చంద్రబాబుకు ఊడిగం చేశారు. ఐపీఎస్ అనే పదవికి సిగ్గుచేటు తెచ్చారు. మా చంద్రబాబుకు అన్యాయం జరుగుతోందంటూ ఆయన్ని కాపాడటానికి ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు బయటకు వచ్చారు. దేశం కోసం కాదు, తెలుగుదేశం కోసం పని చేశారు. ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా టీడీపీ బానిసలాగా వ్యవహరిస్తున్నారు’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు. -
హౌస్ కమిటీ అంటే టీడీపీకి భయమెందుకు?: మంత్రి కన్నబాబు
-
హౌస్ కమిటీ అంటే టీడీపీకి భయమెందుకు?
తాడేపల్లి: పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేస్తే టీడీపీకి భయమెందుకని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. ‘తప్పు చేశాం.. ప్రాయశ్చిత్తం చేసుకుందాం’ అని కూడా టీడీపీకి లేదని కన్నబాబు విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడిన కన్నబాబు పెగాసస్ వ్యవహారంపై కమిటీ వేయడం శుభపరిణామం అని అన్నారు. కాగా, పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం మాట్లాడుతూ.. పెగాసస్‌పై హౌస్‌కమిటీ వేస్తున్నామని ప్రకటించారు. ఈ వ్యవహారంపై విచారణ హౌస్ కమిటీ విచారణ చేపడుతుందని తెలిపారు. దీనికీ సంబంధించి కమిటీ సభ్యులను రేపు(మంగళవారం) కానీ, ఎల్లుండి(బుధవారం)కానీ ప్రకటిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం రూ.25 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందనేది పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం కలకలం సృష్టిస్తుండగా, దీనిపై హౌస్ కమిటీ వేస్తున్నట్లు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని అసెంబ్లీలో ప్రకటించారు. ‘అనధికార సంఘటనలకు ఈనాడు మద్దతు పలుకుతుందా?’ -
నేరమే అధికారమై..!
నేరమే అధికారమై నేరం చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చున్న ప్రతివాడూ నేరస్థుడే అన్నాడొక మహానుభావుడు. నేరమే అధికారమై నేరం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఒకానొక పాపిష్టి ఘటన ఇంకా మన జ్ఞాపకాల్లో సజీవంగానే నిలిచి ఉన్నది. ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’! అధికార పీఠమెక్కిన నేరస్వరానికి బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఆడియో!! ఆ కంఠస్వరం అక్షరాలా ‘ఆయన’దేనని ఆడియోను పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. అంత చక్కని ఇంగ్లీష్ భాషలో ‘ఆయన’ తప్ప ఇంకెవ్వరూ మాట్లాడలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆ రోజుల్లోనే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని, తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టి నేరం చేస్తూ దొరికిపోయిన జుగుప్సాకర సన్నివేశం అది. పొరుగు రాష్ట్ర శాసనసభ్యుడిని కొనుగోలు చేస్తూ, ఆడియో – వీడియోల సాక్షిగా నోట్ల కట్టల సూట్‌కేసుతో బుక్కయిన ఒక అసభ్య చిత్రమది. కొన్ని కోట్లమంది ‘బ్రీఫ్డ్ మీ’ ఆవాజ్‌ను విని ఉంటారు. ఆ గొంతు ఎవరిదీ అనే అనుమానం ఎవరికీ వచ్చి ఉండే ఆస్కారం లేదు. ఒకవేళ వచ్చినా ఫోరెన్సిక్ నివేదిక దాన్ని పటాపంచలు చేసింది. అయినా ఆ నాయకుడి మీద కేసు పడలేదు. ఆయన ఆదేశాలు పాటించిన వారి మీద మాత్రమే ఇప్పుడు కేసు నడుస్తున్నది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలను విజయవంతంగా నడిపించడంలో, ఇతరేతర సంస్థలను, వ్యవస్థలను మెప్పించడంలో గొప్ప దిట్టగా చంద్రబాబుకు పేరున్నది. ఎన్టీఆర్ ప్రభుత్వాన్నీ, పార్టీనీ కబ్జా చేసిన చంద్రబాబు ఆ తర్వాత బాజప్తా న్యాయస్థానం ద్వారానే సైకిల్ గుర్తునూ, పార్టీ జెండానూ, పార్టీ బ్యాంక్ అక్కౌంట్స్నూ స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ స్వయంగా తన చేతుల మీదుగానే పార్టీని నిర్మించారనీ, ప్రభుత్వాన్ని స్థాపించారనీ, పార్టీ పతాకాన్ని డిజైన్ చేశారనీ, సైకిల్ గుర్తును ఎంపిక చేసుకున్నారనీ తెలుగు ప్రజలందరికీ తెలుసు. అయినా కోట్లాదిమంది కామన్సెన్స్ను ఓడించి, కోర్టులో గెలవగలిగారు. ఆయన వ్యాజ్య నైపుణ్యం అటువంటిది. ఒక నాయకుడిపై వచ్చిన ఆరోపణల్ని దర్యాప్తు చేయాలని సాక్షాత్తూ హైకోర్టు కోరినప్పుడు తమ దగ్గర తగినంత సిబ్బంది లేదని సీబీఐ తప్పించుకున్న ఘటన ఇంకోటి ఏదైనా ఉన్నదా? చంద్రబాబు విషయంలో మాత్రమే అలా జరిగింది. అందువల్ల ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పేరు లేకపోవడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయించిన ‘ఐటి గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ముందుపెట్టి, కోట్లాది మంది ఓటర్ల సమస్త సమాచారాన్ని అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ తస్కరింపజేశారనీ ఆధారాలతో సహా వెల్లడైంది. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారన్న అధారాలు కూడా దొరికాయి. వాటిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ప్రతిపక్ష నేతలు, ప్రజలకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ దొంగిలించడం కోసం అప్పటి ఇంటెలిజెన్స్ ఐజీ పలుమార్లు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లి, ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. మరో ఇద్దరు ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సాఫ్ట్వేర్ సామర్ధ్యాన్ని పరిశీలించి వచ్చారని సమాచారం. ఆ సాఫ్ట్వేర్ మరేదో కాదు పక్కా పెగసస్ అనేదానికి మరో తిరుగులేని రుజువు ఇప్పుడు దొరికింది. గురువారం నాడు బెంగాల్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ సందర్భానుసారం పెగసస్ ప్రస్తావన తెచ్చారు. పెగసస్‌పై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన నేపథ్యంలో ఈ ప్రస్తావన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఈ సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు ఇజ్రాయెల్ సంస్థ తమ పోలీస్ విభాగాన్ని కూడా సంప్రదించిందనీ, విషయం తన దృష్టికి రావడంతో తాను తిరస్కరించాననీ ఆమె చెప్పారు. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారని కూడా ఆమె కుండబద్దలు కొట్టారు. చంద్రబాబుతో ఆమెకు విరోధమేమీ లేదు. గడచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రంలో ఆమె ప్రచారం కూడా చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న కీలక నేత కావడం, చంద్రబాబుతో స్నేహ సంబంధాలు కలిగి ఉండడం మూలంగా ఆమె ప్రకటనకు విశ్వసనీయత చేకూరింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’ అవసరాల కోసం ఎన్ఎస్ఓ అనే రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థ ఈ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేసింది. ప్రపంచ దేశాల గూఢచార సంస్థలన్నింటిలోకి సమర్థత ప్రాతిపదికన ‘మొసాద్’ అగ్రస్థానంలో ఉన్నది. ఎంతో విస్తృత ప్రచారమున్న సీఐఏ, కేజీబీ వగైరా సంస్థలన్నీ మొసాద్ ముందు దిగదుడుపే! మొసాద్ చేతికి ఈ సాఫ్ట్వేర్ అందిన తర్వాత ఇరుగు–పొరుగు మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాల్లో వందలాదిమంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ఎన్జీవోల ప్రతినిధులు హత్యలకు గురికావడం, ప్రమాదాల్లో మరణించడం సంభవించిందని అంచనా. గ్రీకు పురాణాల్లో దివ్య మహిమలు గల రెక్కలగుర్రం పేరు – పెగసస్. అంతటి శక్తిమంతమైనదన్న ఉద్దేశంతో ఈ సాఫ్ట్‌వేర్‌కు ఆ పేరు పెట్టి ఉంటారు. పెగసస్ సాఫ్ట్‌వేర్‌కు నిజంగానే ఊహాతీతమైన మహిమలున్నాయి. ఎవరి ఫోన్ నంబర్‌ను అయినా సరే, తమ సర్వర్‌లో ఫీడ్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్‌కు ఒక ఎస్ఎమ్ఎస్నో, వాట్సప్ మెసేజ్‌నో, ఒక మెయిల్నో పంపిస్తారు. మీరు దాన్ని ఓపెన్ చేసినా, చేయకపోయినా పెగసస్ అప్లికేషన్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక ఫోన్‌కాల్‌తో కూడా ఇన్స్టాల్ చేయవచ్చు, మీరు ఫోన్ ఎత్తకపోయినా సరే! ఇక అక్కడి నుంచి మీ ప్రతి కదలికా... అవతలి వారికి తెలిసిపోతుంది. తమ ఫోన్ ట్యాప్ అవుతున్నదని అనుమానం వచ్చిన వాళ్లు ఫోన్లో మాట్లాడకుండా వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడాలనుకోవచ్చు. చేతిలో ఫోన్ పట్టుకుని వెళ్లి వ్యక్తిగతంగా మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఫోన్లో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్ దాని పనిని అది చేస్తుంది. మీ ఎదుటి వ్యక్తి ఫోటోను తీస్తుంది. మీ మాటల్నీ, అతడి మాటల్నీ రికార్డు చేస్తుంది. వాట్సప్ మెసేజ్‌లు, ఈ–మెయిల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లూ, ఫేస్ బుక్ వగైరా అన్నిరకాల సమాచారాన్నీ సంగ్రహిస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరున్న సోర్స్ కోడ్‌కు వెళ్తుంది. అక్కడ్నుంచి క్లయింట్‌కు చేరుతుంది. అంటే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన క్లయింట్లు ఈ దేశ ప్రముఖుల రహస్యాలనూ, ప్రజల సమాచారాన్నీ విదేశీ సంస్థ గుప్పెట్లో డబ్బులిచ్చి మరీ పెడుతున్నారన్నమాట! ఈ లెక్కన చంద్రబాబు కూడా ఈ పని చేశారు. ఆయన ఏటా 35 కోట్ల రూపాయల చొప్పున చెల్లించి మూడేళ్లపాటు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని తెలుస్తున్నది. ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కుట్రపూరితంగా తెలుసుకోదలిచినా, అతడి కదలికలను కనిపెట్టే ప్రయత్నం చేసినా... భారత రాజ్యాంగం 21 (ఎ) అధికరణం, ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్, ఐటీ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (1872)ల ప్రకారం అది పెద్ద నేరం. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి టెలిఫోన్‌ను ట్యాప్ చేయాలి అంటే అతడు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నాడనీ, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో భాగస్థుడనీ స్పష్టమైన సమాచారం ఉండాలి. ఐటీ యాక్ట్ ప్రకారం రాష్ట్ర డీజీపీ కేంద్ర హోంశాఖకు లేఖ రాసి, ఫోన్ ట్యాపింగ్ అనుమతిని తీసుకోవాలి. అందుకు అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ నుంచి సదరు లేఖ టెలికామ్ నోడల్ ఏజెన్సీకి చేరుతుంది. అప్పుడు అనుమానిత వ్యక్తి డేటాను రికార్డు చేసి రాష్ట్ర పోలీసు శాఖకు పంపిస్తారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి మనదేశంలో పాటించే విధానం ఇది. ఇక్కడ కేంద్రంతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్ సంస్థ ద్వారా పెగసస్ గూఢచర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నడిపించినట్టు అర్థమవుతున్నది. ఇది దేశద్రోహం కంటే పెద్ద నేరమవుతుంది. నేరమే అధికారమై, ప్రజల్ని నేరస్థుల్ని చేసి వేటాడుతుంటే ఊరక కూర్చున్న ప్రతివాడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఇక్కడ నేరమే అధికారమై, ప్రత్యర్థుల్ని నేరస్థులుగా ముద్రవేసి వేటాడిన దుర్దినాలను ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం దాటి వచ్చింది. అధికారం కోల్పోయినా నేరస్వభావం మారలేదు. ప్రత్యర్థులపై ముద్రలు వేసి గగ్గోలు పుట్టించాలని చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న ఎకో సిస్టమ్ ఇప్పటికీ సర్వశక్తులూ ఒడ్డుతూనే ఉన్నది. దాని ఉపాంగమైన మీడియా సింఫనీ నిర్విరామంగా సాగుతూనే ఉన్నది. అధికార పీఠం మీద ఉన్నప్పుడు రచించిన అవినీతి పురాణం డజన్ల కొద్దీ అధ్యాయాలతో ఒక పుస్తకంగానే వెలుగు చూసింది. రాజధాని పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్, భూములతో గేమింగ్, రాజధాని నిర్మాణం పేరుతో స్విస్ ఛాలెంజ్ కుంభకోణం, విశాఖపట్నంలో సృష్టించిన భూకంపం, సదావర్తి సత్రం నిలువు దోపిడీ, అస్మదీయులకు కారుచౌకగా భూ నజరానాలు, మద్యం సిండికేట్ల నుంచి పిండుకున్న ముడుపుల గుట్టలు, అగ్రిగోల్డ్ ఆస్తుల నిలువు దోపిడీ – బాధితులకు పంగనామాలు, ఇసుక మాఫియా పిండుకున్న ‘తైలం’, పోలవరాన్ని ఏటీఎమ్‌గా వాడుకోవడం, నీరు – చెట్టు పేరుతో నిత్యశఠగోపం, గ్రానైట్ ఫలహారానికి స్కెచ్‌లు, బరైటీస్ దందాల బిందాస్, విదేశీ బొగ్గును భోంచేయడం... ఇలా ఇదో గాథాసప్తశతి! బృహత్కథా మంజరి!! తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత దాని చుట్టూ ఒక ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తన పార్టీతోపాటు ఇతర పార్టీల్లోని కొన్ని స్వార్థపూరిత శక్తులు, సొంత ప్రయోజనాల కోసం పనిచేసే మీడియా పెద్దలు, వివిధ సంస్థల్లో, వ్యవస్థల్లో కీలక పదవుల్లో ఉండే తనవారు ఈ సిస్టమ్‌లో భాగం. చంద్రబాబుకు అవసరమైనప్పుడు వీరంతా ఎవరి పాత్రను వారు పోషిస్తారు. చూసేవాళ్లకు అంతా యాదృచ్ఛికమనే భావన కలుగుతుంది. కానీ అంతా ఒక పకడ్బందీ స్క్రిప్ట్ ప్రకారమే నాటక ప్రదర్శన జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నేరాలకు, ఘోరాలకు మూల్యం చెల్లించవలసిన సమయమిది. రచ్చబండ వద్ద నిలబెట్టి ప్రశ్నించవలసిన తరుణమిది. కానీ, తెలుగుదేశం, దాని మిత్రకూటమి ఎజెండాను పక్కదారి పట్టించే పనిలో బిజీగా నిమగ్నమైంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పరిపాలనా సంస్కరణలు, విద్య – వైద్యరంగాల్లో మొలకెత్తిన విప్లవం, వ్యవసాయరంగంలో కనిపిస్తున్న సుస్థిరాభివృద్ధి నాగేటి చాళ్లు, పేదవర్గాల ప్రజల్లో పరుచుకుంటున్న కులాతీత సాధికార చైతన్యం... ఇవన్నీ గొప్ప సామాజిక – ఆర్థిక పరిశోధనాంశాలు. దేశవ్యాప్తంగా ఈ మార్పుల మీద చర్చ జరగడం ఒక చారిత్రక అవసరం. కానీ తెలుగుదేశం నడిపించే మీడియాలో ఈ నిశ్శబ్ద విప్లవానికి ఏనాడూ సెంటీమీటర్ చోటు లభించదు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పులుముకున్న అవినీతి అరాచక పాలన బురదను మరిచిపోవడానికి అధికార పార్టీపై బురదను కుమ్మరించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపట్టారు. దాని లక్ష్యం సుస్పష్టం. గడచిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి యాభై శాతం ఓట్లు పడ్డాయి. దాని ఓటింగ్ బలం ఇంకొంత పెరిగిందని ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. దాని ఓటింగ్ బలాన్ని ఓ ఐదారు శాతం మేరకు తగ్గించగలగాలి. అందుకోసం దుష్ప్రచారాల దండోరా! లేకపోతే... వైఎస్ వివేకా హత్య ఎప్పుడు జరిగింది? ఆ హత్య జరిగిన తర్వాత రెండున్నర నెలలపాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పోలీసులే దర్యాప్తు జరిపారు. వైఎస్ జగన్‌ను ఇరుకున పెట్టగలిగే ఏ ఒక్క ఆధారం దొరికినా చంద్రబాబు వదిలేవాడేనా? రెండున్నరేళ్ల తర్వాత ఈ కొత్త పాటేమిటి? కొత్త ప్రచారం ఏమిటి? మొదట్లో తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోసిన వివేకా కూతురు హఠాత్తుగా ప్లేటు మార్చడం ఏమిటి? ఆమెకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం టిక్కెట్టిస్తారన్న ప్రచారం ఎందుకొస్తున్నది? ఇదంతా ఒక స్కీమ్‌లా కనిపించడం లేదా? మిగిలిన దుష్ప్రచారాలన్నీ ఈ తరహావే! ఒక్కో ఆరోపణను సాంగోపాంగంగా తర్కించి పరిశీలిస్తే తేలేది బోగస్ కథనాలే! ఈ ప్రచారాల ద్వారా అధికార పార్టీ ఓట్లను తగ్గించడం వ్యూహంలో ఒక భాగం. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కలిసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఓట్లు చీలకుండా చూడటం రెండో భాగం. వ్యూహంలో రెండో భాగాన్ని మొన్ననే పవన్ కల్యాణ్ నిర్ధారించారు. చంద్రబాబు పవన్ మీద తనకున్న ఒన్ సైడ్ లవ్‌ను ప్రకటించిన మూడు మాసాలకు పవన్ స్పందించారు. ఆ ప్రేమను స్వీకరిస్తూ, ఓట్లు చీలకూడదని సందేశాన్నిచ్చారు. పాలక పార్టీ మీద తొడగొట్టినంత తీవ్రంగా దాడి చేశారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39 శాతం ఓట్లు వస్తే జనసేనకు వచ్చింది ఏడు శాతమే. మరి కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి? ఓట్ల శాతం ప్రకారం పవన్ పార్టీ కూరలో కరివేపాకే కదా! మరి కరివేపాకులే తొడలు కొడితే బాలయ్య బాబులు ఏం చేయాలి? విశాల ప్రజానీకం దైనందిన జీవితాల్లో వస్తున్న మార్పులే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి తప్ప కరివేపాకులు, కలగూరగంపలు చేయగలిగిందేమీ ఉండదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
చంద్రబాబు పెద్ద ట్యాపింగ్ నాయుడు: ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
-
చంద్రబాబు పెద్ద ట్యాపింగ్ నాయుడు: ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: పెగాసస్‌ను చంద్రబాబు ఎవరి కోసం కొన్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. ఆయన శనివారం మీడియతో మాట్లాడుతూ.. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని పేర్కొన్నారు. పెగాసస్ వెనుక ఎవరెవరు ఉన్నారో వెలికితీయాలని అన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ఏం చేశారో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఎవరి సంభాషణలు వినడానికి పెగాసస్ కొన్నారో తెలియాలని మండిపడ్డారు. ఇతరుల ఫోన్ సంభాషణలు దొంగతనంగా వినడం క్షమించరాని నేరమని దుయ్యబట్టారు. చంద్రబాబు పెద్ద ట్యాపింగ్ నాయుడు అని ఎద్దేవా చేశారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వయంగా చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమ వ్యవహారాన్ని బయట పెట్టిందని గుర్తుచేశారు. పెగాసస్ స్పైవైర్ కొనుగోళ్లు కుట్రపై పూర్తి స్థాయి విచారణ జరగాలన్నారు. ఎవరి రహస్యాలు తెలుసుకోవడానికి చంద్రబాబు ఈ వ్యవహారం చేశారో బయటకు రావాలన్నారు. ఇది కేవలం ఏపీ వ్యవహారం కాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశంగా కేంద్రం భావించాలని తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా కేవలం ఫోన్ సమాచారం మాత్రమే కాదు ఎన్నో రహస్యాలు తెలుసుకునే అవకాశం ఉందని మండిపడ్డారు. ఇంత పెద్ద నేరానికి పాల్పడిన చంద్రబాబుపై చర్యలు అవసరమని అన్నారు. ఓటుకు నోటు కేసు విషయంలో సెక్షన్ 8 గురించి మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు ఓ సీనియర్ సీఎం మమత బెనర్జీ స్వయంగా చెప్పిన దశలో చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. -
పెగాసస్‌తో ఎవరి ఫోన్‌నైనా టాప్ చేయవచ్చు: అబ్బయ్య చౌదరి
సాక్షి, ఏలూరు: ఏపీలో పెగాసన్ దుమారం కొనసాగుతోంది. చంద్రబాబు హయంలో పెగాసస్ వాడకంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పెగాసస్ అంశంపై వైఎస్ఆర్సీపీ దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పెగాసస్ ద్వారా ఎవరి ఫోన్‌నైనా టాప్ చేయవచ్చు. మన ఫోన్లో డేటాను పూర్తిగా పరిశీలించవచ్చు.. ఈ శాతాబ్దంలోనే అతి పెద్ద స్కామ్ ఇది.. మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని గతంలోనే గ్రహించాం. పెగాసస్ స్పైవేర్‌తో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారు.. అధికార దాహంతోనే ఎలాంటి కుట్రకైనా పాల్పడే వ్యక్తి చంద్రబాబు.. ప్రత్యర్థి పార్టీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే పెగాసస్ కొన్నారు.. గతంలో చంద్రబాబుతో రాజకీయంగా జతకట్టిన మమతా బెనర్జీనే పెగాసస్ గురించి చెప్పారు’’. అని అన్నారు. -
అది ఇప్పుడు నిజమని తేలిపోయింది: మంత్రి వెల్లంపల్లి
-
‘అది నిజమేనని తేలిపోయింది’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పెగాసస్‌ను ఉపయోగించారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ, తమ ఫోన్లను ట్యాప్ చేశారని, ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలోనే చెప్పామన్నారు. అది ఇప్పుడు నిజమని తేలిపోయిందన్నారు. చదవండి: పెగాసస్‌పై టీడీపీ ఎందుకు కంగారుపడుతోంది: అంబటి రాంబాబు చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయాలని, కేంద్రాని కూడా కోరతామని తెలిపారు. ప్రజా క్షేత్రంలో నిలబడలేక చంద్రబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడైతే విచారణ జరపమని ఆయనే డిమాండ్ చేయాలన్నారు. పెగాసస్‌ను ఉపయోగించడం ద్వారా రాష్ట్రానికే కాదు. దేశ రక్షణకు విఘాతం కలిగించారన్నారు. చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లంపల్లి డిమాండ్ చేశారు. -
బాబు.. ఏబీ.. ఓ పెగసస్ ఇప్పుడేమంటారు..?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం రూ.25 కోట్లతో ఇజ్రాయెల్ నుంచి పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందనేది నూటికి నూరు శాతం నిజమని నిర్ధారణ అయ్యింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో చంద్రబాబు రాజకీయ పన్నాగాలు జాతీయ స్థాయిలో బహిర్గతమయ్యాయి. ఇదే విషయంపై 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసినప్పుడు ఒకింత సందేహాస్పదంగా చూసిన వారంతా, చంద్రబాబు రాజకీయ ప్రయాణమంతా అడ్డదారులేనని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మమతా బెనర్జీ ఈ విషయమై స్పష్టమైన సమాచారం ఉండబట్టే ఈ ప్రకటన చేశారని అధికారులు, విశ్లేషకులు భావిస్తున్నారు. ముందుగా స్పైవేర్ పరికరాలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ సహకారాన్ని ఆశించారు. అందుకే తాను కొనుగోలు చేసిన స్పైవేర్ సాఫ్ట్వేర్ సమాచారం గురించి ఆమెకు తెలిపారు. కొనుగోలు చేయాలంటూ సంప్రదింపులు జరిపారు. అప్పటి ఇంటలిజెన్స్ విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో కంపెనీ ప్రతినిధులు పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం ఏపీలో సమర్థంగా ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నామని రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగం అధికారులు మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారులకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఫోన్ ట్యాపింగ్ అప్రజాస్వామ్యంగా భావించడంతోపాటు నేరమని మమత అప్పట్లో స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయదని తేల్చి చెప్పారు. టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం మమతా బెనర్జీ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఈ విషయం గురించి మరోమారు చర్చించగా, ఆమె సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. చంద్రబాబు డైరెక్షన్.. ఏబీ యాక్షన్ టీడీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందని గుర్తించిన అప్పటి సీఎం చంద్రబాబు 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు కుతంత్రాలకు తెరతీశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ ఓ వైపు, ఓటర్ల డాటా చోరీకి మరోవైపు పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను అప్పటి ప్రభుత్వ ఇంటలిజెన్స్ విభాగం చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుకు అప్పగించారు. ఎందుకంటే అప్పటికే 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి, టీడీపీలో చేర్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఫోన్ల ట్యాపింగ్, డాటా చోరీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. 3.50 కోట్ల మంది డేటా చోరీ రాష్ట్ర ఓటర్ల వ్యక్తిగత వివరాల చోరీకి చంద్రబాబు అండ్ కో హైదరాబాద్‌లోని ‘ఐటీ గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ కేంద్రంగా తెరలేపింది. టీడీపీ ఎన్నికల ప్రచారం కోసం ‘సేవా మిత్ర’ అనే యాప్‌ను ఈ కంపెనీ రూపొందించింది. ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా కొనుగోలు చేసిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రాష్ట్ర ఓటర్ల వ్యక్తిగత డాటాను తస్కరించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ ఆధీనంలో ఉండే అత్యంత విశ్వసనీయమైన ఆధార్ డాటాను తస్కరించడం విస్మయ పరుస్తోంది. మరోవైపు బ్యాంకు ఖాతాల డాటాలోకి చొరబడి ఆ వివరాలను కూడా సేకరించారు. ఏకంగా రాష్ట్రంలో 3.50 కోట్ల మంది ఓటర్ల వ్యక్తిగత వివరాలు చోరీ చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను భద్రపరిచే బాధ్యతను విశాఖపట్నానికి చెందిన ‘బ్లూ ఫ్రాగ్’ అనే కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ వద్ద ఉన్న లబ్ధిదారుల వివరాలను కూడా ఐటీ గ్రిడ్స్ కంపెనీకి అందుబాటులోకి తెచ్చింది. దాంతో టీడీపీ ప్రచారం కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్‌ను రాష్ట్రంలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు, బాం్యకు ఖాతాలు, ఇతర వ్యక్తిగత సమాచారంతో అనుసంధానించారు. కుట్రపై అప్పట్లోనే ఫిర్యాదు అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతోపాటు టీడీపీ అనుకూల ఓటర్ల పేర్లను ఒకటికి మించి నియోజకవర్గాల్లో చేర్చేందుకు ఎత్తుగడ వేశారు. 2019 ఎన్నికల్లో భారీ అక్రమాలకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేశారు. దీన్ని గుర్తించిన వైఎస్సార్సీపీ.. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లింది. మరోవైపు ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీకి పాల్పడుతుండటంపై హైదరాబాద్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై హైదరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ కంపెనీలో తనిఖీలు చేయడంతో మొత్తం బండారం బట్టబయలైంది. దాంతో ఆ కంపెనీకి చెందిన రెండు కార్యాలయాల్లో ఏపీ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ఓటర్ల వివరాలకు సంబంధించిన కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీపై కేసు నమోదు చేశారు. డేటా చోరీకి పాల్పడుతున్న కేసులో ఐటీ గ్రిడ్స్ కంపెనీ ప్రతినిధులతోపాటు ఏపీ నిఘా విభాగానికి చెందిన కొందరు సిబ్బందిని కూడా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం టీడీపీ కుట్రను బహిర్గతం చేసింది. ట్యాపింగ్ నిజమేనన్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అప్పట్లో చంద్రబాబు, ఆయన బృందం వైఎస్సార్సీపీ కీలక నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. అందుకోసం అప్పటి నిఘా విభాగం చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అధునాతన సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘ఏరోస్టర్ ’ అనే ఫోన్ ట్యాపింగ్ పరికరాలను తెప్పించినట్టు సమాచారం. గాలిలో ఎగురవేసే ఈ ఏరోస్టర్ బెలూన్లలో ఉండే ప్రత్యేకమైన పరికరాలు ఫోన్ల ట్యాపింగ్‌తోపాటు అవసరమైన ఫొటోలు తీస్తూ నిఘా వ్యవస్థగా పని చేస్తాయి. చంద్రబాబు కుతంత్రాలపై సందేహించిన వైఎస్సార్సీపీ నేతలు ఫోన్ల ట్యాపింగ్ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కూడా బాధ్యులను చేశారు. దాంతో సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయాలని తమకు అప్పటి నిఘా విభాగం అధికారులు లేఖ ద్వారా ఆదేశించారని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు వెల్లడించడం గమనార్హం. కేంద్ర భద్రతా చట్టాల ఉల్లంఘన రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్ కోసం చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర భద్రతా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘించింది. ‘ఏరోస్టర్’ స్పైవేర్ పరికరాల కోసం అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారిక హోదాతో ఇజ్రాయెల్ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. దేశ భద్రతతో ముడిపడిన స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయాలంటే కచ్చితంగా కేంద్ర రక్షణ, హోం, విదేశీ వ్యవహారాల శాఖల ముందస్తు అనుమతి ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టు పొందిన తన కుమారుడు చేతన్ సాయి కృష్ణ సీఈవోగా ఉన్న ఆకాశ్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన కంపెనీకి ఆ స్పైవేర్ పరికరాలను సరఫరా చేయాలని కోరా>రు. ఆ కంపెనీనే ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలుకు ప్రధాన బిడ్డర్‌గా వ్యవహరించింది. దీనిపై పూర్తి ఆధారాలు లభించినందునే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసింది. ఐపీఎస్ అధికారిగా ఉంటూ కూడా దేశ భద్రతా చట్టాలను ఉల్లంఘించిన ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారాన్ని కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ)కు నివేదించింది. ట్యాపింగ్ కోసమే వాటి వినియోగం ఇజ్రాయెల్‌కు చెందిన వెర్టిన్ అనే కంపెనీ ద్వారానే చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ కంపెనీతో వ్యవహారం నెరిపింది. వెబ్ ఇంటలిజెన్స్ సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో ‘ఐఎంఎస్ఐ క్యాచర్స్’ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను తెప్పించింది. ఫోన్ల ట్యాపింగ్ కోసమే ఈ పరికరాలను ఉపయోగిస్తారు. ఈ విషయంపై 2019 ఎన్నికల పోలింగ్ ముగిశాక.. ఫలితాలు వెల్లడయ్యేలోపు ఆ సాఫ్ట్వేర్ కోసం రూ.12.50 కోట్లు ఆ కంపెనీకి చెల్లించేందుకు ఫైల్ నడిపింది. దీనిపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకెళ్లి చెల్లింపులు చేయొద్దని కోరారు. వెర్టిన్ కంపెనీకి ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ సాఫ్ట్వేర్ పరికరాల ఉత్పత్తిదారు ఎన్ఎస్వో కంపెనీతో సాన్నిహిత్యం ఉంది. ఒకే రకమైన స్పైవేర్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న ఆ రెండు కంపెనీలు విలీనం కావాలని ఒకానొక దశలో భావించాయి కూడా. -
సాక్షి కార్టూన్ 19-03-2022
ప్రజలకు ఏం కావాలో వదిలేసి మనకు ఏం కావాలో అవే తెచ్చుకున్నాం సార్! -
చంద్రబాబువి దుర్మార్గ రాజకీయాలు: అంబటి
-
పెగాసస్‌పై టీడీపీ ఎందుకు కంగారుపడుతోంది: అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: వివాదాస్పద పెగాసస్ స్పైవేర్‌పై కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పెగసస్ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నారు. ఈ విషయంపై శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే టెక్నాలజీకి ఆద్యుడ్ని అని ప్రచారం చేసుకునే చంద్రబాబు దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చారని ఆరోపించారు. పెగసెస్ చంద్రబాబు వాడినట్లు మమత బెనర్జీ చెప్పారు.. ఆమె మా రాజకీయ మిత్రురాలు కాదని అన్నారు. చంద్రబాబు, మమతా బెనర్జీ కొంతకాలం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కలిసి ప్రచారం చేసిన వారేనని గుర్తు చేశారు. ఇప్పుడేమో గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. మేమేమి మీరు పెగసస్ వాడారని చెప్పలేదు.. ఇలా భుజాలు తడుముకుంటున్నారంటే దీనిలో ఏదో ఉందని అన్నారు. లోకేష్ తిండి ఖర్చులకు రూ. 30 లక్షలు వాడారని రాస్తే సాక్షిపై కేసు వేశారు. మరి ఇప్పుడు మమత బెనర్జీపై కేసు వేస్తారా? అని ప్రశ్నించారు. ఈ దేశంలో అనైతిక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని విమర్శించారు. చంద్రబాబు జీవితమంతా అనైతిక రాజకీయాలేనన్నారు. నాడు చంద్రబాబు ట్యాపింగ్ కార్యక్రమాలకు పాల్పడలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. పెగాసస్‌పై విచారణ జరిగితే అసలు విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. దీంతో వెంటనే పెగాసస్‌పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏబీ వెంకటేశ్వర రావు అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు కూడా ప్రాథమికంగా భావించింది. 23 మంది శాసన సభ్యులను తీసుకెళ్లడానికి చంద్రబాబు పోలీసులను వాడుకోలేదా...? ఏబీ వెంకటేశ్వర రావు దీనికి ప్రధాన భూమిక పోషించలేదా...? అధికారికంగా కొనకపోతే ప్రయివేటుగా కొనుగోలు చేసి ఉంటారు.. రూ. 25 కోట్లు పెట్టి ప్రైవేటుగా కొని ఉంటారు.. వెళ్లెప్పుడు వాటిని నాశనం చేసి ఉంటారని అన్నారు. మేము ప్రత్యర్థుల వీక్ నెస్‌పై ఆధారపడి రాజకీయాలు చేయమని స్పష్టం చేశారు. -
పెగసస్ స్పైవేర్‌ను కొన్న చంద్రబాబు సర్కార్: మమతా బెనర్జీ
కోల్‌కతా: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నారు. అయితే, ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది, చట్ట విరుద్ధమైంది అయినందున తాము కొనలేదని వెల్లడించారు. ‘ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అమ్ముతామంటూ నాలుగైదేళ్ల క్రితం మా రాష్ట్ర పోలీసులను సంప్రదించింది. విషయం నాకు తెలిసి, మాకు ఆ సాఫ్ట్వేర్ అవసరం లేదని చెప్పాను’ అని ఆమె వెల్లడించారు. కానీ ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిన కేంద్రం ప్రభుత్వం, దానిని దేశ భద్రత కోసం ఉపయోగించడానికి బదులుగా రాజకీయ ప్రయోజనాల కోసం జడ్జీలు, ప్రతిపక్షనేతలు, ఇతర అధికారులపై నిఘాకు వాడుకుందని ఆరోపించారు. 2017లో పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను భారత ప్రభుత్వం 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్‌టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. -
పెగసస్ స్పైవేర్‌పై దీదీ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: భారత్‌లో గతేడాది ప్రకంపనలు సృష్టించిన ఇజ్రాయెల్ భద్రతా సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ తయారు చేసిన పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ సైబర్ ఇంటలిజెన్స్ సంస్థ ఎన్ఎస్ఓ.. నాలుగేళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ పోలీసు డిపార్టుమెంటకు తమ స్పైవేర్లను విక్రయించడానికి వచ్చినట్లు తెలిపారు. పెగసస్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామని ఆ సంస్థ పేర్కొన్నట్లు సీఎం మమతా వెల్లడించారు. అయితే పెగసస్ వంటి స్పైవేర్‌ను కొనుగోలు చేయడం రాజకీయంగా దోపిడీకి పాల్పడినట్లు అవుతుందని,న్యాయమూర్తులు, కేంద్ర సంస్థల అధికారులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని ఎన్ఎస్ఓ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు ఫోన్లను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రధాని నర్రేందమోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మమతా బెనర్జీ ముందు నుంచి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. పెగసస్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. పెగసస్ స్పైవేర్ వివాదంపై బెంగాల్ ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించింది. వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై విచారణకు ఆదేశించిన మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలవటం విశేషం. పెగాసస్ స్పైవేర్ ద్వారా విపక్షనేతలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై దాదాపు 50 దేశాల్లో నిఘా పెట్టారని అంతర్జాతీయ మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థని ఇజ్రాయెల్ ప్రపంచ దేశాలకు విక్రయిస్తోందని తెలిపాయి. -
తెలుసుకోవాల్సిన నిజం!
ఇజ్రాయెలీ సైబర్ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగసస్’ వ్యవహారం పీటముడిగా మారుతోంది. రోజుకో కొత్త కథనం బయటకొస్తూ, పాలకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేంద్రం తనకు వ్యతిరేకమని భావిస్తున్న జర్నలిస్టులు, పౌరహక్కుల నేతలు, రాజకీయవాదులపై నిఘా కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిం చిందనే వాదనకు ప్రసిద్ధ ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక జనవరి చివరలో ప్రచురించిన తాజా కథనం తోడైంది. ఆ కథనం రాసిన పరిశోధనాత్మక జర్నలిస్టుతో ‘ది వైర్’ జరిపిన తాజా వీడియో ఇంటర్వ్యూ మరో సంచలనమైంది. ఒకేసారి 50 ఫోన్లపై నిఘాకు వీలుగా భారత్ ఆ నిఘావేర్‌ను కొన్నదన్నది ఆ జర్నలిస్టు మాట. వ్యక్తుల ప్రైవసీకి భంగకరంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించినట్లు ప్రభుత్వం అధికారికంగా ఒప్పుకోలేదన్న మాటే కానీ, బయటపడుతున్న కథనాలు ఆ చేదు నిజాన్నే చెబుతు న్నాయి. పెగసస్‌పై సుప్రీమ్ కోర్టే రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్ సారథ్యంలో ముగ్గురు నిపుణుల బృందంతో స్వతంత్ర దర్యాప్తు సాగిస్తున్నవేళ బయటకొచ్చిన ఈ అంశాలు దిగ్భ్రాంతికరం. పార్లమెంటులో కానీ, సర్వోన్నత న్యాయస్థానంలో కానీ మన పాలకులు నోరు విప్పి అవునని కానీ, కాదని కానీ చెప్పలేదన్నమాటే కానీ, అంతర్జాతీయ వేదికలు పెగసస్ దుర్వినియోగాన్ని నెత్తీ నోరూ కొట్టుకొని చెబుతూనే ఉన్నాయి. తప్పు జరిగిందనే వేలెత్తి చూపుతున్నాయి. పెగసస్ నిఘా బారిన పడిన 50 వేల పైచిలుకు మందిలో 300 మంది భారతీయులేనని ఓ అంతర్జాతీయ జర్నలి స్టుల కన్సార్టియమ్ గత జూలైలోనే చెప్పింది. ఇలా ఆరోపణలు వస్తున్నా సరే జాతీయ భద్రతను సాకుగా చూపి, పాలకులు దర్యాప్తు జరపకపోవడం సరి కాదని సుప్రీమ్ కోర్టే చెప్పాల్సి వచ్చింది. పెదవి విప్పని ప్రభుత్వ ప్రవర్తనతో చివరకు స్వతంత్ర విచారణకూ ఆదేశించాల్సి వచ్చింది. అది ఓ పక్క సాగుతుండగానే, నిరుడు డిసెంబర్లో అమెరికన్ ఫోరెన్సిక్ దర్యాప్తు సంస్థ ఆర్సెనెల్ కన్సల్టింగ్ మరో సంగతి వెల్లడించింది. బీమా కోరేగావ్ కేసులో ఉద్యమకారుడు రోనా విల్సన్‌ను జైలులో పెట్టిన వ్యవహారమూ పెగసస్ పుణ్యమే అని బయట పెట్టింది. విల్సన్ మొబైల్ ఫోన్‌పైన కనీసం 49 సార్లు దాడి జరిగిందనీ, ఆయన కంప్యూటర్లో, ఆయన సహ నిందితుడైన సురేంద్ర గాడ్లింగ్ కంప్యూటర్లోనూ వైరస్‌ను ప్రవేశపెట్టారనీ తేల్చింది. నెల తిరిగిందో, లేదో ఇçప్పుడు న్యూయార్క్ టైమ్స్ జనవరి 28 నాటి కథనం సంచలనమైంది. ఇజ్రాయెల్‌కు చెందిన ‘ఎన్ఎస్ఓ గ్రూపు’ ఈ ‘పెగసస్’ నిఘావేర్‌ను ఎలా రూపొందించిందీ, ప్రపంచవ్యాప్తంగా ప్రయో జనాల్ని కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఎలా వాడుకున్నదీ ఆ పరిశోధనాత్మక కథనం వివరించింది. నిజానికి, తీవ్రవాదులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదార్ల కోసం ఉద్దేశించిన నిఘా సాఫ్ట్ వేర్ అది. కానీ, దాన్ని ప్రతిపక్షాల పైన, ఓ కన్నేసి ఉంచే జర్నలిస్టుల పైన వాడేందుకు వీలుగా ఇజ్రా యెల్ అమ్మజూపింది. ఆ రకంగా పాలస్తీనా విషయంలో సుదీర్ఘకాలంగా తమను వ్యతిరేకిస్తున్న దేశాలను సైతం తమ వైపు తిప్పుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ అమ్మకాన్ని తాయిలంగా చూపింది. 2020 ఆగస్టులో ఇజ్రాయెల్‌కూ, పొరుగున ఉన్న అరబ్ దేశాలకూ మధ్య ‘అబ్రహమ్ శాంతి ఒప్పందాలు’ కుదరడానికీ ఇదే కారణమట. అలాగే, పాలస్తీనా విషయంలో ఏళ్ళ తరబడి ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించిన భారత్ సైతం ఇటీవల చెట్టపట్టాలేసుకోవడానికీ ఇదే కారణమని ఆరోపణ. ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీయే. 2017 జూలై నాటి ఆ పర్యటనలో భారత్, ఇజ్రాయెల్‌ల మధ్య కుదిరిన 200 కోట్ల డాలర్ల మేర ‘అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల’ ఒప్పందంలో ఈ ‘పెగసస్’ నిఘా సాఫ్ట్వేర్ కొనుగోలు సైతం భాగమనేది ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం. ఆ తర్వాతే అనేక ఏళ్ళ పాలస్తీనా అనుకూల విధానాన్ని భారత్ మార్చేసుకుందనీ, 2019లో ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో పాలస్తీనా మానవ హక్కుల సంఘానికి పరిశీలక హోదా నిరాకరిస్తూ, ఇజ్రాయెల్ వైపు ఓటు వేసిందనీ వాదన. అలాగే, ప్రభుత్వ విమర్శకుల నోళ్ళు మూయించడం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మెక్సికోలలో పెగసస్‌ను వాడారట. అమెరికా తన నిఘాసంస్థ ‘ఎఫ్‌బీఐ’లో సైతం ఆ సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించి చూసిందట కానీ, దేశంలో వాడలేదట. ఒకప్పుడు ఫోన్ వాడేవారిని ఆకర్షించి, వారు క్లిక్ చేసే మోసకారి లింకుల రూపంలో జొరబడేవారు. ఇప్పుడూ లింకులు నొక్కడం లాంటివేవీ అవసరం లేకుండానే లక్షిత వ్యక్తిపై నిఘా పెట్టడం, కంప్యూటర్లలో కొత్త లెటర్లు జొప్పించడం కొత్త పెగసస్ పద్ధతి. అంటే బీమా కోరేగావ్ సహా అనేక కేసుల్లో మావోయిస్టు పథకరచన అంటూ పాలకులు చూపిస్తున్న ఆధారాల విశ్వసనీయత ప్రశ్నార్హమైనదే. అసలు ప్రభుత్వాలకే పెగసస్‌ను విక్రయిస్తుంటామని ఎన్ఎస్ఓ చెబుతోంది. అందుకే, పౌరస్వేచ్ఛకూ, ప్రాథమిక హక్కులకూ భంగం కలిగించేలా పాలకులు అనుసరిస్తున్న ఈ దొడ్డిదారి సంగతి తేలాల్సిందే. న్యూయార్క్ టైమ్స్ సహా తాజా కథనాల సమాచారాన్నీ సుప్రీమ్ స్వతంత్ర విచారణ బృందం పరిగణనలోకి తీసుకోవాలి. అసలు కథేమిటో అధికారికంగా నిగ్గుదేల్చాలి. కంటిలో నలుసుగా మారిన వకీళ్ళు, పౌర ఉద్యమకారులు, జర్నలిస్టులతో సహా పలువురి మొబైల్ ఫోన్లనూ, ఇతర పరికరాలనూ పెగసస్ తోనో, లేదంటే మరేదైనా నిఘావేర్తోనో పాలకులు ఇనెఫెక్ట్ చేసిందీ, లేనిదీ వెల్లడి కావాలి. దీనిపై పట్టుబడుతున్న ప్రతిపక్షాలే కాదు... పౌరసమాజం... యావద్దేశం తెలుసుకోవాలను కుంటున్నది అదే. మరి, పాలకులు తెలుసుకోనిస్తారా? సచ్ఛీలతను నిరూపించుకుంటారా? -
ఇజ్రాయెల్‌లో అనుమతి లేకుండా పెగసస్ వాడకం
జెరూసలేం: తమ దేశ పౌరుల ఫోన్లపై నిఘా పెట్టడానికి పరిశోధక సిబ్బంది అత్యాధునిక స్పైవేర్‌ను అనుమతి లేకుండా ఉపయోగించినట్లు ఆధారాలను గుర్తించామని ఇజ్రాయెల్ నేషనల్ పోలీసు ఫోర్స్ మంగళవారం ప్రకటించింది. ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసిన పెగసస్ స్పైవేర్‌ను పోలీసులు ఉపయోగించారంటూ ఇజ్రాయెల్ పత్రిక రెండు వారాల క్రితం ప్రకటించింది. దీనిపై దేశమంతా దుమారం రేగుతోంది. నిరసనకారులు, రాజకీయ నాయకులు, నేరగాళ్లపై నిఘా కోసం పోలీసులు ఈ స్పైవేర్‌ను సంబంధిత న్యాయమూర్తి నుంచి అనుమతి తీసుకోకుండానే ఉపయోగించారని సదరు పత్రిక వెల్లడించింది. ప్రజల వినతి మేరకు దీనిపై అటార్నీ జనరల్ దర్యాప్తునకు ఆదేశించారు. -
బడ్జెట్ సమావేశాల లైవ్ అప్డేట్స్: ఉభయ సభలు మంగళవారానికి వాయిదా
అప్డేట్స్ 04:00 PM ► కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం రాజ్యసభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా ఇంతకు ముందు ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా లోక్‌సభలో సమర్పించారు. 12: 55 PM ► కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఎకానామిక్ సర్వే 2021-22 ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. 11: 55 AM ► పార్లమెంట్ సెంట్రల్ హల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల ఆజాదీకా అమృత్.. ఒక పవిత్ర మహోత్సవమని వచ్చే 25 ఏళ్లు అదే స్ఫూర్తితో మనమంతా పనిచేయాలన్నారు. అదే విధంగా, వ్యాక్సిన్‌తో కరోనాను కట్టడి చేయబోతున్నామని తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. దేశంలో పేదలకు ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ► భారత్ గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుతోందన్నారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. భారీగా వస్తున్న ఎఫ్‌డీఐలు దేశ అభివృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. మేకిన్ ఇండియాతో మొబైల్ పరిశ్రమ వృద్ధి చెందుతోందన్నారు. ► ఫసల్ బీమాతో సన్నకారు రైతులకు ప్రయోజం లభిస్తోందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల చేయూత కోసం 3 లక్షల కోట్ల రుణాలు కేటాయించినట్లు తెలిపారు. ► 7 మెగా టెక్స్టైల్ పార్క్‌లతో యువతకు భారీగా ఉద్యోగాల కల్పన చేసినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ తెలిపారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లో 19 బీటెక్ కాలేజీల్లో 6 స్థానిక భాషలలో బోధన జరుగుందని రామ్‌నాథ్ పేర్కొన్నారు. ► పీఎమ్‌గ్రామీణ సడక్ యోజనలతో రోజుకు 100 కి.మీ రహదారుల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ తెలిపారు. ► ప్రస్తుతం భారతదేశం మూడో దశ కొవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్టపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏడాది కాలంలో 160 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారతదేశం మూడో దశ కోవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. ► భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్ట్రపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. కోవిడ్ ఎదుర్కోవడానికి దేశ ఫార్మారంగం ఎంతో కృషి చేసిందన్నారు. ఫార్మా పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ► పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతో ఉపయోగపడిందన్నారు. డబ్ల్యూహెచ్‌వో తొలి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ భారత్‌లో ఏర్పాటు కాబోతుందని పేర్కొన్నారు. అదే విధంగా పద్మపురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లినట్లు వివరించారు. ► ప్రధాని గరీబ్‌యోజన పథకం ద్వారా 19 నెలల పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆహార సరఫరా సంస్థ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో పేర్కొన్నారు. 11: 04 AM ► పార్లమెంట్లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులకు స్వాతంత్ర్య, అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. 10: 54 AM ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ భవనంకు చేరుకున్నారు. 10.: 45 AM పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ఇది కీలక సమయమని, బడ్జెట్ సమావేశాలకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పెగాసస్, రైతు ఆందోళనలు, చైనా దురాక్రమణలు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై దృష్టి సారించింది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వేర్వేరుగా విపక్ష నేతలతో సమావేశమవుతారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలోనే బడ్జెట్ సమావేశాలు జరగడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలు ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆర్థిక, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతిగా కోవింద్ చివరి ప్రసంగం సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను సంయుక్తంగా ఉద్దేశించి ప్రసంగిస్తారు. వచ్చే జూలైలో రాష్ట్రపతిగా కోవింద్ పదవీ కాలం పూర్తికానుంది. దీంతో ఈ సమావేశాలే ఆయన రాష్ట్రపతి హోదాలో చివరిగా ప్రసంగించే పార్లమెంట్ సమావేశాలు. రాష్ట్రపతి ప్రసంగానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2021–22ను, మంగళవారం(ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బుధవారం నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే అంశంపై చర్చ ఆరంభమవుతుంది. ఈ చర్చ సుమారు 4 రోజులు జరగవచ్చు. ఫిబ్రవరి 7న ఈ చర్చకు ప్రధాని బదులిస్తారు. తొలి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. రెండో దశ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. -
పార్లమెంటును పక్కదారి పట్టించారు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌ను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వమే ఇజ్రాయెల్ నుంచి 2017లో కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. గతంలో పెగసస్‌పై కోర్టుకెక్కిన ప్రధాన పిటిషన్‌దారుడైన అడ్వకేట్ ఎంఎల్ శర్మ మళ్లీ సుప్రీం తలుపు తట్టారు. రూ.15 వేల కోట్ల రక్షణ ఒప్పందంలో భాగంగానే పెగసస్‌ను భారత ప్రభుత్వం కొనుగోలు చేసినట్టుగా న్యూయార్క్ టైమ్స్ తమ కథనంలో పేర్కొందని ఆయన ఈసారి పిటిషన్లో ప్రస్తావించారు. ఈ నివేదిక ఆధారంగా ఇజ్రాయెల్‌తో జరిగిన రక్షణ ఒప్పందంపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఆ రక్షణ ఒప్పందాన్ని పార్లమెంటు ఆమోదించలేదని, అందుకే దానిని రద్దు చేసి, ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి వసూలు చేసేలా ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పెగసస్ స్పైవేర్‌ని కేంద్రమే కొనుగోలు చేసిందని వస్తున్న ఆరోపణలపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంని కోరారు. పెగసస్ స్పైవేర్‌ని వినియోగించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జర్నలిస్టులు, హక్కుల సంఘాల కార్యకర్తలు 300 మందిపై కేంద్రం ఫోన్ ట్యాపింగ్ పెట్టిందని గత ఏడాది ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అప్పట్లోనే దీనిపై శర్మ, పాత్రికేయుడు ఎన్.రామ్ వంటివారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని 2021 అక్టోబర్ 27న ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏర్పాటై 13 వారాలు గడుస్తున్నా విచారణలో కాస్త కూడా పురోగతి లేదు. ఇప్పుడు కేంద్రమే దానిని కొనుగోలు చేసిందన్న నివేదికపైనా ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇది దేశద్రోహమేనని తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదికను పరిశీలించండి పెగసస్ స్పైవేర్ దర్యాప్తులో న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కూడా ఆధారంగా తీసుకోవాలని దానిపై వి చారణ జరుపుతున్న సుప్రీం కోర్టు నియమిత జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ కమిటీని ఎడిటర్స్ గిల్డ్ కోరింది. దీనిపై బహిరంగ విచారణ చేపట్టాలని, అలా చేయడం వల్ల పారదర్శకత ఉండడంతో పాటు ప్రజలందరికీ నిజానిజాలు తెలుస్తాయని ఎడిటర్స్ గిల్డ్ ఆదివారం జస్టిస్ రవీంద్రన్ కమిటీకి లేఖ రాసింది. అవన్నీ కపట విమర్శలు పెగసస్ స్పైవేర్‌ను అప్రజాస్వామికంగా వ్యవహరించే దేశాలకు విక్రయిస్తున్నట్టుగా వస్తున్న ఆరోపణల్ని ఆ స్పైవేర్‌ను తయారు చేసే సైబర్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ తిప్పికొట్టింది. అవన్నీ కపట విమర్శలంటూ దుయ్యబట్టింది. ఇజ్రాయెల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆ స్పైవేర్‌ను దుర్వినియోగం చేశారంటూ న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో కంపెనీ సీఈఓ షలెవ్ హులియో స్థానిక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. దశాబ్దకాలంగా ఆ సాఫ్ట్‌వేర్‌ను అమ్ముతున్నామంటూ తమ కంపెనీ ఆపరేషన్లను గట్టిగా సమర్థించుకున్నారు. అయితే అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చునని ఆయన అంగీకరించారు. న్యూయార్క్ టైమ్స్ కథనంతో పెగసస్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా ‘‘రాత్రి నేను గాఢంగా నిద్రపోయాను’’ అని సమాధామిచ్చి తాను అలాంటివేవి పట్టించుకోనని పరోక్షంగా చెప్పారు. ‘‘మేము ఏదో ఒక్క దేశానికి మా సాఫ్ట్వేర్ అమ్మలేదు. కదనరంగంలో వాడే ఆయుధాలు, ఎఫ్–35 ట్యాంకులు, డ్రోన్లు వంటివి అమ్మడం సరైన పని అయినప్పుడు ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచార సేకరణలో ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను అమ్మితే తప్పేంటి’’ అని హులియో ప్రశ్నించారు. అమెరికా తమ సంస్థపై ఆగ్రహంతోనే బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందని, త్వరలోనే దానిని ఎత్తేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెడతాం పెగసస్ అంశంపై లోక్‌సభను తప్పుదారి పట్టించారన్న ఆరోపణలకు సంబంధించి ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సభలో ఆ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌధరి లేఖ రాశారు. పెగసస్ స్పైవేర్‌ను ఎప్పుడూ తాము తీసుకురాలేదని ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తూ వస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ కథనంతో అసలు వాస్తవాలు బయటకు వచ్చాయన్నారు. మోదీ ప్రభుత్వం పార్లమెంటుని, సుప్రీంకోర్టుని, దేశ ప్రజలందరినీ తప్పుదారి పట్టించిందని ధ్వజమెత్తారు. హక్కుల ఉల్లంఘన నోటీసు ఐటీ శాఖ మంత్రికి జారీ చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. -
సాక్షి కార్టూన్(31-01-2022)
-
దేశాన్ని బిగ్‌బాస్ షోలా మార్చేసింది
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని ఆరోపిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. మోదీ ప్రభుత్వం దేశద్రోహ నేరానికి పాల్పడిందని విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థల మీదే దాడి జరుగుతోందని, చట్టసభల్ని, న్యాయవ్యవస్థని మోసం చేసిందని, ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసిందని మండిపడ్డాయి. దేశాన్ని ఒక ‘బిగ్ బాస్ షో’లా మార్చేసిందని విరుచుకుపడ్డాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశాయి. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సూమోటోగా తీసుకొని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేసిన మోసంపై విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. మరోవైపు న్యూయార్క్ కథనాన్ని కేంద్రం తిప్పి కొట్టింది. న్యూయార్క్ టైమ్స్‌ని సుపారీ మీడియా అంటూ కేంద్రమంత్రి వీకే సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ’’మీరు న్యూయార్క్ టైమ్స్‌ని నమ్ముతున్నారా? వాళ్లు సుపారి మీడియాగా పేరుపడ్డారు’’ అని ట్వీట్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్ బృందం ఇచ్చే నివేదిక కోసం వేచి చూస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఎవరినీ వదల్లేదు... ‘‘దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజకీయనాయకులు, సాధారణ ప్రజల మీద నిఘా పెట్టడానికే మోదీ ప్రభుత్వం పెగసస్‌ని కొనుగోలు చేసింది. ప్రభుత్వ అధికారులు, ప్రతిపక్ష నాయకులు, సాయుధ బలగాలు, న్యాయవ్యవస్థ.. ఇలా అందరూ ఫోన్ ట్యాపింగ్‌లకు టార్గెట్ అయ్యారు. ఇది దేశద్రోహం. మోదీ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడింది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకుడు మౌనం అర్ధాంగీకారమే! ‘‘ఆ సైబర్ ఆయుధాన్ని ఎందుకు తీసుకువచ్చారు? దానిని వాడడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? లక్ష్యాలను ఎలా నిర్ణయించారు? వీటన్నింటికీ మోదీ ప్రభుత్వం అఫడివిట్ రూపంలో సమాధానం ఇవ్వాలి. ఇంత కీలకమైన అంశంలో మౌనంగా ఉంటే నేర కార్యకలాపాలకు పాల్పడ్డామని అంగీకరించినట్టు అవుతుంది’’ – సీతారామ్ ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి రియాలిటీ షో చేసేశారు... ‘‘రక్షణ వ్యవహారాలకు ఈ స్పైవేర్‌ని వినియోగించుకుండా ప్రతిపక్షాలు, జర్నలిస్టులపై ప్రయోగించడమేంటి? బీజేపీ ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. వాళ్లు దేశాన్ని ఒక బిగ్ బాస్ షోలా మార్చేస్తున్నారు’’ – ప్రియాంక చతుర్వేది, ఎంపీ, శివసేన కావాలని కేంద్రం తప్పించుకుంటోంది ‘‘పెగసస్‌పై ఐటీ కమిటీకి ప్రభుత్వం సమాధానమివ్వడం లేదు. ఎప్పుడు ఈ విషయాన్ని చర్చిద్దామన్నా బీజేపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే హాజరుకాకపోవడంతో కోరమ్ ఉండటం లేదు. దీంతో నిజానిజాలను నిర్ధారించడానికి కమిటీకి అవకాశం లేకుండా పోయింది. సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారిస్తోంది. నిజంగా పెగసస్‌ను ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కి వినియోగిస్తే మన ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడినట్టే’’ – శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ, కమ్యూనికేషన్లు, ఐటీపై పార్లమెంటరీ ప్యానెల్ చైర్మన్ అది సుపారీ మీడియా ‘మీరు న్యూయార్క్ టైమ్స్‌ని నమ్ముతున్నారా? వాళ్లు సుపారీ మీడియాగా పేరుపడ్డారు’’ – కేంద్రమంత్రి వీకే సింగ్ ట్వీట్ -
మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో సీన్ మారింది
‘‘ది బ్యాటిల్ ఫర్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ సైబర్‌వెపన్’’ అనే టైటిల్‌తో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఆ కథనంలో వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘ఇజ్రాయెల్‌కు చెందిన భద్రతా సంస్థ ఎన్‌ఎస్‌ఒఓ గ్రూప్ గత దశాబ్దాకాలంగా పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవస్థని ప్రపంచ దేశాలకు విక్రయిస్తోంది. ఇది పని చేసినట్టు మరేది చేయలేదని వివిధ దేశాల పోలీసు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు ఆ సంస్థ హామీలు గుప్పించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ప్రైవేటు డిటెక్టివ్ కంపెనీలు కూడా చేయలేని పని ఈ పెగసస్ చేస్తుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను కూడా కనిపెట్టగలదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 జులైలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు పెగసస్ స్పైవేర్‌పై ఒప్పందం కుదిరింది. ఒక భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం అదే తొలిసారి. అంతకు ముందు దశాబ్దాలుగా పాలస్తీనాకు మద్దతుగానే భారత్ వ్యవహరించింది. కానీ మోదీ పర్యటనలో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అత్యంత సుహృద్భావ వాతావరణం మధ్య చర్చలు జరిగాయి. నెతన్యాహూతో కలిసి మోదీ చెప్పులు లేకుండా మరీ స్థానిక బీచ్‌లో విహరించారు. ఆ పర్యటనలో ఇరు దేశాల మధ్య 200 కోట్ల డాలర్ల ఒప్పందం కుదిరింది. అత్యంత ఆధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థ, పెగసస్ స్పైవేర్ అన్నీ కలిసి ఒక ప్యాకేజీలా కొనుగోలు ఒప్పందం జరిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే నెతన్యాహూ ఆకస్మికంగా భారత్‌కు పర్యటించారు. 2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి పాలస్తీనాకు చెందిన మానవ హక్కుల సంస్థకు అబ్జర్వర్ స్టేటస్‌కు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు జరిగిన ఓటింగ్‌లో భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఓటు వేసింది. అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్‌కు భారత్ మద్దతునివ్వడం అదే తొలిసారి. అమెరికాకు చెందిన ఎఫ్బిఐ కూడా పెగసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసినప్పటికీ దానిని ఎవరి మీద వినియోగించకూడదని నిర్ణయించింది. 2011లో ఇజ్రాయెల్ ప్రపంచ మార్కెట్లో పెగసస్‌ని ప్రవేశపెట్టిన తర్వాత పలు యూరప్ దేశాలు ఉగ్రవాదుల ఉనికి కనిపెట్టడానికి దీనిని వినియోగించాయి. ఉగ్రవాదులు, కరడుగట్టిన నేరస్తులు దగ్గర అత్యంత ఆధునికమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని డీక్రిప్ట్ (డీకోడ్) చేయగలిగే సామర్థ్యం పెగసస్‌కి ఉండటంతో విధ్వంసకారుల గుట్లు తెలిసేవి. కానీ దీనిని కొనుగోలు చేసిన దేశాలు హక్కుల సంఘాలపై కూడా ప్రయోగించాయి. జర్నలిస్టులు, రాజకీయ అసమ్మతివాదులపైనా మెక్సికో ప్రయోగిస్తే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పౌర హక్కుల కార్యకర్తలపైనా, సౌదీ అరేబియా మహిళా హక్కుల కార్యకర్తలపైనా నిఘాను ఉంచాయి. ఈ స్పైవేర్ ఇలా దుర్వినియోగమడం వివాదాస్పదం కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై గత ఏడాది జులైలో విచారణకు ఒక కమిటీ వేసింది. దీనిపై ఎన్ఎస్ఒ ఆనాటి చీఫ్ షాలెవ్ హులియో ఇజ్రాయెల్ సైబర్ పరిశ్రమపైనే బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ఏడాది నవంబర్‌లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ వివాదం నుంచి దూరంగా జరిగింది. స్పైవేర్‌ని రూపొందించిన ఎన్ఎస్ఒ ప్రైవేటు సంస్థ కాబట్టి ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలు ఆ సంస్థకి వర్తించవని తప్పించుకుంది. దీంతో అమెరికా ప్రభుత్వం ఆ సంస్థపై ఆంక్షలు విధించింది’’ అని న్యూయార్క్ టైమ్స్ ఆ కథనాన్ని ముగించింది. -
పెగసస్ స్పైవేర్‌ని... కేంద్రమే కొనుగోలు చేసింది
న్యూయార్క్: దేశవ్యాప్తంగా గత ఏడాది ప్రకంపనలు సృష్టించిన పెగసస్ స్పైవేర్ వివాదం మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది. ఈ స్పైవేర్‌ను 2017లో ఇజ్రాయెల్ నుంచి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యంత ఆధునిక ఆయుధాలు, క్షిపణి వ్యవస్థతో పాటు పెగసస్ స్పైవేర్‌ని భారత్ కొనుగోలు చేసిందని ఆ కథనం ఆరోపించింది. 200 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో (రూ.15 వేల కోట్లు) భాగంగా పెగసస్ స్పైవేర్ కూడా కొనుగోలు చేసినట్టు పేర్కొంది. ఏడాది పాటు పరిశోధన చేసి, ఎన్నో దేశాలకు చెందిన ప్రభుత్వ, ఇంటెలిజెన్స్ అధికారుల, సైబర్ నిపుణుల్ని ఇంటర్వ్యూలు చేసి ఈ విషయాన్ని రూఢి చేసుకున్నామని వెల్లడించింది. భారత్‌లో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సహా విపక్ష నాయకులు, ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేయడానికి ఈ పెగసస్ స్పైవేర్‌ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగించినట్టుగా గత ఏడాది జులైలో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్‌తో పాటు మరికొన్ని దేశ ప్రభుత్వాలు ఈ నిఘా వ్యవస్థని వాడినట్టుగా ఆరోపణలు రావడంతో సమాజంలో వివిధ వర్గాల గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. ఔననక.. కాదనక! పెగసస్ స్పైవేర్ అంశం పార్లమెంటు వర్షాకాల సమావేశాలను దాదాపు తుడిచిపెట్టినపుడు కూడా కేంద్రంలోని మోదీ సర్కారు చాలా నర్మగర్భంగా సమాధానమిచ్చింది. ఏది జరిగినా... నిబంధనల ప్రకారమే, సంబంధిత చట్టాలకు లోబడి మాత్రమే జరిగిందని చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టు అడిగినపుడు కూడా ఇదే సమాధానం ఇచ్చింది. దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఇంతకంటే ఇంకేమీ చెప్పలేమని బదులిచ్చింది. పెగసస్ నిఘాపై స్వతంత్య్ర కమిటీతో విచారణ జరిపించి నేరుగా సుప్రీంకోర్టుకే నివేదిక సమర్పించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. అయితే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇందుకు అంగీకరించలేదు. గత ఏడాది అక్టోబరు 27న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. – నేషనల్ డెస్క్, సాక్షి -
పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ సంచలన నివేదిక.. మరోసారి దుమారం
న్యూఢిల్లీ: గతేడాది దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను భారత్ 2017లోనే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ పత్రిక న్యూయార్క్ టైమ్స్ సంచలన కథనం వెల్లడించింది. అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాల కొనుగోలుకు భారత్, ఇజ్రాయేల్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా క్షిపణులతోపాటు పెగాసస్ స్పైవేర్ భాగమేనని నివేదిక పేర్కొంది. పెగాసస్ వ్యవహారంపై దాదాపు ఏడాది పాటు దర్యాప్తు జరిపి ఈ కథనం రూపొందించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కాగా ఎన్ఎస్ఓ సంస్థకు చెందిన పెగాసస్ స్పైవేర్ సాయంతో భారత్ సహా పలు దేశాల్లో జర్నలిస్ట్‌లు, మానవహక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేసినట్టు బయటకు రావడంతో వివాదం చెలరేగింది. చదవండి: నామినేషన్ దాఖలు చేసిన ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తాజాగా ‘‘ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైబర్‌వెపన్ కోసం యుద్ధం’’ పేరుతో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ఎస్ఓ తన సాఫ్ట్‌వేర్‌ను పలు నిఘా సంస్థలు, చట్టాలను అమలుచేసే సంస్థలకు దశాబ్దం కాలం నుంచి విక్రయిస్తోందని తెలిపింది. తమ సాఫ్ట్‌వేర్‌కు సాటి మరేదీ లేదని, ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లను స్థిరంగా, విశ్వసనీయంగా ట్రాక్ చేయగలదని వాగ్దానం చేసిందని పేర్కొంది. జులై 2017లో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి ఇజ్రాయేల్ పర్యటన వెళ్లగా.. దీని గురించి కూడా నివేదిక ప్రస్తావించింది. చదవండి: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు పర్యటన సమయంలో ఇరుదేశాల మధ్య 2 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం కుదిరిందని, ఈ డీల్లోనే పెగాసస్, క్షిపణి వ్యవస్థ కూడా ప్రధానంగా ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. అనంతరం బెంజిమిన్ నెతన్యాహు భారత్‌లో పర్యటించారని, జూన్ 2019లో ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో ఇజ్రాయేల్‌కు మద్దతుగా పాలస్తీనా మానవ హక్కుల సంస్థకు పరిశీలకుల హోదాను నిరాకరించడానికి భారత్ ఓటు వేసిందని నివేదిక పేర్కొంది. అయితే న్యూయార్క్ టైమ్స్ నివేదికపై కేంద్రాన్ని పీటీఐ సంప్రదించగా.. తక్షణమే స్పందించడానికి నిరాకరించింది. -
హ్యాక్ అయితే 7 లోపు సంప్రదించండి
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని ఎన్ఎస్వో సంస్థ తయారీ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగగస్’ కారణంగా మొబైల్‌ఫోన్ హ్యాకింగ్‌కు గురైనట్లు భావించే బాధితులు జనవరి ఏడో తేదీ లోపు తమను సంప్రదించాలని సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ ప్రజలకు సూచించింది. ఈ మేరకు కమిటీ ఆదివారం ఒక పబ్లిక్ నోటీస్‌ను జారీచేసింది. ‘ పెగసస్ మాల్వేర్ తమ ఫోన్‌ను హ్యాక్ చేసిందని ఎందుకు భావిస్తున్నారో తగు కారణాలను కమిటీ ముందు ఆయా బాధితులు వెల్లడించాలి. హ్యాక్ అయిన మొబైల్/డివైజ్‌ను టెక్నికల్ కమిటీ పరిశీలించేందుకు మీరు అంగీకరిస్తారా? అనే విషయాన్నీ కమిటీకి పంపే ఈ–మెయిల్లో స్పష్టం చేయాలి’ అని ఆ నోటీస్‌లో కమిటీ పేర్కొంది. ‘ మీ కారణాలు సహేతుకమైనవని కమిటీ భావిస్తే ఆ మొబైల్/డివైజ్‌ను కమిటీ పరిశీలన/పరీక్ష/దర్యాప్తునకు తీసుకుంటుంది’ అని నోటీస్‌లో పేర్కొన్నారు. విపక్ష పార్టీల ముఖ్యనేతలు, ప్రముఖ సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, జడ్జీలు సహా ప్రముఖుల మొబైల్ ఫోన్లను మోదీ సర్కార్ పెగసస్ స్పైవేర్‌తో హ్యాక్ చేసి నిఘా పెట్టిందని పెను దుమారం చెలరేగిన విషయం విదితమే. -
రైతు విజయం.. కరోనా కల్లోలం!
కాల గతిలో మరో ఏడాది గడిచిపోతోంది. మరో రెండ్రోజుల్లో నూతన సంవత్సరం కాలుమోపుతోంది. గతేడాది ఆరంభమైన కరోనా సంక్షోభం ఇంకా మానవాళిని వీడలేదు. ఈ ఏడాది చివరకు కొత్త వేరియంట్ కలకలం ఆరంభమైంది. 2021లో దేశీయ యవనికపై పలు ఘటనలు జరిగాయి. స్థూలంగా చెప్పుకుంటే 2021 రైతు ఆందోళనతో మొదలై సాగు చట్టాల ఉపసంహరణతో ముగిసిందనుకోవచ్చు. కరోనా, రైతు సంఘటనలతో పాటు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు, పెగసస్ కలవరం, డ్రగ్స్ కేసు, సరిహద్దుల్లో కదలికలు, సీడీఎస్ మృతి వంటి పలు ఇతర ఘటనలు దేశంలో సంచలనానికి కారణమయ్యాయి. కోవిడ్ విధ్వంసం జనవరిలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి భారత్ అనుమతించింది. అదేనెల దేశీయంగా భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మార్చిలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఆరంభమైంది. ఏప్రిల్‌లో దేశీయంగా కరోనా మరణాలు 2లక్షలు దాటాయి. దేశంలో ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకల కొరత ఆందోళనకరస్థాయికి చేరాయి. ఈనెల్లో సుమారు 69 లక్షల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మేలో సెకండ్ వేవ్ తారస్థాయికి చేరింది. కొత్త కేసులు 90 లక్షలు దాటగా, 1.2 లక్షల మరణాలు నమోదయ్యాయి. కోర్టులు కల్పించుకొనే స్థాయికి ఆక్సిజన్ కొరత చేరింది. అక్టోబర్‌లో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల రికార్డును భారత్ సాధించింది. డిసెంబర్ 29నాటికి దేశీయంగా 143.75 కోట్ల టీకా డోసులు ప్రజలకు అందించారు. డిసెంబర్లో భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఆరంభమైంది. మమత హ్యాట్రిక్ మే నెల్లో దేశంలో ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సంచలన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీఎంసీకి 213 సీట్లు, బీజేపీకి 77 సీట్లు దక్కగా వామపక్షాలు, కాంగ్రెస్‌కు ఒక్కసీటు కూడా రాలేదు. టీఎంసీ అధినేత మమత నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓడిపోవడం సంచలనం సృష్టించింది. అనంతరం ఆమె భవానీ పూర్ నుంచి పోటీ చేసి ఎంఎల్ఏగా గెలుపొందారు. అస్సాంలో రెండోమారు ఎన్డీఏ కూటమి 75 సీట్లతో అధికారంలోకి రాగా, బీజేపీకి చెందిన హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. కేరళలో పాలకపక్షం వరుసగా రెండోమారు విజయం సాధించదన్న ఆనవాయితీని లెఫ్ట్ కూటమి తిరగరాసింది. 99 సీట్లతో లెఫ్ట్ కూటమి వరుసగా రెండోమారు విజయం సాధించగా, సీపీఎంకు చెందిన పినరయ్ విజయన్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. తమిళనాడులో డీఎంకేను 159 సీట్లతో విజయం వైపు నడిపిన సారధి స్టాలిన్, 68 సంవత్సరాల వయసులో తొలిసారి సీఎంగా పదవీ స్వీకారం చేశారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 19 సీట్లను గెలిచి రంగస్వామి సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రుల మార్పులు జూలైలో ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ఎన్నికయ్యారు. కర్ణాటకలో బీజేపీ యడియూరప్పను మార్చి బసవరాజ బొమ్మైని సీఎం చేసింది. సెప్టెంబర్‌లో గుజరాత్ సీఎం పదవి నుంచి విజయ్ రూపానీ, పంజాబ్ సీఎం పీఠం నుంచి అమరీందర్‌సింగ్ వైదొలిగారు. పంజాబ్ సీఎంగా చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, గుజరాత్ సీఎం గా భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టారు. మిస్ యూనివర్స్ డిసెంబర్లో హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్‌గా ఎన్నికైంది. 1994(సుస్మితా సేన్), 2000(లారా దత్తా) తర్వాత విశ్వ సుందరిగా ఎంపికైన మూడో భారతీయ యువతి సంధు. వ్యవసాయదారుల విజయం గతేడాది ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ దినోత్సవాన రైతుల సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ ముట్టడించారు. జనవరి 12న రైతు చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వీటిపై అధ్యయనానికి ఒక కమిటీని నియమించింది. నవంబర్ 19న రైతు చట్టాలపై ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పారు. మూడు సాగు చట్టాలను ఉపసంహరిస్తామని ప్రకటించారు. అదే నెల 29న సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ఉపసంహరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. దీంతో ఏడాదికి పైగా సాగిన ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేసి స్వస్థలాలకు వెళ్తున్నామని రైతులు ప్రకటించారు. లఖింపూర్ ఖేరీ ప్రకంపనలు అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతుల ర్యాలీపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనం నడపడంతో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన దేశంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆర్యన్ అరెస్టు అక్టోబర్‌లో బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ సహా 8 మందిని నార్కొటిక్స్ బ్యూరో డ్రగ్స్ కేసులో అరెస్టు చేసింది. 22 రోజుల కస్టడీ అనంతరం ఆర్యన్‌కు బాంబే హైకోర్టు బెయిలిచ్చింది. బిపిన్ మృతి డిసెంబర్లో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్‌రావత్, ఆయన భార్య మధులిక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ప్రమాదంలో బతికి బయటపడ్డ వరుణ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. -
మమత సర్కార్‌కు సుప్రీంలో చుక్కెదురు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పెగసస్ నిఘా సాఫ్ట్‌వేర్‌తో హ్యాకింగ్ ఉదంతంపై బెంగాల్ ప్రభుత్వం వేరుగా విచారణ చేయించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎంబీ లోకూర్ ఆధ్వర్యంలో మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించిన కమిటీ దర్యాప్తుపై స్టే విధించింది. ఇప్పటికే పెగసస్ హ్యాకింగ్‌పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెగసస్‌పై దర్యాప్తు చేయించబోమంటూ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన తర్వాత కూడా బెంగాల్ ప్రభుత్వం వేరుగా విచారణ కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎంఎల్ శర్మ వేసిన పిటిషన్‌ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘లోకూర్ కమిషన్ విచారణ ఉండదని గతంలో బెంగాల్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా! కానీ, మళ్లీ దర్యాప్తు కొనసాగుతోంది. ఏమిటిది?’అని ప్రశ్నించింది. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలకు తెలియజేస్తానని బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ లాయర్ ఏఎం సింఘ్వి ధర్మాసనానికి నివేదించారు. న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వెలువరించేదాకా లోకూర్ కమిషన్ తన విచారణను నిలిపివేస్తుందని ఆయన తెలిపారు. స్పందించిన ధర్మాసనం..‘రాష్ట్ర ప్రభుత్వం సంకటస్థితి అర్థమైంది. పెగసస్ హ్యాకింగ్ విషయంలో దర్యాప్తును నిలుపుదల చేయాలని సంబంధిత అన్ని వర్గాలకు నోటీసులు ఇస్తున్నాం’అని పేర్కొంది. భారత్‌లోని వివిధ వర్గాలకు చెందిన 300 మంది ఫోన్లపై పెగసస్ స్పైవేర్ నిఘా పెట్టిందంటూ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ బయటపెట్టిన విషయం తెలిసిందే. -
‘ఎన్ఎస్ఓ గ్రూప్‌పై నిషేధం’ ప్రతిపాదన లేదు
న్యూఢిల్లీ: ‘ఎన్ఎస్ఓ గ్రూప్’ అని పేరున్న సంస్థలపై నిషేధం విధించాలన్న ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. పెగాసస్ స్పైవేర్‌ను ప్రభుత్వాలకు అందించినందుకు గాను ఎన్ఎస్ఓ గ్రూప్‌ను అమెరికా ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో చేర్చినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. ఈ గ్రూప్‌ను భారత్‌లో నిషేధిస్తారా? అని రాజ్యసభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అలాంటి ప్రతిపాదన లేదన్నారు. దేశంలో సోషల్ మీడియా దుర్వినియోగం అవుతున్న సంగతి నిజమేనని అంగీకరించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసి, విక్రయించిన పెగాసస్ స్పైవేర్‌తో భారత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై, జర్నలిస్టులపై, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, అలాంటిదేమీ లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతుతోంది. పెగాసస్ స్పైవేర్ వాడకంపై నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఈ ఏడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టు ముగ్గురు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. -
పార్లమెంటులో హింసాత్మక ధోరణి.. 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, 2021 చివరి రోజున రాజ్యసభలో హింసకు పాల్పడిన 12 మంది విపక్ష ఎంపీలపై తాజాగా సస్పెన్షన్ వేటు విధించారు. వీరంతా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సభకు హాజరుకాకుడదని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగా అసాధారణ దుష్ప్రవర్తన, ధిక్కార, హింసాత్మక, వికృత ప్రవర్తన కారణంగా వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. సస్పెండ్ చేసిన వారిలో ఆరుగురు కాంగ్రెస్ నేతలతో పాటు శివసేన నేత ప్రియాంక చతుర్వేది, అనిత్ దేశాయ్, టీఎంసీ డోలా సేన్, శాంతా ఛెత్రి, సీపీఎం నేత ఎలమరం కరీం, మరో సీపీఐ నేత ఉన్నారు. ఈ ఏడాది వర్షాకాల పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఆగస్టు 11న లోక్‌సభలో పెగాసస్ స్పైవేర్‌పై చర్చించాల్సిందిగా అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో విపక్ష నేతలు మహిళా సిబ్బందిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు వెలుగు చూశాయి. (చదవండి: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం..!) జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి సూచించాలని డిమాండ్ చేసినప్పటికీ దాన్ని ఆమోదించడంతో సభ దద్దరిల్లింది. ఇక సీసీటీవీ ఫుటేజీలో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో భద్రతా సిబ్బంది మీదకు దూసుకెళ్లడం కనిపించింది. నల్లజెండాలు చేతపట్టుకున్న ఎంపీలు టేబుల్స్ పైకిఎక్కి ఫైళ్లు, పత్రాలు చెల్లాచెదురు చేయడం సీసీటీవీలో రికార్డయ్యింది. (చదవండి: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. ‘ఇదేం బుద్ధి’ అంటూ శశి థరూర్‌పై విమర్శలు) మహిళా మార్షల్స్‌పై విపక్షాలు అసభ్యంగా ప్రవర్తించాయని ప్రభుత్వం ఆరోపించగా, ప్రతిపక్షం ఒక ఉమ్మడి ప్రకటనలో "మహిళా ఎంపీలతో సహా ప్రతిపక్ష నాయకులు, సభ్యులపై చేయి చేసుకోవడానికిగాను ప్రభుత్వం బయటి వ్యక్తులను తీసుకువచ్చింది" అని ఆరోపించింది. ఈ క్రమంలో నాటి హింసాత్మక ఘటనకు సంబంధించి 12 మంది ఎంపీలపై తాజాగా సస్పెన్షన్ వేటు వేశారు. చదవండి: శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్ -
ఎన్ఎస్ఓపై యాపిల్ కేసు
రిచ్మండ్: దిగ్గజ కంపెనీ యాపిల్ వివాదాస్పద స్పైవేర్ పెగాసస్‌ను రూపొందించిన ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూపును కోర్టుకు లాగింది. ఐఫోన్ లాంటి తమ ఉత్పత్తుల్లోకి పెగాసస్‌ను జొ ప్పించకుండా నిరోధించాలని కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేసింది. ‘అత్యంత అధునాతన సైబర్ నిఘా సాంకేతికత సహాయంతో ఎన్ఎస్ఓ ఉద్యోగులు అనైతిక చర్యలకు పాల్పడే కిరాయి సైనికులుగా మారారని ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా కొద్దిసంఖ్యలో ఐఫోన్లపై పెగాసస్ ద్వారా నిఘా పెట్టారని పేర్కొంది. ప్రభుత్వాల అండతో పనిచేసే ఎన్ఎస్ఓ లాంటి గ్రూపులు ఎలాంటి జవాబుదారీతనం లేకుండా... మిలియన్ల కొద్ది డాలర్లను అత్యాధునిక నిఘా వ్యవస్థ అభివృద్ధికి వెచ్చిస్తాయి. ఇది మారాలి’ అని యాపిల్ సంస్థ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెడెరిఘి కోర్టుకు విన్నవించారు. తాము ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం లేదని, కేవలం ప్రభుత్వాలకు మా త్రమే తమ ఉత్పత్తులను అమ్ముతున్నామని ఎన్ఎస్ఓ వాదిస్తోంది. విపక్షనాయకులు, మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు తదితరులపై పెగాసస్ ద్వారా భారత ప్రభుత్వం నిఘా పెట్టిందనే ఆరోపణలు రావడంతో తీవ్ర దుమారం రేగడంతో దీనిపై సుప్రీంకోర్టు ముగ్గురు సాంకేతిక నిపుణులతో దర్యాప్తు కమిటీని వేయడం తెలిసిందే. -
కోట్లమంది ఫోన్ డేటా చోరీ! ఎట్టకేలకు కదిలిన యాపిల్
Pegasus surveillance scandal: పెగాసస్ స్కామ్‌కు సంబంధించిన వ్యవహారంలో యాపిల్ కంపెనీ ఎట్టకేలకు స్పందించింది. కోట్ల మంది ఐఫోన్ యూజర్ల డేటాను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ లక్క్ష్యంగా చేసుకుందంటూ మంగళవారం కాలిఫోర్నియా కోర్టులో దావా వేసింది యాపిల్. ఇప్పటికే పెగాసస్ స్పైవేర్ ద్వారా కోట్లమంది ఐఫోన్ యూజర్ల డేటాను హ్యాకర్లకు చేర్చిందని సదరు దావాలో యాపిల్ పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ ఎన్ఎస్వో గ్రూప్.. పెగాసస్ స్పైవేర్‌ను ఇతర దేశాలకు అమ్ముతుంటుంది. అయితే ప్రభుత్వాలు మాత్రమే మెయింటెన్ చేసే ఈ స్పైవేర్‌ను.. హ్యాకర్లు లక్క్ష్యం చేసుకున్నారని, పలువురు ప్రముఖుల ఫోన్ డేటాను తస్కరించారనే ఆరోపణలతో ‘పెగాసస్ స్కామ్’ వెలుగుచూసింది. పైగా యాపిల్ ఫోన్లు వాడే ప్రముఖుల డేటా లక్క్ష్యం అయ్యిందని, భవిష్యత్తులోనూ ఐఫోన్లు వాడేవాళ్ల డేటా తేలికగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని ఉటంకించింది. Pegasus surveillance scandal నేపథ్యంలోనే మంగళవారం స్పైవేర్ మేకర్ ఎన్‌ఎస్‌వోపై దావా వేసింది. పెగాసస్ స్పైవేర్‌పై అమెరికా ఆంక్షలు విధించిన రెండు వారాలకే యాపిల్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. అంతేకాదు ఎన్ఎస్వో గ్రూప్ యాపిల్‌కు సంబంధించి ఎలాంటి డివైజ్‌లను, సాంకేతికతను, సేవలను, వినియోగించకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఫెడరల్ కోర్టును యాపిల్ అభ్యర్థించింది. అంతేకాదు తమ ఫోన్ డేటా కూడా చోరీకి గురయ్యే అవకాశం ఉందన్న భయాందోళనను తాజా సర్వేలో పలువురు యూజర్లు వ్యక్తం చేశారని యాపిల్ దావాలో పేర్కొంది. అయితే పెగాసస్ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి(భారత్‌కు చెందిన పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సెలబ్రిటీల పేర్లు కూడా!).. ఆరోపణల్ని ఎన్ఎస్వో గ్రూప్ ఖండిస్తోంది. పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశమే ఉండదని స్పష్టం చేసింది. లీక్ డేటా బేస్‌లో నెంబర్లు కనిపించినంత మాత్రనా డేటా హ్యాక్ అయినట్లు కాదని గుర్తించాలని తెలిపింది. తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది కూడా. అయినప్పటికీ వివాదం ముదురుతూనే వచ్చింది. ఇక ఎన్‌ఎస్‌వోకి ఇలాంటి దావాలు కొత్తేం కాదు. 2019లో ఫేస్బుక్ కూడా దావా వేసింది. వాట్సాప్ మెసేంజర్ ద్వారా సైబర్ గూఢచర్యానికి పాల్పడిందని, జర్నలిస్టులు, మానవ హక్కుల సంఘం ఉద్యమకారుల డాటాను తస్కరించిందనే ఆరోపణలు చేస్తూ కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులోనే ఫేస్బుక్ దావా వేసింది. దావాలు చాలవన్నట్లు 500 మిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయి.. డిఫాల్ట్ ప్రమాదానికి చేరువలో ఉంది. మరోవైపు అమెరికా ఆంక్షల తర్వాత భారీ కొనుగోళ్ల ఒప్పందం నుంచి ఫ్రాన్స్ సైతం వెనుదిరిగింది. చదవండి: ఐఫోన్ యూజర్లకు హైఅలర్ట్! వెంటనే.. -
Farm Laws: రద్దు’ ఇప్పుడే ఎందుకు?
Reason Behind Farm Law Repeal In Telugu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి ఈ సమయాన్నే ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహం దాగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఆందోళనలు మొదలై ఈ నెల 26తో ఏడాది పూర్తవుతుంది. ఈలోగా తమ డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా (40 రైతు సంఘాల సమాఖ్య) ప్రకటించింది. మరోవైపు ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సాగు చట్టాలు, పెగాసస్ స్పైవేర్ అంశంపై అనునిత్యం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికి వర్షాకాల సమావేశాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. మరో నాలుగు నెలల్లో ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకతను మరింతగా పెంచుకోవాలని ఏ రాజకీయ పార్టీ కూడా కోరుకోదు. డిసెంబర్ 23 దాకా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయి. రైతుల నిరసనలు, నల్ల చట్టాల అంశమే నిత్యం వార్తల్లో ఉంటే.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విపక్షాలూ ఎలాగూ దీన్ని అందిపుచ్చుకొని ప్రధానాస్త్రంగా చేసుకుంటాయి. వెరసి కాషాయ పార్టీపై ప్రజావ్యతిరేకత ప్రబలుతుంది. అందుకే బీజేపీ వ్యూహకర్తలు పట్టువిడుపులు ప్రదర్శించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు సాగు చట్టాలు, పెట్రోధరల లాంటి అంశాలను హైలైట్ చేస్తూ పతాక శీర్షికలకు ఎక్కితే అది కచ్చితంగా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ప్రతికూల సంకేతాలను పంపుతుంది. ఇది కాషాయ దళానికి అభిలషణీం కాదు. ఏడాది కాలంగా ఏమీ పట్టించుకోకున్నా ఇప్పుడిక ‘సమయం’ లేదు కాబట్టే సాగు చట్టాల ఉపసంహరణకు కేంద్రం మొగ్గుచూపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాల ప్రధానాస్త్రాలు మూడింటి విషయంలోనూ ఇప్పుడు కేంద్రం ప్రభుత్వానికి ‘దాటవేత’ ధోరణిని అధిగమించి ఎదురునిలిచి బదులిచ్చే వెసులుబాటు కలిగింది. ఎదురుదాడి ఇటీవల పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాల్లో తేడాకొట్టిన వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అన్నట్లుగా బీజేపీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాలు సైతం పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను తగ్గిస్తూ గంటల వ్యవధిలో పోటీలు పడి ప్రకటనలు విడుదల చేశాయి. ఇప్పుడిదే అంశాన్ని పట్టుకొని బీజేపీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాల నోరునొక్కడానికి ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. మీ రాష్ట్రాల్లో వ్యాట్‌ను ఎందుకు తగ్గించట్లేదని ఎదురుదాడికి దిగుతుంది. ఇతర ఏ అంశాన్ని విపక్షాలు ప్రస్తావించినా బీజేపీ మాత్రం వ్యాట్ ఎందుకు తగ్గించలేదనే అంశాన్నే తెరపైకి తెస్తూ తప్పించకోజూస్తుంది. కేంద్రం వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీని సెంట్రల్ పూల్ కింద తక్కువగా చూపుతూ సెస్‌ల రూపంలో అధికంగా పిండుకుంటోంది. అసలే రాష్ట్రాలకు ఆదాయ వనరులు తక్కువని, కోవిడ్–19 వ్యాప్తితో రాబడి మరింత దెబ్బతిందని, ఈ నేపథ్యంలో వ్యాట్ తగ్గింపు సాధ్యం కాదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. వ్యాట్ తగ్గింపు అంశాన్ని ప్రతిరోజూ హైలైట్ చేయడం ద్వారా ఇతర అంశాలను మరుగున పడేయడానికి పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ తప్పకుండా ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. అంతిమంగా ప్రజా వ్యతిరేకతను వీలైనంత తగ్గించుకొని, విపక్షాలకు అస్త్రాలేవీ లేకుండా చేయాలని, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆలస్యమైనా ఉపశమనం సదుద్దేశంతో రైతుల మేలుకోరి మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చినా కొందరినీ ఒప్పించలేక వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఈనెల 19న ప్రకటించారు. దేశానికి క్షమాçపణ చెప్పారు. ఉపసంహరణ æప్రక్రియను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామన్నారు. రైతు ఆందోళనల్లో కీలక భూమిక పోషిస్తున్న జాట్లు 136 స్థానాలున్న పశ్చిమ యూపీలో బీజేపీయేతర ఓటును ఏకతాటిపైకి చేర్చకుండా చూసుకోవాలంటే రైతు చట్టాలను రద్దు చేయాలి. పంజాబ్ జనాభాలో 21 నుంచి 25 శాతం జాట్ సిక్కులు ఉన్నారు. ఇతర సిక్కుల్లోనూ రైతులే అధికం. వీరి ఆగ్రహాన్ని చల్లార్చాలి. ఈ రెండింటినీ బీజేపీ ఆశించింది. ఇప్పుడిక కాంగ్రెస్, మిగతా విపక్షాలు రైతు ఎజెండాపై ఇదివరకటిలా మోదీ సర్కారుపై ముప్పేట దాడికి దిగలేవు. ‘కనీస మద్దతు ధర’ అంశం ఇకపై ఇరుపక్షాల నడుమ సంఘర్షణకు కేంద్ర బిందువు అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఊరట విపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై పెగాసస్ స్పైవేర్‌తో (ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ తయారీ) నిఘా పెట్టారని, ఫోన్లను ట్యాప్ చేశారని, దీనిపై ప్రభుత్వం విస్పష్టమైన సమాధానం ఇవ్వాలని విపక్షాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను స్తంభింపజేశాయి. సీనియర్ జర్నలిస్టులు కొందరు సుప్రీంకోర్టుకు ఎక్కారు. చట్టవిరుద్ధంగా తామేమీ నిఘా పెట్టలేదని, దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఇంతకు మించి వివరాలను వెల్లడించలేమని మోదీ సర్కా రు సుప్రీంకోర్టులో వాదించింది. ఇందులోని నిజా నిజాలను నిగ్గుతేల్చడానికి మాజీ జడ్జి ఆర్.వి.రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సాంకేతిక నిపుణులతో కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. అంటే పెగాసస్‌పై కేంద్రానికి తాత్కాలిక ఊరట లభించినట్లే. విపక్షాలు దీన్ని లేవదీసినా అంశం కోర్టు పరిధిలో ఉందని, ఏమైనా ఉంటే సాంకేతిక కమిటీకి విన్నవించుకోవాలంటూ కేంద్రం చేతులు దులుపుకునే అవకాశం ఉంటుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
పూర్తి సహకారమందిస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు కొనసాగించనున్న నిపుణుల కమిటీకి తమ పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం స్పష్టంచేసింది. ప్రతిపక్ష నేతలు, సామాజిక ఉద్యమ కారులు, పాత్రికేయులు తదితరులపై కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ సాయంతో నిఘా పెట్టిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. దీంతో ఈ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు స్వతంత్య్ర సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఇటీవల ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి కావాల్సిన మౌలిక, మానవ వనరుల, ల్యాబొరేటరీ వసతులు, సమాచారం ఇలా అన్ని రకాల సహాయసహకారాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టంచేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన ‘టైమ్స్ నౌ సమ్మిట్ 2021’లో మంత్రి ప్రసంగించారు. ‘ చట్టాన్ని మీరి మోదీ సర్కార్ ఎలాంటి తప్పు చేయలేదు. ఈ విషయంలో మాకు ఎలాంటి చింతా లేదు. నిపుణుల కమిటీ తుది నివేదిక ఎలా ఉన్నా మాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు’ అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ‘ ఇంతవరకూ దేశాన్ని పాలించిన ఏ ప్రభుత్వమూ పెగాసస్ స్పైవేర్‌ను కొనలేదంటారా?’ అన్న సూటి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ‘ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా గతంలోనే స్పష్టంచేశాం. చట్టాల చట్రంలోనే మా పాలన కొనసాగుతోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఆయా చట్టాలను గతంలో రూపొందించారు. ఆ చట్టాల నాలుగు గోడల మధ్యే మేమున్నాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాలపై నియంత్రణపై ఆయన మాట్లాడారు. మన సంస్కృతి దెబ్బతినకుండా, భవిష్యత్ పరిణామాలకు తగ్గట్లుగా ఐటీ మార్గదర్శకాలు రూపొందాయన్నారు. -
అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెగాసస్
రిచ్మండ్ (అమెరికా): భారత్‌లో తీవ్ర దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. పెగాసస్ స్పైవేర్ ద్వారా విపక్షనేతలు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై దాదాపు 50 దేశాల్లో నిఘా పెట్టారని అంతర్జాతీయ మీడియా కన్సార్టియం బయటపెట్టిన విషయం తెలిసిందే. అక్రమంగా ఫోన్లను హ్యాక్ చేశారనే విషయం భారత్‌లో ప్రకంపనలు సృష్టించింది. విపక్షాల నిరసనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సైతం పూర్తిగా స్తంభించిపోయాయి. పెగాసస్ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూపు తయారు చేస్తోంది. ఎన్ఎస్ఓ గ్రూపుతో పాటు నిఘా పరికరాలను, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న ఇజ్రాయెల్‌కే చెందిన మరో సంస్థ ‘కాండిరూ’ను నియంత్రిత సంస్థల జాబితాలో చేరుస్తున్నట్లు అమెరికా వాణిజ్యశాఖ బుధవారం ప్రకటించింది. ఈ సంస్థల ఉత్పత్తులు దేశ, విదేశాల్లో అణచివేతకు దారితీశాయని బైడెన్ సర్కారు పేర్కొంది. నియంత్రిత సంస్థల జాబితాలో చేరిస్తే... ఈ సంస్థలకు అమెరికా కంపెనీల నుంచి సాంకేతిక పరిజ్ఞానం, విడిభాగాలు, పరికరాలు లభించడం కష్టతరమవుతుంది. ఈ సంస్థలకు ఎగుమతులు చేయాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనసరి కానుంది. అమెరికా విదేశాంగ విధానంలో మానవహక్కులకు పెద్దపీట వేయాలని బైడెన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అందువల్లే ఎన్ఎస్ఓ, కాండిరూలను నియంత్రిత సంస్థల జాబితాలో చేర్చామని అమెరికా వాణిజ్యశాఖ తెలిపింది. పెగాసస్ స్పైవేర్‌తో అక్రమ నిఘా పెట్టారని, స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని పిటిషన్లు దాఖలు కావడంతో భారత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని నిగ్గుతేల్చడానికి కొద్దిరోజుల కిందటే రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంతో సాంకేతిక నిపుణులతో విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. Vinisha Umashankar: మీ తీరు చూస్తోంటే..కోపం వస్తోంది! శభాష్ వినీషా! -
‘ఈ నిఘా’తోనే అసలు ముప్పు!
వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై నిఘా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారివారి సొంతం. అది అవధులు దాటి సమాజ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తే తప్ప.. వ్యక్తిగత ‘గోప్యత’కు, భావప్రకటనా స్వేచ్ఛకూ భంగం కలిగించడానికి తాము వ్యతిరేకమని న్యాయ మూర్తులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. పెగసస్ గూఢచర్యంపై భారత సర్వోన్నత న్యాయస్థానం తక్షణ, సంపూర్ణ విచారణకు నిర్ణయించడానికి ఇదే కారణం. పౌరులపై, ప్రముఖులపై నిఘా ఆరోపణలు ‘నిజమా, కాదా’ అన్న ప్రశ్నకు కేంద్ర పాలకులు ఈ రోజుదాకా సమాధానం ఇవ్వకుండా ‘మూగనోము’ పట్టి కూర్చుంటున్నారు. కానీ, మన జాతీయ భద్రతకే ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో, తన వంతుగా మూగనోము పట్టి, ప్రేక్షక పాత్రను పోషించలేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఇతర దేశాలలో ఇజ్రాయెల్ జరిపే గూఢ చర్యం నిమిత్తం ఆయా దేశాలలో ‘కూపీలు’ తీయడానికి ఉపయోగించే ప్రత్యేక నిఘా సాఫ్ట్వేర్ ‘పెగసస్’. దీన్ని ఆయా దేశాల ప్రభుత్వాలకు మాత్రమే ఇజ్రాయెలీ కంపెనీలు విక్రయించుకోవచ్చు. పెగసస్ గూఢ చర్య వ్యవహారం భారత ప్రభుత్వ సొంత వ్యవహారం.’’ – భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారిగా కొత్తగా నియమితులైన నోర్ గిలాన్ ప్రకటన (28–10–2021) ఇటీవలి చరిత్రను అవలోకిస్తే, ఇజ్రాయెల్‌ను అరబ్బుల మధ్య ఒక ప్రత్యేక దేశంగా అమెరికా, బ్రిటన్లు సృష్టించిన విషయం గుర్తు కొస్తుంది. పశ్చిమాసియాను, అరబ్ దేశాలను యథేచ్ఛగా దోచుకొని అక్కడి ఇంధన వనరులను తరలించుకుపోయే సాధనంగా ఇజ్రాయె ల్ని అమెరికా, బ్రిటన్లు వినియోగించుకుంటూ వస్తున్నాయని మర చిపోరాదు. అదే ప్రయోగం మనదేశంలో ఇప్పుడు అంతర్గతంగా జరు గుతోందా అని అనుమానం కలుగుతోంది. కనుకనే ఈ అను భవం దృష్ట్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పెగసస్ గూఢ చర్యంపై తక్షణ, సంపూర్ణ విచారణకు నిర్ణయించవలసి వచ్చిందనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రభుత్వ అనుమతితో ఎన్.ఎస్.వో. అనే పేరుతో నడుస్తున్న గూఢచర్య సంస్థ తాలూకు నిఘా సాఫ్ట్వేర్ పెగసస్ భారత ప్రభుత్వ అనుమతితోనే దేశంలోకి అడుగుపెట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను, ఆందోళనలను తలపెట్టిన రాజకీయ పక్షాలు, పౌరహక్కుల సంస్థలు, ప్రతిపక్షాల కార్యకలాపాల పైన ఒక కన్నువేయడానికి పాలకవర్గం ‘పెగసస్’ ద్వారా గూఢ చర్యా నికి ఒడిగట్టిందని ఆరోపణలు పెల్లుబికాయి. కాని, గత రెండు న్నర సంవత్సరాలకు పైగా తన నిఘా విధానాలపై ప్రబలిపోతున్న అను మానాలు, ఆరోపణలు ‘నిజమా, కాదా’ అన్న ప్రశ్నకు మాత్రం కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా ‘మూగ నోము’ పట్టింది. దేశభద్రతకు సంబంధించిన ఈ పరిణామాలపట్ల ఆందోళన చెందిన సుప్రసిద్ధ పాత్రికేయులు, పత్రికాసంస్థలు రంగంలోకి దిగి సుప్రీంకోర్టులో ‘రిట్’ పిటీషన్లు దాఖలు చేశాయి. దీంతో ‘డొంకంతా’ కదిలింది. అంతకుముందు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై నిఘా పట్ల తీవ్ర అభ్యంతరం తెలుపుతూ వచ్చారు. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారివారి సొంతం. అది అవధులు దాటి సమాజ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తే తప్ప వ్యక్తిగత ‘గోప్యత’కు, వీరి భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కల్గించడానికి తాము వ్యతిరేకమని కొందరు గౌరవ న్యాయ మూర్తులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. కాగా భారత ప్రభుత్వ అనుమతితోనే భారతదేశ అంతరంగిక వ్యవహారాల్లో, తాము జోక్యం చేసుకుని ఈ గూఢచర్యానికి దిగామని ‘పెగసస్’ సంస్థ తాజాగా అంగీకరించింది. దీనికి ఇజ్రాయెల్ ప్రభుత్వ అనుమతి కూడా ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత పాలకవర్గాల సమ్మతితో నడుస్తున్న ‘పెగసస్’ గూఢచర్యం తంతు ‘నిగ్గు’ తేల్చడానికీ, మొత్తం వ్యవహారం గుట్టుమట్టులు తేల్చడానికి సుప్రీం గౌరవ ప్రధాన న్యాయమూర్తి సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.వి. రవీంద్రన్ నేతృత్వంలో ముగ్గురు సభ్యు లతో కూడిన నిపుణుల కమిటీని ఆయన నియమించారు. ఈ కమిటీకి పలు శాఖలకు చెందిన సాంకేతిక నిపుణులు సహాయ సహకారాలు అందిస్తారు. ఫలితంగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికీ, సెక్యులర్ రాజ్యాంగ విలువల రక్షణకూ శాశ్వతమార్గం ఏర్పడగలదన్న ఆశా భావాన్ని పలు ప్రతిపక్షాలు, పౌర హక్కుల సంస్థలు, నిపుణులు, ప్రజా ఉద్యమాలకు చెందిన ఆందోళనకారులు వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని, పౌరహక్కులను కూడా విదేశీ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగసస్’ ద్వారా కాలరాసే దుర్గతిని అనుమతించ రాదని సీనియర్ జర్నలిస్టు నాయకులు కొంత కాలం క్రితం‘రిట్’ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ని కోర్టు గౌరవించి రంగంలోకి దిగవలసి వచ్చింది. దీని పర్యవసానంగానే ‘జాతీయ భద్రత కన్నా మించింది లేదనీ’ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మన జాతీయ భద్రతకే ముప్పు వాటిల్లుతున్న ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో, తన వంతుగా మూగనోము పట్టి, ప్రేక్షక పాత్రను పోషించలేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తన నుంచి ఈ అంశానికి సంబంధించి సానుకూల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈషణ్మాత్రం కూడా ఆశిం చరాదనీ గౌరవ సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించాల్సి వచ్చింది! అదే సమయంలో న్యాయస్ధానం మరొక విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ‘గోప్యత అనేది ఒక్క జర్నలిస్టులకు, లేదా సామాజిక కార్యకర్తలకు మాత్రమే వర్తించేదికాదు, ఈ ప్రాథమిక హక్కుకు భంగం కలగడం అనేది, ‘నా గోప్యతను దెబ్బతీయడానికి ఫలానా ప్రమాదం పొంచి ఉందన్న అనుమానం పౌరుడికి కల్గడమే’ తప్ప మరేమీ కాదు. గోప్యతకు భంగం కలిగిస్తే, పౌరులు తమ ప్రాథమిక హక్కులను స్వేచ్ఛగా ఇకపై అనుభవించలేమన్న భావనకు దారి తీస్తుందని గుర్తించాలని కూడా కోర్టు హెచ్చరించాల్సి వచ్చింది. పత్రికలు, జర్నలిస్టులు, రానున్న పరిణామాలను ముందస్తుగానే పసికట్టి, ప్రజల్ని అప్రమత్తుల్ని చేస్తారు. కాబట్టి అలాంటి వారిపైన పాలకవర్గాలు ‘నిఘా’ పెట్టడమంటే పత్రికల గురుతర బాధ్యతపైన దాడి చేయడమేననీ, వారి నోళ్లు నొక్కడంగానే భావించాలనీ కోర్టు అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య మనుగడకు మీడియా ఒక ప్రధా నమైన దీపస్తంభమని మరచిపోరాదంటూ, పాలకవర్గాలను సుప్రీం కోర్టు ధర్మాసనం మరోసారి హెచ్చరించాల్సి వచ్చింది. జర్నలిస్టులకు తమ వార్తలకున్న ఆధారాన్ని సంరక్షించుకోవాల్సిన ధర్మం ఉంటుంది. వీరి వృత్తి ధర్మ నిర్వహణపై నిఘా పెట్టడం అంటే, ‘పెగసస్’ ద్వారా ప్రభుత్వం మనదేశంలో సాగిస్తున్న రహస్య కార్యకలాపాలకు సంబం ధించిన విశ్వసనీయ సమాచారాన్ని రాబట్టడాన్ని అడ్డుకోవడమే అవు తుంది. పైగా ఈ బాధ్యతలో ఉన్న పాత్రికేయుల శక్తిని నిర్వీర్యం చేయ డమే అవుతుందని కోర్టు (27–10–2021) హెచ్చరించాల్సి వచ్చిం దని మరువరాదు! అంతేగాదు, పత్రికాస్వేచ్ఛ అనేది ‘ప్రజాస్వామ్య వ్యవస్థ మను గడకోసం’ చేసిన ఎన్నో త్యాగాల ఫలితంగా దక్కిన హక్కు అని న్యాయస్థానం గుర్తుచేయాల్సి వచ్చింది. ఇటు ఎన్. రామ్ ప్రభృతులు, మరోవైపు నుంచి ఎడిటర్స్ గిల్డ్– ఇజ్రాయెలీ గూఢ చర్య సాఫ్ట్వేర్ ‘పెగసస్’ వ్యవహారంలో ఇరుక్కున్న భారత ప్రభుత్వ పాత్ర గురించిన వివాదంలో స్వతంత్ర దర్యాప్తు విధిగా అవసరమని భావించడం జరిగింది. మనదేశంలో కూడా ఇజ్రాయెల్ ఆధారంగా శరవేగంగా సంభ విస్తున్న పరిణామాల్ని జాగ్రత్తగా పరిశీలించగల వారికి ప్రసిద్ధ తెలుగు సామెత గుర్తుకు రాకతప్పదు. ‘నువ్వులు చల్లి ఆవాలు పండమంటే సాధ్యమా’ అన్నది! అందుకే దాస్యమనేది ప్రతి ఆత్మలో పెరిగే ఓ కలుపుమొక్క అన్న సామెత పుట్టుకొచ్చి ఉంటుంది. ఎంతటి ‘ప్రజాస్వామ్య దేశమైనా’ సరే... శాస్త్రీయ సోషలిజం ప్రవక్త కారల్ మార్క్స్ ఒక సత్యాన్ని లోకానికి అందించి పోయాడు. ప్రతీ యుగంలోనూ పాలకవర్గం భావాలు ఆనాటి పాలనా వ్యవస్థ భావాలే. అంటే ఆనాటి సమాజంలో ఏ వర్గం బలమైన భౌతికశక్తిగా పెత్తనం చలాయిస్తూ ఉంటుందో, ఆ శక్తే యావత్ సమాజంపై పెత్తనం చలాయించే ప్రధానమైన మేధాశక్తిగా చలామణీ అవుతూ ఉంటుంది. ఆ శక్తే స్త్రీ– పురుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను కూడా శాసించే నిర్ణాయక శక్తిగా పెత్తనం సాగిస్తూ ఉంటుంది! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
పెగాసస్‌పై కమిటీ.. గొప్ప ముందడుగు: రాహుల్
న్యూఢిల్లీ: పెగాసస్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్వాగతించారు. ఇదొక పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. సైబర్ నిపుణులతో కూడిన త్రిసభ్య కమిటీ దర్యాప్తుతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెగాసస్‌ను ఉపయోగించడం అంటే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. పెగాసస్ నిఘా అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో మళ్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని రాహుల్ పేర్కొన్నారు. చర్చకు ప్రభుత్వం ఇష్టపడకపోయినప్పటికీ తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. -
గోప్యత హక్కు చాలా ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొంతమంది విపక్ష నేతలు, ప్రముఖులు, పాత్రికేయులపై నిఘా ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ వినియోగించిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు కమిటీ నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో 300మందికి పైగా మొబైల్ ఫోన్లపై నిఘా ఉంచారంటూ మనోహర్‌లాల్ శర్మ, ఎడిటర్స్ గిల్డ్ సహా పలువురు జర్నలిస్టులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం 46 పేజీల తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని తామే ఏర్పాటు చేస్తామన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రజాస్వామ్య దేశంలో అక్రమంగా వ్యక్తులపై నిఘా పెట్టడాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది. జాతీయ భద్రతతో ముడిపడిన అంశమని చెప్పి కేంద్రం ప్రతిదాన్నీ దాటవేయలేదని స్పష్టం చేసింది. పౌరుల వ్యక్తిగత గోపత్య హక్కుకు సంబంధించి ఇటీవలికాలంలో అత్యంత కీలకమైన తీర్పును వెలువరిస్తూ... జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పి... న్యాయవ్యవస్థను మౌనప్రేక్షక పాత్రకు పరిమితం చేయలేరని విస్పష్టంగా పేర్కొంది. నిపుణుల కమిటీని వారి సమాచారాన్ని వ్యక్తిగతంగా సేకరించి, పరిశీలించి నియమించామని తెలిపింది. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, నెట్వర్క్, హార్డ్‌వేర్ వంటి సాంకేతిక అంశాల్లో అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను ఎంపిక చేసి పారదర్శక దర్యాప్తు నిమిత్తం కమిటీలో నియమించామని పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ కమిటీకి నేతృత్వం వహిస్తారని, దర్యాప్తు పారదర్శకంగా, సమర్థంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కమిటీకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓసీ)ను తీర్పులో పొందుపరిచింది. కమిటీ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పెగాసస్‌పై సమగ్రంగా పరిశీలించి, దర్యాప్తు అనంతరం నివేదికను కోర్టుకు అందించాలని కమిటీని ఆదేశించింది. ఎనిమిది వారాల అనంతరం ఈ అంశంపై విచారణ చేస్తామని పేర్కొంది. కోర్టు నియమించిన కమిటీకి కావాల్సిన వసతి, ఇతరత్రా సౌకర్యాలు, సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏజెన్సీలు అందించాలని ఆదేశించింది. దేశప్రజలపై విదేశీ ఏజెన్సీలు, ప్రైవేటు సంస్థలు నిఘా ఉంచడాన్ని గమనించిన ధర్మాసనం ఈ అంశాన్ని కూడా దర్యాప్తు చేయాలని కమిటీని ఆదేశించింది. నిబంధనలకు లోబడే ఉండాలి... దేశంలో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాల్సి ఉందన్న సుప్రీంకోర్టు జాతీయ భద్రత విషయంలో న్యాయవ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది, అయితే, న్యాయసమీక్షకు వ్యతిరేకంగా దేన్నిపడితే దాన్ని నిషేధించే అవకాశం లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత అనేది ఎప్పుడుపడితే అప్పుడు ఉపయోగించే అంశం కాదని తెలిపింది. ఆ ప్రస్తావన వచ్చినపుడల్లా న్యాయవ్యవస్థ జోక్యం అవసరమని అభిప్రాయపడడం లేదని తెలిపింది. జాతీయ భద్రతపై భయాందోళనలు తలెత్తినపుడల్లా కేంద్రానికి తప్పించుకొనే అవశాకం వస్తుందని కాదని, అలాగని తిరస్కరించే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినపుడు కేంద్రం తననితాను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సమాచారం బహిర్గతం కావడం అనేది జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేస్తుందని చెప్పి దీనిపై కోర్టు అన్నివేళలా మౌనంగా వ్యవహరించబోదని స్పష్టం చేసింది. దేశంలో ప్రజలందరికి గోప్యత హక్కు చాలా ముఖ్యమని పేర్కొంది. ప్రజల జీవితాలు మెరుగుకావడానికి సాంకేతిక సాధనమైనప్పటికీ దాని వల్లే గోప్యత ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిపింది. ‘గోప్యత అనేది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలకు మాత్రమే సంబంధించింది కాదు. గోప్యత ఉల్లంఘనల నుంచి ప్రతి పౌరుడికి రక్షణ, భద్రత ఉండాలి. ఇదే వ్యక్తిగత స్వేచ్ఛను ఉయోగించుకునేలా చేస్తుంది‘ అని ధర్మాసనం పేర్కొంది. ఇతర హక్కుల మాదిరిగానే గోప్యత హక్కు కూడా పరిమితులకు లోబడే ఉంటుందని, అవి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటానికి నిఘా ఎంతో అవసరమని, ఈ పరిస్థితుల్లో వ్యక్తుల గోప్యత హక్కులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం వస్తుందని, ఇది జాతీయ భద్రత, ప్రయోజనాల కోసమే నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. గోప్యత హక్కు ఉల్లంఘన ఆరోపణల విషయంలో సదరు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం సరైనా సాక్ష్యాధారాల ద్వారానే జరగాలని తెలిపింది. ప్రజాస్వామ్య దేశాల్లో విచక్షణారహితంగా వ్యక్తులపై నిఘా, గూఢచర్యం అనుమతించడానికి వీల్లేదని పేర్కొంది. మీడియాపై నిఘా అనేది పబ్లిక్ వాచ్ డాగ్ పాత్రపై దాడి చేసినట్లుగా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలా చేయడం కచ్చితత్వంతో కూడిన నమ్మదగిన సమాచారాన్ని అందించే పత్రిక సామర్థ్యాన్ని అణగదొక్కడమేనని పేర్కొంది. పెగాసస్‌పై తొలి ఆరోపణల నుంచి కేంద్రం తగిన వైఖరి వెల్లడించలేదని, అయినప్పటికీ రెండేళ్లుగా కోర్టు తగిన సమయం ఇచ్చిందని తెలిపింది. జాతీయ భద్రతా సమస్యలను ప్రభావితం చేసే ఏ సమాచారాన్నైనా బహిర్గతం చేయాలని కేంద్రంపై తామెప్పుడు ఒత్తిడి చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీ సభ్యులు జస్టిస్ ఆర్వీ రవీంద్రన్: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఇటీవల కుట్ర ఆరోపణలు వచ్చినపుడు విచారణకు నియమితులైన జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. జస్టిస్ రవీంద్రన్ న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్బీఎస్ఏ)కు 2013 నుంచి 2019 వరకూ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆలోక్ జోషి: 1976 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆలోక్ జోషి ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్త డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విశేషమైన దర్యాప్తు అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. రిసెర్చ్, ఎనాలసిస్ వింగ్ (రా)లో కార్యదర్శిగా, నేషనల్ టెక్నికల్ రిసెర్చీ ఆర్గనైజేషన్‌కు ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ రవీంద్రన్‌కు సహాయకారిగా ఈ కమిటీలో సభ్యుడిగా సుప్రీంకోర్టు నియమించింది. డాక్టర్ సందీప్ ఒబెరాయ్ : ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యురిటీ నిపుణుడుగా గుర్తింపు పొందారు. టీసీఎస్ సైబర్ సెక్యూరిటీస్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల రంగంలో సదుపాయాల అభివృద్ధికి సబ్ కమిటీ అయిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండరైజేషన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్, జాయింట్ టెక్నికల్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. సాంకేతిక కమిటీ సభ్యులు డాక్టర్ నవీన్‌కుమార్ చౌధరి: సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ అయిన నవీన్ కుమార్ గుజరాత్‌లోని నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ డీన్‌గా పనిచేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేయడంతోపాటు సైబర్ సెక్యూరిటీ ఎనేబులర్‌గా, సైబర్ సెక్యురిటీ నిపుణుడిగా పేరుగాంచారు. సైబర్ సెక్యూరిటీ పాలసీ, నెట్వర్క్, వల్నరబిలిటీ అసెస్మెంట్, పెనట్రేషన్ టెస్టింగ్‌లో అనుభవంగల వారు. డాక్టర్ పి.ప్రభాహరన్: కేరళలోని అమృత విశ్వ విద్యాపీఠంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ప్రభాహరన్. కంప్యూటర్ సైన్స్, సెక్యూరిటీకి సంబంధించి రెండు దశాబ్దాల అనుభవం ఈయన సొంతం. మాల్వేర్ డిటెక్షన్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్సెక్యూరిటీ, కాంప్లెక్స్ బైనరీ ఎనాలసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో నిపుణులు. పలు జర్నల్స్‌లో ప్రభాహరన్ వ్యాసాలు ప్రచురితమయ్యాయి. డాక్టర్ అశ్విన్ అనిల్ గుమస్తే: బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్‌టెక్నాలజీ (ఐఐటీ)లో కంప్యూటర్‌సైన్స్ ఇంజినీరింగ్‌లో ఇన్స్టిట్యూట్ ఛైర్ అసోసియేట్ ప్రొఫెసర్. ఈయన పేరు మీద 20 యూఎస్ పేటెంట్లు ఉన్నాయి. 150 పత్రాలు వివిధ «జర్నల్స్‌లో ప్రచురితం కాగా మూడు పుస్తకాలు రాశారు. విక్రమ్‌సారాభాయ్ అవార్డు (2012), శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (2018)లో అందుకొన్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజిటింగ్ ప్రొఫెసర్. పరిశీలించే అంశాలు... భారతీయుల ఫోన్లు, ఇతరత్రా పరికరాలను పెగాసస్ స్పైవేర్‌ను వినియోగించి వారి సంభాషణలను ఆలకించడం, ఫోన్లలో నిల్వ ఉన్న సమాచారాన్ని సేకరించడం, లేదా ఇతరత్రా ప్రయోజనాల కోసం వినియోగించడం కేంద్ర ప్రభుత్వం చేసిందా?. అలా చేస్తే బాధితుల వివరాలు ఏంటి? పెగాసస్ వినియోగించి 2019లో భారతీయుల వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఏయే చర్యలు తీసుకుంది ?. కేంద్రం పెగాసస్ సహా ఏ తరహావైనా స్పైవేర్లను కలిగి ఉందా? భారతీయులపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాన్ని వినియోగించిందా?. ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ భారతీయులపై ఆ తరహా స్పైవేర్‌ను వినియోగించి ఉంటే ఏ చట్ట ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం లేదా ప్రోటోకాల్, న్యాయ సంబంధిత అంశం ద్వారా చేపట్టింది? భారతదేశానికి సంబంధించిన సంస్థ/వ్యక్తులు స్పైవేర్ వినియోగించినట్లైతే వారికి ఉన్న అధికారం ఏంటి? ఇతరత్రా సంబంధిత అంశాలు, ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అనేది కమిటీ పరిశీలించాలి. -
పెగాసస్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
పెగసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
పెగాసస్ వ్యవహారం.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ వాదనల నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం దీనిపై విచారణకు ఆదేశిస్తూ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటిని నియమించింది. జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది. అలోక్ జోషి, సందీప్ ఒబెరాయ్ సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ.. ఏడు అంశాలపై దర్యాప్తు చేయనుంది. (చదవండి: తమిళనాడులో కేంద్రం కొత్త ఆట.. రసవత్తరంగా రాజ్‌భవన్ రాజకీయం..!) చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను కోర్టు సహించదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్ ప్రత్యక్ష బాధితులని పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వురినియోగంపై పరిశీలన చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడాన్ని సహించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిఘాతో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని ధర్మాసనం పేర్కొంది. (చదవండి: ఢిల్లీలో చంద్రబాబుకు షాక్.. అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ, షా -
కాసేపట్లో పెగాసస్ స్పైవేర్ పై సుప్రీం కోర్టు తీర్పు
-
పెగాసెస్: ప్రిన్సెస్ ఫోన్ హ్యాక్ చేసిన మాజీ భర్త
దుబాయ్: దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్-మక్తూమ్ తన మాజీ భార్య ప్రిన్సెస్ హయా బింట్, ఆమె న్యాయవాదుల ఫోన్లను హ్యాక్ చేయమని ఆదేశించినట్లు తెలిసింది. వారి పిల్లల కస్టడీకి సంబంధించిన ఇంగ్లండ్ హైకోర్టులో చైల్డ్-కస్టడీ ఫాక్ట్-ఫైండింగ్ కేసు నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీని విచారణలో భాగంగా మొహమ్మద్ తన మాజీ భార్య ప్రిన్సెస్ హయాను వెంటాడి.. బెదిరింపులకు గురి చేసినట్లు ఇంగ్లండ్ హైకోర్టు అభిప్రాయపడింది. ప్రిన్సెస్ హయా ఫోన్ హ్యాక్ చేయడం కోసం మహమ్మద్ అధునాతన "పెగసస్" సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ జాతీయ భద్రతా ప్రమాదాలను ఎదుర్కోవడానికి దేశాల కోసం ఈ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసింది. ఇది మనదేశలో కూడా పెగాసస్ పెను ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొహమ్మద్.. తన మాజీ భార్య, జోర్డాన్ రాజు అబ్దుల్లా సోదరి ప్రిన్సెస్ హయా బింట్ అల్-హుస్సేన్‌తో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న వారి ఫోన్లను హ్యాక్ చేయడానికి పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకున్నట్లు తెలిసింది (చదవండి: మేఘాలకే షాకిచ్చి.. వానలు కురిపించి..) మొహమ్మద్ కోసం పనిచేస్తున్న వారు బ్రిటిష్ రాజధాని సమీపంలోని హయా ఎస్టేట్‌కి ప్రక్కనే ఒక భవంతిని కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ చర్యలను ఇంగ్లండ్ కోర్టు తప్పుపట్టింది. హయాను వెంటాడే ఈ చర్యల వల్ల ఆమె ఎంతో అసురక్షితంగా ఫీలవుతుందని.. ఊపిరి కూడా పీల్చుకోలేకపోతుంది అని కోర్టు అభిప్రాయపడింది. మొహమ్మద్ తన ఇద్దరు కుమార్తెలను అపహరించాడని, వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడమే కాక వారి ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించాడని కోర్టు నిర్ధారించిన 19 నెలల తర్వాత తాజాగా తీర్పులు వెల్లడించింది. ఈ సందర్భంగా "తాజాగా వెల్లడయిన అంశాలు విశ్వాసాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి" అని ఇంగ్లండ్, వేల్స్‌లోని కుటుంబ విభాగం అధ్యక్షుడు జడ్జి ఆండ్రూ మెక్‌ఫార్లేన్ తన తీర్పులో వెల్లడించారు. (చదవండి: ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా.. ఇప్పుడు ప్రపంచంలోని అద్భుతాలకు.. ) మొహమ్మద్ షేక్ కోర్టు తీర్మానాలను తిరస్కరించారు, అవి అసంపూర్ణ వాస్తవాలపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు. "నాపై చేసిన ఆరోపణలను నేను ఎప్పుడూ ఖండిస్తూనే ఉన్నాను.. ఇప్పుడు కూడా అదే చేస్తాను" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కొన్నేళ్ల క్రితం హయా(47), తన ఇద్దరు పిల్లలు జలీలా(13), జాయెద్‌లను తీసుకుని బ్రిటన్ పారిపోయారు. అప్పటి నుంచి పిల్లల కస్టడీకి సంబంధించి మొహమ్మద్, హయాల మధ్య సుదీర్ఘమైన, ఖరీదైన న్యాయపోరాటం జరుగుతుంది. అంతేకాక హయా తన బ్రిటిష్ అంగరక్షకులలో ఒకరితో సంబంధం కలిగి ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. హ్యాకింగ్‌కు గురి అయిన వారిలో హయా తరఫు న్యాయవాది ఫియోనా షాక్లెటన్ కూడా ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. (చదవండి: బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్) హ్యాకింగ్ వార్తలు వెలుగు చూసిన తర్వాత పెగసస్‌ను దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లభించినట్లయితే తాము చర్యలు తీసుకుంటామని.. యూఏఈతో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని ఎన్ఎస్ఓ వెల్లడించినట్లు హయా తరఫు న్యాయవాది తెలిపారు. ఈ విషయంపై ఎన్ఎస్ఓ స్పందించలేదు. చదవండి: ప్రపంచమే హాయిగా నిద్రపోతోంది -
పెగాసస్ విచారణకు నిపుణుల కమిటీ ఏర్పాటు: సుప్రీం కోర్టు
-
పెగాసెస్ విచారణకు నిపుణుల కమిటీ ఏర్పాటు: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: దేశరాజకీయాలను కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణకు నిపుణుల కమిటీకి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కాగా ఈ కమిటీ ఏర్పాటు కోసం కొంత మంది నిపుణులను తాము ఎంపిక చేయాలని భావించగా, కొందరు మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల విముఖత చూపుతున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. ఈ కారణంగానే కమిటీ ఏర్పాటు ఆలస్యమైందని తెలుపుతూ.. కమిటీ సభ్యుల నియామకంపై తుది నిర్ణయం తీసుకొని వచ్చే వారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సీజేఐ తెలిపారు. ఇజ్రాయెల్ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసెస్ సాఫ్ట్వేర్ ద్వారా భారత్‌లోని పలువురు ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్‌పై నిఘా పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పౌరుల వ్యక్తిగత గోప్యతను ఈ చర్య భంగం కలిగించిందని ప్రతిపక్షాలు మండిపడుతూ పెగాసెస్ నిఘాపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ కూడా చేశాయి. అయితే, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. చదవండి: రాహుల్, ప్రియాంకలకు అనుభవం లేదు: అమరీందర్ -
పౌరస్వేచ్ఛ భద్రతలో న్యాయమూర్తులు
కాలం చెల్లిపోయిన వలస పాలనా వ్యవస్థలో రూపొందించిన చట్టాలు భారతదేశ ప్రజాస్వామ్య రక్షణకు, పౌర హక్కుల రక్షణకు పనికిరావని, నవభారత నిర్వహణకు కూడా అవి ఉపయోగపడవని, ఇందుకోసం న్యాయవ్యవస్థ చట్రంలోనే మౌలికమైన మార్పులు అనివార్యమని, పౌరుల భద్రతకు ఇవి తప్పనిసరని సుప్రీంకోర్టు ధర్మాసనం గత కొద్ది రోజులుగా విస్పష్టంగా ప్రకటనలు జారీచేయడం ప్రశంసనీయమైన పరిణామం. ముఖ్యంగా మన దేశ పాలకుల ఆశీస్సులు పొందిన విదేశీ కూపీ సంస్థ ‘పెగసస్’ కారణంగా దేశ పౌరహక్కులకు ఎదురైన పెనుముప్పు సందర్భంగా, న్యాయమూర్తుల తాజా ప్రకటనల ప్రతిపత్తికి మరింత విలువ పెరిగింది. జాతీయ భద్రత అంటే ఏమిటో, దాన్ని పిడుక్కీ బియ్యానికీ వాడుకుని అన్ని రకాల ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఏయే చిట్కాలను ఆశ్రయిం చాలో ప్రధాని నరేంద్రమోదీకే తెలుసునని సుప్రసిద్ధ ‘ది హిందు’ దిన పత్రిక కార్టూనిస్టు సాత్విక్ అత్యంత వ్యంగ్య వైభవంతో వివరించారు. (16–09–2021). అందులో దేశ భద్రతా లక్ష్యం కింద ఏయే కేసుల్ని నమోదు చేయవచ్చునో కార్టూనిస్టు సాత్విక్ పేర్కొన్నారు. దేశద్రోహం కేసులు, ఆరోగ్య సమస్యలతో తీసుకుంటున్న సీనియర్ పౌరులను జైల్లో నిర్బంధించడం, ఇంకో వైపునుంచి జాతీయ పౌర చట్ట సవరణ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నవారి ఆచూకీ తెలిపే పెగ సస్ ‘సాక్ష్యం’, నిరసనకారులపై నిర్బంధ చర్యలు... వెరసి ఇవన్నీ జాతీయ భద్రత కోసమే సుమా! ఇదీ ఆ వ్యంగ్య చిత్రం వరుస. ఇజ్రాయెల్ కేంద్రంగా వివిధ దేశాల్లో ఆయా ప్రభుత్వాల తరఫున పౌరులపై రహస్యంగా గూఢచర్యం జరపడానికి ఇజ్రాయెల్ అనుమతి స్తోంది. ఇతర దేశాల పాలకవర్గ ప్రయోజనాల కోసం ఆయా దేశా ల్లోని ప్రభుత్వాల అనుమతితోనే, ప్రజాసమస్యలపై ఆందోళన జరిపే స్థానిక పౌరులపైన కూడా గూఢ చర్యం పెగసస్ జరుపుతోంది. కానీ ఈ క్రమంలో జర్మనీ చేతికి చిక్కిన పెగసస్ జుట్టు మన పాలకుల చేతికి ఎందుకు చిక్కలేదు? భారతదేశంలో కూడా పెగసస్ గూఢ చర్యం గుట్టు కాస్తా రట్టయింది కదా. ప్రభుత్వం భావించే ఫలానా ఆందోళనకారులపైనేగాక, జన జీవితంలో హృదయమున్న ఉన్నతాధి కారులపైన, మేధావులపైన, మాజీ విదేశాంగ మంత్రుల పైన, మాజీ పోలీసు అధికారులపైన సహితం పాలకవర్గం నిగూఢంగా కన్నేసి నిఘా పెట్టడానికి కారణం... ఈ పెగసస్ గూఢచర్యమే. ఈ బాగోతం కాస్తా పాలకుల మెడకు చుట్టుకున్నాక, అలాంటిదేమీ లేదని, అది ప్రతిపక్షాల ఆరోపణ మాత్రమేనని బీజేపీబుకాయిస్తూ వస్తోంది. చివరకు ప్రతిపక్షాలు, దేశంలోని సుప్రసిద్ధ హిందూ సీనియర్ జర్నలిస్టు ఎన్. రామ్, ఇండియన్ ఎడిటర్స్ గిల్డ్... పెగసస్ గూఢచారి సంస్థ సాయంతో బీజేపీ పాలకులు దేశీయ పౌర సమాజంపైనే ఎక్కుపెట్టిన పెను రహస్య గూఢచర్య కార్యకలాపాలను బహిర్గతం చేసి, నిరసన తెలిపి నిలదీశారు. ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కదిలించివేసింది. కోర్టు రంగంలోకి ప్రత్యక్షంగా దిగి, మొత్తం పెగసస్ గూఢచర్యంపై వివరమైన సాక్ష్యాధారాలతో ప్రకట నను ప్రభుత్వం సమర్పించాల్సిందేనని ఆదేశించింది. అప్పుడు అసలు రహస్యం కోర్టుకే కాదు. యావత్తు దేశానికే వెల్లడవక తప్ప లేదు. ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన ఆరోపణలు తీవ్రమైనవి కాబట్టి అసలు నిజానిజాలు విధిగా ప్రభుత్వం బయట పెట్టాల్సిందేనని కోర్టు హెచ్చరించింది. ఆరోపణలు ఎక్కుపెట్టిన ఎన్. రామ్ ప్రభృతులు, తమ పిటిషన్ల కాపీలను ప్రభుత్వానికి కూడా అందజేయాలని ఆశించ డంతో పాలకులకు గొంతులో వెలక్కాయ పడినట్టు భావించి ఇక తప్పించుకోలేమన్న భయంతో తమ రూటు మార్చారు. ఈ కేసు మొదలై రెండేళ్ళయింది. ‘పెగసస్’ భారతప్రభుత్వం అనుమతితోనే ఇండియాలో ‘హల్చల్’ చేస్తోందని అందరూ భావించిన దరిమిలా 2019లోనే ఈ భాగోతం బయటపడిందని కూడా నాటి సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ దేశానికి వెల్లడించింది. పైగా పెగసస్ గూఢచారి స్పైవేర్‌ను... మోదీ దేశప్రజలపైన ప్రయోగిస్తున్నారనే ఆరో పణలను కోర్టు కూడా విశ్వసించింది, ప్రభుత్వ సంస్థలు ప్రత్యర్థులపై నిఘా పెట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ పాలక సంస్థ సాయంతో దేశంలోని ప్రత్యర్థులపై కూపీలు లాగడానికే ఈ విదేశీ స్పైవేర్‌ను ప్రయోగిస్తోందన్న మీడియా వార్తలు నమ్మశక్యం కానివని తామూ భావించడంలేదని కూడా సుప్రీం బెంచ్ భావించింది. ఇది వ్యక్తుల గోప్యత, గౌరవాలపై దాడిచేసినట్టే అవు తుందని ధర్మాసనం చెప్పింది. ఇక పాలకులు ఠలాయించలేమనే పరి స్థితుల్లో పడి, గొంతు మార్చి దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు, పెగసస్‌తో ఒప్పందం జరిగిందని ఒప్పుకునే పక్షంలో జాతీయ భద్రతను కాపాడటంలో ప్రభుత్వం రాజీపడినట్టు అవుతుందని కోర్టు ముందు పేర్కొన్నారు. దీంతో ‘పెగసస్’తో కుదుర్చుకున్న ఒప్పం దాన్ని పాలకులు ఒప్పుకున్నట్టయింది. పైగా, పెగసస్ బాగోతం గురించి జర్మన్ ప్రభుత్వం వెల్లడించిన అసలు వాస్తవాలు విస్మయం కలిగిస్తున్నాయి. జర్మనీలోని 50,000 మంది స్థానిక పౌరులపైన ఈ పెగసస్ గూఢచర్యానికి ఎలా దిగిందీ, మాజీ సీనియర్ దౌత్యవేత్తలపైన ‘పెగసస్’ రహస్య గూఢచర్యానికి ఎలా పాల్పడిందీ, స్థానిక ప్రైవసీ చట్టాలు అనుమతించిన పరిమితు లను కూడా మించి ఎలా జర్మనీ ప్రయోజనాలకు, స్వతంత్ర విధానా లకూ, హానికరంగా ‘పెగసస్’ తయారయిందీ కూడా జర్మన్ లాయర్లు ప్రకటించాల్సి వచ్చింది. మన పాలకుల్లాగానే జర్మనీ పాలకులు కూడా స్థానిక ప్రజల పౌర అవసరాలను తీర్చడంలో విఫలమై, ఆందోళన లను తట్టుకోలేక వాటిని అణచివేయడం కోసం పెగసస్ అనే ప్రపంచ రాక్షస కూపీ సంస్థను అరువు తెచ్చుకుని చేతులు కాల్చుకున్నారు. ఈ సంగతి తెలిసొచ్చిన తరువాతనే జర్మన్ పాలకులు పెగసస్ వల్ల దేశ సార్వభౌమాధికారానికి వచ్చిన పెనుప్రమాదాన్ని గుర్తించి ‘లెంపలు’ వాయించుకుని దారికి రావలసి వచ్చింది. దాంతో స్వతంత్రదేశాలు జాగ్రత్త పడవలసి వచ్చిందన్నది ఆలస్యంగానైనా వచ్చిన గుర్తింపు. కానీ మన పాలకులకు మాత్రం ఆ గ్రహింపు ఇప్పటికీ లేదు. మన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సంధించిన ప్రశ్నల పరంపరను తప్పిం చుకునే క్రమంలో మన పాలకులు మరికొంత లోతుగా దిగబడి పోయారు. అత్యున్నత న్యాయస్థానంలో ప్రభుత్వం కోర్టు కోరినట్టుగా తన వాంగ్మూలాన్ని దాఖలు చేయడమంటే అది బహిరంగమైపోయి జాతీయ భద్రతకు వ్యతిరేకంగా రాజీపడటమే అవుతుందని అసలు విచారణ నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. కమిటీల మీద కమి టీల పేరిట కాలయాపన చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. అంతే తప్ప దేశసార్వభౌమాధికారానికి, దేశ ప్రజల పౌర హక్కులకు, ప్రజా స్వామ్య హక్కులకోసం ఆందోళన చెందుతున్న జర్నలిస్టులు, పలు వురు మేధావులు, చివరికి వందలాదిమంది మాజీ న్యాయమూర్తులు, కేంద్ర మాజీ అధికారులు, మాజీ పోలీసు అధికారులు తదితర ప్రజా తంత్ర శక్తులపై కూపీ కోసం పెగసస్‌తో రహస్య ఒప్పందం చేసుకున్న పాలకులు మాత్రం జర్మనీ పాలకుల బాట పట్టలేకపోయారు. కనీసం నెల రోజుల క్రితమే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ ఇలా స్పష్టం చేశారు. ‘దేశంలో ప్రజాస్వామ్యమూ, సత్యమూ చెట్టపట్టాలు కట్టుకుని ముందుగా సాగాల్సిన అవసరం ఉంది. పాలకులకు నిజాన్ని బల్లగుద్దినట్టు చెప్పితీరాలి. దేశంలో అధి కారంలో ఉన్నవాళ్లు ఎవరన్నా కానివ్వండి... చివరికి అది రాచరిక మైనా లేదా సర్వశక్తిమంతమైన ప్రభుత్వమైనా సరే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే సత్యమన్నదీ, వాస్తవమన్నదీ బహిరంగం కావా ల్సిందే. సత్య ప్రకటన అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థ చేతిలో బలమైన కత్తీ, రక్షణాయుధమూ. అందుకే ప్రజాస్వామ్య జీవనం మన హక్కు. సత్యం పలకడమంటే అధికార శక్తిని నిలువరించడమే. నియంతృత్వ పోకడలను తలెత్తనివ్వకుండా ముందస్తుగానే జాగ్రత్తపడడం. కొన్ని ప్రభుత్వాలు నిరంతరం అబద్ధాల మీదనే బతకడానికి కారణం– ప్రజ లపైన తన పెత్తనాన్ని కొనసాగించుకోవడానికే సుమా!’ అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. దేశంలో ‘పెగసస్’ ప్రమాదకర గూఢచర్యం... అందునా పాలకుల రహస్య ఒప్పందంతో కొనసాగుతున్న తరు ణంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రకటన వెలువడడం వల్ల అది సమకాలీన వాస్తవ పరిస్థితులకు పట్టిన నిలువుటద్దం! క్రమంగా ఒక దేశం, ఒకే ఎన్నిక నినాదం క్రమంగా ఒక దేశం, శాశ్వతంగా ఒక ప్రధానమంత్రి ఉండాలన్న ఆలోచన వైపునకు ఆచరణాత్మకం కాకూడదన్న హెచ్చరి కకు సుప్రీం సీనియర్ జస్టిస్ చంద్రచూడ్ తాజా ప్రకటనే నిదర్శనం. అందుకే నిజాన్ని పాతిపెట్టి అబద్ధమాడితే, ఆ నోటికి అరవీసెడు సున్నం పెట్టమన్న సామెత పుట్టుకొచ్చిందా? ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక..! వెంటనే..
ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరించింది. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో పొంచి ఉన్న ముప్పును తప్పించుకునేందుకు గాను ఆపిల్ ముఖ్యమైన అప్డేట్ను తీసుకొచ్చింది. వెంటనే యూజర్లు ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సౌదీకి చెందిన ఆక్టివిస్ట్పై పెగాసస్‌తో నిఘా ఉంచినట్లు పరిశోధకులు గుర్తించారు. టోరంటో విశ్వవిద్యాలయం ల్యాబ్ పరిశోధకులు ప్రస్తుతం ఐఫోన్‌లోని ఐవోఎస్ 14పై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెగాసస్‌తో దాడులు జరుగుతున్నట్లు గుర్తించారు. చదవండి: Apple: మాకు ఎవరీ సహాయం అక్కర్లేదు..! ఐఫోన్లలోని ఐమెసేజ్ యాప్‌కు వచ్చే హానికరమైన లింక్‌పై యూజర్లు క్లిక్ చేసినప్పుడు హ్యకర్లు యూజర్లపై నిఘా ఉంచడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. మీరు ఐఫోన్ యూజర్ అయితే, మీ ఐఫోన్లో సాఫ్ట్‌వేర్‌ని ఐవోఎస్ 14.8 కి అప్డేట్ చేయాలని ఆపిల్ నిర్ధేశించింది. అదేవిధంగా, ఐప్యాడ్ వినియోగదారులు సాఫ్ట్‌వేర్‌ను కూడా ఐప్యాడ్వోఎస్ 14.8 కి అప్డేట్ చేసుకోవాలని ఆపిల్ సూచించింది. సీవీఈ-2021-30860 అని పిలవబడే హ్యకర్ల బృందం సౌదీ అరేబియాలోని, ఇతర దేశాలలో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అభివృద్ధి చేసిన పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో ప్రముఖ వ్యక్తులపై నిఘా ఉంచుతుందనే విషయాలను వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను పెగాసస్ సాఫ్ట్వేర్ కుదిపేసింది. భారత్‌లో కూడా పెగాసస్ అంశంపై పార్లమెంట్లోప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: iPhone 13 Launch: ఐఫోన్-13 సిరీస్..14 సిరీస్ ట్విస్ట్ ఉంటుందా? ధరలు ఇవే! లైవ్ చూడడం ఎలాగంటే.. -
Pegasus: బహిరంగ పర్చలేం
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై కోర్టులో సమగ్ర అఫిడవిట్ సమర్పించలేమని, ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. తాము మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. పెగాసస్ హ్యాకింగ్ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు సమగ్ర అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించడం తెల్సిందే. పిటిషన్లపై సుప్రీం బెంచ్ సోమవారం విచారణ జరిపింది. ఈ కేసులో సమగ్ర ఆఫిడవిట్ దాఖలుపై ప్రభుత్వానికి పునరాలోచన ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. మరో 2–3రోజుల్లో మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తామని, అప్పటిలోగా స్పందించాలని పేర్కొంది. ‘ఈ అంశంపై నిజానిజాలను నిర్ధారించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, కమిటీ కోర్టుకు నివేదిక ఇస్తుందని మీరు(సొలిసిటర్ జనరల్) చెబుతున్నారు. అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్నంగా పరిశీలించి, మధ్యంతర ఉత్తర్వు జారీ చేస్తాం’ అని కోర్టు స్పష్టం చేసింది. దాచడానికి ఏమీ లేదు: కేంద్రం విచారణ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఒక నిర్ధిష్టమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? లేదా? అనేది ప్రజల్లో చర్చ జరగాల్పినన అంశం కాదని అన్నారు. పెగాసస్‌ను కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన అంశంగా పరిగణిస్తోందని, ఇందులో దాచడానికి ఏమీ లేదని తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. జాతి భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని తాము ఆశించడం లేదని ధర్మాసనం పేర్కొంది. దేశ పౌరులపై నిఘా పెట్టడానికి పెగాసస్ స్పైవేర్‌ను కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉపయోగించిందా? లేదా? అనేది మాత్రమే తాము తెలుసుకోవాలని కోరుకుంటున్నామని సొలిసిటర్ జనరల్‌కు తెలిపింది. అసలు విషయం ఏమిటో సూటిగా చెప్పకుండా డొంకతిరుగుడు వైఖరి అవలంబించడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. చట్టం నిర్దేశించిన ప్రక్రియ మేరకే స్నూపింగ్ సమగ్ర అఫిటవిట్ దాఖలు చేస్తే పెగాసస్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తమకు తెలుస్తుందని కోర్టు వివరించింది. తమ గోప్యతకు(ప్రైవసీ) భంగం కలిగేలా కేంద్రం పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందని, ఫోన్లపై నిఘా పెట్టిందని జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు ఇతరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఉద్ఘాటించింది. ‘‘చట్ట ప్రకారం ఒక ప్రక్రియ ఉంటుంది. దేశ భద్రత దృష్ట్యా అనుమానితులపై నిఘా పెట్టడానికి చట్టం కూడా అనుమతిస్తుంది’ అని పేర్కొంది. ఒకవేళ స్పైవేర్‌ను ప్రభుత్వం ఉపయోగిస్తున్నట్లయితే చట్టం నిర్దేశించిన ప్రక్రియ ప్రకారమే అది జరగాల్సి ఉంటుందని సూచించింది. చట్టం అనుమతించిన ప్రక్రియ కాకుండా ఇంకేదైనా ప్రక్రియను ప్రభుత్వం ఉపయోగిస్తోందా? అనేది తెలుసుకోవాలని పిటిషనర్లు ఆశిస్తున్నారని ధర్మాసనం గుర్తుచేసింది. వాస్తవాలు చెప్పడం ప్రభుత్వం విధి: సిబల్ పిటిషనర్లు ఎన్.రామ్, శశి కుమార్ తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అఫిడవిట్ దాఖలు చేయబోమని కేంద్రం తేల్చిచెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేశ ప్రజలకు వాస్తవాలను వెల్లడించడం ప్రభుత్వం విధి అని అన్నారు. స్పైవేర్‌ను ఉపయోగించే విషయంలో చట్టబద్ధమైన ప్రక్రియను ప్రభుత్వం పాటించలేదని మరో సారి తేలిపోయిందని చెప్పారు. మరో పిటిషనర్ తరపున సీనియర్ అడ్వొకేట్ శ్యామ్ దివాన్ వాదిస్తూ... స్పైవేర్‌తో పౌరుల ఫోన్లపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యంపై ముమ్మాటికీ దాడేనని అన్నారు. విశ్వసనీయమైన దర్యాప్తు జరిపించాలని కోరారు. చట్టం అనుమతించదు ఫలానా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాం, ఫలానా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం లేదు అని బయటకు చెబితే ఉగ్రవాద శక్తులు దాన్నొక అవకాశంగా మార్చుకొనే ప్రమాదం ఉందని సొలిసిటర్ జనరల్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సాఫ్ట్‌వేర్‌కు కౌంటర్–సాఫ్ట్వేర్ ఉంటుందన్నారు. కొన్ని కేసుల్లో ఇలాంటి వాటిని బహిర్గతం చేయడానికి టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం అనుమతించవని వివరించారు. పెగాసస్‌పై ఏర్పాటు చేయబోయే కమిటీలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఉండబోరని, ఐటీ రంగానికి చెందిన నిపుణులే ఉంటారని తెలిపారు. నివేదిక తమకు అందిన తర్వాత బహిర్గతం చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని తుషార్ మెహతా బదులిచ్చారు. దేశ భద్రత నేపథ్యంలో ఇలాంటివి ప్రజల్లోకి రాకపోవడమే మంచిదని అన్నారు. -
ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం: కేంద్రం
-
‘పెగాసస్ అంశంపై కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదు’
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ ప్రారంభం అయ్యింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా, పెగాసస్ అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం లేదని కేంద్రం ధర్మాసనానికి తెలిపింది. ఈ అంశంపై మరో అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. కేంద్రం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించిందా లేదా అన్నది అఫిడవిట్లో చర్చించే అంశం కాదు అని స్పష్టం చేసింది. విశాల ప్రజాప్రయోజనాల దృష్ట్యా వాటిని అఫిడవిట్లో పొందుపర్చాలని తాము అనుకోవడం లేదని కేంద్రం సుప్రీం కోర్టు ఎదుట తమ వాదనలను వినిపించింది. కాగా, దీనిపై స్పందించిన ధర్మాసనం దేశ భద్రత, శాంతి భద్రతల అంశాలలోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేసింది. అదే విధంగా డిఫెన్స్ తదితర విషయాలు అడగట్లేదని తెలిపింది. పెగాసస్ అంశం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని ధర్మాసనం కేంద్రానికి తెలిపింది. చదవండి: ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేలా భారత బలగాలకు వ్యూహాత్మక శిక్షణ ! -
పెగసస్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. అయితే, ఇందులో దేశ భద్రత, రక్షణకు సంబంధించిన గోప్యమైన సమాచారం ఏదైనా ఉంటే ప్రభుత్వం బయటపెట్టాలని తాము కోరడం లేదని తెలిపింది. పెగసస్‌పై వస్తున్న ఆరోపణల విషయంలో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేస్తే వచ్చే సమస్య ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించింది. పెగసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఓఎస్ గ్రూప్ అభివృద్ధి చేసిన పెగసస్ స్పైవేర్‌ను భారత్‌లో అసలు ఉపయోగించారా? లేదా? అనే విషయం దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారమని చెప్పారు. ‘‘తమ ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టినట్లు పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. వీరిలో ప్రముఖులతోపాటు సామాన్య పౌరులు కూడా ఉన్నారు. ఫోన్లు హ్యాక్ అయ్యాయని చెబుతున్నారు. పౌరుల ఫోన్లను హ్యాక్ చేయడానికి నిబంధనలు అంగీకరిస్తాయి. అయితే, సంబంధిత ప్రభుత్వ సంస్థ(కాంపిటెంట్ అథారిటీ) అనుమతితోనే ఫోన్లను హ్యాక్ చేయాల్సి ఉంటుంది. అనుమతితో చేస్తే ఎలాంటి తప్పు లేదు. అలాంటప్పుడు పెగసస్‌పై కోర్టులో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయడానికి కాంపిటెంట్ అథారిటీకి సమస్య ఏమిటి?’’ అని ధర్మాసనం నిలదీసింది. దేశ భద్రత, రక్షణకు సంబంధించి ఒక్క పదమైనా అఫిడవిట్లో ఉండాలని తాము ఆశించడం లేదని స్పష్టం చేసింది. కోర్టు నుంచి దాచలేం... పెగసస్‌పై ఎవరికీ ఏమీ చెప్పబోమంటూ కేంద్రం ఇప్పటిదాకా అనలేదని తుషార్ మెహతా గుర్తుచేశారు. అయితే, ఈ విషయాన్ని బహిరంగం చేయకూడదన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఏ దేశ ప్రభుత్వమైనా ఎలాంటి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తోందో బయటకు చెబితే దేశ శత్రువులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు దాన్నొక అవకాశంగా మార్చుకునే ప్రమాదం ఉందన్నారు. వారి రహస్యాలు బయటపడకుండా ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌ను అడ్డుకోవానికి ముష్కరులు తమ వద్ద ఉన్న సాఫ్ట్వేర్లలో మార్పులు చేసుకొనే ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఏ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్నాం, ఏది వాడడం లేదు అనేది జాతి భద్రతకు సంబంధించిన అంశమని, దాన్ని కోర్టు నుంచి దాచలేమని పేర్కొన్నారు. వచ్చే సోమవారం ప్రభుత్వం సమగ్ర అఫిడవిట్ దాఖలు చేస్తుందని, పెగసస్‌పై తన వైఖరిని అందులో స్పష్టం చేస్తుందని తుషార్ మెహతా తెలిపారు. ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్రం తన ప్రతిస్పందనను తెలిపిందని, తటస్థ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని, దేశ అత్యున్నత న్యాయం ముందుకు ప్రభుత్వం వచ్చిందని గుర్తుచేశారు. పెగసస్‌పై దాచడానికి ఏమీ లేదని కేంద్రం వెల్లడించిందని అన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని తటస్థ నిపుణుల కమిటీకి అందజేస్తామని, ఆ కమిటీ విచారణ జరిపి, నివేదికను నేరుగా సుప్రీంకోర్టుకు సమర్పిస్తుందని చెప్పారు. దీంతో తదుపరి విచారణకు ధర్మాసనం 10 రోజుల పాటు వాయిదా వేసింది. దేశ రక్షణ ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ప్రజలకూ అంతే ముఖ్యమని పిటిషనర్ల తరపున వాదించిన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. దేశ రక్షణకు సంబంధించిన సమాచారం ప్రభుత్వం బహిర్గతం చేయాలని తాము కోరడం లేదని అన్నారు. -
పెగాసస్‌పై సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: పెగాసస్‌పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. స్పైవేర్ వాడకంపై వివరాలు ఇవ్వలేమని కేంద్రం పేర్కొంది. దేశ భద్రతతో కూడుకున్న అంశమని సుప్రీంకోర్టు కేంద్రం తెలిపింది. కాగా పెగాసస్ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 10రోజులకు వాయిదా వేసింది. ఇక సోమవారం పెగాసస్‌పై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పెగాసస్ గూఢచర్యం ఆరోపణలను నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. పెగాసస్ ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతిపక్షాలు, జర్నలిస్టుల ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది. పెగాసస్‌పై నిజాలను నిగ్గు తేల్చేందుకు ట్రిబ్యునట్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో తెలిపిన సంగతి తెలిసిందే. -
దాచడానికి ఏమీ లేదు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్ వ్యవహారంలో దాచేయడానికి ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించడానికి, అనుమానాలను నివృత్తి చేయడానికి తటస్థులైన ప్రఖ్యాత నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టుల ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ స్పైవేర్‌తో నిఘా పెట్టిందని, ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, శశి కుమార్‌తోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పెగసస్‌పై కేంద్ర ప్రభుత్వం క్లుప్తంగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించలేమని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్లపై మంగళవారం కూడా విచారణ కొనసాగిస్తామని వెల్లడించింది. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వం సంస్థలు అసలు పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నాయో లేదో స్పష్టం చేయాలని, ఈ మేరకు న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. పెగసస్ అనేది దేశ భద్రతతో ముడిపడిన సున్నితమైన అంశమని పేర్కొన్నారు. దీన్ని సంచలనాత్మకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తప్పుపట్టారు. అత్యున్నత సాంకేతికతకు సంబంధించిన ఈ అంశాన్ని పరిశీలించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కేవలం ఓ వెబ్ పోర్టల్‌లో ప్రచురించిన వార్తల ఆధారంగానే పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని, వాస్తవానికి పెగసస్‌పై తప్పుడు కథనాలు సృష్టించారని తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సొంత లాభం కోసం తప్పుడు ప్రచారం: కేవలం ఊహాగానాలు, అనుమానాలు, బలమైన సాక్ష్యాధారాలు లేని మీడియా కథనాలను, అసంపూర్ణ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని పెగసస్ స్పైవేర్‌పై కొందరు స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నారని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. పెగసస్‌పై వస్తున్న ఆరోపణలకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో ఇప్పటికే సమాధానం ఇచ్చారని గుర్తుచేసింది. కొందరు సొంత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని విమర్శించింది. అనుమానాలను నివృత్తి చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. పెగసస్‌పై మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ స్పైవేర్‌తో భారత ప్రభుత్వం దేశంలో 300కు పైగా ఫోన్లపై నిఘా పెట్టిందని, రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులపై కేంద్రం లక్ష్యంగా చేసుకుందంటూ ఇంటర్నేషనల్ మీడియా కన్సార్టియం బాంబు పేల్చింది. దీంతో ఈ అంశం దేశాన్ని కుదిపేసింది. పెగసస్‌పై సమాధానం చెప్పాలంటూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసిన విషయం తెల్సిందే. -
పచ్చి అబద్ధాలతో ముగిసిన చర్చలు!
అంతర్జాతీయ సైబర్ నిఘా సాఫ్ట్వేర్ సంస్థ ఎన్ఎస్ఓ రూపొందించిన ‘పెగసస్’ సాఫ్ట్వేర్ భారతదేశంలో యథేచ్ఛగా సాగిస్తున్న ‘కూపీ’లతో తమకు సంబంధం ఉన్నదా లేదా అనే విషయాన్ని తేల్చి చెప్పడానికి బీజేపీ పాలకులకు ఏళ్ళూపూళ్లూ పట్టవలసిన అవసరం లేదు. ‘పెగసస్’తో లోపాయికారీ ఒప్పందం ఏదో ప్రభుత్వానికి ఉందన్న ప్రతిపక్షాలు, పలు ప్రజాసంస్థల ఆరోపణలను ఖండించడానికి రెండు మాసాలకు పైగా కాలక్షేపం చేయవలసిన అవసరం లేదు! దేశంలోని రాజకీయ ప్రత్యర్థులపైన. జర్నలిస్ట్‌లపైన, కొందరు జడ్జీల ఫోన్లపైన ఎన్ఎస్ఓ రూపొందించిన ‘పెగసస్’ సాఫ్ట్‌వేర్‌ని భారత పాలకులు ఉపయోగిస్తున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. గోవిందాచార్య సుప్రీంకోర్టులో 2019లోనే ‘పెగసస్’ బాగోతం నిగ్గుతేల్చాలని దాఖలు చేసుకున్న పిటిషన్ సుప్రీంలో ఇంకా అలాగే ఉండిపోయి ఉసురు నిలుపుకోవడమే అసలుసిసలు కొసమెరుపు! ‘‘చట్టాలు చేయడంలోనూ, పార్లమెంట్లో చర్చలు నిర్వహించడంలోనూ, చేసే చట్టాలలో కొట్టొచ్చే అస్పష్టత చోటు చేసుకున్నందువల్ల దేశంలో తగాదాలు పెరుగుతున్నాయి. ఈ పరిణామం దేశ పౌరులకు, న్యాయస్థానాలకు, తదితర కక్షిదారులకు చిరాకు కల్గిస్తోంది. ఫలితంగా చట్టాలను రూపొందించే ప్రమాణాలు పడిపోతున్నాయి. చట్ట సభలు చేస్తున్న చట్టాలు ఏ ప్రయోజనం కోసం రూపొందుతున్నాయో మనకు తెలియడం లేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్య్ర ప్రతిపత్తిని కాస్తా ఇలాంటి చట్టాలు దిగజార్చివేస్తున్నాయి. ఫలితంగా చట్ట సభలు చేస్తున్న కొత్త చట్టాల లక్ష్యం ఏమిటో న్యాయస్థానాలకు బొత్తిగా అంతుచిక్కకుండా పోతున్నాయి.’’ – సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి ఎన్.వి. రమణ ‘‘పెగసస్ సృష్టికర్త ఇజ్రాయెల్ సైబర్ గూఢచారి సంస్థ ఎన్.ఎస్.ఓ కార్యకలాపాలపైన, అలాంటి చట్టవిరుద్ధ గూఢచర్య కార్యకలాపాల్లో ఉన్న ఫేస్బుక్, వాట్సాప్ తదితర సంస్థలపైన తక్షణమే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని 2019లోనే నేను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తిరిగి పునరుద్ధరించగోరుతున్నాను. మన దేశంలో ఈ ‘పెగసస్’ గూఢచర్యం ఆధునిక సాంకేతిక సైబర్ టెర్రరిజంలో భాగం, దీన్ని సమాచార టెక్నాలజీ చట్టం కింద శిక్షించాలి. ‘పెగసస్’ గూఢచర్యం సహా యంతో ఈ దేశ పౌరుల గోప్యత, వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించే వారందరినీ శిక్షించాల్సిందే. కోట్లాది మంది భారతీయుల ప్రాథమిక హక్కుల రక్షణ అనేది చట్ట నిబంధన (రూల్ ఆఫ్ లా)పైన ఆధారపడి ఉంది. ఇది రాజ్యాంగ బద్ధం. కనుక ‘పెగసస్’ వినియోగంపై విచారణ జరిపి తీరాలన్న నా 2019 నాటి పిటిషన్‌ను సుప్రీం తిరిగి చేపట్టాలి’’ – ఆర్ఎస్ఎస్ మాజీ సిద్ధాంతకర్త కె.ఎన్. గోవిందాచార్య పిటిషన్ (2019లోనే సుప్రీంకోర్టులో) పచ్చి అబద్ధాలతో ఈసారి పార్లమెంటు చర్చలు ముగియడానికి దారితీసిన పరిణామాలలో ప్రధానమైన అంశం... దేశాన్ని కుదిపేసిన అంతర్జాతీయ స్థాయి సైబర్ గూఢచార సమాచార వ్యవస్థ ఎన్.ఎస్.ఓ. నెలకొల్పిన ‘పెగసస్’ భారతదేశంలో యథేచ్ఛగా సాగిస్తున్న ‘కూపీ’ లతో బీజేపీ పాలకులకు సంబంధ బాంధవ్యాలలో నిజానిజాలకు సంబంధించినదే! ఈ విషయాన్ని తేల్చి చెప్పడానికి బీజేపీ పాలకులకు ఏళ్ళూపూళ్లూ పట్టవలసిన అవసరం లేదు. కానీ పాలనా విధానాలను విమర్శిస్తున్న పౌరులపైన మాజీ అధికారులు, పౌరహక్కుల సంఘాల నాయకులపైన, చివరికి కేంద్రపాలక వర్గంలోని కొందరు మంత్రుల అభ్యంతరాల పైన, విద్యార్థి, ఉద్యోగ వర్గాలపైన పాలకులు కన్నెర్ర చేయవలసిన అవసరం లేదు. ‘పెగసస్’తో లోపాయికారీ ఒప్పందం ఏదో ప్రభుత్వానికి ఉందన్న ప్రతిపక్షాలు, పలు ప్రజాసంస్థల ఆరోపణలను ఖండించడానికి రెండు మాసాలకు పైగా కాలక్షేపం చేయవలసిన అవసరం లేదు! నాటి ఆర్ఎస్ఎస్ నాయకుడు గోవిందాచార్య 2019లోనే ‘పెగసస్’ సైబర్ గూఢచర్య కార్యకలాపాలపైన విచారణ కోరడం, 2021లో దేశంలోని ప్రజాసంస్థలు, పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్షాలు అదే విచారణను డిమాండ్ చేయవలసి రావడం ప్రహసనంగా మారవలసి వచ్చింది! కానీ దాదాపుగా రెండునెలలు గడిచిపోయిన తరువాత, దేశం లోని రాజకీయ ప్రత్యర్థులపైన. జర్నలిస్ట్‌లపైన, కొందరు జడ్జీల ఫోన్లపైన ఇజ్రాయెల్ సైబర్ గూఢచారి సంస్థ ఎన్.ఎస్.ఓ. రూపొందించిన ‘పెగసస్’ సాఫ్ట్‌వేర్‌ని భారత పాలకులు ఉపయోగిస్తున్నారని, అందుకోసమే ఆధునిక టెక్నాలజీకి కూడా దొరకని సాంకేతిక వ్యవస్థని ప్రభుత్వం తరపున కొనుగోలు చేశారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తీవ్ర ఆరోపణను ఖండించడానికి మన పాలకులకు తీరికలేకనో ఏమోగాని, రెండు నెలల కాలయాపన తర్వాత తాపీగా 9–8–2021వ తేదీన అందునా ఏ సమాచార శాఖో, విదేశాంగ వ్యవహా రాల మంత్రిత్వ శాఖో కాకుండా భారత రక్షణ శాఖ... పెగసస్‌కి స్పైవేర్ నిర్వాహణా సంస్థ ఎన్ఎస్ఓతో ఎలాంటి లావాదేవీల్లేవు అని పార్లమెంటులో ప్రకటించాల్సి వచ్చింది! అయితే ఇదే సమయంలో, రాజ్యసభ అధ్యక్షులు, దేశ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడు, ‘పార్లమెంటు ఉన్నది సమస్యల్ని చర్చించడానికే గానీ, రాజకీయ కొట్లాటలకు కాదు’ అని ప్రకటించారు తప్పితే, అంతవరకూ ‘పెగసస్’ బాగోతం గురించి రెండునెలలుగా ప్రతిపక్షాలు కోరుతూ వచ్చింది, ఆ ‘చర్చ కోసమే’ నన్న వాస్తవాన్ని మరచిపోవటం! ఒకవేళ ‘పెగసస్’ గూఢచర్యంతో మనకు రహస్య సంబంధాలు లేవనుకున్నా అనేక మాసాలుగా న్యాయం కోసం జరుగుతున్న వేలాదిమంది రైతుల ఆందోళన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన సుమారు ఆరు వందలమంది రైతుల కుటుంబాలకు కనీస సానుభూతి కూడా ప్రకటించని పాలక వ్యవస్థ.. ‘పెగసస్’ ఆధునిక గూఢచర్యాన్ని బాహాటంగా ఖండిం చకపోవడాన్ని ప్రజలు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు! ఇది ఇలా ఉండగానే, ఒక వైపునుంచి గౌరవ ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా ‘చాపచుట్టి’ దేశీయ, విదేశీయ ప్రైవేటు రంగానికి ధారాదత్తం చేస్తున్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఒక ప్రకటనలో భారత పారిశ్రామిక వేత్తలు అనుసరిస్తున్న వర్తక, వ్యాపార లావాదేవీలు జాతీయ ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని, వినియోగదార్ల ప్రయోజనాల రక్షణకు ఉద్దేశించిన నిబంధనలకు (రూల్స్) ప్రైవేట్ పారి శ్రామికవేత్తలు బాహాటంగా కాలరాస్తున్నారని విమర్శించాల్సి వచ్చింది! దేశంలోకి అనుమతిం చిన కొన్ని విదేశీ గుత్త కంపెనీలకు నేడు మన జాతీయ ప్రయోజనాలకన్నా వాటి ప్రయోజనాలకే ప్రాధాన్యం పెరిగిపోవడం విచారకరమని కూడా గోయల్ ప్రకటించవలసి వచ్చింది. (13–8–2021 ప్రకటన) అన్నట్టు ఇంతకూ మనం ‘పెగసస్’ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ని కొనుగోలు చేశామా, లేదా? అబద్ధమాడితే గోడను ఎంతగా అడ్డుపెట్టుకున్నా ఎన్నాళ్ళు ఆగుతుంది? అబద్ధం అంటేనే అతుకుల మూట! అబద్ధం చెబితే నిజం చెప్పేవాడి కంట్లో మిరప్పొడి కొట్టినట్లు ఉండాలన్న సామెత ఊరకనే పుట్టలేదు! ఇంతకూ ఏతావాతా ధనికవర్గ పాలనా వ్యవస్థలో దాగిఉన్న అసలు సత్యం ఏమిటో వెనకటికో పెద్దమనిషి బయటపెట్టేశాడు. ధనం మాట్లాడుతూంటే, సత్యం అలా గుడ్లప్పగించి ఊరకుండిపోతుందట!! అయినా గోవిందాచార్య సుప్రీం కోర్టులో 2019లోనే ‘పెగసస్’ బాగోతం నిగ్గుతేల్చాలని దాఖలు చేసుకున్న పిటిషన్ సుప్రీంలో ఇంకా అలాగే ఉండిపోయి ఉసురు నిలుపుకోవడమే అసలుసిసలు కొసమెరుపు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు