న్యూఢిల్లీ: పెగాసస్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్వాగతించారు. ఇదొక పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. సైబర్ నిపుణులతో కూడిన త్రిసభ్య కమిటీ దర్యాప్తుతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెగాసస్‌ను ఉపయోగించడం అంటే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. పెగాసస్ నిఘా అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో మళ్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని రాహుల్ పేర్కొన్నారు. చర్చకు ప్రభుత్వం ఇష్టపడకపోయినప్పటికీ తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment