
నాగార్జున యూనివర్సిటీ ఘటనలపై త్రిసభ్య కమిటీ!
సాక్షి, హైదరాబాద్: గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి, అందుకు దారితీసిన కారణాలు, తదనంతర పరిణామాలపై విచారించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించింది. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కమిటీ సభ్యుల పేర్లపై పరిశీలన చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం మాజీ ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, విక్రమసింహపురి వీసీ ప్రొఫెసర్ వీరయ్య, ఆర్. సుదర్శనరావులను ఈ కమిటీలో నియమించవచ్చని తెలుస్తోంది.