సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల నీటి కేటారుుంపుల అం శాన్ని చర్చించేందుకు శుక్రవారం జరగాల్సిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ వారుుదా పడింది. ఏపీ ఈఎన్‌సీ అందుబాటులో లేనందున భేటీని బోర్డు వారుుదా వేసిం ది. అరుుతే తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ ముర ళీధర్ గురువారం బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీని తక్షణ నీటి కేటారుుంపుల అవసరంపై వివరణ ఇచ్చారు. నాగార్జునసాగర్ కింద 6.40లక్షల ఎకరాలకు 50 టీఎం సీలు, ఏఎంఆర్‌పీ కింద 2.50లక్షల ఎకరాలకు 15 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటికి 10టీఎంసీలు తక్షణమే తెలంగాణకు కేటారుుంచాలని కోరారు.
జూరాల కింద 20 టీఎంసీ, మీడియం ప్రాజెక్టులకు 8 టీఎంసీలు కలిపి మొత్తంగా 103 టీఎంసీలు అవసరమని విన్నవించారు. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 197.90 టీఎంసీల మేర నీటి లభ్యత ఉందని వివరించారు. ఈ ఏడాది ప్రస్తుతం వరకు కృష్ణాలో ఏపీ 187.18 టీఎంసీ నీటిని వాడుకోగా, తెలంగాణ కేవలం 64.8టీఎంసీలను మాత్రమే వినియోగించుకుందని దృష్టికి తెచ్చారు. ఈ దృష్య్టా రాష్ట్ర అవసరాలను పరిగణనలోకి తీసుకుంటూ నీటి విడుదలపై నిర్ణయం చేయాలని కోరారు.