పంట రుణం... అయోమయం! | News about runa maafi | Sakshi
Sakshi News home page

పంట రుణం... అయోమయం!

Published Thu, Nov 17 2016 2:54 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

పంట రుణం... అయోమయం!

పంట రుణం... అయోమయం!

లక్ష్యానికి దూరంగా రబీ రుణాల పంపిణీ

లక్ష్యం రూ.1444 కోట్లు..
ఇచ్చింది రూ.305.54 కోట్లు
అదును దాటుతున్నా 20.94     శాతమే పంపిణీ
రుణాలకు పెద్ద నోట్ల రద్దు దెబ్బ

 
సాక్షి, కరీంనగర్ : సాగునే నమ్ముకున్న రైతులకు పంటరుణాల విషయంలో ఈసారి కూడా అష్టకష్టాలు తప్పడం లేదు. రబీ సీజన్ ఆరంభం కావడంతో పెట్టుబడులకు డబ్బులు లేక రైతన్నలు సతమతం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రూ.1448 కోట్లను 2.93 లక్షల మంది రైతులకు అందజేసినట్లు అధికారులు చెప్తున్నా రు. అరుుతే క్షేత్రస్థారుులో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నారుు. పంట రుణమాఫీ, రుణాల రీ షెడ్యూల్ పోను రైతుల చేతికి అందింది అంతంతమాత్రమే అంటున్నారు. రబీ సీజన్‌లో రూ.1444.20 కోట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరగ్గా... కరీంనగర్‌తో పాటు రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో రబీ పంటరుణాల లక్ష్యం ఇప్పటికీ రూ.20.94 శాతం దాటలేదు.

స్కేల్ ఆఫ్ ఫైనాన్‌‌సకు మంగళం
వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం రుణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించింది. వ్యవసాయశాఖ అంచనాల మేరకు జిల్లా అధికారులు రుణా లు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల పరిధిలోని 423 బ్రాంచిలలో ఖరీఫ్, రబీ సీజన్‌లలో కలిపి రూ.2900 కోట్లు పంటరుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సెప్టెంబర్ చివరి, అక్టోబర్ మొదటి వారం నుంచి పంపిణీ చేయాల్సిన రుణాలను అక్టోబర్ చివరి వారంలో మొదలెట్టారు. బ్యాంకర్లు ఇప్పటివరకు రూ.305.54 కోట్లు మాత్రమే ఇవ్వగా.. రబీ రుణలక్ష్యం 20.94 శాతంగా ఉంది. పంట ల రుణాలను కనిష్టంగా, గరిష్టంగా ఎకరానికి ఎంత ఇవ్వచ్చన్న ప్రతిపాదనలను సైతం అక్కడక్కడ బ్యాంకర్లు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నారుు.

పంటలపై ఇచ్చే రుణ మొత్తం (స్కేల్ ఆఫ్ పైనాన్‌‌స) విధానాన్ని పాటించడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో సూచించిన విధంగా మొక్కజొన్నకు ఎకరానికి రూ.20వేలు, వేరుశనగకు రూ.18వేలు, పొద్దుతిరుగుడుకు రూ.13 వేలు, వరి ఎకరానికి రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు పంట రుణం ఇవ్వాల్సి ఉండగా... ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నారు.
 
రైతులకు అందని రుణమాఫీ
పంటరుణాల సంగతి ఇలావుంటే.. రుణమాఫీ, రీషెడ్యూల్‌పైన స్పష్టత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అధికారులు, బ్యాంకర్ల వైఖరి నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం, స్పష్టతపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. అధికారులు, బ్యాంకర్లు చెప్తున్న గణాంకాల ప్రకారం రుణమాఫీ కింద 3,74,632 మంది రైతులకు రూ.1662.52 కోట్ల పంటరుణాలు మాఫీ కావాల్సి ఉంది. ఇందులో మొదటి విడతగా 2014-15లో రూ.415.632 కోట్లు, రెండో విడతగా 2015-16లో 12.5 శాతం చొప్పున రెండుమార్లు రూ.416 కోట్లు మాఫీ చేశారు. మూడో విడత మరో రూ.415 కోట్లు విడుదలైనట్లు చెప్తున్నా... చాలామంది రైతులు తమ ఖాతాల్లో ఇంకా జమ కాలేదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి రుణమాఫీ అమలు, రీ షెడ్యూల్ చేయడం, లక్ష్యాల మేరకు పంటరుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

పెద్దనోట్ల రద్దు దెబ్బ
పంట రుణాల విషయంలో ఐదారు రోజులుగా పెద్దనోట్ల రద్దు అంశం కూడా ప్రతిబంధకంగా మారిందని రైతులు చెప్తున్నారు. ‘మాకు  ఇప్పటివరకు బ్యాంకు రు ణాలు అందలేదు. పెద్దనోట్ల రద్దుతో పంటరుణాలు ఇవ్వాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలని బ్యాంకర్లు అం టున్నారు. దీనికితోడు పెద్ద నోట్లతో గందరగోళం ఏర్పడింది. మార్కెట్‌లో నలభై క్వింటాళ్ల వరిధాన్యాన్ని విక్రరుుంచాను. వాళ్లు డబ్బులు ఇచ్చేది ఎప్పుడో.. నేను తీసుకునేది ఎప్పుడో. మా రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’ అని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రా మానికి చెందిన రైతు బోగ రామస్వామి పేర్కొన్నాడు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement