సచివాలయంలో తమ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన త్రిసభ్య కమిటీ బృందం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిరుపయోగంగా ఉన్నందున ఈ భవనాలను ఇవ్వడం తప్ప గత్యంతరం లేదని, తమ ముఖ్యమంత్రితో మాట్లాడి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సమక్షంలో రెండు రాష్ట్రాల కమిటీ సభ్యులు గురువారం రెండోసారి భేటీ అయ్యా రు. తెలంగాణ తరఫున మంత్రులు హరీశ్‌రా వు, జగదీశ్‌రెడ్డి, సలహాదారు వివేక్, మెంబర్ సెక్రెటరీ రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ తరఫు న మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, విప్ కాల్వ శ్రీనివాసులు, మెంబర్ సెక్రెటరీ ప్రేమచంద్రారెడ్డి హాజరయ్యారు. పలు కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు.