కృష్ణా జలాలపై అదే ప్రతిష్టంభన! | no clarification on krishna board | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాలపై అదే ప్రతిష్టంభన!

Published Thu, Dec 1 2016 2:32 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

కృష్ణా జలాలపై అదే ప్రతిష్టంభన! - Sakshi

కృష్ణా జలాలపై అదే ప్రతిష్టంభన!

నీటి కేటారుుంపులపైతేల్చని కృష్ణా త్రిసభ్య కమిటీ
నీటి వినియోగ లెక్కలపై ఇరు రాష్ట్రాల భిన్న వాదనలు
రేపు మరోమారు భేటీ కావాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్: రబీలో కృష్ణా జలాల విడుదలకు సంబంధించి బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వాటాలకు మించి నీటిని వినియోగించుకున్నారంటూ ఇరు రాష్ట్రాలూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఏమీ తేల్చలేకపోరుున బోర్డు.. మరోసారి భేటీ అవుదామని సూచించడంతో సమావేశం వారుుదా పడింది. బుధవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ ఈఎన్‌సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో భేటీ అరుుంది. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై తీవ్రంగా వాదనలు జరిగారుు.

‘మైనర్’లెక్కలపైనే గొడవంతా..
తొలుత ఇరు రాష్ట్రాలూ తమ అవసరాలను పేర్కొంటూ ఇండెంట్‌ను బోర్డు ముందుం చారుు. తెలంగాణ 103 టీఎంసీల అవసరాలను పేర్కొనగా, ఏపీ 47 టీఎంసీలు కావాలని కోరింది. రబీ అవసరాల దృష్ట్యా నీటి వినియోగానికి అవకాశమివ్వాలని ఇరు రాష్ట్రా లు కోరారుు. అనంతరం ఇప్పటివరకు కృష్ణా లో జరిగిన జలాల వినియోగంపై వాదనలు వినిపించారు. తొలుత తెలంగాణ వాదన వినిపించింది. ‘‘కృష్ణా పరిధిలోని లభ్యత నీటి లో ఏపీ 236.25 టీఎంసీలు, తెలంగాణ 74. 51 టీఎంసీలు వినియోగించారుు. ఇందులో మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణ 24.41 టీఎంసీలు, ఏపీ 15.85 టీఎంసీలు వాడారుు.

ప్రస్తుతం కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో 158.25 టీఎంసీల మేర లభ్యత జలాలున్నారుు. ఇందులో తెలంగాణకు 88.61 టీఎంసీలు, ఏపీకి 69.64 టీఎంసీలు దక్కుతారుు..’’అని వివరించింది. తమకు 201.86 టీఎంసీలు వాడుకునే అవకాశమున్నా 165.77 టీఎంసీలే వాడుకున్నామని.. అదే తెలంగాణ 117.90 టీఎంసీలనే వాడాల్సి ఉన్నా 154 టీఎంసీల నీటిని వాడుకుందని పేర్కొంది. మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణకు 89.15 టీఎంసీల కేటారుుంపులుండగా 68 టీఎంసీల మేర విని యోగించుకుందని.. ఈ లెక్కలను నమోదు చేయకుండా కృష్ణా జలాల్లో అధిక వాటా కొట్టేసేందుకు యత్నిస్తోందని ఆరోపించింది.

ప్రస్తుతం మొత్తం నీటి లభ్యత 130 టీఎంసీల మేర ఉందని... అందులో 102 టీఎంసీలు ఏపీకి, 28 టీఎంసీలు తెలంగాణకు దక్కుతాయని పేర్కొంది. ఏపీ వాదనను తెలంగాణ తిప్పికొట్టింది. మైనర్ ఇరిగేషన్ కింద ఏపీ పేర్కొన్న స్థారుులో నీటి వినియోగం జరగలేదని.. చాలా చెరువుల్లో ఆశించిన స్థారుులో నీరే చేరలేదని స్పష్టం చేసింది. సాధారణ నష్టాలను పక్కనపెడితే 22 టీఎంసీలకు మించి వినియోగం లేదని... అవసరమైతే సంయుక్త కమిటీతో విచారణ చేరుుద్దామని పేర్కొంది.

ఇదే సమయంలో పట్టిసీమ అంశాన్ని కూడా లేవనెత్తింది. పట్టిసీమ కింద ఏపీ 52 టీఎంసీల వినియోగం చేసినా లెక్కల్లో చూపడం లేదేమని నిలదీసింది. ఆ అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున ఆ వినియోగాన్ని లెక్కలోకి చూపలేమని ఏపీ పేర్కొంది. దీనిపై ఇరు రాష్ట్రాలూ వాదనకు దిగడంతో.. బోర్డు కల్పించుకుని శుక్రవారం మరోమారు దీనిపై భేటీ నిర్వహిద్దామని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement