కృష్ణా జలాలపై అదే ప్రతిష్టంభన! | no clarification on krishna board | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 1 2016 7:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

రబీలో కృష్ణా జలాల విడుదలకు సంబంధించి బోర్డు త్రిసభ్య కమిటీ భేటీలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. వాటాలకు మించి నీటిని వినియోగించుకున్నారంటూ ఇరు రాష్ట్రాలూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఏమీ తేల్చలేకపోరుున బోర్డు.. మరోసారి భేటీ అవుదామని సూచించడంతో సమావేశం వారుుదా పడింది. బుధవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ అధ్యక్షతన ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ ఈఎన్‌సీలు వెంకటేశ్వరరావు, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో భేటీ అరుుంది. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో పలు అంశాలపై తీవ్రంగా వాదనలు జరిగారుు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement