Trisabhya committee
-
జగిత్యాల పెద్దాసుపత్రి వైద్యుల నిర్లక్ష్య వైఖరి
-
విద్యార్థుల రక్షణ సామాజిక బాధ్యత
సాక్షి, హైదరాబాద్: స్కూల్ విద్యార్థుల భద్రత, రక్షణను సామాజిక బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరముందని పాఠశాల విద్యార్థుల భద్రత, రక్షణ కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ముందు పలువురు అభిప్రాయపడ్డారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రాణీకుముదిని అధ్యక్షురాలిగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం హైదరాబాద్ ఎంహెచ్ఆర్డీలో వివిధ వర్గాలతో భేటీ అయి, వారి సలహాలు, సూచనలు తీసుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ స్వాతి లక్రా, ప్రభుత్వ కార్యదర్శి దివ్య దేవరాజన్, డీపీజీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన పాల్గొన్నారు. పిల్లలపై జరిగే ఘటనలను మార్గదర్శకాల రూపకల్పనపై కమిటీ సలహాలు తీసుకుంది. డీజీపీ మాట్లాడుతూ భద్రత, రక్షణవిషయంలో యాజమాన్యాలను భాగస్వాముల ను చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవస్థీకృత చట్టంలో మార్గదర్శకాల రూపకల్పన చేయాలన్నారు. ఘటన జరగకముందే మేల్కొనే వ్యవస్థ ఏర్పాటు అవసర మని స్వాతి లక్రా సూచించారు. పిల్లలరక్షణ సామాజిక బాధ్యతగా అందరూ భావించాలని దేవసేన అన్నారు. సమావేశంలో వివిధ జిల్లాల విద్యాశాఖాధికారులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. -
ఆంధ్రప్రదేశ్‌కు 13.5 టీఎంసీలు
సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 13.5 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. తెలంగాణకు 13.25 టీఎంసీలు, శ్రీశైలంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.4 టీఎంసీలను.. మొత్తం 15.65 టీఎంసీలను కేటాయించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. రాయ్‌పురే కన్వీనర్‌గా ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. గతేడాది తమ కోటాలోని 47.719 టీఎంసీలను శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు తరలించామని, వాటిని ఈ ఏడాది వాడుకొంటామని తెలంగాణ ఈఎన్సీ కోరారు. దీనిపై ఏపీ ఈఎన్సీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని, కోటాలో మిగిలిన నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా బచావత్ ట్రిబ్యునల్ తీర్పునే సమర్ధించిందని, క్యారీ ఓవర్ జలాల్లో ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం వాటా ఉంటుందని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో క్యారీ ఓవర్ జలాల్లో సాగర్ కుడి కాలువకు 10, ఎడమ కాలువకు 3.5 టీఎంసీలు కేటాయించాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి చేసిన ప్రతిపాదనను రాయ్‌పురే అంగీకరించారు. సాగర్‌లో తాగునీటి అవసరాలకు 5.75 టీఎంసీలు, ఎడమ కాలువకు 7.5 టీఎంసీలు, శ్రీశైలంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.4 టీఎంసీలను విడుదల చేయాలన్న తెలంగాణ ఈఎన్సీ ప్రతిపాదనకు రాయ్‌పురే అంగీకరించారు. శ్రీశైలంలో జూన్ 1 నుంచి గురువారం వరకు ఏపీ 10.884 టీఎంసీలు, తెలంగాణ 3.504 టీఎంసీలు వాడుకున్నట్లు లెక్క చెప్పారు. జూలై ఆఖరులో మరోసారి కమిటీ సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. ఈసారైనా తెలంగాణ అధికారులు వస్తారా? కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) మూడో సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరగనుంది. తొలి రెండు సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు హాజరుకాలేదు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన మూడో సమావేశానికైనా వస్తారా.. రారా.. అన్నది చర్చనీయాంశంగా మారింది. మే 6న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో ఆర్ఎంసీ ఏర్పాటైంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో విద్యుదుత్పత్తికి నిబంధనలు, ఆయకట్టుకు నీటి విడుదల (రూల్ కర్వ్) నియమావళి, వరద రోజుల్లో మళ్లించిన నీటిని కోటాలో కలపాలా? వద్దా? అనే అంశాలపై చర్చించి, నివేదిక ఇచ్చేందకు కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై, ముయాన్తంగ్, ఏపీ, తెలంగాణల ఈఎన్సీలు, జెన్కో డైరెక్టర్లు సభ్యులుగా ఆర్ఎంసీని ఏర్పాటు చేశారు. జలవిద్యుదుత్పత్తి నియమావళి నివేదికను 15 రోజుల్లోగా, మిగతా రెండు అంశాలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. ఇందుకోసం మే 20న, 30న జరిగిన తొలి రెండు సమావేశాలకు తెలంగాణ అధికారులు రాకపోవడంతో ఆర్ఎంసీ మూడో భేటీని ఏర్పాటు చేసింది. -
‘ఈడబ్ల్యూఎస్’ కోటాలో ఆదాయ పరిమితి రూ.8 లక్షలు సమంజసమే
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) వారికి రిజర్వేషన్ల వర్తింపు అర్హతపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు, అంతకంటే తక్కువగా ఉండాలని త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల్ని ఆమోదించాలని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈడబ్ల్యూఎస్‌ను నిర్వచించడానికి కుటుంబ ఆదాయమే సరైన ప్రమాణంగా కమిటీ సిఫారసు చేసిందని, ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలలోపు ఉండాలన్న సిఫార్సు సమంజసమైన పరిమితిగా భావిస్తున్నామని అఫిడవిట్లో పేర్కొంది. కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల వరకు ఉన్న వారే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందడానికి అర్హులవుతారంది. రూ.8లక్షలు దాటితే క్రీమీలేయర్ వర్తింపజేస్తారు. ఆ కుటుంబాల వారు ఈడబ్ల్యూఎస్‌కు అనర్హులు. ఓబీసీ రిజర్వేషన్లకు గత 3 ఆర్థిక సంవత్సరాల వార్షిక ఆదాయం సరాసరిని పరిగణనలోకి తీసుకుంటుండగా ఈడబ్ల్యూఎస్‌కు గత ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. కేంద్రం తరఫున సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. నీట్–పీజీ అభ్యర్థులు వేసిన పలు పిటిషన్లపై స్పందించిన సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కోటా ఆదాయ అర్హత ప్రమాణాలను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగాలు, నీట్–పీజీ కౌన్సిలింగ్ అర్హతకు కుటుంబ ఆదాయపరిమితిపై సిఫారసులు చేసేందుకు గత నవంబర్‌లో ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి వీకే మల్హోత్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గత ఏడాది డిసెంబర్ 31న తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ‘ఈడబ్ల్యూఎస్ కోటా అర్హతకు అభ్యర్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షలు, అంతకంటే తక్కువగా ప్రస్తుతమున్న విధానాన్ని కొనసాగించవచ్చు. అంతకుముందు సంవత్సరం కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల వరకు ఉన్న వారు మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులవుతారు.’అని కమిటీ సిఫారసు చేసింది. ఈ సిఫారసును ప్రభుత్వం ఆమోదించడంలో జాప్యం కారణంగా నీట్–పీజీ–2021 కౌన్సెలింగ్ ఆలస్యం అయింది. దీంతో, ఢిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనలకు దిగారు. న్యాయపరమైన అవరోధాలను తొలగించి, వెంటనే కౌన్సిలింగ్ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. నీట్–పీజీ కౌన్సెలింగ్ చేపట్టడంలో 8 నెలలపాటు జరిగిన జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో రెసిడెంట్ డాక్టర్లకు తీవ్ర కొరత ఏర్పడిందని వారు పేర్కొన్నారు. త్రిసభ్య కమిటీ ఇంకా ఏం చెప్పిందంటే.. ‘ప్రస్తుతమున్న కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ.8 లక్షలను భారీ ఆదాయంగా పరిగణించలేము. అందుబాటులో ఉన్న వాస్తవ ఫలితాలను బట్టి చూస్తే ఈ మొత్తం సమంజసమైందిగా ఉంది. సంవత్సరాదాయంలో వ్యవసాయ ఆదాయం, వేతనాలను కూడా కలిపిన విషయం గమనించాలి. ఆదాయంతో సంబంధం లేకుండా అయిదెకరాలు అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబానికి చెందిన అభ్యర్థిని ఈ డబ్ల్యూఎస్ నుంచి మినహాయించవచ్చు. నివాస ఆస్తుల ప్రాతిపదికను తొలగించవచ్చు’అని పేర్కొంది. -
పెగాసస్‌పై కమిటీ.. గొప్ప ముందడుగు: రాహుల్
న్యూఢిల్లీ: పెగాసస్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ స్వాగతించారు. ఇదొక పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. సైబర్ నిపుణులతో కూడిన త్రిసభ్య కమిటీ దర్యాప్తుతో నిజానిజాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెగాసస్‌ను ఉపయోగించడం అంటే దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నమేనని ఆరోపించారు. పెగాసస్ నిఘా అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో మళ్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని రాహుల్ పేర్కొన్నారు. చర్చకు ప్రభుత్వం ఇష్టపడకపోయినప్పటికీ తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు. -
వచ్చేవారంలో రాష్ట్రానికి సుప్రీం త్రిసభ్య కమిషన్
సాక్షి, హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్ వచ్చేవారం రాష్ట్రానికి రానుంది. ఇందులోభాగంగా సైబరాబాద్ పోలీసులను, ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృంద (సిట్) సభ్యులను, దిశ తల్లిదండ్రులను, అత్యాచార నిందితుల కుటుంబాలను కమిషన్ కలవనుంది. ‘దిశ’కేసులో నిందితుల ఎన్కౌంటర్ బూటకమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ త్రిసభ్య కమిషన్ని వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు దిశ కేసులో వారంరోజుల్లోగా మహబూబ్‌నగర్ పోలీసులు న్యాయస్థానానికి ఫైనల్ రిపోర్టును సమర్పించనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు జడ్జి సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తున్న కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖా ప్రకాశ్, సీబీఐ మాజీ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. -
ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్
సాక్షి, న్యూఢిల్లీ: దిశ హత్యాచారం ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై సుప్రీంకోర్టు న్యాయ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్. సిర్పుర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్ న్యాయ విచారణ చేపడుతుందని పేర్కొంది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్ బాల్డోట, సీబీఐ మాజీ డైరెక్టర్ డి.ఆర్.కార్తి కేయన్ ఇందులో సభ్యులుగా ఉంటారని తెలిపింది. హైదరా బాద్ కేంద్రంగా పనిచేసే ఈ కమిషన్.. విధులు ప్రారంభించిన తొలి రోజు నుంచి ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పిస్తుందని వెల్లడించింది. అప్పటి వరకు ఏ ఇతర కోర్టులూ ఎన్కౌంటర్ మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్.ఎ. బాబ్డే నేతృత్వంలోని జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురు వారం ఆదేశాలు జారీచేసింది. నిందితులను బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపారని, బాధ్యు లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశిం చాలని కోరుతూ జి.ఎస్.మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్, ఎంకే శర్మ, మనోహర్‌లాల్ శర్మలు దాఖలు చేసిన మూడు పిటి షన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మీరు తప్పు చేశారని మేం అనడంలేదు. కానీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ న్యాయ విచారణ జరిపిస్తున్నాం. – సుప్రీంకోర్టు వాదనలు విన్న అనంతరం.. ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నం దునే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ‘కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్– 1951’ ద్వారా దఖలుపడిన అధికారాలన్నీ ఈ కమి షన్ కలిగి ఉంటుందని వెల్లడించింది. కమిషన్‌కు హైదరాబాద్‌లో కావాల్సిన కార్యాలయం, వసతి, సచివాలయ సిబ్బంది, రవాణా వసతిని కమిషన్ సూచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సమకూర్చాలని ఆదేశించింది. అలాగే కమిషన్‌కు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని సూచించింది. కమిషన్‌కు కౌన్సిల్‌గా న్యాయవాది కె.పరమేశ్వరన్ వ్యవహరిస్తారని పేర్కొంది. నిందితుల మృతదేహాలు భద్రపరచాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నల వర్షం.. అంతకుముందు ఈ పిటిషన్లపై తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుదీర్ఘ వాదనలు వినిపించారు. గంటపాటు సాగిన విచారణలో తొలుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ ఎ.బాబ్డే.. ముకుల్ రోహత్గీపై ప్రశ్నల వర్షం కురిపించారు. దిశ హత్యోదంతం సంఘటన రోహత్గీ వివరిస్తుండగా.. పిటిషన్ కేవలం ఎన్‌కౌంటర్‌కు సంబంధించినదని ధర్మాసనం ప్రస్తావించడంతో ఎన్కౌంటర్ జరిగిన తీరును రోహత్గీ నివేదించారు. ‘పోలీసులు నిందితులను తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో క్రైమ్ సీన్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలికి సంబంధించిన మొబైల్ వంటి వస్తువులను సేకరించారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఘటన తీరును తెలుసుకునే క్రమంలో విచారిస్తుండగా నిందితులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఆయుధాలను లాక్కుని కాల్చడం ప్రారంభించారు’ అని తెలిపారు. జస్టిస్ బాబ్డే జోక్యం చేసుకుని ‘పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కునే పరిస్థితి ఉంటుందా?’ అని ప్రశ్నించారు. దీనికి రోహత్గీ బదులిస్తూ.. ‘రాళ్లతో దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు కూడా అయ్యాయి’ అని బదులిచ్చారు. మరి దీనికి సంబంధించి మెడికల్ రిపోర్ట్ ఉందా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయని రోహత్గీ చెప్పారు. నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లిన పోలీసు అధికారుల ర్యాంక్(హోదా) ఏంటని, కాల్పులు జరిపిన అధికారుల ర్యాంక్ ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏసీపీ నేతృత్వంలో సీఐ, ఎస్ఐ ర్యాంకులతో కూడిన అధికారుల బృందం అక్కడికి వెళ్లిందని రోహత్గీ వివరించారు. నిందితులు పిస్టల్‌ను, రాళ్లను ఒకేసారి ఎలా వినియోగించారని జస్టిస్ బాబ్డే ప్రశ్నించారు. వారు కాల్పులు జరిపారా? జరిపితే ఆ బుల్లెట్లను సేకరించారా? వాటిని ఎక్కడ దాచారు? అంటూ ప్రధాన న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు రోహత్గీ వివరంగా సమాధానాలు చెప్పారు. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు చంపారని, వారికి వేరొక మార్గం కనిపించలేదని వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సిట్ నిష్పాక్షిక విచారణ జరుపుతోందని, ఆ నివేదిక వచ్చాక అవసరమైన పక్షంలో తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని నివేదించారు. అయితే ఈ సందర్భంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపిస్తే వచ్చే ఇబ్బందేంటని ధర్మాసనం ప్రశ్నించింది. సమాంతర దర్యాప్తు వీలుకాదు ఇప్పటికే పీయూసీఎల్ కేసులో సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాలన్నీ అమలు చేశామని, ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, పోలీస్ కమిషనర్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) దర్యాప్తు జరుపుతోందని రోహత్గీ వివరించారు. దర్యాప్తు స్వతంత్రతపై విశ్వాసం లేనప్పుడే ఎన్హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు మార్గదర్శకం ఉన్నప్పటికీ, దానిని కాదని ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ విచారణ జరుపుతోందని తెలిపారు. ఒకవైపు సిట్ ఈ కేసులో దర్యాప్తు జరుపుతుండగా మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో సమాంతర దర్యాప్తు సాధ్యం కాదని పేర్కొన్నారు. ‘పోలీసులపై తిరగబడి వారిపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితులు ఇద్దరు పోలీసు అధికారుల నుంచి ఆయుధాలు లాక్కుని కాల్పులకు దిగడంతో పోలీసులు ప్రతిఘటనగా ఈ కాల్పులు జరిపారు’ అని రోహత్గీ వివరించారు. ఈ విచారణ హాస్యాస్పదం... ‘పోలీసులపై హత్యాయత్నానికి దిగారంటూ చనిపోయిన వారిని నిందితులుగా చేర్చి విచారణ జరుపుతున్నామంటూ చెప్పడం దర్యాప్తును నీరుగార్చడమే. ఇక్కడ ప్రాసిక్యూషన్ విట్నెస్ ఎక్కడుంది? ఇది విచారణ ఎలా అనిపించుకుంటుంది. విశ్వసనీయతతో కూడిన అంశంగా దీనిని చూడాలి. మీరు మాట్లాడుతున్న విచారణకు అర్థం లేదు. నిందితులు లేరు. శిక్ష ఉండదు. మీ రక్షణ కోసమే నిర్వహించే విచారణ అవుతుంది. మీరేమీ చేయలేదని ఎవరు చెబుతారు? ఎవరి సాక్ష్యం ఆధారంగా చెబుతారు? ఈ విచారణ హాస్యాస్పదం అవుతుంది. ఈ విషయంలో మీరు స్టేట్స్మెన్లా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. ఇది పరిహాసం కాకూడదు’ అని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. మీరు దోషులని మేమనడం లేదు ‘మీరు తప్పు చేశారని మేం అనడంలేదు. కానీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తప్పనిసరిగా నిజాలు తెలియాలి. అందుకే ఈ న్యాయ విచారణ జరిపిస్తున్నాం.. వాస్తవాలు ఇవి అని మేం ఊహించజాలం. నిందితులు పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. న్యాయ విచారణ జరగనివ్వండి. ఈ విషయంలో మీరు ఎందుకు అభ్యంతరపెడుతున్నారు’ అని ధర్మాసనం ప్రశ్నించింది. కానీ ఎన్ని ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించగలమని న్యాయవాది రోహత్గీ వాదించారు. ‘ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా విచారిస్తోంది. ఇంకా ఎన్ని విచారణలు జరుగుతాయి?’ అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ బాబ్డే స్పందిస్తూ ‘సిట్.. ఈ కమిషన్‌కు సహకరించవచ్చు. సాక్ష్యాలను సమర్పించవచ్చు’ అని సూచించారు. దీనిపై రోహత్గీ స్పందిస్తూ.. ‘కమిషన్‌ను నియమిస్తే హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ విచారణలను నిలుపుదల చేయండి’ అని నివేదించారు. మీడియాను నియంత్రించండి: పిటిషనర్ ‘దిశ హత్యోదంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇదిగో సాక్ష్యం, అదిగో సాక్ష్యం అంటూ మీడియా అనవసరంగా ప్రసారాలు చేసి కేసుపై ప్రభావం చూపింది. ప్రజలను రెచ్చగొట్టేలా చేసింది’ అని పిటిషనర్లలో ఒకరైన మనోహర్‌లాల్ శర్మ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో ధర్మాసనం స్పందిస్తూ ‘విచారణ కమిషన్ విచారణ జరుపుతున్నప్పుడు మీడియా పబ్లిసిటీ ఇవ్వకుండా నియంత్రించాలని, విచారణపై కామెంట్లు చేయడం ఆపేలా నియంత్రించాలని సలహా వచ్చింది. అయితే ఈ విషయంలో ఆదేశాలు జారీ చేసేముందు సంబంధిత మీడియా అభిప్రాయం కూడా తీసుకోవాలని రోహత్గీ చెప్పారు. ఈ దిశగా మేం అభిప్రాయం కోరుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పీటీఐకి నోటీసులు జారీ చేస్తున్నాం. దీనికి నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలి’ అని పేర్కొంది. కాగా పీటీఐని ఇంప్లీడ్ చేసేందుకు వీలుగా దరఖాస్తు చేసుకునేందుకు మనోహర్‌లాల్ శర్మకు స్వేచ్ఛ ఇస్తున్నట్టు ఆదేశాల్లో స్పష్టంచేసింది. అలాగే ఈ కేసులో ప్రతివాది అయిన కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. -
6 నుంచి అయోధ్య విచారణ
న్యూఢిల్లీ: రాజకీయంగా సున్నితమైన అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు భూ వివాదానికి మధ్యవర్తిత్వం పరిష్కారం చూపనందున ఇక ఈ కేసును తామే ప్రతి రోజూ విచారిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. ఆగస్టు 6 నుంచి ప్రారంభించి విచారణను రోజూ బహిరంగంగా చేపడతామంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా నేతృత్వంలోని త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీ దాదాపు నాలుగు నెలలపాటు అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి ప్రయత్నించినా ఫలితం రాలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను తాము చదివామనీ, సమస్యకు ఈ కమిటీ తుది పరిష్కారం చూపలేకపోయిందని పేర్కొంది. కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇక తామే ఈ కేసును విచారించాలని నిర్ణయించినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లు ఈ ధర్మాసనంలో ఇతర సభ్యులుగా ఉన్నారు. జూలై 31 నాటి వరకు మధ్యవర్తిత్వంలో ఎంత పురోగతి వచ్చిందో తెలిపే నివేదికను ఆగస్టు 1న తమకు సమర్పించాల్సిందిగా త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీని కోర్టు జూలై 18నే ఆదేశించింది. కాగా, అయోధ్య కేసుపై ప్రతి రోజూ విచారణ జరుపుతామంటూ సుప్రీంకోర్టు చెప్పడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్వాగతించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు త్వరలోనే తొలగిపోతాయని తాము ఆశిస్తున్నామని ట్విట్టర్లో తెలిపింది. మధ్యవర్తిత్వంతో లాభం లేదు త్రిసభ్య కమిటీ నివేదికను పరిశీలించిన అనంతరం, మధ్యవర్తిత్వంతో లాభం లేదనీ, కేసును తామే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎఫ్ఎంఐ ఖలీఫుల్లా ఈ త్రిసభ్య కమిటీకి నేతృత్వం వహిస్తుండగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌తోపాటు సీనియర్ న్యాయవాది, మధ్యవర్తిత్వంలో పేరొందిన శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉండటం తెలిసిందే. క్లిష్టమైన అయోధ్య సమస్యకు హిందూ, ముస్లిం వర్గాలకు అమోదయోగ్యమైన పరిష్కారం లభించడం లేదని త్రిసభ్య కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి కోర్టు మార్చి 8న అనుమతినిచ్చింది. చర్చలను రహస్యంగా జరపాలనీ, 8 వారాల్లోగా పూర్తి చేయాలని అప్పట్లో గడువు విధించింది. అయితే సామరస్యక పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆశాజనకంగా సాగుతున్నాయనీ, మరికొంత సమయం కావాలని కమిటీ కోరడంతో, ఆగస్టు 15 వరకు కోర్టు గడువిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో కమిటీ ఈ చర్చలు జరిపింది. 16వ శతాబ్దంలో మీర్ బఖీ నిర్మించిన బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6న కొందరు కూల్చేయడం తెలిసిందే. 20 రోజుల సమయం కావాలి... ఈ కేసులో ముస్లింల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ శుక్రవారం కోర్టులో వాదిస్తూ పలు సాంకేతికాంశాలను ప్రస్తావించారు. కేసులోని వివిధ అంశాలను సంపూర్ణంగా వాదించాలంటే తనకు ముందుగా కనీసం 20 రోజుల సమయం కావాలని ఆయన కోరారు. కేసులోని వివిధ అంశాలు, అప్పీళ్లను ఎలా విచారించాలో రాజీవ్ కోర్టుకు చెబుతుండగా, న్యాయమూర్తులు కలగజేసుకుంటూ ‘మేము ఏం చేయాలో మీరు మాకు గుర్తుచేయాల్సిన అవసరం లేదు. కేసులో ఏయే అంశాలున్నాయో మాకు తెలుసు. వాటన్నింటిపై మేం విచారిస్తాం. ముందు విచారణ ప్రారంభం కానివ్వండి’ అని అన్నారు. మధ్యవర్తిత్వ కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు రహస్యంగానే ఉంటాయని కూడా కోర్టు స్పష్టం చేసింది. -
విశాఖ భూకుంభకోణంపై టీడీపీ త్రిసభ్య కమిటీ
పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు నిర్ణయం టీడీపీ నుంచి ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సస్పెన్షన్ సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన విశాఖపట్నం భూకుంభకోణంపై విచారణకు పార్టీ పరంగా త్రిసభ్య కమిటీని నియమించాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపి, తనకు నివేదిక ఇçస్తుందని ఆయన చెప్పారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గురువారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా విశాఖపట్నం భూకుంభకోణంపై చర్చించినట్లు తెలిసింది. మంత్రులు, అధికారులు ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రకటనలు చేయడం వల్ల ఇబ్బంది ఏర్పడినట్లు చంద్రబాబు అన్నారు. విషయం తెలుసుకోకుండానే లక్ష ఎకరాలు ట్యాంపరింగ్ జరిగినట్లు కలెక్టర్ చెప్పడం ఏమిటని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడైన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భూకబ్జా కేసులో అరెస్టయినా అతనిపై చర్యలు తీసుకోకపోవడం లేదంటూ బాబుపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపక్‌రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దీపక్‌రెడ్డిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. -
‘భవనాల’పై సీఎంల స్థాయిలో నిర్ణయం
♦ విభజనాంశాలపై గవర్నర్ సమక్షంలో చర్చలో త్రిసభ్య కమిటీలు ♦ కీలక నిర్ణయాలేవీ తీసుకోకుండానే ముగిసిన భేటీ ♦ 17న మరోసారి సమావేశం సాక్షి, హైదరాబాద్: విభజన సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన రెండు రాష్ట్రాల త్రిసభ్య కమిటీలు ఆదివారం ఇక్కడి రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో మరోమారు సమావేశమయ్యాయి. ఈ భేటీకి తెలంగాణ నుంచి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఏపీ నుంచి మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో కీలక నిర్ణయాలేవీ కమిటీలు తీసుకోలేదు. ఏప్రిల్ 17న మరోమారు సమావేశం కావాలని సూచనప్రాయంగా నిర్ణయించాయి. అనంతరం సమావేవ వివరాలను వివేక్ మీడియాకు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజనతోపాటు ఉద్యోగుల విభజనపై చర్చించినట్లు చెప్పారు. ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇప్పటికే అమరావతికి తరలివెళ్లినందువల్ల సెక్రటేరియట్ భవనాలను ఏపీ ఖాళీ చేస్తే బాగుంటుందన్న విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయితే దీనిపై తమ సీఎం చంద్రబాబుతో మాట్లాడి చెబుతామని ఏపీ మంత్రులు చెప్పారన్నారు. భవనాల విభజనపై కమిటీలు నిర్ణయం తీసుకోలేవని, ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయం జరగాలని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల పంపిణీ సమస్యలపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఎండీలు మాట్లాడుకున్నారని, వారిచ్చిన నివేదికల ఆధారంగా సమస్యలను త్వరగా పరిష్కరిస్తామనే అభిప్రాయం వెలిబుచ్చారు. 42 కార్పొరేషన్ల విభజనతోపాటు పలు అంశాలపై వచ్చే సమావేశంలో స్పష్టత వస్తుందని వివేక్ తెలిపారు. తదుపరి సమావేశంలో ఉద్యోగుల ఇబ్బందులపై దృష్టి సారిస్తామని, ఇదే అంశంపై గవర్నర్ పలు సూచనలు చేసినట్లు చెప్పారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపైత్వరలో సుప్రీంకు... సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ సలహా తీసుకుం టున్నామని వివేక్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ సూచన మేరకు త్వరలోనే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, నిజామాబాద్ ఎంపీ కవిత చొరవతోనే నిజామాబాద్–పెద్దపల్లి రైల్వేలైన్ పూర్తయిందంటూ ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. -
సచివాలయ భవనాల అప్పగింతే..!
-
సచివాలయ భవనాల అప్పగింతే..!
♦ ఏపీ త్రిసభ్య కమిటీ బృందం సూత్రప్రాయ అంగీకారం ♦ తొమ్మిదో షెడ్యూల్ సంస్థలు, ఉద్యోగుల విభజనపై కీలక నిర్ణయాలు ♦ గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల కమిటీ సభ్యులు రెండో భేటీ ♦ 26న రాజ్‌భవన్‌లో మూడో సమావేశం సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో తమ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన త్రిసభ్య కమిటీ బృందం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిరుపయోగంగా ఉన్నందున ఈ భవనాలను ఇవ్వడం తప్ప గత్యంతరం లేదని, తమ ముఖ్యమంత్రితో మాట్లాడి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో రెండు రాష్ట్రాల కమిటీ సభ్యులు గురువారం రెండోసారి భేటీ అయ్యా రు. తెలంగాణ తరఫున మంత్రులు హరీశ్‌రా వు, జగదీశ్‌రెడ్డి, సలహాదారు వివేక్, మెంబర్ సెక్రెటరీ రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ తరఫు న మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, విప్ కాల్వ శ్రీనివాసులు, మెంబర్ సెక్రెటరీ ప్రేమచంద్రారెడ్డి హాజరయ్యారు. పలు కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. 9 సంఘాల విభజనకు ఒప్పందం.. ఈ చర్చల సందర్భంగా 9 బీసీ సంఘాల విభజనకు పరస్పర ఒప్పందం కుదిరిం ది. ఏపీ వడ్డెర కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ వాల్మీకి బోయ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ కృష్ణబలిజ /పూసల కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ బట్రాజ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ విశ్వబ్రాహ్మణ కోఆప రేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ కుమ్మర (శాలివాహన) కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరే షన్ లిమిటెడ్, ఏపీ మేదర కోఆపరేటివ్ సొసై టీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ గీత కార్మికుల కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ సగర(ఉప్పర) కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ విభజనకు రెండు కమిటీల మధ్యా అంగీకారం కుదిరింది. హైకోర్టు విభజనపై ప్రతిపాదన.. హైకోర్టు విభజనపై కూడా సత్వర నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ త్రిసభ్య కమిటీ ప్రతిపాదించింది. దీనిపై రెండు రాష్ట్రాల కమిటీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. హైకోర్టుకు అమరావతిలో త్వరగా స్థలం కేటాయించుకుని, విభజనకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఏపీకే నిర్వహణ వ్యయం పెరిగిపోతోంది : హరీశ్‌రావు ‘ఏపీ సచివాలయం ఇప్పటికే ఖాళీ చేసి తాళాలేసి పెట్టారు. అక్కర లేకున్నా పన్ను లు, బిల్లులు కడుతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వానికే నిర్వహణ వ్యయం పెరిగిపో తోంది. ఎలుకల బాధ. చెత్త పేరుకోవటంతో మాకూ ఇబ్బందిగానే ఉంది.. అదే విషయాన్ని చెప్పాం. సీఎంతో మాట్లాడి నిర్ణయం చెపుతామన్నారు’అని భేటీ అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో అన్నారు. పరస్పర బదిలీలకు ఓకే.. సచివాలయంతో పాటు జిల్లాల్లోనూ రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పరస్పర బదిలీల ప్రతిపాదనకు చర్చల్లో అంగీకారం కుదిరింది. ఏయే పోస్టులకు చెందిన వారు.. ఎంత మంది ఉద్యోగులు పరస్పర బదిలీకి అంగీకార యోగ్యంగా ఉన్నారో అభ్యర్థనల ను స్వీకరించి.. అంత మేరకు బదిలీ చేస్తే ఇబ్బందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమైం ది. విద్యుత్ ఉద్యోగుల విభజన, పెండిం గ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల ఎండీలు కలసి మాట్లాడుకుని తెలంగాణ, ఏపీ ఉద్యోగుల వివరాలను వారం రోజుల్లో తమకు అందిం చాలని కమిటీ సభ్యులు సూచించారు. తదుపరి సమావేశంలో ఈ వివరాలను చర్చించాలని నిర్ణయించారు. కాగా, ఈ నెల 26న రాజ్‌భవన్‌లో మూడోసారి సమావేశం కావాలని నిర్ణయం జరిగింది. -
బాలింతల మరణాలపై త్రిసభ్య కమిటీ
నిలోఫర్‌లో విచారణకు ఆదేశించిన డీఎంఈ సాక్షి, హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రిలో బాలింతల మరణాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. వైద్య ఆరోగ్య మంత్రి ఆదేశాల మేరకు డీఎంఈ రమణి ఆస్పత్రికి చేరుకుని, బాలింతల మరణాలపై సమగ్ర విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఉస్మానియా డాక్టర్ భీంరావుసింగ్, గాంధీ ప్రొఫెసర్ డాక్టర్ రాణి, పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి చెందిన డాక్టర్ ప్రతిభతో కమిటీ ఏర్పాటైంది. ఈ బృందం సోమవారం నిలోఫర్ ఆస్పత్రిని సందర్శించి, సిజేరియన్‌లో వైద్యపరమైన నిర్లక్ష్యంపై ఆరా తీసింది. ప్రభుత్వానికి రెండు రోజుల్లో సమగ్ర నివవేదిక అందే అవకాశం ఉంది. నివేదిక అందిన వెంటనే చర్యలు... ఇదిలా ఉండగా డీఎంఈ రమణి.. సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్‌కుమార్ సహా ఆర్ఎంలు, ఇతర వైద్యులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాలింతల మరణాలపై ఆరా తీశారు. ఈ సంద ర్భంగా ఆస్పత్రిలో బాలింతల మరణాలు చోటు చేసుకోవడం వాస్తవమేనని ఆమె అంగీకరించారు. గత నెల 28 నుంచి ఈ నెల మూడో తేదీ వరకు ఆస్పత్రిలో 44 సిజేరియన్లు చేయగా వీరిలో ఐదుగురు (రీనా, బుష్రబేగం, ఫరా ఫాతిమా, నజ్రత్, అనుష) బాలింతలు మృతి చెందారన్నారు. ఈ మరణాలపై విచారణ కొనసాగుతోందని, నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొంత మంది వైద్యులు, పీజీ విద్యార్థులు.. సీఎస్ ఆర్‌ఎంఓపై డీఎంఈకి ఫిర్యాదు చేశారు. బంధువుల ఆందోళన.. ఆస్పత్రిలో సిజేరియన్ల కోసం మూడు ఆపరేషన్ థియేటర్లు ఉండగా, ఇప్పటికే రెండింటిని మూసివేశారు. అత్యవసర చికిత్సల కోసం తెరిచి ఉన్న ఆ ఒక్క ఓటీని కూడా సోమవారం మూసివేశారు. త్రిసభ్య కమిటీ నివేదిక వచ్చే వరకు సిజేరియన్లు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. సాధారణ ప్రసవాలు మాత్రమే చేస్తున్నారు. బ్యాక్టీరియా, వైరస్ల నిర్మూలన కోసం ఓటీల్లో ఫ్యూమిగేషన్ చేపట్టారు. మరోవైపు బాలింతల మరణాలకు కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుల బంధువులు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన నేతలు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగాయి. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
కృష్ణా జలాలపై అదే ప్రతిష్టంభన!
-
కృష్ణా జలాలపై అదే ప్రతిష్టంభన!
• నీటి కేటారుుంపులపైతేల్చని కృష్ణా త్రిసభ్య కమిటీ • నీటి వినియోగ లెక్కలపై ఇరు రాష్ట్రాల భిన్న వాదనలు • రేపు మరోమారు భేటీ కావాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రబీలో కృష్ణా జలాల విడుదలకు సంబంధించి బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వాటాలకు మించి నీటిని వినియోగించుకున్నారంటూ ఇరు రాష్ట్రాలూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఏమీ తేల్చలేకపోరుున బోర్డు.. మరోసారి భేటీ అవుదామని సూచించడంతో సమావేశం వారుుదా పడింది. బుధవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ ఈఎన్సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో భేటీ అరుుంది. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై తీవ్రంగా వాదనలు జరిగారుు. ‘మైనర్’లెక్కలపైనే గొడవంతా.. తొలుత ఇరు రాష్ట్రాలూ తమ అవసరాలను పేర్కొంటూ ఇండెంట్‌ను బోర్డు ముందుం చారుు. తెలంగాణ 103 టీఎంసీల అవసరాలను పేర్కొనగా, ఏపీ 47 టీఎంసీలు కావాలని కోరింది. రబీ అవసరాల దృష్ట్యా నీటి వినియోగానికి అవకాశమివ్వాలని ఇరు రాష్ట్రా లు కోరారుు. అనంతరం ఇప్పటివరకు కృష్ణా లో జరిగిన జలాల వినియోగంపై వాదనలు వినిపించారు. తొలుత తెలంగాణ వాదన వినిపించింది. ‘‘కృష్ణా పరిధిలోని లభ్యత నీటి లో ఏపీ 236.25 టీఎంసీలు, తెలంగాణ 74. 51 టీఎంసీలు వినియోగించారుు. ఇందులో మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణ 24.41 టీఎంసీలు, ఏపీ 15.85 టీఎంసీలు వాడారుు. ప్రస్తుతం కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో 158.25 టీఎంసీల మేర లభ్యత జలాలున్నారుు. ఇందులో తెలంగాణకు 88.61 టీఎంసీలు, ఏపీకి 69.64 టీఎంసీలు దక్కుతారుు..’’అని వివరించింది. తమకు 201.86 టీఎంసీలు వాడుకునే అవకాశమున్నా 165.77 టీఎంసీలే వాడుకున్నామని.. అదే తెలంగాణ 117.90 టీఎంసీలనే వాడాల్సి ఉన్నా 154 టీఎంసీల నీటిని వాడుకుందని పేర్కొంది. మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణకు 89.15 టీఎంసీల కేటారుుంపులుండగా 68 టీఎంసీల మేర విని యోగించుకుందని.. ఈ లెక్కలను నమోదు చేయకుండా కృష్ణా జలాల్లో అధిక వాటా కొట్టేసేందుకు యత్నిస్తోందని ఆరోపించింది. ప్రస్తుతం మొత్తం నీటి లభ్యత 130 టీఎంసీల మేర ఉందని... అందులో 102 టీఎంసీలు ఏపీకి, 28 టీఎంసీలు తెలంగాణకు దక్కుతాయని పేర్కొంది. ఏపీ వాదనను తెలంగాణ తిప్పికొట్టింది. మైనర్ ఇరిగేషన్ కింద ఏపీ పేర్కొన్న స్థారుులో నీటి వినియోగం జరగలేదని.. చాలా చెరువుల్లో ఆశించిన స్థారుులో నీరే చేరలేదని స్పష్టం చేసింది. సాధారణ నష్టాలను పక్కనపెడితే 22 టీఎంసీలకు మించి వినియోగం లేదని... అవసరమైతే సంయుక్త కమిటీతో విచారణ చేరుుద్దామని పేర్కొంది. ఇదే సమయంలో పట్టిసీమ అంశాన్ని కూడా లేవనెత్తింది. పట్టిసీమ కింద ఏపీ 52 టీఎంసీల వినియోగం చేసినా లెక్కల్లో చూపడం లేదేమని నిలదీసింది. ఆ అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున ఆ వినియోగాన్ని లెక్కలోకి చూపలేమని ఏపీ పేర్కొంది. దీనిపై ఇరు రాష్ట్రాలూ వాదనకు దిగడంతో.. బోర్డు కల్పించుకుని శుక్రవారం మరోమారు దీనిపై భేటీ నిర్వహిద్దామని సూచించింది. -
‘కృష్ణా’ త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల నీటి కేటారుుంపుల అం శాన్ని చర్చించేందుకు శుక్రవారం జరగాల్సిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ వారుుదా పడింది. ఏపీ ఈఎన్సీ అందుబాటులో లేనందున భేటీని బోర్డు వారుుదా వేసిం ది. అరుుతే తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్సీ ముర ళీధర్ గురువారం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీని తక్షణ నీటి కేటారుుంపుల అవసరంపై వివరణ ఇచ్చారు. నాగార్జునసాగర్ కింద 6.40లక్షల ఎకరాలకు 50 టీఎం సీలు, ఏఎంఆర్పీ కింద 2.50లక్షల ఎకరాలకు 15 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటికి 10టీఎంసీలు తక్షణమే తెలంగాణకు కేటారుుంచాలని కోరారు. జూరాల కింద 20 టీఎంసీ, మీడియం ప్రాజెక్టులకు 8 టీఎంసీలు కలిపి మొత్తంగా 103 టీఎంసీలు అవసరమని విన్నవించారు. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 197.90 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని వివరించారు. ఈ ఏడాది ప్రస్తుతం వరకు కృష్ణాలో ఏపీ 187.18 టీఎంసీ నీటిని వాడుకోగా, తెలంగాణ కేవలం 64.8టీఎంసీలను మాత్రమే వినియోగించుకుందని దృష్టికి తెచ్చారు. ఈ దృష్య్టా రాష్ట్ర అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ నీటి విడుదలపై నిర్ణయం చేయాలని కోరారు. -
నేడు బాబ్లీ గేట్ల ఎత్తివేత
► గోదావరిలోకి పెరగనున్న నీటి ప్రవాహం ► త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో విడుదల భైంసా : గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలుకా బాబ్లీ గ్రామం వద్ద నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అర్ధరాత్రి తెరవనున్నారు. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచి నీటిని వదలనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏటా జూలై 1న గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నది నీటి సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రకు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గేట్లను పైకి ఎత్తనున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి గోదావరి నది ప్రవహిస్తూ నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలో అడుగీడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు వరకు ఈ నది ప్రవాహం ఉంటుంది. గోదావరి నదిలో వర్షపు నీరు.. వర్షాలు లేక గతేడాది ఎస్సారెస్పీలో నీరు చేరలేదు. పుష్కరాల సమయంలో గేట్లు ఎత్తడంతో ఆ నీరు బాసర వరకు చేరింది. వర్షాలు లేక గోదావరి నదిలో తవ్విన ఇసుక గుంతల్లోనే ప్రాజెక్టు నీరు ఇంకిపోయింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మంజీర ఉపనదితో వచ్చే నీరు బాసర వద్ద నిలిచి ఉంది. పక్షం రోజుల వరకు బాసర వద్ద పుణ్యస్నానాలకు కూడా నీరు కనిపించలేదు. గోదావరి నదిలో బావులు తవ్వి ఆలయానికి, గ్రామానికి, ట్రిపుల్ఐటీ విద్యార్థులకు నీటిని పంపించారు. జూన్ మొదటి వారం నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి జలకళ వచ్చింది. బాసర గోదావరి నదిలో స్నానఘట్టాల వద్ద వర్షపునీరు చేరింది. రైలు, బస్సు వంతెనల నుంచి నదిలో నీరు కనిపిస్తోంది. గతేడాది నుంచి ఎడారిలా కనిపించిన గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎస్సారెస్పీకి నీరు.. ఇక వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తనున్నారు. నీరంతా ఎస్సారెస్పీలోకి చేరనుంది. పైగా మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరంతా గోదావరి నదిగుండా ఎస్సారెస్పీకి చేరనుంది. ప్రాజెక్టు 14 గేట్లు పైకి ఎత్తి ఉంచడంతో సహజ నది నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఉండదు. గోదావరి నది ప్రవహిస్తే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలతో నీరంది పంటలు పండుతాయి. నీరులేక గతేడాది రెండు జిల్లాలోనూ పంటపొలాలన్నీ బీడుభూములుగా మారిపోయాయి. ఈ యేడాది వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వచ్చే నీటితో ఎత్తిపోతల పథకాలు పనిచేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల రైతులు వరి పంటలువేసేందుకు పొలాలను సిద్ధం చేసి ఉంచారు. రైతుల ఆశలు.. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో ఏడు లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీరు అందుతుంది. తీవ్ర వర్షాభావంతో ఈ రైతులంతా గతేడాది నష్టపోయారు. ఈ యేడు వాతావరణ సూచనలతో వర్షాలు కురుస్తాయని ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో ఎలాగైనా ప్రాజెక్టు నిండుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కురుస్తున్న వర్షాలకుతోడు వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎస్సారెస్పీలో నీరు చేరితే తాగు, సాగునీటి ఇబ్బందులు దూరం కానున్నాయి. -
అటవీ చెక్‌పోస్ట్‌ల వసూళ్లకు చెక్
► అధ్యయూనికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు ► ప్రైవేట్ వ్యక్తుల తొలగింపునకు నిర్ణయం ► వారి స్థానంలో బేస్‌క్యాంప్ సిబ్బంది సేవలు హన్మకొండ అర్బన్ : అటవీశాఖ చెక్‌పోస్ట్‌ల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఉన్నతాధికారులు కనిపెట్టబోతున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఈ నిర్ధారణకు వచ్చా రు. చెక్‌పోస్ట్‌లు అక్రమ వసూళ్లకు కేంద్రాలుగా మారాయన్న ఆరోపణలు ఉన్నందున ప్రక్షాళనకు చర్యలు మొదలు పెట్టారు. జిల్లాలోని మొత్తం చెక్‌పోస్ట్‌ల స్థితిగతులు, సిబ్బంది, పర్యవేక్షణ తీరు, అవినీతి ఆరోపణలు తదితరాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. త్రిసభ్య కమిటీ చెక్‌పోస్ట్‌ల అధ్యయనం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో నార్త్ డీఎఫ్ఓ, వ న్యప్రాణి విభాగం డీఎఫ్ఓ,ఫ్లైరుు్యంగ్ స్క్వా డ్ డీఎఫ్ఓ సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్ట్‌ల్లో అవసరానికి అనుగుణంగా పనిచేస్తున్న ఎన్ని ఉన్నారుు? ఉపయోగంలో లేని ఉంటే మూసివేతకు అనుమతులు కోరాలని నిర్ణరుుంచినట్లు సమాచారం. అవినీతి ఆ రోపణలు వస్తున్న చెక్‌పోస్టుల్లో అందుకు బ లమైన కారణాలు ఏమిటనే కోణంలో విచారణ చేసిన అధికారులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. పరిస్థితి చక్కదిద్దేందుకు, సమస్యలు అధిగమించేందుకు కమిటీ నియమించినట్లు సమాచారం. ప్రైవేట్ పేరుతో వసూళ్లు జిల్లాలో ఉన్న తొమ్మిది అటవీశాఖ చెక్‌పోస్టుల్లో అధికారులకు సహాయకులుగా ఉండేందుకు ప్రైవేట్ సిబ్బందిని నియమించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీన్ని ఆసరా చేసుకొని చెక్‌పోస్టుల్లో పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్నట్లు ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. చెక్‌పోస్ట్‌ల వద్ద పనిచేసే ఉద్యోగులు, పర్యవేక్షించే అధికారుల పాత్ర స్పష్టమవుతున్నా పలుమార్లు ప్రైవేట్ వ్యక్తులపై నెట్టివేస్తున్నట్లు గుర్తించారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద ఇకపై ప్రైవేట్ వ్యక్తులు లేకుండా చేయూలని నిర్ణరుుంచారు. త్రిసభ్య కమిటీ అధ్యయనంలో ఇది కీలకంగా చేర్చారు. ప్రైవేట్ వ్యక్తుల స్థానంలో అటవీశాఖలో నమ్మకంగా పనిచేస్తున్న బేస్‌క్యాంప్ సిబ్బంది సేవ లు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ప్రత్యేక ఉత్తర్వులతో చెక్‌పోస్ట్ విధుల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిని అక్కడి నుంచి తప్పించాలని మొదట అనుకున్నారు. అరుుతే ప్రత్యేక ఉత్తర్వుల తో చెక్‌పోస్టుల్లో పోస్టింగ్‌లు పొందిన కొందరికి అధికారుల నిర్ణయం మింగుడు పడక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మధ్యేమార్గంగా రేంజ్ పరిధిలోని ఉద్యోగులకు చెక్‌పోస్టు విధులు రొటేషన్ పద్ధతిలో కేయించేలా అధికారులు ప్రస్తుతానికి ఆదేశాలు ఇచ్చారు. త్రిసభ్య కమిటీ నివేదిక తర్వాత ఈవిషయంలోనూ స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తొమ్మిది చెక్‌పోస్టుల్లో అదే తీరు జిల్లాలో అటవీశాఖకు చెందిన తొమ్మిది చెక్‌పోస్టులు ఉన్నారుు. బ్రాహ్మణపల్లి, జంగాలపల్లి అటవీశాఖ నార్త్ డివిజన్ పరిధిలోకి, మహబూబాబాద్ సమీపంలోని చెక్‌పోస్టు, నర్సంపేట సమీపంలోని చెక్‌పోస్టు సౌత్ డివిజన్‌లోకి, ఏటూరునాగారం, పస్రా, భూపతిపేట, కొత్తగూడ చెక్‌పోస్టులు వన్యప్రాణి విభాగంలోకి వస్తాయి. వీటిలో కొన్ని అవసరం లేదని, వాటి ప్రదేశాలు మార్చి మరో చోట ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. ఈ విషయం కమిటీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వన్యప్రాణి విభాగం డీఎఫ్‌వో పురుషోత్తం మాట్లాడుతూ చెక్‌పోస్టుల వద్ద ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఆరోపణల నేపథ్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు. -
బడులను ఎందుకు మూస్తున్నారు?
► రంగారెడ్డి జిల్లాలో పలు పాఠశాలలను పరిశీలించిన సుప్రీంకోర్టు బృందం ► విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వివరాల సేకరణ కందుకూరు/ మంచాల: స్కూళ్ల మూసివేతపై ఆరా తీసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించింది. కందుకూరు మం డలం పులిమామిడిలోని అంబేద్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాల, నేదునూరు ఉర్దూ పాఠశాలలను కమిటీ చైర్మన్ అశోక్‌గుప్తా, సభ్యులు వెంకటేశ్వరరావు, రత్నం, తెలంగాణ పేరెంట్స్ ఫౌండేషన్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ సందర్శించారు. గ్రామంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నారు? ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంది ఉన్నారు? ప్రైవేట్ పాఠశాలల్లో ఎంత మంది ఉన్నారని బృందం ఆరా తీసింది. ఇక్కడ ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండడంతో పిల్లల్ని ఇతర పాఠశాలల్లో చేర్పించామని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై కమిటీ సభ్యులు అధికారుల్ని ప్రశ్నించగా తక్కువ సంఖ్య ఉండటంతో ఇక్కడివారిని అర కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రభు త్వపాఠశాలలో కలిపామని చెప్పారు. మళ్లీ ఉపాధ్యాయుల్ని నియమించి తరగతులు ప్రారంభిస్తే విద్యార్థులు చేరతారా అని ప్రశ్నించగా సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడే చది విస్తామని తల్లిదండ్రులు బదులిచ్చారు. నేదునూరులోని ఉర్దూ మీడియం పాఠశాల టీచర్ మెటర్నటీ సెలవుపై వెళ్లడంతో ఇక్కడ చదివే పిల్లలు ఇతర పాఠశాలల్లో చేరడంతో పాఠశాల బంద్ అయిందని తల్లిదండ్రులు తెలిపారు. సమయాభావం వల్ల దాసర్లపల్లి, కటికపల్లిలోని పాఠశాలలను సందర్శిం చకుండానే వారు వెనుదిరిగారు. అనంతరం మంచాల మండలం ఆరుట్ల దళితవాడ-2, బుగ్గ తండా పాఠశాల, కొర్రం తండా ప్రాథమిక పాఠశాలను కమిటీ సందర్శించగా టీచర్లు సకాలంలో రావడంలేదని, ఏకోపాధ్యాయులు ఉన్న చోట ఇబ్బందులున్నాయని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. -
మళ్లీ వస్తా!
పై స్థాయిలో ఆశీస్సులు ఉన్నాయంటూ ప్రచారం ఆయన హయాంలో పలు అవినీతి ఆరోపణలు కొత్త అధికారి వస్తే బయటపడుతుందేమోనని ఆందోళన సిబ్బంది నోరు మెదపకుండా ముందస్తు జాగ్రత్త కర్నూలు: సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)లో గతంలో పనిచేసిన అధికారి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మళ్లీ ఎస్ఎస్ఏ అధికారిగా తానే వస్తానంటూ అక్కడి ఉద్యోగుల వద్ద చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఇందుకోసం తనకు పైస్థాయిలో ఆశీస్సులు కూడా ఉన్నాయని ఆయన చెప్పుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన అధికారి మొదట్లో విధుల్లో చేరకుండా అడ్డుకోగలిగానని కూడా ఆయన వ్యాఖ్యానిస్తుండటం చర్చకు దారితీస్తోంది. రెండు నెలల్లోగా తానే మళ్లీ అధికారిగా వస్తానని ఆయన నిర్దిష్ట సమయాన్ని కూడా చెబుతుండటం దుమారం రేపుతోంది. ఇదే సమయంలో ఎస్ఎస్ఏ వ్యవహారాలపై ఆరోపణలు రావడం కూడా చర్చనీయాంశమవుతోంది . అన్నీ ఆరోపణలే.. వాస్తవానికి ఎస్ఎస్ఏ వ్యవహారంలో మొదటి నుంచీ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. అధికారుల పుణ్యమా అని 2015-16 ఆర్థిక సంవత్సరంలో అదనపు తరగతుల నిర్మాణానికి కేంద్రం ఒక్క పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఇందుకు కారణం 2014-15లో కేంద్రం మంజూరు చేసిన నిధులన్నీ ఖర్చు చేయకపోవడమే. దీంతో పాటుగా జిల్లాలో పాఠశాలన్నింటిలోనూ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామని ప్రభుత్వానికి ఎస్ఎస్ఏ అధికారులు నివేదించారు. అదేవిధంగా కేవలం ఈ విద్యా సంవత్సరంలో 700 పైచిలుకు పాఠశాలల్లోని మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించామని బిల్లులు కూడా చూపించారు. అయితే, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తాజాగా జిల్లాలో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ పర్యటించిన సందర్భంలోనూ ఇదే విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో కొత్త అధికారి రావడంతో తాను చేసిన మొత్తం వ్యవహారాలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న అనుమానం గతంలో పనిచేసిన అధికారికి కలుగుతోందని సమాచారం. -
నాగార్జున యూనివర్సిటీ ఘటనలపై త్రిసభ్య కమిటీ!
సాక్షి, హైదరాబాద్: గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి, అందుకు దారితీసిన కారణాలు, తదనంతర పరిణామాలపై విచారించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించింది. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కమిటీ సభ్యుల పేర్లపై పరిశీలన చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం మాజీ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, విక్రమసింహపురి వీసీ ప్రొఫెసర్ వీరయ్య, ఆర్. సుదర్శనరావులను ఈ కమిటీలో నియమించవచ్చని తెలుస్తోంది. -
ఖజానా నుంచి వేతనాలివ్వండి
దేవాదాయ కమిటీకి అర్చకులు, ఉద్యోగుల వినతి సాక్షి, హైదరాబాద్: తమకు ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు ఇచ్చేలా సిఫారసు చేయాలని దేవాదాయ చట్ట సవరణకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీకి దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల అర్చకులు, ఉద్యోగులు కోరారు. కమిటీ సభ్యులు వెంకటాచారి, సీతారామారావు, కృష్ణమూర్తి శనివారం దేవాదాయశాఖ కార్యాలయంలో అభిప్రాయసేకరణ నిర్వహించారు. దీనికి పలు ఆలయాల ధర్మకర్తలు, అర్చకులు, ఉద్యోగులు హాజరై పలు సూచనలు అందజేశారు. దేవాలయాలను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఖజానా నుంచి వేతనాలు చెల్లించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ డిమాండ్‌తో ఇటీవల దేవాలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ సమ్మెకు దిగటంతో ప్రభుత్వం దాని పరిశీలనకు ఓ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చట్ట సవరణ కమిటీకి కూడా ఆ అంశాన్ని వివరించి ప్రభుత్వానికి అనుకూలంగా సిఫారసు చేయాల్సిందిగా కోరారు. అర్చక సంఘాల విభేదాలపై అసహనం: అర్చక సంఘాల్లో విభేదాలు, పరస్పర ఆరోపణలపై కమిటీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల గంగు భానుమూర్తి ఆధ్వర్యంలోని అర్చక సంఘం, ఉద్యోగుల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంలో అర్చకుల్లో విభేదాలు రచ్చకె క్కాయి. సమ్మెను ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలోని తెలంగాణ అర్చక సంఘం వ్యతిరేకించింది. సమ్మెకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ విభేదాలు తీవ్రమయ్యాయి. కమిటీకి మొదట భానుమూర్తి వర్గం సూచనలు అందజేసింది. ఆ తర్వాత ఉపేంద్ర శర్మ వర్గం తెలిపింది. ఈ సందర్భంగా రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. దీనిపై కమిటీ సభ్యులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
రేపటి నుంచి వైఎస్సార్ సీపీ సమీక్షలు
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వచ్చిన ఫలితాలపై జూన్ 1,2,3 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు. త్రిసభ్య కమిటీ సభ్యులు భూమా నాగిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి రాజమండ్రి, కాకినాడ, రావులపాలెంలలో జరిగే ఈ సమీక్ష సమావేశాలకు హాజరవుతారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపోటములకు దారితీసిన పరిస్థితులపై వారు లోతైన అధ్యయనం, విశ్లేషణ చేస్తారన్నారు. రాజమండ్రి జాంపేట ఉమా రామలింగేశ్వర కళ్యాణమండపంలో ఆదివారం ఉదయం 9 గంటలకు రాజమండ్రి రూరల్, 10 గంటలకు రాజానగరం, 11 గంటలకు అనపర్తి, మధ్యాహ్నం 2 గంటలకు రంపచోడవరం, 3 గంటలకు మండపేట, 4 గంటలకు రామచంద్రపురం, 5.30కు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాలపై సమీక్షిస్తారన్నారు. జూన్ 2న కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు కాకినాడ రూరల్, 10.30కు పెద్దాపురం, 11.30కు ప్రత్తిపాడు, 12.30కు జగ్గంపేట, 3 గంటలకు పిఠాపురం, 4 గంటలకు తుని, 5గంటలకు కాకినాడ సిటీ నియోజకవర్గాలపై సమీక్షిస్తామని చెప్పారు. 3వ తేదీన రావులపాలెం సీఆర్సీలో జరిగే సమీక్షసమావేశంలో ఉదయం 9గంటలకు కొత్తపేట, 10 గంటలకు పి.గన్నవరం, 11కు అమలాపురం, 12కు రాజోలు, 1.30గంటలకు ముమ్మిడివరం నియోజకవర్గాలపై సమీక్షలు జరుగుతాయన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో పాల్గొంటారని చిట్టబ్బాయి తెలిపారు. -
నిర్మాణాత్మక దిశగా...
- ఫలితాలపై నేడు వైఎస్సార్ సీపీ - నిశిత సమీక్ష జిల్లాకొస్తున్న త్రిసభ్య కమిటీ - క్షత్రియ కల్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం - పార్టీ పటిష్టత కోసం అభిప్రాయ సేకరణ సాక్షి ప్రతినిధి, విజయనగరం : సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్ సీపీ శనివారం సమీక్షలు నిర్వహించనుంది. పార్టీ అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరగనున్నాయి. ఊహించిన విధంగా ఫలితాలు రాకపోవడానికి గల కారణాలను కమిటీ సభ్యులు తెలుసుకోనున్నారు. భవిష్యత్‌లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్ట పరచడానికి తీసుకోవలసిన చర్యలపై కూడా నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించనున్నారు. అందరి మనోగతం తెలుసుకుని తదనుగుణంగా ఓ నివేదికను పార్టీ అధిష్టానానికి త్రిసభ్య కమిటీ సమర్పించనుంది. ఉదయం 10 నుంచి రాత్రి ఏడు గంటల వరకూ... జూన్ మొదటి వారంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించనున్న దృష్ట్యా సన్నాహకంగా త్రిసభ్య కమిటీ జిల్లా స్థాయిలో నియోజకవర్గాల వారీగా సమీక్ష చేయనుంది. ఈ కమిటీలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, గాజువాక నియోజకవర్గ నేత తిప్పల నాగిరెడ్డి సభ్యులుగా ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు కూడా సమీక్షలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు నెల్లిమర్ల నియోజకవర్గంతో సమీక్షలు ప్రారంభం కానున్నాయి. 11 గంటకు గజపతినగరం, 12 గంటలకు ఎస్.కోట, మధ్యాహ్నం ఒంటి గంటకు చీపురుపల్లి, 3 గంటలకు కురుపాం, సాయంత్రం 4 గంటల కు సాలూరు, 5 గంటలకు పార్వతీపురం, 6 గంటలకు బొబ్బిలి నియోజకవర్గాల సమీక్ష జరగనుంది. చివరిగా రాత్రి 7 గంటలకు విజయనగరం నియోజకవర్గాన్ని సమీక్షిం చి జయాపజయాలపై కారణాలు విశ్లేషిస్తారు. ఫలితాలపై అన్ని కోణాల్లో... ఎన్నికల ఫలితాలపై త్రిసభ్య కమిటీ నిశితంగా సమీక్షించనుంది. ప్రచార తీరు, అభ్యర్థుల పనితీరు, ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు, నాయకుల పనితీరు తదితర అంశాలపై లోతుగా చర్చించనున్నారు. ఏయే విషయాల్లో వెనుకబడ్డాం, ఎక్కడెక్కడ దెబ్బతిన్నాం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరెవరు పాల్పడ్డారు...తదితర కోణాల్లో కమిటీ ఆరా తీయనుంది. నియోజకవర్గానికి గంట చొప్పున సమీక్ష చేసి తదనంతరం అధిష్టానానికి నివేదిక అందజేస్తారు. ఈ సమీక్షలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు నియోజకవర్గ అభ్యర్థులు, మండల కన్వీనర్లు పాల్గొంటారు. వీరందరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పార్టీ పటిష్టతపై... ఎన్నికల ఫలితాలపైనే కాకుండా పార్టీ పటిష్టతపై కూడా చర్చించనున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక నేతలతో త్రిసభ్య కమిటీ సభ్యులు చర్చించనున్నారు. పార్టీ నిర్మాణం కోసం సమీక్షకు హాజరైన వారందరి అభిప్రాయాన్ని కోరనున్నారు. వారిచ్చే సూచనలు, సలహాలను ఆధారంగా చేసుకుని త్రిసభ్య కమిటీ సభ్యులు అధిష్టానానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని జూన్ మొదటి వారంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షలు చేసి పార్టీ పటిష్టతకు పథక రచన చేయనున్నారు. సమీక్షకు హాజరుకండి : పెనుమత్స ఆహ్వానం అందిన నేతలంతా సమీక్షలకు హాజరు కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు కోరా రు. ఉదయం 10 గంటలకు సమీక్షలు ప్రారంభమవుతాయ ని, ఒక్కొక్క నియోజకవర్గానికి గంట చొప్పున సమయం కేటాయిస్తున్నట్టు చెప్పారు. పార్టీ పటిష్టత కోసం తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. నిర్మాణాత్మకంగా వ్యవహరించేందుకు ఇదొక మంచి అవకాశమని తెలిపారు. -
రేపు వైఎస్సార్ సీపీ త్రిసభ్య కమిటీ రాక
- జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్ష - పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు వెల్లడి బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ ఆదివారం జిల్లాకు రానుంది. మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డిలతో కూడిన ఈ కమిటీ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పార్టీ ఓటమిపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తుందని పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు చెప్పారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులతో కమిటీ సభ్యులు లోతైన విశ్లేషణ చేస్తారన్నారు. పార్టీకి దశదిశ నిర్దేశం చేస్తారని, జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలపై చర్చిస్తారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని బాలరాజు చెప్పారు. మోడి గాలిలో చంద్రబాబు విజయం సాధించారని, అది అతని గొప్పదనం కాదన్నారు. చంద్రబాబు అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వ చ్చాడని విమర్శించారు. చంద్రబాబు తన మొదటి సంతకాన్ని రైతుల రుణాలు మాఫీ ఫైలుపై సంతకం పెట్టి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రుణాలు మాఫీ చేస్తే రైతులు కొత్త రుణాలు తీసుకుని వ్యవసాయం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రైతులు రుణమాఫీపై కోటి ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.