'నాగార్జున' లో మరోసారి ర్యాగింగ్
'నాగార్జున' లో మరోసారి ర్యాగింగ్
Published Fri, Sep 9 2016 4:12 PM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM
-ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్
నాగార్జున యూనివర్సిటీ : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. వివరాలు.. యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం ఈసీఈ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మొదటి సంవత్సరం సివిల్ స్టూడెంట్ జయంత్‌ను గురువారం రాత్రి ర్యాగింగ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆచార్య పి. సిద్ధయ్య ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన శంకర్, నవీన్, వెంకట కృష్ణ, కల్యాణ్, మనోజ్ కుమార్ లను హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Advertisement
Advertisement