Rabe
-
పంటల బీమాకు కంపెనీల ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల బీమాను అమలు చేసేందుకు కంపెనీలను ఖరారు చేసినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. పంటల బీమా అమలు, పెండింగ్ క్లెయిమ్స్‌పై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019–20 సంవత్సరానికి ఇఫ్కో టోక్యోకు రెండు క్లస్టర్లు, ఏఐసీకి నాలుగు క్లస్టర్లు అప్పగించామన్నారు. అలాగే పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో టమాటా పంటను చేర్చామన్నారు. 2019– 20 ఏడాదిలో ఖరీఫ్, రబీలకు కలిపి 15 రోజుల్లో నోటిఫికేషన్ ప్రకటిస్తామన్నారు. ప్రస్తుత రబీకి నమోదు చేసుకున్న రైతుల పంటలు వడగండ్ల వాన వల్ల దెబ్బతిన్నట్లయితే, విపత్తు సంభవించిన 72 గంటలలో ఇన్సూరెన్స్ కంపెనీలకు తెలియపరచాలన్నారు. 2017–18 ఖరీఫ్, రబీ క్లెయిమ్స్‌ల చెల్లిం పుల నిర్దేశిత గడువు ఈ నెల 20వ తేదీగా నిర్ణయించామన్నా రు. స్థానిక విపత్తుల సమాచారాన్ని నివేదించేందుకు టోల్ ఫ్రీ నంబర్లు ఏఐసీ –18005992594, బజాజ్ అలయెంజ్ –18002095959కు ఫోన్ చేయవచ్చన్నారు. -
సాగు 85 శాతం.. రుణాలు 45 శాతమే!
సాక్షి, హైదరాబాద్: భారీగా పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం రుణాలు అందడం లేదు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకా రం రబీ పంటల సాగు విస్తీర్ణం 85 శాతానికి చేరింది. కానీ రైతులకు బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు లక్ష్యంలో 45.66 శాతమే కావ డం గమనార్హం. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే రబీ సీజన్‌కు.. నవంబర్‌కే రైతులకు రుణాలు అందాలి. కానీ సాగు చివరి దశకు చేరుకుంటున్నా బ్యాంకులు స్పందించట్లేదు. బ్యాంకర్లపై ఒత్తిడి తేవడంలో వ్యవసాయ శాఖ విఫలమవుతుండటంతో రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొం ది. గత ఖరీఫ్‌లో చేతికొచ్చిన పంటలకు తగిన ధర రాక రైతులకు నిరాశే మిగిలింది. బ్యాంకులు కూడా మొండి చెయ్యి చూపిస్తుం డటంతో రైతులు దిగులు పడుతున్నారు. లక్ష్యంలో సగం కూడా ఇవ్వలేదు.. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31,92 లక్షల ఎకరాలు కాగా... 27.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలుకాగా.. 15 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయని వ్యవసాయ శాఖ తాజా నివేదికలో తెలిపింది. అంటే దాదాపుగా పంటల సాగు చివరి దశకు వచ్చిన పరిస్థితుల్లో బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేయడం లేదు. రబీ పంట రుణాల లక్ష్యం రూ.15,901 కోట్లు. కానీ ఇప్పటివరకు ఇచ్చింది రూ.7,261 కోట్లేనని వెల్లడైంది. లక్ష్యంలో సగం కూడా రుణాలు ఇవ్వలేదని స్పష్టమవుతోంది. రైతుల పైనే వడ్డీ భారం రైతుల రుణాలకు సంబంధించి పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల పథకాల కింద ప్రభుత్వం బ్యాంకులకు రూ.321 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీని చెల్లింపులో సర్కారు చేస్తు న్న జాప్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు జారీ చేసి నిధులు మాత్రం విడుదల చేయకపోతుండటంతో.. బ్యాంకులు వడ్డీల సొమ్మును రైతుల నుంచే వసూలు చేస్తున్నాయి. రైతుల నుంచి తీసుకోవద్దని, వడ్డీ సొమ్మును విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపినా.. నిధులు విడుదల చేయలేదు. రుణమాఫీ నిధులను కూడా ప్రభుత్వం నాలుగు విడతలుగా విడుదల చేయడంతో, బ్యాంకులు ఆ రుణాలపై వడ్డీని వసూలు చేశాయి. రూ.లక్షలోపు పంట రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయకూడదు. ప్రభుత్వమే దానిని రీయింబర్స్ చేస్తుంది. బ్యాంకులు రుణాల మంజూరు సమయంలో బుక్ అడ్జస్ట్మెంట్లు చేస్తున్నాయి. కొత్త అప్పు మంజూరు చేస్తూనే.. పాత అప్పును, వడ్డీని రికవరీ చేస్తాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ భారం తమపైనే పడుతుండటం, బ్యాం కులు రుణాలివ్వకుండా ఇబ్బందిపెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
రబీ వరి నాట్లు 2 శాతమే..!
వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి నాట్లు ఇంకా ఊపందుకోలేదు. రబీలో వరి సాధా రణ సాగు విస్తీర్ణం 13.32 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 30 వేల ఎకరాల్లో(2 శాతం) మాత్రమే వరినాట్లు పడ్డాయని తెలంగాణ వ్యవసాయ శాఖ బుధవారం విదుదల చేసిన నివేదికలో వెల్లడించింది. సెప్టెంబర్‌లో అధిక వర్షాలు కురిసినా.. జలాశయాలు, వాగులు వంకలు, చెరువుల్లోకి నీరు వెల్లు వెత్తినా.. భూగర్భ జలాలు పెరిగినా ఇంకా వరినాట్లు ఊపందుకోకపోవడం గమనార్హం. అయితే వరిసాగు విస్తీర్ణం సాధారణం కంటే అధికంగా ఉంటుందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇంకా సమయం ఉందని.. కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండబోదని ఆయన పేర్కొనడం విశేషం. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం మొత్తం అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 30.20 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 10.05 లక్షల ఎకరాల్లో(33%) పంటల సాగు జరిగింది. అందులో శనగ సాగు విస్తీర్ణం అత్యధికంగా 115 శాతం కావడం విశేషం. రబీలో శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.11 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 2.52 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. మొత్తం అన్ని రకాల పప్పుధాన్యాల సాగు 97 శాతం ఉంది. రబీలో పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.17 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 3.07 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నూనె గింజల్లో వేరుశనగ సాగు సాధారణ విస్తీర్ణం 3.8 లక్షల ఎకరాలు కాగా.. 3.37 లక్షల ఎకరాల్లో(89%) సాగైంది. ఇదిలావుండగా రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడంతో రెండు నెలలుగా ఈ పరిస్థితి నెలకొంది. -
కృష్ణా జలాలపై అదే ప్రతిష్టంభన!
-
కృష్ణా జలాలపై అదే ప్రతిష్టంభన!
• నీటి కేటారుుంపులపైతేల్చని కృష్ణా త్రిసభ్య కమిటీ • నీటి వినియోగ లెక్కలపై ఇరు రాష్ట్రాల భిన్న వాదనలు • రేపు మరోమారు భేటీ కావాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రబీలో కృష్ణా జలాల విడుదలకు సంబంధించి బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వాటాలకు మించి నీటిని వినియోగించుకున్నారంటూ ఇరు రాష్ట్రాలూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఏమీ తేల్చలేకపోరుున బోర్డు.. మరోసారి భేటీ అవుదామని సూచించడంతో సమావేశం వారుుదా పడింది. బుధవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ ఈఎన్సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో భేటీ అరుుంది. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై తీవ్రంగా వాదనలు జరిగారుు. ‘మైనర్’లెక్కలపైనే గొడవంతా.. తొలుత ఇరు రాష్ట్రాలూ తమ అవసరాలను పేర్కొంటూ ఇండెంట్‌ను బోర్డు ముందుం చారుు. తెలంగాణ 103 టీఎంసీల అవసరాలను పేర్కొనగా, ఏపీ 47 టీఎంసీలు కావాలని కోరింది. రబీ అవసరాల దృష్ట్యా నీటి వినియోగానికి అవకాశమివ్వాలని ఇరు రాష్ట్రా లు కోరారుు. అనంతరం ఇప్పటివరకు కృష్ణా లో జరిగిన జలాల వినియోగంపై వాదనలు వినిపించారు. తొలుత తెలంగాణ వాదన వినిపించింది. ‘‘కృష్ణా పరిధిలోని లభ్యత నీటి లో ఏపీ 236.25 టీఎంసీలు, తెలంగాణ 74. 51 టీఎంసీలు వినియోగించారుు. ఇందులో మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణ 24.41 టీఎంసీలు, ఏపీ 15.85 టీఎంసీలు వాడారుు. ప్రస్తుతం కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో 158.25 టీఎంసీల మేర లభ్యత జలాలున్నారుు. ఇందులో తెలంగాణకు 88.61 టీఎంసీలు, ఏపీకి 69.64 టీఎంసీలు దక్కుతారుు..’’అని వివరించింది. తమకు 201.86 టీఎంసీలు వాడుకునే అవకాశమున్నా 165.77 టీఎంసీలే వాడుకున్నామని.. అదే తెలంగాణ 117.90 టీఎంసీలనే వాడాల్సి ఉన్నా 154 టీఎంసీల నీటిని వాడుకుందని పేర్కొంది. మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణకు 89.15 టీఎంసీల కేటారుుంపులుండగా 68 టీఎంసీల మేర విని యోగించుకుందని.. ఈ లెక్కలను నమోదు చేయకుండా కృష్ణా జలాల్లో అధిక వాటా కొట్టేసేందుకు యత్నిస్తోందని ఆరోపించింది. ప్రస్తుతం మొత్తం నీటి లభ్యత 130 టీఎంసీల మేర ఉందని... అందులో 102 టీఎంసీలు ఏపీకి, 28 టీఎంసీలు తెలంగాణకు దక్కుతాయని పేర్కొంది. ఏపీ వాదనను తెలంగాణ తిప్పికొట్టింది. మైనర్ ఇరిగేషన్ కింద ఏపీ పేర్కొన్న స్థారుులో నీటి వినియోగం జరగలేదని.. చాలా చెరువుల్లో ఆశించిన స్థారుులో నీరే చేరలేదని స్పష్టం చేసింది. సాధారణ నష్టాలను పక్కనపెడితే 22 టీఎంసీలకు మించి వినియోగం లేదని... అవసరమైతే సంయుక్త కమిటీతో విచారణ చేరుుద్దామని పేర్కొంది. ఇదే సమయంలో పట్టిసీమ అంశాన్ని కూడా లేవనెత్తింది. పట్టిసీమ కింద ఏపీ 52 టీఎంసీల వినియోగం చేసినా లెక్కల్లో చూపడం లేదేమని నిలదీసింది. ఆ అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున ఆ వినియోగాన్ని లెక్కలోకి చూపలేమని ఏపీ పేర్కొంది. దీనిపై ఇరు రాష్ట్రాలూ వాదనకు దిగడంతో.. బోర్డు కల్పించుకుని శుక్రవారం మరోమారు దీనిపై భేటీ నిర్వహిద్దామని సూచించింది. -
పంట రుణం... అయోమయం!
లక్ష్యానికి దూరంగా రబీ రుణాల పంపిణీ ►లక్ష్యం రూ.1444 కోట్లు.. ►ఇచ్చింది రూ.305.54 కోట్లు ►అదును దాటుతున్నా 20.94 శాతమే పంపిణీ ► రుణాలకు పెద్ద నోట్ల రద్దు దెబ్బ సాక్షి, కరీంనగర్ : సాగునే నమ్ముకున్న రైతులకు పంటరుణాల విషయంలో ఈసారి కూడా అష్టకష్టాలు తప్పడం లేదు. రబీ సీజన్ ఆరంభం కావడంతో పెట్టుబడులకు డబ్బులు లేక రైతన్నలు సతమతం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రూ.1448 కోట్లను 2.93 లక్షల మంది రైతులకు అందజేసినట్లు అధికారులు చెప్తున్నా రు. అరుుతే క్షేత్రస్థారుులో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నారుు. పంట రుణమాఫీ, రుణాల రీ షెడ్యూల్ పోను రైతుల చేతికి అందింది అంతంతమాత్రమే అంటున్నారు. రబీ సీజన్లో రూ.1444.20 కోట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగ్గా... కరీంనగర్‌తో పాటు రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో రబీ పంటరుణాల లక్ష్యం ఇప్పటికీ రూ.20.94 శాతం దాటలేదు. స్కేల్ ఆఫ్ ఫైనాన్సకు మంగళం వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం రుణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించింది. వ్యవసాయశాఖ అంచనాల మేరకు జిల్లా అధికారులు రుణా లు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల పరిధిలోని 423 బ్రాంచిలలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ.2900 కోట్లు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబర్ చివరి, అక్టోబర్ మొదటి వారం నుంచి పంపిణీ చేయాల్సిన రుణాలను అక్టోబర్ చివరి వారంలో మొదలెట్టారు. బ్యాంకర్లు ఇప్పటివరకు రూ.305.54 కోట్లు మాత్రమే ఇవ్వగా.. రబీ రుణలక్ష్యం 20.94 శాతంగా ఉంది. పంట ల రుణాలను కనిష్టంగా, గరిష్టంగా ఎకరానికి ఎంత ఇవ్వచ్చన్న ప్రతిపాదనలను సైతం అక్కడక్కడ బ్యాంకర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నారుు. పంటలపై ఇచ్చే రుణ మొత్తం (స్కేల్ ఆఫ్ పైనాన్స) విధానాన్ని పాటించడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో సూచించిన విధంగా మొక్కజొన్నకు ఎకరానికి రూ.20వేలు, వేరుశనగకు రూ.18వేలు, పొద్దుతిరుగుడుకు రూ.13 వేలు, వరి ఎకరానికి రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పంట రుణం ఇవ్వాల్సి ఉండగా... ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నారు. రైతులకు అందని రుణమాఫీ పంటరుణాల సంగతి ఇలావుంటే.. రుణమాఫీ, రీషెడ్యూల్‌పైన స్పష్టత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అధికారులు, బ్యాంకర్ల వైఖరి నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం, స్పష్టతపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. అధికారులు, బ్యాంకర్లు చెప్తున్న గణాంకాల ప్రకారం రుణమాఫీ కింద 3,74,632 మంది రైతులకు రూ.1662.52 కోట్ల పంటరుణాలు మాఫీ కావాల్సి ఉంది. ఇందులో మొదటి విడతగా 2014-15లో రూ.415.632 కోట్లు, రెండో విడతగా 2015-16లో 12.5 శాతం చొప్పున రెండుమార్లు రూ.416 కోట్లు మాఫీ చేశారు. మూడో విడత మరో రూ.415 కోట్లు విడుదలైనట్లు చెప్తున్నా... చాలామంది రైతులు తమ ఖాతాల్లో ఇంకా జమ కాలేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి రుణమాఫీ అమలు, రీ షెడ్యూల్ చేయడం, లక్ష్యాల మేరకు పంటరుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. పెద్దనోట్ల రద్దు దెబ్బ పంట రుణాల విషయంలో ఐదారు రోజులుగా పెద్దనోట్ల రద్దు అంశం కూడా ప్రతిబంధకంగా మారిందని రైతులు చెప్తున్నారు. ‘మాకు ఇప్పటివరకు బ్యాంకు రు ణాలు అందలేదు. పెద్దనోట్ల రద్దుతో పంటరుణాలు ఇవ్వాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలని బ్యాంకర్లు అం టున్నారు. దీనికితోడు పెద్ద నోట్లతో గందరగోళం ఏర్పడింది. మార్కెట్లో నలభై క్వింటాళ్ల వరిధాన్యాన్ని విక్రరుుంచాను. వాళ్లు డబ్బులు ఇచ్చేది ఎప్పుడో.. నేను తీసుకునేది ఎప్పుడో. మా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రా మానికి చెందిన రైతు బోగ రామస్వామి పేర్కొన్నాడు. -
తెలంగాణలో రైతుల విత్తన దీక్ష
-
విత్తన దీక్ష
పోలీసు పహారా మధ్య పంపిణీ.. రాత్రంతా కేంద్రాల వద్దే జాగరణ ఓచోట చలిమంట వేసుకొని నిద్ర కాస్తున్నారు.. ఇంకోచోట అక్కడే నిద్రపోతున్నారు.. మరోచోట ఇలా బారులు తీరి కనిపిస్తున్నారు.. అవును వీరంతా రైతులు! గింజ దశ నుంచే కష్టాలను కావలించుకొని ‘విత్తన దీక్ష’ చేస్తున్న కష్టజీవులు!! కామారెడ్డి జిల్లాలోని పలు విత్తన విక్రయ కేంద్రాల ముందు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. సబ్సిడీ శనగ విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సాక్షి, కామారెడ్డి: రబీలో శనగ విత్తనాల కోసం రైతాంగం విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని చాలా మండలాల్లో విత్తనాల కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా బారులుదీరుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో శనగ విత్తనాలకు భారీగా డిమాండ్ ఉంది. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో శనగ విత్తనాల కోసం భారీగా రైతులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జుక్కల్, మద్నూర్ మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మద్నూర్ మండల కేంద్రంలో విత్తనకేంద్రం వద్దే శుక్రవారంరాత్రి రైతులు పడిగాపులు కాశారు. కొందరు చలి మంట వేసుకొని నిద్ర కాస్తే.. ఇంకొందరు అక్కడే నిద్రించారు. మహిళారైతులు సైతం విత్తనాల కోసం కేంద్రాల వద్దకు వచ్చారు. బహిరంగ మార్కెట్లో శనగ విత్తనాలు క్విం టాలు రూ.13 వేలు ధర పలుకుతోంది. ప్రభుత్వం 39 శాతం రాయితీపై అందిస్తోంది. దీంతో రైతులు ఇలా విత్తన పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక్కో పాస్‌బుక్‌పై రెండు బ్యాగుల విత్తనాలే ఇవ్వడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు ఎకరాలభూమి ఉందని చెబుతున్నా, రెండు ఎకరాలకే సరిపడా విత్తన బ్యాగులు ఇస్తుండడంతో సగం భూమి అలికి, మిగిలిన సగం విత్తనాల కోసం బహిరంగ మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడంతో కొందరు రైతులకు దళారులు ఆశపెట్టి వారి పాస్‌బుక్‌లపై విత్తనాలు తీసుకొని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. తానూరులో పోలీసు బందోబస్తు మధ్య.. తానూరు: నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం లో శనివారం శనగ విత్తనాల పంపిణీ పోలీసు బందోబస్తు మధ్య జరిగింది. విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచే బారులుదీరి గంటల తరబడి నిరీక్షించారు. విత్తనాలు అందక కొందరు నిరాశతో వెనుదిరిగారు. విత్తనాలు అవసరం లేని ఇక్కడి రైతులు కొందరు మహా రాష్ట్రలోని తమ సంబంధీకులకు పట్టా పుస్తకాలు ఇస్తున్నారు. దీంతో వారు ఇక్కడికి వచ్చి సబ్సిడీ విత్తనాలు పొందుతున్నారు. మరి కొం దరు ఇక్కడ సబ్సిడీపై రూ.1,600కు పొం దిన విత్తనాలను మహారాష్ట్ర రైతులకు రూ.2,200కు అమ్ముకుంటున్నారు. దీంతో సరిహద్దులో అధి కారులు, పోలీసులు నిఘా పెట్టారు. శనివారం అక్రమంగా తరలిస్తున్న 22 సబ్సిడీ శనగ విత్తనాల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. -
విత్తు జాడేది?
► పుష్కలంగా నీళ్లున్నా రైతన్నను వేధిస్తున్న విత్తన కొరత ► 4.88 లక్షల క్వింటాళ్ల సరఫరా లక్ష్యం.. అందింది 30 వేల క్వింటాళ్లే ► విత్తనాలు దొరక్క రైతుల కష్టాలు.. రబీ సన్నద్ధతలో వ్యవసాయ శాఖ విఫలం సాక్షి, హైదరాబాద్: పుష్కలంగా వానలు పడ్డాయి.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి.. భూగర్భ జలాలు పైకి వచ్చాయి.. రబీకి గత పదేళ్ల కాలంలో ఇంతటి సానుకూల పరిస్థితి ఎప్పుడూ లేదంటున్నారు.. కానీ ఏం లాభం..? వ్యవసాయశాఖ అందుకు తగ్గట్లుగా సన్నద్ధం కాలేదు. దీంతో రబీ సీజన్ మొదలై 25 రోజులు కావొస్తున్నా విత్తు జాడ కానరావడం లేదు. వేరుశనగ, శనగ, వరి, కంది, మినుములు, మొక్కజొన్న వంటి విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. పలుచోట్ల రోడ్డెక్కుతున్నారు. రబీకి అన్ని రకాల విత్తనాలు 4.88 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఇప్పటివరకు విక్రయ కేంద్రాల్లో 66,993 క్వింటాళ్లు సిద్ధంగా ఉంచారు. అందులో 30,634 క్వింటాళ్లు మాత్రమే రైతులకు సరఫరా చేశారు. గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు. అదను తప్పితే అంతే.. ఈ నెల ఒకటో తేదీ నుంచే వివిధ రకాల పంటల సాగు మొదలు పెట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచిం చింది. అందుకు సంబంధించి రబీ సీజన్ పం టల సాగు కేలండర్‌ను గత నెలలోనే విడుదల చేసింది. పంటలు వేయాల్సిన గడువు తేదీలను (కట్ ఆఫ్) ప్రకటించింది. ఆ ప్రకారం వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పెసర పంటలను ఈ నెల ఒకటో తేదీ నుంచే వేయడం ప్రారంభించాలి. కానీ వేరుశనగ, శనగ, మొక్కజొన్న, పెసర విత్తనాలను అవసరం మేరకు రైతులకు అందించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 1.58 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను రైతులకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు విక్రయ కేంద్రాల్లో 35,172 క్విం టాళ్లే సిద్ధంగా ఉంచారు. అందులో 17,116 క్వింటాళ్లే రైతులకు సరఫరా చేశారు. 1.22 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు విక్రయ కేం ద్రాలకు 18,363 క్వింటాళ్లు మాత్రమే చేరాయి. అందులో రైతులకు 13,145 క్వింటాళ్లే సరఫరా చేశారు. 3,800 క్వింటాళ్ల పెసర విత్తనాలకు గాను.. విక్రయ కేంద్రాల్లో కేవలం 493 క్వింటాళ్లే సిద్ధంగా ఉన్నాయి. అందులో 187 క్వింటాళ్లు మాత్రమే రైతులకు అందజేశారు. మొక్కజొన్న 24 వేల క్వింటాళ్లకుగాను ప్రభుత్వం ఒక్క క్వింటాలు కూడా సరఫరా చేయడం లేదు. వేరు శనగ, శనగకు మించిన సమయం ఉత్తర తెలంగాణలో వేరుశనగ, పెసర పం టలను ఈ నెల 20 వరకు వేసుకోవచ్చని.. దక్షిణ తెలంగాణలో మాత్రం వేరుశనగను నవంబర్ 15వ తేదీ వరకు వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. ఉత్తర తెలంగాణలో వేరుశనగ, శనగ వేయడానికి సమయం మించిపోయింది. అదను కూడా తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విత్తనాలను ఇంకెప్పుడు సరఫరా చేస్తారో అంతుబట్టడంలేదు. అవసరమైన సమయంలో సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయకపోవడంపై రైతులు నిలదీస్తున్నారు. -
4.24 లక్షల ఎకరాల్లో పంట నష్టం
- జిల్లాల్లో పర్యటించిన బృందాల ప్రాథమిక నివేదిక - 222 మండలాల్లో.. దాదాపు రూ.1,000 కోట్ల నష్టం సాక్షి, హైదరాబాద్: కుండపోత వర్షాలతో ఓవైపు రబీపై ఆశలు నెలకొనగా.. మరోవైపు ఇవే వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడం, చెరువులు, కుంటలు మత్తడి దూకడంతో లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 4.24 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల బృందాలు ప్రాథమిక అంచనా వేశాయి. పూర్తి స్థాయి నష్టం అంచనాకు కసరత్తు చేస్తున్నాయి. ప్రాథమిక నివేదిక ఇచ్చిన బృందాలు భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ ప్రతి జిల్లాకు ఒక రాష్ట్రస్థాయి అధికారుల బృం దాన్ని పంపింది. ఆ బృందాలు 3 రోజుల పాటు పర్యటించి.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించాయి. ఆ నివేదిక మేరకు రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో 4.24 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం మినహా 8 జిల్లాల్లోని 222 మండలాల్లో పంటలకు ఎక్కువ నష్టం జరిగింది. సోయాబీన్, వరి, పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయి. అత్యధికంగా సోయాబీన్ పంటకు 1.79 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పత్తి 98,025 ఎకరాల్లో దెబ్బతింది. 78,351 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. కంది 20,578 ఎకరాల్లో, మొక్కజొన్న 23,101 ఎకరాల్లో, జొన్న 11,273 ఎకరాల్లో నీటి పాలయ్యాయి. ఇక అక్కడక్కడా పెసర, మిరప, చెరకు, ఆముదం, పొగాకు పంటలు కూడా దెబ్బతిన్నాయి. రూ. 1,000 కోట్లకుపైగా నష్టం.. వ్యవసాయ నిపుణులు వేస్తున్న అంచనాల ప్రకారం రైతులకు దాదాపు రూ.1,000 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అత్యధికంగా నిజా మాబాద్ జిల్లాలో 1.83లక్షల ఎకరాల్లో, రంగారెడ్డి జిల్లాలో 44,182 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంటలు పూర్తిగా దెబ్బతినడంతోపాటు నీటిలో ఎక్కువ రోజులు ఉండడంతో జరిగే దిగుబడి నష్టం కలిపి ఈ స్థాయి లో నష్టం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిపై ఇంకా పూర్తిస్థాయి అంచనా వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది బ్యాంకులు ఖరీఫ్ రుణాలు ఇవ్వడంలో మీనమేషాలు లెక్కించడం, ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయకపోవడంతో రైతులు అప్పు లు చేసి పంటలు వేశారు. కానీ చేతికొచ్చే పంట నీట మునగడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
పంట రుణ లక్ష్యం 29,101 కోట్లు
⇒ ఖరారు చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ⇒ ఖరీఫ్‌కు రూ.17,460 కోట్లు.. రబీకి రూ.11,640 కోట్లు ⇒ అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రూ. 4,686 కోట్లు ⇒ మొత్తం రాష్ట్ర రుణ ప్రణాళిక లక్ష్యం రూ.90,776 కోట్లు ⇒ విద్య, గృహ రంగాలకు గతం కంటే తక్కువ రుణాలు హైదరాబాద్: 2016-17 ఖరీఫ్, రబీ సీజన్లలో రూ.29,101 కోట్ల పంట రుణాలివ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. అందులో ఖరీఫ్‌కు రూ.17,460 కోట్లు, రబీకి రూ.11,640 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది పంట రుణాల లక్ష్యం రూ.27,800 కోట్లు కాగా.. ఈసారి కాస్త పెంచారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రూ. 4,686 కోట్లు కేటాయించారు. ఇక వ్యవసాయ టర్మ్ రుణాలకు రూ.9,202 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2,708 కోట్లు కేటాయించారు. మొత్తంగా ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ. 41,012 కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర బ్యాంకర్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 2016-17 తెలంగాణ రాష్ట్ర రుణ ప్రణాళికను గురువారం జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విడుదల చేశారు. వ్యవసాయం సహా ఇతర అన్ని రంగాలకు కలిపి రాష్ట్ర రుణ ప్రణాళిక లక్ష్యం రూ.90,776 కోట్లుగా ఎస్ఎల్బీసీ ప్రకటించింది. గతేడాది రూ.78,776 కోట్లు కాగా.. ఈసారి 15.23 శాతం పెంచారు. మరోవైపు ఈసారి చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, విద్య, గృహ రంగాలకు రుణాలను తగ్గించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు గతేడాది రూ.11,020 కోట్లు కేటాయిస్తే... ఈసారి రూ.10,807 కోట్లకే పరిమితం చేశారు. గతేడాది విద్యా రుణాల లక్ష్యం రూ. 864 కోట్లు కాగా.. ఈసారి రూ.731 కోట్లకు తగ్గించారు. గతేడాది గృహ రుణాల లక్ష్యం రూ.2,306 కోట్లు కాగా.. ఈసారి రూ.2,189 కోట్లకు తగ్గించారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 2,185 కోట్లు వ్యవసాయ టర్మ్ రుణాలు, సాగు అనుబంధ రంగాలకు రూ.11,911 రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకర్లు వ్యవసాయానికి కూలీల కొరత కారణంగా వ్యవసాయ యాంత్రీకరణలో పెట్టుబడులు పెట్టే వారికి 2,185 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రీన్హౌస్, కూరగాయల సాగుకు రూ.2,082 కోట్లు కేటాయించారు. కోళ్ల పరిశ్రమకు రూ.788 కోట్లు కేటాయించారు. శ్వేత విప్లవానికి రూ.2,105 కోట్లు, గొర్రెలు, మేకలు, మత్స్య రంగాలకు రూ. 811 కోట్లు కేటాయించారు. కాగా, పంట రుణాల్లో అత్యధికంగా వరి సాగు చేసే రైతులకు రూ.12,740 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చిరుధాన్యాల సాగుకు రూ.1,366 కోట్లు, పప్పుధాన్యాల సాగుకు రూ.857 కోట్లు, పత్తి రైతులకు రూ.7,087 కోట్లు కేటాయించారు. -
కొంప ముంచిన కల్తీ విత్తనాలు
► రబీ వరి చేపడితే ఊదగడ్డి పుట్టుకొచ్చింది ► ఎకరా భూమిలో పంట నష్టపోయిన రైతు మునగపాకః రబీ వరి విత్తనాల్లో కల్తీలు అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చాయి. మండలంలోని చూచుకొండకు చెందిన రైతు పెంటకోట రామసత్యనారాయణ పరిస్థితి ఇందుకు తార్కాణం. రూ. 35వేలు నష్టపోయాడు. రబీ వరిసాగుకు రైతు గతేడాది డిసెంబర్లో అధికారుల సూచనల మేరకు ఎకరా విస్తీర్ణంలో పంటను చేపట్టేందుకు 1010 రకం వరి విత్తనాలు 30కిలోల బస్తా రూ.780లకు కొనుగోలు చేశారు. సాధారణంగా వరిలో 5శాతం మేర ఊదగడ్డి పుట్టుకొస్తుంది. కానీ రబీ వరిలో 95శాతం ఊదగడ్డి పుట్టుకొచ్చింది. వెంటనే రైతు అధికారులను ఆశ్రయించాడు. శాస్త్రవేత్తల బృందం పంటను పరిశీలించింది. విత్తనం కల్తీ అయినట్టు గుర్తించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రైతుకు న్యాయం చేస్తామని స్థానిక వ్యవసాయాధికారులు రైతుకు హామీఇచ్చారు. కల్తీ విత్తనం కారణంగా రూ.35వేలు నష్టం వాటిల్లినట్టు రైతు వాపోతున్నాడు. ఇదే విషయాన్ని వ్యవసాయాధికారి పావని వద్ద ప్రస్తావించగా అక్కడక్కడ బ్యాగ్‌లలో కల్తీ విత్తనాలు వస్తున్నాయని, దీనిని ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు. -
అడవి పందుల వేట
పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేతకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎనిమిది మంది షూటర్లతో కూడిన ప్యానెల్‌ను నియమిస్తూ అటవీ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ షూటర్ల ఎంపిక పకడ్బందీగా జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుభవం లేనివారికి ఈ ప్యానెల్లో చోటు కల్పించారనే విమర్శలున్నాయి. కదిలే వన్య ప్రాణులను కాల్చడం ప్రత్యేక నిపుణులకే సాధ్యమవుతుంది. అనుభవం లేని వారు, శిక్షణ తీసుకోని వారితో ఈ వేట ప్రారంభిస్తే అటవీ ప్రాంతంలోని ఇతర వన్య ప్రాణుల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అటవీ పందులతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి, తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పంటలు సాగు చేస్తే.. అవి చేతికందే సమయంలో అడవి పందులు రాత్రికి రాత్రి పంటను నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా పంటలు కొతకొచ్చే దశలో వీటి దాడి తీవ్రంగా ఉంటోంది. దీంతో కళ్లముందే పంట పందుల పాలవుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కేవలం రిజర్వు ఫారెస్టు సమీప గ్రామ శివారుల్లోనే కాకుండా, మైదాన ప్రాంతాల్లో కూడా ఈ అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో వందలాది ఎకరాలు పందుల పాలవుతోంది. పంటను పాడు చేయడమే కాకుండా, ఒక్కోసారి పంటకు కాపలాగా ఉన్న రైతులపై కూడా పందులు దాడిచేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఈ సమస్య తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం అడవి పందుల కాల్చివేతకు అనుమతుల అంశాన్ని పరిశీలించింది. వీటిని కాల్చివేసేందుకు అటవీశాఖ ఉన్నతాధికారులు లెసైన్సు ఉన్న ఆయుధాలు కలిగిన షూటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు ఎనిమిది మంది సభ్యుల ప్యానెల్‌ను తయారు చేస్తూ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎ.కె.శ్రీవాత్సవ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎనిమిది మందిలో నలుగురు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌కు చెందిన వారుండగా, మరో నలుగురు సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు. వీరంతా ఉచితంగా వేటాడేందుకు ముందుకొచ్చారు. అయితే ఈ షూటర్ల ఎంపిక పకడ్బందీగా జరగలేదనే విమర్శలున్నాయి. కదలకుండా ఉండే లక్ష్యాన్ని షూట్ చేయడంలో శిక్షణ పొందిన వారిని షూటర్లుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిలో కొందరికి పరిగెత్తే అడవి పందులను కాల్చడంలో పెద్దగా అనుభవం లేనట్లు సమాచారం. ఆయా అటవీ డివిజన్ పరిధిలో అటవీ పందుల దాడి తీవ్రంగా ఉన్న గ్రామాలను వెంటనే గుర్తించి, వాటి కాల్చివేతకు తగిన చర్యలు చేపట్టాలని అటవీ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందాయి. ఈ మేరకు జిల్లాలోని అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ పులుల అభయారణ్యం పరిసర గ్రామాల శివారుల్లో ఈ అడవి పందుల దాడి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా బీర్సాయిపేట్, ఖానాపూర్ రేంజ్ పరిధిలోని పలు గ్రామాల్లో తరచూ అటవీ పందులు దాడి చేస్తున్నాయి. నిపుణులనే ఎంపిక చేశారు.. అడవి పందుల కాల్చివేతకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిపుణులనే షూటర్లుగా ఎంపిక చేయడం జరిగింది. లెసైన్సు కలిగి ఆయుధాలున్న వారినే గుర్తించాం. వీటిని వేటాడేందుకు వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కొందరికి హిమాచల్ ప్రదేశ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. - సంజయ్‌కుమార్ గుప్తా కవ్వాల్ టైగర్‌జోన్ ఫీల్డ్ డెరైక్టర్ -
చిక్కిన ‘రబీ’
ముగిసిన సీజన్ 50 శాతానికి మించిన వరిసాగు లక్ష్యానికి మించి అపరాల సాగు గతేడాదితో పోలిస్తే తగ్గిన విస్తీర్ణం విశాఖపట్నం: ‘రబీ’ చిక్కింది. గత నాలుగైదేళ్లుగా ఖరీఫ్‌తో పోలిస్తే రబీ సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. తొలి‘పంట’ పండినప్పటికీ రెండో పంటకొచ్చే సరికి వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడం.. సాగునీటి వనరులు తగ్గిపోవడంతో రైతు రబీ సాగుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. లక్ష్యానికి దూరంగా.. జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 38,961 హెక్టార్లు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఊహించని దిగుబడులు రావడంతో అదే ఊపుతో రబీలో కూడా సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయశాఖ లక్ష్యాలను ఎంచుకుంది. ఈ ఏడాది 45వేల హెక్టార్లలో రబీ సాగు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఆ మేరకు అవసరమైన విత్తనాలు కూడా ద్ధం చేశారు. కానీ నవంబర్ వరకు అడపాదడపా పలుకరించిన వరుణుడు ఆ తర్వాత పూర్తిగా ముఖం చాటేశాడు. గతేడాది 37,618 హెక్టార్లలో రబీ సాగవగా, ఈ ఏడాది 36వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది. నాట్లు వేసే డిసెంబర్ నెలలో చినుకు కూడా రాలక పోవడంతో సాగునీటి వనరుల కింద తప్ప వరిసాగు చేసేందుకు రైతులు సాహసించలేకపోయారు. రబీలో సాధారణ వరి విస్తీర్ణం 5,784 హెక్టార్లు కాగా ఈ ఏడాది కనీసం ఆరున్నరవేల హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మరో రెండ్రోజుల్లో సీజన్ ముగుస్తుండగా కేవలం 3,009 హెక్టార్లలో మాత్రమే వరిసాగైంది. కొన్ని పంటలపైనే ఆసక్తి మొక్కజొన్న, రాగులు, కందులు, జొన్న, అపరాల్లో ఉలవలు, అలసందలు సాగు విస్తీర్ణం తగ్గిపోగా, పెసలు, మినుములు, కొమ్ము శెగన,రాజ్మా సాగు విస్తీర్ణం రబీలో ఊహించనిరీతిలో పెరిగింది. మొక్క జొన్న సాధారణ విస్తీర్ణం 1164 హెక్టార్లు కాగా, సాగైంది మాత్రం 1024 హెక్టార్లే. ఉలవలు 1562 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా 1083 హెక్టార్లలో సాగైంది. రాగులు 262 హెక్టార్లకు 144 హెక్టార్లు, జొన్న ఆరు హెక్టార్లకు మూడు హెక్టార్లు, కందులు 23 హెక్టార్లకు 11 హెక్టార్లు సాగైంది. రబీలో అత్యధికంగా రాజ్మా సాగైంది. రబీలో సాధారణ విస్తీర్ణం7,188 హెక్టార్లు కాగా ఈ ఏడాది ఏకంగా 10,755 హెక్టార్లలో సాగైంది. ఆ తర్వాత మినుములు 5583 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగానిర్ణయించగా రబీలో 7,159 హెక్టార్లలో సాగైంది. పెసలు 3488 హెక్టార్లకు 3794 హెక్టార్లలో సాగవగా, కొమ్ము శనగలు 71 హెక్టార్లకు 165 హెక్టార్లలో సాగైంది. రాజ్మాతో సహా అపరాల పంటలు చేతికొచ్చేస్తుండగా.. వరి, మొక్కజొన్న, రాగి, జొన్నలు మాత్రం ఇంకా మొక్కదశలోనే ఉన్నాయి. పూర్తిగా సాగునీటివనరుల కింద వేసిన ఈ పంటలకు ప్రస్తుతానికి నీటి ఇబ్బందుల్లేకున్నప్పటికీ మరో 15-20 రోజుల్లో నీటిఎద్దడి తలెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి. తగ్గిన చెరకు విస్తీర్ణం ఇక జిల్లాలోవాణిజ్య పంటల్లో ప్రధానమైన చెరకు 37,800 హెక్టార్లకు 35వేలహెక్టార్లలోనే సాగైంది. మొత్తమ్మీద అపరాల వరకు ఆశాజనకంగానే రబీలో సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ చెరకు, వరి, మొక్కజొన్న తదితర పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఆందోళన కల్గిస్తోంది. -
ఉపాధి ఊసేది!?
మచిలీపట్నం : జిల్లాలో ఉపాధి హామీ పనులు ఆశించిన మేర ముందుకుసాగడం లేదు. రబీలో పంటల సాగు లేకపోవడంతో లక్షల మంది కూలీలు పనులకోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించకపోవడంతో అవసరమైన వారందరికీ పనులు దొరకని పరిస్థితి నెలకొంది. పనులకు సంబంధించి గ్రామసభల్లో ప్రతిపాదనలు తయారుచేసినా అవి కలెక్టర్ ఆమోదం పొందలేదు. ఈ నేపథ్యంలో పనులను ప్రారంభించే పరిస్థితి లేదు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.192.30 కోట్ల విలువైన పనులను ఉపాధి హామీ పథకంలో చేయాలని నిర్ణయించారు. 64.36 లక్షల పనిదినాలు కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు రూ.93.18 కోట్లు ఖర్చు చేసి 49.22 లక్షల పనిదినాలు కల్పించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. దాళ్వా పంట లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు అందుబాటులో లేవు. చేసేందుకు పని లేక కూలీలు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రతి మండలంలో రోజుకు 300 నుంచి 400 మంది ఉపాధి పనులు చేస్తున్నారని అధికారులు చెబుతున్నా అందరికీ పని కల్పించలేని దుస్థితి ఏర్పడుతోంది. ముందస్తు ప్రణాళిక లేకే.. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో సాగునీటి కొరత ఏర్పడింది. పంటలు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికను రూపొందించలేదు. రెండు పంటలు సాగులో ఉంటే మార్చి నుంచి ఉపాధి పనులను ప్రారంభిస్తారు. ఇదే పద్ధతిని ఈ ఏడాదీ అమలు చేశారు. రబీకి సాగునీరు విడుదల చేయకపోవడంతో డిసెంబర్ నుంచే ఉపాధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. అయినా అధికారులు స్పందించ లేదు. పనులు ప్రారంభించిన మూడు వారాలకు కాని వేతనం కూలీల చేతికి అందని పరిస్థితి ఉంది. ప్రస్తుతం పనులు ప్రారంభించినా పనిచేసిన కూలీలకు వేతనం అందాలంటే మరో 20 రోజులకు పైబడి ఎదురుచూడాల్సిందే. ఉపాధి హామీ పనిలో పంటబోదెలను ఎనిమిది మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు, 20 సెంటీమీటర్ల లోతున మట్టి తీస్తే ఒక్కొక్క కూలీకి రూ.160 నుంచి రూ.190 వరకు వేతనంగా వచ్చే అవకాశం ఉంది. జాబ్ కార్డులు సిద్ధంగానే ఉన్నా.. పనుల కోసం కూలీలు ఎదురుచూస్తున్నా, పనులకు సంబంధించి ఆమోదం లేకపోవడంతో ఉపాధి పనులు మందకొడిగా సాగుతున్నాయి. మొక్కల పెంపకం అంతంతమాత్రమే ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 500 ఎకరాల్లో మామిడి, నిమ్మ, జామ తోటల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాల్లోనే ఈ మొక్కల పెంపకం చేపట్టాలనే నిబంధన విధించారు. మొక్కలు ఇంత వరకు పంపిణీ కాలేదు. ఎప్పటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటారో తెలియని పరిస్థితి. -
వట్టిపోయిన పట్టిసీమ ఆవిరి
పులిచింతలలోనూ నీరు లేదు కృష్ణాడెల్టాలో తాగునీటికి కటకటే రబీ అంటేనే భయపడుతున్న రైతాంగం విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు పడకేసింది. ప్రస్తుతం గోదావరి జలాలు పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణానదిలో కలవడం పూర్తిగా నిలిచిపోయింది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పడిపోవడంతో గోదావరి నదులపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ఆపివేయాలంటూ అక్కడి చీఫ్ ఇంజినీర్ ఆదేశించడంతో తాడిపత్రి, పట్టిసీమ వద్ద ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాలను ఇటీవల నిలుపుదల చేశారు. ప్రస్తుతం గోదావరి నీరు కేవలం గోదావరి డెల్టాకు మాత్రమే సరిపోతుందని, కృష్ణాడెల్టాకు పట్టిసీమ ద్వారా చుక్క నీరు రావడం కష్టమేనని మన ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌కు పట్టిసీమ ద్వారా వచ్చిన నీరు ఇక ఆగిపోయినట్లేనని అంటున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఒక్కరోజు కూడా 1500 క్యూసెక్కులకు మించి నీరు కృష్ణానదికి రాలేదనేది నిష్టుర సత్యం. రబీ ఆశలూ గల్లంతేనా! ఖరీఫ్‌లో ప్రభుత్వం నీరివ్వకుండా చేతులెత్తేయడంతో కృష్ణాడెల్టా రైతులు రబీపై ఆశలు వదులుకున్నారు. బందరు, పెనమలూరు, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో వ్యవసాయాధికారులు మినుము, పెసర విత్తనాలను సరఫరా చేస్తూ రైతుల్ని రబీవైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వానలు కూడా లేనందున మినుము, పెసర విత్తనాలు ఏమేరకు మొలుస్తాయనే అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని, ఇప్పుడు అపరాల వల్ల నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కనీసం ఐదు టీఎంసీల నీరును వదిలిపెట్టాలంటూ కృష్ణా నీటి యాజమాన్య బోర్డును అధికారులు కోరుతున్నారు. ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ నీరు వచ్చి జిల్లాలోని చెరువులు నింపితే రాబోయే మూడు, నాలుగు నెలల్లో కొంతమేరకు నీటి ఎద్దడి తగ్గుతుందని, లేకపోతే గ్రామాల్లో రైతులు, పశువులు నీటి కోసం కూడా విలవిల్లాడాల్సి వస్తుందని ఇంజినీర్లే అంగీకరిస్తున్నారు. కాల్వల మరమతులపై దృష్టి.. ప్రస్తుతం నీరు అందుబాటులో లేకపోవడంతో కాల్వల మరమతులపై ఇరిగేషన్ అధికారులు దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఆపివేసిన కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. బోర్డు నీరిస్తే ఒక విడత చెరువులు నింపి ఆ తర్వాత పనులు ప్రారంభిస్తే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. పులిచింతల సంగతి సరేసరి.. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీరు అడుగంటింది. పులిచింతల జలాశయంలో కేవలం 0.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎనిమిది అడుగుల నీరు మాత్రమే ఉండడంతో ఎన్టీటీపీఎస్కు అవసరమయ్యే నీరు కూడా అందడం లేదు. దీంతో అధికారులు మోటార్లతో నీటిని తోడుకుని ప్లాంట్‌ను నడుపుతున్నారు. ఈ దశలో ప్రకాశం బ్యారేజీ దిగువకు నీరు వదలడం కష్టమని ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్నారు. -
రూ.30 వేల కోట్లతో రుణ ప్రణాళిక
* నాబార్డ్ ప్రతిపాదన * రబీ, టర్మ్ రుణాలూ ఖరారు * జిల్లాల వారీగా కేటాయింపు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తుల పెంపులో కీలక భూమిక పోషించే రుణ ప్రణాళిక ఖరారైంది. ప్రస్తుత ఖరీఫ్ కాలానికి రూ.30,587.59 కోట్ల పంట రుణాలు ఇచ్చేలా ‘నాబార్డ్’ ప్రణాళికను ప్రతిపాదించింది. ఖరీఫ్‌తో పాటు రబీకి, వ్యవసాయానుబంధ రంగాలకు ఇచ్చే కాల పరిమితి (టర్మ్) రుణాలనూ ఖరారు చేసింది. 2015 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ శాఖ ప్రకటించిన వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రూ.69,548 కోట్లను బ్యాంకర్లు రైతులకు రుణాలుగా ఇస్తారు. ఈనెల 29న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో దీనికి ఆమోదముద్ర పడుతుంది. రుణ ప్రణాళిక అమలుకు సహకార సంస్థలు, వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌లో పంట రుణాలుగా రూ.30,587.59 కోట్లు, రబీలో రూ.20,391.73 కోట్లు, వ్యవసాయానుబంధరంగాలు సహా కాల పరిమితి రుణాలుగా రూ.18,569.51 కోట్లు ఇవ్వాలని నాబార్డ్ ప్రతిపాదించింది. ఏయే జిల్లాలకు ఎంతెంత మొత్తంలో కేటాయించిందీ ప్రకటించింది. ఈ ఏడాదికీ పావలా వడ్డీ.. చిన్న, సన్నకారు రైతులు రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల లోపు తీసుకునే రుణానికి పావలా వడ్డీ ఈ ఏడాది కూడా వర్తిస్తుంది. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. నిర్ణీత గడువులోపు చెల్లించే రైతులు 3 శాతం వడ్డీని చెల్లిస్తే మిగతా మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.పది కోట్లను కేటాయించింది. వడ్డీ లేని రుణాలకు.. : రూ.లక్షలోపు రుణం తీసుకునే కౌల్దారులు, సన్నకారు రైతులు.. రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే ఎటువంటి వడ్డీని బ్యాంకులు వసూలు చేయవు. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.17.2 కోట్లను కేటాయించింది. ఈ పథకాలన్నింటికీ టీడీపీ ప్రభుత్వ రుణమాఫీ పెద్ద ఆటంకంగా నిలిచింది. కొత్తరుణాలు ఇవ్వలేమని, కనీసం పాతవాటిని పునరుద్ధరించుకోవడమైనా చేయాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమైనా ఇంతవరకు కొత్త అప్పులు పుట్టకపోవడం రైతుల్ని తీవ్రంగా కుంగదీస్తోంది. దీంతో అనివార్యంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. -
9 గంటలూ పగలే
విద్యుత్‌పై సమీక్షలో సీఎం కేసీఆర్ స్పష్టీకరణ వచ్చే ఏడాది రబీ నుంచి సరఫరా మార్చి నాటికి 3 వేల మెగావాట్ల అదనపు విద్యుత్.. 2016 నాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండదు 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ హైదరాబాద్: వచ్చే ఏడాది రబీకి (రెండో పంట) పగటి వేళల్లోనే 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో 4,320 మెగావాట్ల విద్యుత్ లభ్యత వుందని, వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మరో 3 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని సీఎం పేర్కొన్నారు. అప్పుడు రైతులకే తొలి ప్రాధాన్యత ఇచ్చి పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలన్నారు. 2016 నాటికి తెలంగాణ విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా మారుతుందని, 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుత విద్యుత్ సరఫరా, భవిష్యత్ డిమాండు-సరఫరా, నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మించనున్న కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ తదితర అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ రాజీవ్ శర్మ, ముఖ్యకార్యదర్శి నర్సింగ రావు, జెన్కో సీఎం డీ ప్రభాకర్ రావు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ‘విద్యుత్’ ఆలయాలు నల్లగొండ జిల్లా దామరచర్లలో జెన్కో ఆధ్వర్యంలో 4,400 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన మెగా థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘యాదాద్రి థర్మల్ స్టేషన్’గా ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు. నల్లగొండ జిల్లాలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టకు ఇటీవల ‘యాదాద్రి’గా నామకరణం చేసినందున అదే పేరును దామరచర్ల ప్లాంట్‌కు పెట్టారు. మణుగూరులో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న థర్మల్ ప్లాంట్‌కు ఇదే కోవలో ‘భద్రాద్రి థర్మల్ కేంద్రం’గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా.. పరస్పర భూ మార్పిడి విధానంలో యాదాద్రి ప్లాంట్ నిర్మాణం కోసం దామరచర్ల పరిసరాల్లోని 4,700 ఎకరాల అటవీ భూములను కేటాయిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తానని కేసీఆర్ చెప్పారు. -
అగ్గి సోకితే.. బుగ్గే
దుగ్గొండి : రబీలో నీటి వసతి ఉన్న రైతులు అక్కడక్కడా వరి పంట సాగు చేశారు. కొందరు సా ధారణ రకాలయిన 1010, ఎర్రమల్లెలు, ఐ ఈర్-64 రకాలు సాగు వేయగా మరికొందరు బేయర్, పయనీర్ కంపెనీలకు చెందిన ఆడమగ వరి సాగు చేశారు. ప్రస్తుతం పంట చిరుపొట్టదశ ప్రారంభంలో ఉంది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల అగ్గితెగులు లక్షణాలు కనబడుతున్నాయి. నిర్లక్ష్యం చేస్తే తెగులు ఉధృతి చెంది పంటకు తీవ్ర నష్టం కలుగుతుందని వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెగులు లక్షణాలు-నివారణ చర్యలు వివరించారు. కారణాలు రాత్రిపూట చలి ఉండి పొద్దంతా వేడి వాతావరణం ఉండడం వల్ల అగ్గి తెగులు సోకుతుంది. పంట పెరుగుదల లేదని భావించి కొందరు రైతులు నత్రజనిని మోతాదుకు మించి వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల తెగులు వస్తుంది.నారు పోసే ముందు విత్తనశుద్ధి చేయకపోరుునా.. తెగులు అవశేషాలు ఉన్న విత్తనాలతో నారు పోసినా అగ్గి తెగులు సోకుతుంది. లక్షణాలు వరి ఆకులపై మొదట నూలు కండె ఆకారంలో చిన్న చిన్న మ చ్చలు ఏర్పడతాయి. {Mమేణా మచ్చలు పెద్దగా మారి ఆకు మొత్తం వ్యాపిస్తుంది. ఆకుతో సహా కుదురు ఎండిపోతుంది.తెగులు ఆరంభ దశలో నిర్లక్ష్యంగా ఉంటే వరి గొలుసులు బయటికి వచ్చాక మెడవి రుపు వచ్చి గింజలన్నీ తాలుగా మారిపోయి 70 శాతం దిగుబడి తగ్గిపోతుంది. నివారణ ఆకులపై నూలు కండె మచ్చలు వచ్చినట్లు గమనించగానే లీటరు నీటికి 0.6 గ్రాములు ట్రైసైక్లోజోల్ మందును కలిపి ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి. తెగులు లక్షణాలు గమనించిన వెంటనే నత్రజని వాడకం నిలిపి వేయాలి.నీటిని అధికంగా కాకుండా పలుచగా పెట్టాలి.చౌడు నేలల్లో అధికంగాా అగ్గితెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తీవ్రత తగ్గించు కోవడానికి కూలీల చేత భూమిని కదిలించాలి. దీంతో వేర్లకు గాలి ధారళంగా అంది తెగులు కొంత వరకు తగ్గుతుంది. డాక్టర్ రఘురామిరెడ్డి 99896 25223 -
కన్నీటిపాట్లు
రబీ వరి సాగు కీలక దశకు చేరిన ప్రస్తుత తరుణంలో.. నీరందక గోదావరి డెల్టా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం పైసా కూడా విదల్చకపోవడం.. కీలక సమయంలో నీరందించాలన్న ముందుచూపు లేని నీటిపారుదల శాఖ నిర్వాకం అన్నదాతకు శాపంగా మారాయి. వరి పైరు పాలు పోసుకుంటున్న దశలో చేలకు సమృద్ధిగా నీరందించాల్సి ఉంటుందని తెలిసి కూడా.. అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయలేదు. అమలాపురం :డెల్టాలో రబీ వరి పైరు పాలు పోసుకునే దశలో ఉంది. ఈ తరుణంలో సాగునీరందించడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. రబీకి 16 టీఎంసీల నీటికొరత ఉందని అటు ఇరిగేషన్ అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు ముందే తెలుసు. అయినప్పటికీ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి డెల్టా మొత్తం ఆయకట్టుకు నీరందించాలని గతంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ప్రభుత్వం రూ.10 కోట్లు ఇస్తే అదనపు జలాలు సేకరిస్తామని అధికారులు అప్పట్లో చెప్పారు. నిధులు తెచ్చే బాధ్యత తమదని అధికార పార్టీ నేతలు వారికి భరోసా ఇచ్చారు. దీంతో రబీ మొత్తం ఆయకట్టుకు అధికారులు అనుమతి ఇచ్చారు. కానీ, వరిపైరు పాలు పోసుకుంటున్న ప్రస్తుత దశలో సాగునీరందక రైతులు పడుతున్న ఇబ్బందులను ఇటు అధికారులు, అటు పాలకపక్ష ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. క్రాస్బండ్లకు అనుమతి వచ్చినా.. సాగునీటి కొరతను అధిగమించేందుకు గోదావరి వృథా జలాలను కాలువల్లోకి మళ్లించాలని, మురుగునీటి కాలువలపై క్రాస్బండ్లు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తద్వారా ఏడు టీఎంసీల నీటిని సేకరించవచ్చని, ఇందుకు నిధులివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. డెల్టాలో రబీకి నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుందని తెలిసి కూడా ప్రభుత్వం ఆమేరకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో గోదావరిలో వృథా పోతున్న నీటిని కాలువల్లోకి మళ్లించే అవకాశం లేకుండా పోయింది. గతంలో కడియం మండలం వేమగిరి, ముమ్మిడివరం మండలం పళ్లవారిపాలెం, అయినవిల్లి మండలం శానపల్లిలంకల వద్ద ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సేకరణ జరిగింది. గత నెలలో మాత్రం ‘క్రాస్బండ్లు వేయించండి. నిధులు వచ్చిన తరువాత ఇస్తాం’ అని జిల్లా ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడెక్కడ వీటిని నిర్మించాలనేది సూచిస్తూ డ్రైన్ అధికారులకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. క్రాస్బండ్లు వేయించినా నిధులు వస్తాయనే భరోసా లేకపోవడం డ్రైన్స్ అధికారులు పనులు మొదలు పెట్టించేందుకు జంకుతున్నారు. గతంలో నీటి ఎద్దడి సమయంలో తూర్పు, మధ్య డెల్టాల్లో సుమారు 220 వరకూ క్రాస్బండ్లు వేయగా, ఇప్పటివరకూ అమలాపురం సబ్ డివిజన్లో కూనవరం, వాసాలతిప్ప వద్ద కేవలం రెండంటే రెండే క్రాస్బండ్లు వేశారు. అవికూడా రైతులే స్వయంగా నిర్మించుకున్నవి కావడం గమనార్హం. అలాగే చిన్నిచిన్ని మురుగునీటి కాలువలు, బోదెలపై రైతులు సొంతంగా క్రాస్బండ్లు వేసి చేలల్లో నీరు దిగకుండా చూసుకుంటున్నారు. లోపించిన ముందస్తు ప్రణాళిక మొత్తం ఆయకట్టుకు నీటి లభ్యత తక్కువగా ఉందని తెలిసి కూడా ఇరిగేషన్ అధికారులు ముందస్తు ప్రణాళికతో సాగునీరందించడంలో నిర్లక్ష్యం వహించారు. సాధారణంగా నాట్లు వేసే సమయంలోను, పంట చేలు పాలు పోసుకుని గింజ గట్టిపడే దశలోను చేలల్లో ఐదు సెంటీమీటర్ల ఎత్తున నీరు ఉంచుతారు. అందువల్ల పాలు పోసుకునే ఈ నెల రోజులూ సమృద్ధిగా సాగు నీరందించాలి. ఈ ఏడాది డెల్టాలో రబీ సాగు ఆలస్యమైంది. దీంతో ఎగువ ప్రాంతాలకు, శివారుకు మధ్య నాట్లకు నెల రోజులు పైగా వ్యత్యాసముంది. ఈ కారణంగా ఫిబ్రవరి 15 నుంచి ఈ నెలాఖరు వరకూ చేలు పాలు పోసుకుని గింజ గట్టిపడే దశ ఉంటుంది. ఈ సమయంలో మూడు డెల్టా కాలువల ద్వారా 9 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి. ఇది ముందే తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు గతంలో ఎన్నడూ లేనివిధంగా సీలేరు నుంచి వస్తున్న నీటికి అదనంగా 2 వేల క్యూసెక్కులు రప్పిస్తున్నారు. ఇదేదో రెండు వారాల క్రితం రప్పించి ఉంటే ప్రస్తుతం నీటికి ఇబ్బందులు వచ్చేవి కావని రైతులంటున్నారు. సీలేరు నీరు వస్తున్నా శివారుకు ఎద్దడి ఏర్పడుతోందంటే అందుకు క్రాస్బండ్ల ద్వారా మురుగునీటి కాలువల నుంచి, లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి గోదావరి నుంచి కాలువల్లోకి నీరు మళ్లించకపోవడమే కారణమని ఇరిగేషన్ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. -
వేసవి నువ్వులు!
రబీ వరి కోతల తర్వాత నువ్వు సాగు ఎకరానికి రూ. 3 వేల పెట్టుబడి.. సుమారు రూ. 50 వేల ఆదాయం గుంటూరు జిల్లా రుపెంగుంట్ల గ్రామానికి చెందిన తొండపి గురవయ్య నిరంతరం కొత్తదనాన్ని కోరుకునే అన్నదాత. గతంలో వినూత్నమైన గొర్రును తయారు చేసి ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ఆయన ఇప్పుడు వినూత్న పద్ధతిలో నువ్వుల సాగుకు శ్రీకారం చుట్టారు. రైతులు సాధారణంగా ఖరీఫ్ వరి కోతల తర్వాత పొలాన్ని దున్నకుండానే జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న, పెసర, మినుము, పొద్దుతిరుగుడు వంటి పంటలు వేస్తుంటారు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కలుపు ప్రధాన సమస్య. కాలువల కింద సాగయ్యే పొలాల్లో రబీ వరి తర్వాత నువ్వుల విత్తనాలు చల్లితే కలుపు సమస్యను సులభంగా ఎదుర్కోవచ్చునని గురవయ్య భావించారు. ఎందుకంటే వేసవిలో కలుపు సమస్య పెద్దగా ఉండదు. పైగా భూమిలో తేమ కూడా ఉండదు. కలుపు, తేమ లేకుంటేనే నువ్వుల పంట తొలి దశలో బాగా ఎదుగుతుంది. రోహిణి కార్తె ప్రవేశించిన తర్వాత కురిసే వానలు ఎదుగుతున్న పంటకు ప్రాణం పోస్తాయి. పైగా ఆయన నివసించే ప్రాంతంలోని భూములకు వేసవిలో కాలువల ద్వారా నీరు అందుతుంది. ఆ నీటితో కీలక దశల్లో ఒకటి రెండు తడులు ఇవ్వవచ్చు. ఇంకేం? పంట ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రబీ వరి కోతలకు 15 రోజుల ముందు గురవయ్య తన పొలంలో ఎకరానికి 2 కిలోల నువ్వుల విత్తనాలు చల్లారు. మాగాణి భూమిలో ఉన్న తేమతో అవి బాగా మొలకెత్తాయి. రోహిణి కార్తె సమయంలో కురిసిన జల్లులతో ఏపుగా ఎదిగాయి. 90 రోజుల వ్యవధిలో మూడు నాలుగు సార్లు వర్షాలు పడ్డాయి. జూలైలో పూత వచ్చింది. ఆగస్ట్‌లో పంట కోశారు. పంటకాలంలో ఆయన ఎకరానికి కేవలం ఒకే ఒక యూరియా బస్తా వేశారు. అది కూడా వర్షం పడినప్పుడే. చీడపీడల నివారణకు విత్తనాలు వేసిన 50-60 రోజుల తర్వాత రెండుసార్లు పురుగు మందులు పిచికారీ చేశారు. కోత ఖర్చు తప్పించి పెద్దగా అయిన పెట్టుబడేమీ లేదు. ఎంత ఎక్కువ ఖర్చు చేసినా ఎకరానికి మూడు వేల రూపాయలకు మించి పెట్టుబడి అవసరం లేదు. వాతావరణం అనుకూలించి, అంతా బాగుంటే ఎకరానికి 7 బస్తాల (బస్తాకు 75 కిలోలు) నువ్వుల దిగుబడి వస్తుంది. ఒక్కో బస్తా రూ.7 వేలు పలుకుతోంది. అంటే రూ. 3 వేల పెట్టుబడికి రూ. 49 వేల ఆదాయమన్నమాట! తక్కువలో తక్కువ 2 బస్తాలకు తగ్గదు. 2009 నుంచే గురవయ్య ఈ ప్రయోగం చేస్తున్నారు. అయితే కాలువలకు నీరు బాగా అంది రబీలో వరి వేసిన సందర్భంలో మాత్రమే ఆయన కోతల తర్వాత నువ్వులు చల్లుతున్నారు. సకాలంలో వర్షాలు పడకపోయినా, పంటకు నీరు అందకపోయినా దిగుబడులు తగ్గుతాయి. ఇది ఏ పంటకైనా తప్పదు కదా? గురవయ్య ప్రయోగాన్ని గుంటూరు లాం శాస్త్రవేత్తలు పరిశీలించి, ఆయనపై ప్రశంసలు కురిపించారు. - పి. సంగమేశ్వరరావు, సాగుబడి డెస్క్ -
ప్రయోగాత్మక వ్యవసాయానికి ప్రాధాన్యత
సీఎం చంద్రబాబు వెల్లడి సాక్షి,హైదరాబాద్: రబీలో ప్రయోగాత్మక వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని వ్యవసాయ, అనుబంధ శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. భూసార పరీక్షలను పెద్ద ఎత్తున చేపట్టాలని, ఎరువుల పరిశ్రమలు కూడా ఈ పరీక్షలకు సహకరించి సూక్ష్మ పోషకాల నిర్ధారణకు తోడ్పడాలని కోరారు. రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాథమిక రంగం అభివృద్ధిపై బుధవారం సచివాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో ఇక్రిశాట్, వ్యవసాయం, అనుబంధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వర్క్‌షాపులో సీఎం మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో ఎలాంటి వ్యవసాయ విధానాలతో ముందుకెళ్లాలో త్వరలో ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. అన్నీ ఆన్లైన్లోనే ప్రభుత్వ నిధులు మంజూరు, చెల్లింపులన్నీ ఇక ఆన్లైన్లో విధానంలోనే జరగనున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్థిక శాఖ ప్రారంభించిన సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ఇప్పుడు అమల్లోకి వస్తోంది. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా ప్రయోగాత్మకంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. -
శివారు రైతుపై సాగునీటి భారం
కాలువల్లో అడుగంటిన నీరు డీజిల్, విద్యుత్ మోటార్లే శరణ్యం డెల్టా రైతులపై రూ.22 కోట్ల అదనపు వ్యయం అమలాపురం : ఒకవైపు సాగునీటి కొరత, మరోవైపు సాగు ఆలస్యంతో డెల్టాలో రబీ సేద్యం ‘భారం’గా సాగుతోంది. పంట కాలువల అధ్వానస్థితి, అస్తవ్యస్తమైన నీటి పంపిణీ, నీటి చౌర్యం.. వంటి కారణాలతో ఆయకట్టు శివార్లకు నీరందడం లేదు. దీంతో డీజిల్ ఇంజన్లతో పొలాల్లోకి నీరు మళ్లించాల్సి వచ్చి, పెట్టుబడి భారంగా మారుతోందని రైతులు వాపోతున్నారు. తూర్పు, మధ్యడెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ)లలో 3.30 లక్షల ఎకరాల్లో రబీ సాగు జరుగుతోంది. ఖరీఫ్ కన్నా రబీలో ఎరువులు, పురుగుమందులకు అదనంగా ఖర్చు పెట్టడంతో పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దానికి నీటి ఎద్దడి తోడవుతోంది. రెండు డెల్టాలు, పీబీసీలో సుమారు 75 వేల ఎకరాలు మెరక చేలు. కాలువలు నిండుగా ఉన్నప్పుడే నీరు పెట్టడం కష్టం. అలాంటిది కాలువల్లో నీరు లేకపోవడంతో విద్యుత్ మోటార్లతో, డీజిల్ ఇంజన్లతో నీరు మళ్లించాల్సి వస్తోంది. దీంతో ఎకరాకు అదనంగా రూ.మూడు వేల వరకు ఖర్చవుతోంది. -
కేంద్రానికి చెప్పి వాటా వాడుకుందాం
రబీకి కృష్ణా జలాల వినియోగంపై టీ సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాలను ప్రస్తుత రబీ అవసరాలకు వినియోగించుకునే విషయంలో వాస్తవ పరిస్థితులను కేంద్రానికి తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిం ది. కేంద్రానికి లేఖ ద్వారా లేదా స్వయంగా అన్ని విషయాలు వివరించాకే నీటి వినియోగం మొదలుపెట్టాలని భావిస్తోం ది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖకు స్పష్టమైన సూచనలు చేశారు. కేరళ పర్యటన నుంచి వచ్చిన కేసీఆర్.. ఆదివారం నీటిపారుదల మం త్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తదితరులతో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. మూడు గంటలపాటు కృష్ణా జలాల వివాదం, ఏపీ చేస్తున్న వాదనలపై కూలంకషంగా చర్చించారు. ఇప్పటికే వాటా మేరకు నీటిని వినియోగించుకున్న ఏపీ ప్రస్తుతం మిగిలిన నీటిలోనూ వాటా కోరుతోందని, ఇందుకు అంగీకరించకపోవడంతో బోర్డుకు పదేపదే లేఖలు రాస్తూ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని అధికారులు వివరించినట్లుగా తెలిసింది. ఈ దృష్ట్యా తాము సైతం రబీ అవసరాలకు నీటిని వినియోగించుకునే అంశమై బోర్డుకు లేఖ రాశామని, వారి నుంచి పెద్దగా స్పందన లేదని తెలిపినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, అన్ని అంశాలను కేంద్ర జలవనరులశాఖకు తెలుపుతూ లేఖ రాయాలని సూచించినట్లుగా చెబుతున్నారు. అవసరమైతే త్వరలో చేపట్టనున్న ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి ఉమా భారతిని కలసి సమస్యను వివరించి పరిష్కారం కోరతానని సీఎం వెల్లడించినట్లుగా తెలిసింది. కేంద్రానికి అన్ని వివరాలు తెలిపాకే రబీకి నీటి వినియోగం ప్రారంభిద్దామని ఆయన సూచించినట్లుగా సమాచారం. ఇక, ప్రస్తుతం సాగర్‌లో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని రబీ అవసరాలను కేవలం నల్లగొండ జిల్లాకే పరిమితం చేయాలనే దిశగా సమాలోచనలు చేసినట్లు తెలిసింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కలిపి 4.20 లక్షల ఎకరాల మేరకు నీటి అవసరాలు ఉన్నా, నల్లగొండ జిల్లాకు 3 లక్షల ఎకరాల మేరకే నీటిని ఇవ్వగలిగే అవకాశం ఉందని సమావేశంలో అధికారులు సీఎంకు తెలియజేసినట్లుగా సమాచారం. ఖమ్మం జిల్లాను సైతం కలిపితే పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత ఏర్పడితే సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఈ దృష్ట్యా రబీ నుంచి ఖమ్మం ఆయకట్టును పక్కనబెట్టడమే ఉత్తమమని వారు సూచించినట్లుగా తెలిసింది. అయితే ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం మిగిలి ఉన్న 1.20 లక్షల ఎకరాల ఖరీఫ్ సాగు అవసరాలకు నీటిని మాత్రం యథాతథంగా విడుదల చేస్తామని వారు స్పష్టం చేసినట్లుగా తెలిసింది. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. -
కాడి దించేస్తున్న రబీ రైతు
వెంటాడుతున్న వర్షాభావం అడుగంటుతున్న చెరువులు, బోర్లు కష్టాలపాల్జేస్తున్న కరెంటు కోతలు అందని పంట రుణాలు భారీగా తగ్గిన రబీ సాగు విస్తీర్ణం శ్రీకాకుళం అగ్రికల్చర్: ఖరీఫ్ కలిసిరాకపోగా ఈసారి రబీ కూడా రైతులను కన్నీరు పెట్టిస్తోంది. వర్షాభావం, భూగర్భజలాలు అడుగంటడం, కరెంటు కోతలు, రుణా లు అందకపోవడం వంటి పరిస్థితులు జిల్లాలో రబీ సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా దిగజార్చాయి. డిసెంబర్ నెల ముగుస్తున్నా అనుకూల వాతావరణం లేకపోవడంతో రబీలో సాగు చేసే దాదా పు అన్ని పంటలు సాధారణ విస్తీర్ణం కంటే చాలా తక్కువ పరిమాణంలో సాగవుతున్నాయి. అప్పులు చేసి పంట ల సాగుతో చేతులు కాల్చుకోవడం కంటే పొలాలను ఖాళీగా ఉంచడమే మంచిదని రైతులు అభిప్రాయపడుతున్నారు. రబీలో ప్రధానంగా అడపాదడపా కురిసే వర్షాలు, భూగర్భ జలాలపై ఆధారపడి ఆరుతడి పంటలనే సాగు చేస్తుంటారు. ఈసారి ఆ రెండు ఆశించినస్థాయిలో లేకపోవడంతో ఇప్పటివరకు సుమారు 50 శాతం భూముల్లోనే పంటలు వేశారు. దీనివల్ల ఆహార ధాన్యాల దిగుబడి బాగా తగ్గిపోయే ప్రమాదముంది. నిండని చెరువులు గత మూడు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువులు సైతం నిండలేదు. హుద్‌హుద్ తుపాను ప్రభావంతో అక్టోబర్‌లో కురిసిన వర్షాలు తప్ప ఖరీఫ్ చివరిలోనూ వర్షాభావం నెలకొంది. రబీనీ అదే వెంటాడుతోంది. ఈశాన్య రుతుపవనాలు కరుణించకపోవడంతో చెరువులు, కుంటలు పూర్తిగా నిండలేదు. అయినా వాటితోపాటు బోర్లు ఉన్న ప్రాంతాల్లోనే కొంతమేరకు పంటలు సాగు చేస్తున్నారు. అయినా కరెంట్ కోతలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వేళాపాళా లేని కోతలతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రబీ పంటలు పూర్తిస్థాయిలో చేతికందడం కూడా అనుమానమేనంటున్నారు. తగ్గుతూ వస్తున్న వర్షపాతం గత రెండుమూడేళ్లుగా వర్షపాతం తగ్గుతూ వస్తుండటంతో పంటల సాగు కూ డా తగ్గిపోతోం ది. అక్టోబర్‌లో హుద్‌హుద్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల ఆ నెలల్లో కొంత వర్షపాతం నమోదైనా రెండుమూడు రోజుల్లోనే అదంతా కురవడం గమనార్హం. ఇక నవంబర్, డిసెంబర్ నెలల్లో చుక్క వర్షం కూడా కురవలేదు. దీంతో రైతులు కూ డా పంట వేయడాన్ని తగ్గించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. -
‘కాడి’ కన్నీరు!
ఈ‘సారీ’ రబీ అరకొరే.. అన్నదాతల ఆశలు గల్లంతు బావులు, బోర్లే ఆధారం వరంగల్ : రైతులను రబీ కన్నీరు పెట్టిస్తోంది. అరకొరే సాగవడంతో దిగాలు చెందుతున్నారు. సేద్యానికి సెలవు పలకడానికి సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ కలిసిరాక పోవడంతో రబీపై పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. డిసెంబర్ సగం ముగిసినప్పటికీ అనుకూల పరిస్థితులు లేక పోవడంతో అవస్థలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటడం, కరెంటు కోతలు, రుణాలు అందకపోవడం వంటి కారణాలతో గిట్టుబాటు కాదని సేద్యానికి ఎగనామం పెడుతున్నారు. ఇప్పటివరకు భూగర్భజలాలపై ఆధారపడి మాత్రమే పంటలు వేశారు. ఇందులో ప్రధానంగా ఆరుతడి పంటలకే ప్రాధాన్యత నిచ్చారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు 28 శాతం పంటలు సాగయ్యూరుు. ఈ సీజన్ నిరాశజనకంగా ముగిసేట్టుగా కనిపిస్తోంది. ఈ రబీ సాగు తగ్గి, దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆహార ధాన్యాల దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉంది. నిండని చెరువులు.. సాగని సాగు.. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు సాగుకు అడ్డంకిగా మారాయి. ఖరీఫ్‌లో వర్షాలు లేక పోవడంతోపాటు రబీ కూడా ఇదే దారిలో సాగుతోంది. ఈ సీజన్లో హుదూద్ తుపాన్ ప్రభావంతో రెండు రోజులపాటు కురిసిన చిన్నపాటి వర్షాలు తప్ప ఈశాన్య రుతుపవనాలు రైతులను కరుణించకపోవడంతో పంట ల సాగు ఆశించిన స్థాయిలో లేదు. చెరువులు, కుంటలు, బోర్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. అయినా కరెంట్ కోతలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వేళాపాళాలేని కరెంట్ కటకటతో రైతులు పంటలను సాగు చేయాలంటే జంకుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటే రబీ సాగు తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఖరీఫ్‌లో కష్టాలపాలైన రైతులు రబీసాగు చేపట్టాలంటే భయపడుతున్నారు. ఆరు తడిపంటలు మేలు : జేడీఏ రామారావు నీటి లభ్యత తగినంత లేనందున రైతులు ఆరుతడి పంటలు వేయాలి. తొందరపడి వరి సాగు వల్ల రైతులు ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది.కరెంట్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. భూగర్భజలాలపై ఆధారపడి సాగు చేస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కజొన్న, జొన్న, అపరాల సాగు వల్ల రైతుకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది. -
రబీకి రాం..రాం
రబీలో వ్యవసాయ రంగానికి కరెంటు ఇవ్వడం సాధ్యం కాదని, ఆరుతడి పంటలే వేసుకోవాలని స్వయానా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇటీవల స్పష్టం చేశారు. అలాగే జిల్లాకు వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీలో నీళ్లు లేవని, ఉన్న నీళ్లు తాగేందుకే సరిపోతాయని, రబీలో నీటి విడుదల ఉండదని ప్రాజెక్టు సీఈ శంకర్ అంతకుముందే తేల్చిచెప్పారు. దీంతో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. కరీంనగర్ అగ్రికల్చర్ : ఈ ఏడాది అన్నదాతలను ‘కాలం' వెక్కిరించింది. వర్షాభావం, కరెంటు కోతలతో ఖరీఫ్‌లో అపారనష్టాన్ని మూటగట్టుకున్న రైతన్నలకు ఇప్పుడు రబీ రంది పట్టుకుంది. ఖరీఫ్‌లో చేసిన అప్పులను తీర్చుకుందామని రబీపై గంపెడాశలు పెట్టుకోగా సాగునీటి కొరత, కరెంటు కోతల రూపంలో చుక్కెదురైంది. సాధారణంగా రబీలో ఎస్సారెస్పీ, బోర్లు, బావులపై ఆధారపడి రైతులు సాగు పంటలు చేస్తుంటారు. తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండుముఖం పట్టింది. 90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 22.41 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది కేవలం తాగునీటి అవసరాలకే సరిపోనుంది. ఇక సాగు అవసరాలకు విడుదల చేసే అవకాశమే ఉండదు. 24 టీఎంసీల సామర్థ్యమున్న దిగువమానేరు జలాశయంలో బుధవారం వరకు 7.051 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉంది. ఇందులో రెండు టీఎంసీలు డెడ్‌స్టోరేజీ. మిగిలిన ఐదు టీఎంసీలను కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, వేములవాడ, సిరిసిల్లకు తాగునీటి కోసం వినియోగించనున్నారు. ప్రస్తుతం బావుల్లోనూ భూగర్భజలాలు అడుగంటాయి. గతేడాదితో పోల్చితే రెండుమీటర్ల లోతుకు పడిపోయాయి. జిల్లావ్యాప్తంగా 3.40 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్ల కనెక్షన్లున్నాయి. వీటికి రోజుకు 12 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ కేటాయింపులు లేక కోతలు తీవ్రమయ్యాయి. పంటల విస్తీర్ణం పెరగకముందే లోటు పెరగడం కలవరపెడుతోంది. అప్పుల ఊబిలో ఆత్మహత్యలు ఖరీఫ్‌లో పంట దిగుబడి సగానికిపైగా పడిపోవడంతో రైతుల నెత్తిన పెట్టుబడుల భారం పడిం ది. అప్పటికే అప్పులపాలైన రైతులు మరింత ఊబిలో కూరుకుపోయినట్లు అయ్యింది. ఖరీఫ్ లో పొలం దున్నడం, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కలిపి ఎకరాకు రూ.18- 20 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. వర్షాభావం, కరెంటు కోతలతో పంటలన్నీ ఎండిపోయి ఆ భారమంతా మీదపడింది. ప్రస్తుతం రబీలో పెట్టుబడుల కోసం అన్నదాతలు నానా అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికే పంటనష్టం, అప్పులబాధతో జిల్లాలో 70 మందికిపైగా రైతు లు ఆత్మహత్య చేసుకోవడం కలవరపరుస్తోంది. ట్రాన్స్‘ఫార్మర్ల’ కష్టాలు కరెంటు కోతలతో సతమతమవుతుంటే ట్రాన్స్ఫార్మర్లు తరచూ కాలిపోతుండడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. లోవోల్టేజీ, ఓవర్‌లోడ్ కారణంగా జిల్లాలో రోజుకు సుమారు వం ద ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. విద్యుత్ శాఖ అధికారులు స్పందించకపోవడంతో వాటి ని రైతులే స్వయంగా మరమ్మతు కేంద్రాలకు తరలిస్తున్నారు. అప్పటికే కేంద్రాల్లో ట్రాన్స్ఫార్మర్లు కుప్పలుతెప్పలుగా ఉండడంతో మరమ్మతుకు 15రోజులు ఆగాల్సి వస్తోంది. ఆలోపు పంటలన్నీ ఎండిపోతే దశకు చేరుకుంటున్నాయి. ట్రాన్స్ఫార్మర్లపై అదనపు భారం పడకుండా.. అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించాల్సిన అధికారులు ఆ దిశగా చొరవ చూపడం లేదు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని ఫిర్యాదు చేస్తే ట్రాన్స్‌కో సిబ్బంది స్పందించే తీరు కూడా అంతంతమాత్రమే. 20శాతమే సాగు.. రబీలో 6.87 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 4.37 లక్షల ఎకరాల్లో వరి, 1.38 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.11లక్షల ఎకరాల్లో ఇతర పంటలు వేస్తారని నివేదిక రూపొందించారు. కానీ.. రబీ ప్రారంభమై నెల గడిచినా ఇప్పటివరకు 20 శాతం మాత్రమే సాగులోకొచ్చింది. రబీలో పంటల సాగు ఇలా..(హెక్టార్లలో) పంట సాధారణ సాగు సాగయ్యింది వరి 155338 - మొక్కజొన్న 44984 11226 పెసర్లు 3765 2413 శనగలు 2082 1274 బబ్బెర్లు 4119 684 వేరుశనగ 10384 4520 పొద్దుతిరుగుడు 430 25 ఖరీఫ్, రబీ పంట రుణాలు లక్ష్యం.. రూ.2300 కోట్లు ఇచ్చింది రూ.1280 కోట్లు వర్షపాతం ఇలా.. జూన్ నుంచి ఇప్పటివరకు 900 మిల్లీలీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ 584.6 మిల్లీలీటర్లకు మించలేదు. మెట్పల్లి, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, హుస్నాబాద్, కాటారం, కమాన్‌పూర్‌లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. 50 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. బోయినిపల్లి మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 47 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని జిల్లా యంత్రాంగం సర్కారు ఇటీవలే ప్రతిపాదనలు పంపింది. అందులో ఎన్ని మండలాలను కరువుగా ప్రభుత్వం గుర్తిస్తుందో అనే ఆందోళన నెలకొంది. -
రబీకి కన్నీళ్లే!
నేడు ఐఏబీ సమావేశం కర్నూలు రూరల్: ఈ సారి రబీకి సాగునీరు ఇచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. అన్నదాత కష్టాలు తీరేలా లేవు. సాగునీటి కాలువల మరమ్మతులకు పెండింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు ఇవ్వకపోవడం దీనికి ఓ కారణం. కాలువలకు కేటారుుంచిన నీటిని తీసుకురావడంలో పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అశ్రద్ధ మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నేడు ఐఏబీ సమావేశం సాగు నీటి కాల్వలకు రబీ ఆయకట్టుకు సాగు నీటి విడుదలపై చర్చించేందుకు సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం జరుగనుంది. ప్రాజెక్టులలో నీటి నిల్వలు లేవనే సాకుతో రబీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని, గత ఐఏబీ సమావేశంలోని తీర్మానాలపై ప్రతిపక్షం చర్చకు పట్టుబడితే తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. మీటింగ్‌లో కేవలం అజెండాపై మాత్రమే చర్చించి సమావేశాన్ని ముగించేలా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. రైతులను నిలువునా ముంచేందుకు కంకణం కట్టుకున్నారు. కర్ణాటక జలచౌర్యం.. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా 16 మండలాల్లోని 192 గ్రామాలకు తాగునీరు, 107615 ఎకరాల రబీకి సాగునీరు అందిస్తుంది. డ్యాంలో నీటి ఆధారంగా ఈ ఏడాది మొదటగా 16.302 టీఎంసీలు ఇవ్వాలని నిర్ణరుుంచారు. తర్వాత ఇటీవల 15.62 టీఎంసీలకు తగ్గించారు. ఇందులో ఇప్పటివరకు 6.2 టీఎంసీలు ఖీరీఫ్కు వినియోగించారు. ఇంకా 9.60 టీఎంసీలు ఉండగా వీటిలో తాగునీటికి 4 టీఎంసీలు పోరుుంది. మిగిలిన 5.60 టీఎంసీల నీటిని ఈ ఏడాది 40 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించనున్నారు. అరుుతే కర్ణాటకలో సుమారు 70 వేల ఎకరాల నాన్ ఆయకట్టు సాగు కోసం జలచౌర్యం ఏడాది కేడాది పెరిగిపోతోంది. దీనివల్ల ఇక్కడి ఆయకట్టుకు మొండి చేరుు మిగులుతోంది. జలచౌర్యంను అడ్డుకునేందుకు ప్రతి ఐఏబీలో తీర్మానాలు చేస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. చివరికి నీరందక రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. కేసీ నీటి మళ్లింపు ఉత్తర్వుల రద్దు చేస్తేనే సాగునీరు.. కర్నూలు-కడప కాలువ ఆయకట్టుకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తుంగభద్ర డ్యాం నిల్వ నీటి నుంచి 10 టీఎంసీలు రావాల్సి ఉంది. పూడిక చేరిందనే కారణంలో ప్రతి ఏటా 6.8 టీఎంసీలే విడుదల చేస్తున్నారు. అదేసమయంలో కేసీకి కేటాయించిన నీటిని అనంతపురం జిల్లా తాగునీటి కోసం పెన్నా అహోబిళం రిజర్వాయర్‌కు 2004లో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు మొదటగా 5 టీఎంసీల నీటిని, ఆ తరువాత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మరో 5 టీఎంసీల నీటి మళ్లింపునకు ఉత్తర్వులు ఇచ్చారు. దీనివల్ల పదేళ్లుగా కేసీ కాల్వ కింద కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలు, కడప జిల్లాలో 92,001 ఎకరాల ఆయకట్టు రబీ సీజన్లో సాగుకు నోచుకోవడం లేదు. నీటికోసం అనంత పట్టు.. రబీలో కేసీ ఆయకట్టుకు నీరందదని తెలిసినా అనంతపురం జిల్లాకి చెందిన మంత్రులు, అక్కడి ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నీటిని తరలించుకుపోయేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. తొలివిడతగా 3 టీఎంసీల నీటిని మళ్లించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిళ్ళు చేస్తున్నారు. జిల్లాని రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరెత్తకపోవడం గమనార్హం. దీంతో కేసీ రబీ ఆయకట్టుకు సాగు నీరు ప్రశ్నార్థకం కానుంది. మళ్లింపు ఉత్తర్వులు రద్దు చేయిస్తే 0 నుంచి 120 కి.మీ వరకు 20 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటుతోనే న్యాయం.. జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులకు, కాల్వలకు సంవృద్ధిగా సాగు నీరు అందాలంటే కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేస్తేనే న్యాయం జరుగుతుందని లేకపోతే భవిష్యత్‌లో మరిన్నిసాగు నీటి కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా, అధికారులు ఐఏబీలో కర్నూలులోనే కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలని పలువురు సాగు నీటి నిపుణులు, ఆయకట్టుదారులు కోరుతున్నారు. ఇదీ అసలువిషయం.. నీరు ఇవ్వలేమనే విషయాన్ని అధికారులు ఐఏబీలో చెప్పనున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, ఏపీఎస్ఐడీసీ కర్నూలు సబ్ డివిజన్ కింద తుంగభద్ర, హగేరి,ఎస్ఆర్ఎంసీ, కుందూ నదుల కింది నిర్మించిన సుమారు 70 ఎత్తిపోతల పథకాలకు, గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద నిర్మించిన స్కీమ్‌లకు సైతం రబీ ఆయకట్టుకు సాగు నీరు ఇచ్చే అవకాశమేలేదు. గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఈ ఏడాది 8 వేల ఎకరాలకు రబీ కింద సాగు నీరుఇచ్చే అవకాశం ఉంది. నీరిచ్చే అవకాశమే లేదు.. కరువు సీమకు శ్రీశైలం ప్రధాన జల సిరి. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం జలాశయంలో 856 అడుగులు మాత్రమే నీరుంది. శ్రీశైలం జలాశయం నిండక ముందే కృష్ణా డెల్టాలో తాగునీటి కోసమని, కరెంట్ ఉత్పత్తి పేరుతో రోజుకు 70 వేల క్యూసెక్కుల ప్రకారం నీటిని కోస్తా ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు కుట్ర పూరితంగా తీసుకెళ్లారు. దీనివల్ల తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, ఎస్కేపు చానల్‌కు సకాలంలో నీరు విడుదల కాలేదు. ఖరీఫ్ పంటల సాగు ఆలస్యమయ్యింది. ఈ లోపు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నీటిని వినియోగించుకోవడం, పంతాలకు పోరుు ఆంధ్రా ప్రభుత్వం సైతం కరెంట్ ఉత్పిత్తికి నీటిని వినియోగించడంతో 20 రోజులకే శ్రీశైలం నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. వాస్తవంగా కుడి, ఎడమ గట్టుల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తూ దిగువన ఉన్న సాగర్‌కు 300 టీఎంసీలు, అత్యవసరం కింద మరో 50 టీఎంసీల నీటిని మాత్రమే వదలాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకులకు రైతులపై చిత్తశుద్ధి లేకపోవడంతో అదనంగా ఈ ఏడాది 94 టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారు. ఈ కారణంగా తెలుగు గంగ కింద జిల్లాలో 1,03,700 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు, ఎస్సార్బీసీ సర్కిల్-1 పరిధిలో 1 నుంచి 7బ్లాకుల కింద ఖరీఫ్‌లో 46,857 ఎకరాలు, సర్కిల్-2 పరిధిలోని 8 నుంచి 16 బ్లాకుల కింద 97,460 ఎకరాల ఆయకట్టుకు రబీలో సాగు నీరు ఇచ్చే అవకాశమే లేదు.