అటవీ చెక్‌పోస్ట్‌ల వసూళ్లకు చెక్
► అధ్యయూనికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు
► ప్రైవేట్ వ్యక్తుల తొలగింపునకు నిర్ణయం
► వారి స్థానంలో బేస్‌క్యాంప్ సిబ్బంది సేవలు
హన్మకొండ అర్బన్ : అటవీశాఖ చెక్‌పోస్ట్‌ల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఉన్నతాధికారులు కనిపెట్టబోతున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలతో ఈ నిర్ధారణకు వచ్చా రు. చెక్‌పోస్ట్‌లు అక్రమ వసూళ్లకు కేంద్రాలుగా మారాయన్న ఆరోపణలు ఉన్నందున ప్రక్షాళనకు చర్యలు మొదలు పెట్టారు. జిల్లాలోని మొత్తం చెక్‌పోస్ట్‌ల స్థితిగతులు, సిబ్బంది, పర్యవేక్షణ తీరు, అవినీతి ఆరోపణలు తదితరాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు.
త్రిసభ్య కమిటీ
చెక్‌పోస్ట్‌ల అధ్యయనం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో నార్త్ డీఎఫ్‌ఓ, వ న్యప్రాణి విభాగం డీఎఫ్‌ఓ,ఫ్లైరుు్యంగ్ స్క్వా డ్ డీఎఫ్‌ఓ సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్ట్‌ల్లో అవసరానికి అనుగుణంగా పనిచేస్తున్న ఎన్ని ఉన్నారుు? ఉపయోగంలో లేని ఉంటే మూసివేతకు అనుమతులు కోరాలని నిర్ణరుుంచినట్లు సమాచారం. అవినీతి ఆ రోపణలు వస్తున్న చెక్‌పోస్టుల్లో అందుకు బ లమైన కారణాలు ఏమిటనే కోణంలో విచారణ చేసిన అధికారులు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. పరిస్థితి చక్కదిద్దేందుకు, సమస్యలు అధిగమించేందుకు కమిటీ నియమించినట్లు సమాచారం.
ప్రైవేట్ పేరుతో వసూళ్లు
జిల్లాలో ఉన్న తొమ్మిది అటవీశాఖ చెక్‌పోస్టుల్లో అధికారులకు సహాయకులుగా ఉండేందుకు ప్రైవేట్ సిబ్బందిని నియమించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీన్ని ఆసరా చేసుకొని చెక్‌పోస్టుల్లో పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతున్నట్లు ఉన్నతాధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. చెక్‌పోస్ట్‌ల వద్ద పనిచేసే ఉద్యోగులు, పర్యవేక్షించే అధికారుల పాత్ర స్పష్టమవుతున్నా పలుమార్లు ప్రైవేట్ వ్యక్తులపై నెట్టివేస్తున్నట్లు గుర్తించారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద ఇకపై ప్రైవేట్ వ్యక్తులు లేకుండా చేయూలని నిర్ణరుుంచారు. త్రిసభ్య కమిటీ అధ్యయనంలో ఇది కీలకంగా చేర్చారు. ప్రైవేట్ వ్యక్తుల స్థానంలో అటవీశాఖలో నమ్మకంగా పనిచేస్తున్న బేస్‌క్యాంప్ సిబ్బంది సేవ లు వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
ప్రత్యేక ఉత్తర్వులతో చెక్‌పోస్ట్ విధుల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిని అక్కడి నుంచి తప్పించాలని మొదట అనుకున్నారు. అరుుతే ప్రత్యేక ఉత్తర్వుల తో చెక్‌పోస్టుల్లో పోస్టింగ్‌లు పొందిన కొందరికి అధికారుల నిర్ణయం మింగుడు పడక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మధ్యేమార్గంగా రేంజ్ పరిధిలోని ఉద్యోగులకు చెక్‌పోస్టు విధులు రొటేషన్ పద్ధతిలో కేయించేలా అధికారులు ప్రస్తుతానికి ఆదేశాలు ఇచ్చారు. త్రిసభ్య కమిటీ నివేదిక తర్వాత ఈవిషయంలోనూ స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
తొమ్మిది చెక్‌పోస్టుల్లో అదే తీరు
జిల్లాలో అటవీశాఖకు చెందిన తొమ్మిది చెక్‌పోస్టులు ఉన్నారుు. బ్రాహ్మణపల్లి, జంగాలపల్లి అటవీశాఖ నార్త్ డివిజన్ పరిధిలోకి, మహబూబాబాద్ సమీపంలోని చెక్‌పోస్టు, నర్సంపేట సమీపంలోని చెక్‌పోస్టు సౌత్ డివిజన్‌లోకి, ఏటూరునాగారం, పస్రా, భూపతిపేట, కొత్తగూడ చెక్‌పోస్టులు వన్యప్రాణి విభాగంలోకి వస్తాయి. వీటిలో కొన్ని అవసరం లేదని, వాటి ప్రదేశాలు మార్చి మరో చోట ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది. ఈ విషయం కమిటీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వన్యప్రాణి విభాగం డీఎఫ్‌వో పురుషోత్తం మాట్లాడుతూ చెక్‌పోస్టుల వద్ద ఇటీవల జరుగుతున్న పరిణామాలు, ఆరోపణల నేపథ్యంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు.