
న్యూఢిల్లీ: దేశరాజకీయాలను కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణకు నిపుణుల కమిటీకి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కాగా ఈ కమిటీ ఏర్పాటు కోసం కొంత మంది నిపుణులను తాము ఎంపిక చేయాలని భావించగా, కొందరు మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల విముఖత చూపుతున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ వివరించారు. ఈ కారణంగానే కమిటీ ఏర్పాటు ఆలస్యమైందని తెలుపుతూ.. కమిటీ సభ్యుల నియామకంపై తుది నిర్ణయం తీసుకొని వచ్చే వారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సీజేఐ తెలిపారు.
ఇజ్రాయెల్ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ద్వారా భారత్‌లోని పలువురు ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్‌పై నిఘా పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పౌరుల వ్యక్తిగత గోప్యతను ఈ చర్య భంగం కలిగించిందని ప్రతిపక్షాలు మండిపడుతూ పెగాసెస్ నిఘాపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ కూడా చేశాయి. అయితే, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment