వెంటాడుతున్న వర్షాభావం
అడుగంటుతున్న చెరువులు, బోర్లు
కష్టాలపాల్జేస్తున్న కరెంటు కోతలు
అందని పంట రుణాలు భారీగా తగ్గిన రబీ సాగు విస్తీర్ణం
శ్రీకాకుళం అగ్రికల్చర్: ఖరీఫ్ కలిసిరాకపోగా ఈసారి రబీ కూడా రైతులను కన్నీరు పెట్టిస్తోంది. వర్షాభావం, భూగర్భజలాలు అడుగంటడం, కరెంటు కోతలు, రుణా లు అందకపోవడం వంటి పరిస్థితులు జిల్లాలో రబీ సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా దిగజార్చాయి. డిసెంబర్ నెల ముగుస్తున్నా అనుకూల వాతావరణం లేకపోవడంతో రబీలో సాగు చేసే దాదా పు అన్ని పంటలు సాధారణ విస్తీర్ణం కంటే చాలా తక్కువ పరిమాణంలో సాగవుతున్నాయి. అప్పులు చేసి పంట ల సాగుతో చేతులు కాల్చుకోవడం కంటే పొలాలను ఖాళీగా ఉంచడమే మంచిదని రైతులు అభిప్రాయపడుతున్నారు. రబీలో ప్రధానంగా అడపాదడపా కురిసే వర్షాలు, భూగర్భ జలాలపై ఆధారపడి ఆరుతడి పంటలనే సాగు చేస్తుంటారు. ఈసారి ఆ రెండు ఆశించినస్థాయిలో లేకపోవడంతో ఇప్పటివరకు సుమారు 50 శాతం భూముల్లోనే పంటలు వేశారు. దీనివల్ల ఆహార ధాన్యాల దిగుబడి బాగా తగ్గిపోయే ప్రమాదముంది.
నిండని చెరువులు
గత మూడు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో చెరువులు సైతం నిండలేదు. హుద్‌హుద్ తుపాను ప్రభావంతో అక్టోబర్‌లో కురిసిన వర్షాలు తప్ప ఖరీఫ్ చివరిలోనూ వర్షాభావం నెలకొంది. రబీనీ అదే వెంటాడుతోంది. ఈశాన్య రుతుపవనాలు కరుణించకపోవడంతో చెరువులు, కుంటలు పూర్తిగా నిండలేదు. అయినా వాటితోపాటు బోర్లు ఉన్న ప్రాంతాల్లోనే కొంతమేరకు పంటలు సాగు చేస్తున్నారు.
అయినా కరెంట్ కోతలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వేళాపాళా లేని కోతలతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రబీ పంటలు పూర్తిస్థాయిలో చేతికందడం కూడా అనుమానమేనంటున్నారు.
తగ్గుతూ వస్తున్న వర్షపాతం
గత రెండుమూడేళ్లుగా వర్షపాతం తగ్గుతూ వస్తుండటంతో పంటల సాగు కూ డా తగ్గిపోతోం ది. అక్టోబర్‌లో హుద్‌హుద్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల ఆ నెలల్లో కొంత వర్షపాతం నమోదైనా రెండుమూడు రోజుల్లోనే అదంతా కురవడం గమనార్హం. ఇక నవంబర్, డిసెంబర్ నెలల్లో చుక్క వర్షం కూడా కురవలేదు. దీంతో రైతులు కూ డా పంట వేయడాన్ని తగ్గించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
కాడి దించేస్తున్న రబీ రైతు
Published Thu, Dec 25 2014 3:01 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement