ఢిల్లీ: కనీస మద్దతు ధర, రైతుల ఇతర సమస్యల పరిష్కారానికి సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు సమస్యల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు సోమవారం ప్రకటించింది. శంభు సరిహద్దు వద్ద ఉన్న రైతుల దిగ్బంధాన్ని తొలగించాలన్న పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాలపై హర్యానా రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా రైతు సమస్యల పరిష్కారానికి పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ అధ్యక్షతన సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వారంలోగా రైతులతో తొలి చర్చలు జరపాలని కమిటీని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.
ఇక.. రైతులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఢిల్లీ శివారులోని శంభు సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి పంటలకు మద్దతు ధర, ఇతర సమస్యలను పరిష్కారించాలని శంభు బోర్డర్‌లో రైతులు చేపట్టిన నిరసనలు ఇటీవల 200 రోజులను పూర్తి చేసుకున్నాయి. ఈ నిరసనలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment