హక్కుల కార్యకర్తల నుంచి జర్నలిస్టులు, ఎన్నికల ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, విపక్షనేతలు, మంత్రులు.. పరిమితి లేకుండా, ఎంపిక చేసిన అందరి కదలికల్ని, భావాల్ని, ఆలోచనల్ని, సంభాషణల్ని, ఫోటోలని, డాక్యుమెంట్లనూ చడీచప్పుడు లేకుండా ‘నిరంతర నిఘా’తో లాక్కుంటే ఇక ఏమి మిగులుతుంది? ప్రత్యక్షంగా ఇది ప్రజాస్వామ్య హక్కులపైనే దాడి. మొత్తం పౌర సమాజమే ఓ అనధికారిక నిఘా నేత్రం కింద, నిరంతరం నలుగుతున్నట్టు లెక్క! తాజా ‘పెగసస్’ స్పైవేర్ అలజడి ఈ ఉల్లంఘనే! రాజ్యమే ఈ చర్యకు పాల్పడితే ఇక పౌరులకు దిక్కేది?
గ్రీక్ ఇతిహాసంలోదే అయినా... ఎగిరే రెక్కల గుర్రం (పెగసస్) అంటేనే అసాధారణ శక్తి. అది ఆధునిక శాస్త్ర సాంకేతికత రూపంలో కనబడకుండా, వినబడకుండా అన్ని వ్యక్తిగత గోప్య ప్రదేశాల్లోకి చొర బడితే పరిస్థితి ఏంటి? పురమాయించిన పనే రహస్య నిఘా, నివేదిం చడం అయితే, రాజ్యాంగం దేశ పౌరులకు హామీ ఇచ్చిన వ్యక్తిగత గోప్యత హక్కు గాలికిపోయినట్టే! సదరు స్వేచ్ఛ ఆధారంగా అభిప్రా యాలు ఏర్పరచుకోవడం, భావ వ్యక్తీకరణ, పాలనలో పాల్గొనడం మొదలు... గౌరవప్రదంగా జీవించడం వరకుండే ప్రజాస్వామ్య మౌలిక హక్కులన్నీ భంగపోయినట్టే! హక్కుల కార్యకర్తల నుంచి జర్నలి స్టులు, ఎన్నికల ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, విపక్ష నేతలు, మంత్రులు.... పరిమితి లేకుండా, ఎంపిక చేసిన అందరి కద లికల్ని, భావాల్ని, ఆలోచనల్ని, సంభాషణల్ని, ఫోటోలని, డాక్యుమెం ట్లనూ చడీచప్పుడు లేకుండా ‘నిరంతర నిఘా’తో లాక్కుంటే ఇక ఏమి మిగులుతుంది? ప్రత్యక్షంగా ఇది ప్రజాస్వామ్య హక్కులపైనే దాడి. మొత్తం పౌర సమాజమే ఓ అనధికారిక నిఘా నేత్రం కింద, నిరం తరం నలుగు తున్నట్టు లెక్క! తాజా ‘పెగసస్’ స్పైవేర్ అలజడి ఈ ఉల్లంఘనే! ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందెవరు? ఎవరు చేయిం చారు? విస్తృతి ఎంత? అన్నది తేలితే కాని, ప్రమాద తీవ్రత బోధ పడదు. విపక్షాలు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నట్టు రాజ్యమే ఈ చర్యకు పాల్పడితే ఇక పౌరులకు దిక్కేది? కేంద్ర ప్రభుత్వం చెబుతు న్నట్టు తనకు ప్రమేయం లేకుంటే, మరెవరు చేసినట్టు? దేశంలోని అత్యున్నత వ్యవస్థలు, వ్యక్తుల గోప్య సమాచారంపైన, కేంద్ర ప్రభు త్వానికి తెలియకుండా ఏ విదేశీ ఎజెన్సీలదో నిఘా ఉంటే, సమాచార మంతా రహస్యంగా వారికి చేరుతుంటే, దేశ భద్రతకది ముప్పు కాదా? నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఇవీ తాజా ప్రశ్నలు. పార్లమెంటు కార్యకలాపాలు గత నాలుగు రోజులుగా ఇదే వివాదంపై దాదాపు స్తంభించాయి. సాంకేతిక పరిజ్ఞానమే ఉపకర ణంగా ‘పెగసస్’ ఓ నిఘా దాడి. ఇజ్రాయెల్‌కు చెందిన జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) ఈ స్ఫై(సాఫ్ట్)వేర్ విక్రేత! ప్రపంచ వ్యాప్తంగా 45 దేశాల్లో యాబై వేలమంది మొబైల్ నంబర్లు ఈ నిఘా కింద ఉండగా, వెయ్యిమంది ఫోన్ల నుంచి సమాచార చౌర్యా(హాక్)నికి లంకె ఏర్ప డ్డట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది. పారిస్ కేంద్రంగా పనిచేసే లాభా పేక్షలేని ఓ మీడియా కూటమి (ఫోర్‌బిడెన్ స్టోరీస్)– హక్కుల సంఘం (ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్) జరిపిన పరిశోధనలో ఇది ధ్రువపడింది. అందులో మన దేశానికి చెందిన 300 నంబర్లు బయట పడ్డాయి.
తొలిసారి కాదు
తెలియకుండానే ‘పెగసస్’ నిఘా దేశంలో పలువురిపై ఉందని వెల్లడ వడం ఇదే మొదటిసారి కాదు. రెండేళ్ల కిందటే వెలుగులోకి వచ్చింది. భీమా–కోరేగావ్ నిందితులైన హక్కుల కార్యకర్తలు, న్యాయవాదుల టెలిఫోన్లు ట్యాప్/హ్యాక్ అయ్యాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తెలియకుండానే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలోకి ఓ మాల్‌వేర్ చొరబడి పోయింది. అప్పటికే పెగసస్ ప్రస్తావన వచ్చింది. 2019లో పార్ల మెంట్ (ఐటీ) స్థాయీ సంఘం విచారించినపుడు, 121 మంది ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్టు అధికారులు తెలిపారు. రిమోట్ పద్ధతిలో మొబై ల్‌లోకి వచ్చి తిష్టవేసే ఈ మాల్‌వేర్, ఫోన్ యజమానికి స్పృహలో లేకుండానే సమాచారాన్ని వేరెక్కడో కేంద్రకంగా పనిచేసే నిర్వాహ కులకు చేరుస్తుంది. కాంటాక్ట్ నంబర్లు, మెసేజ్‌లు, కాల్‌డాటాయే కాకుండా సంభాషణలు, మెయిల్ సమాచారం, పత్రాలు, ఫోటోలు కూడా పంపిస్తుంది. రిమోట్ ఆపరేషన్ పద్ధతిలోనే కెమెరా కూడా పని చేస్తుంది. మన దేశంలో, బయట కూడా ఇది వెలుగుచూశాక... వాట్సాప్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి సామాజిక మా«ధ్యమ వేదికలు పెగసస్ బారిన పడకుండా సెక్యూరిటీ ఫీచర్స్‌ను ఆధునికీకరించు కున్నాయి. అయినా, ఆ స్ఫైవేర్ మరింత ఆధునికతతో ఆపిల్, ఆండ్రా యిడ్‌లలో చొరబడగలుగుతోంది. ‘పెగసస్’ సేవల్ని ప్రభుత్వం విని యోగించుకుంటోందా? అన్న నిర్దిష్ట ప్రశ్నకు నాటి ఐ.టీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ రాజ్యసభలో సూటిగా సమాధానం చెప్పకుండా దాట వేశారు. ‘ఏది జరిగినా చట్టనిబంధనలకు లోబడి, అధికారిక అనుమ తులతోనే నిఘా ఉంటుంది’ అని ఓ నర్మగర్భ సమాధానమిచ్చారు. మాల్‌వేర్ విక్రేత ఎన్‌ఎస్‌ఓ కథనం ప్రకారం ఇది కేవలం ప్రభు త్వాలకు, వారి అధీకృత సంస్థలకే విక్రయిస్తారు. నిర్దిష్టంగా దేశ భద్రత, తీవ్రవాద కార్యకలాపాల నియంత్రణ కోసమే! అలాంట ప్పుడు సమాజంలోని వివిధ వృత్తుల, స్థాయిల వారి ఫోన్లు ఎందుకు హ్యాక్ అయ్యాయి? ప్రభుత్వ విధానాలను నిరసించే వారు, చీకటి వ్యవహారాల నిగ్గుతేల్చే పరిశోధనా జర్నలిస్టులు, గిట్టని అధికారులు, రాజకీయ ప్రత్యర్థులు ఎందుకు లక్ష్యం అవుతున్నారు? జాబితాలోని పేర్లను బట్టి చూసినా, ఈ నిర్వాకం ఎవరి చర్య? వారిపై నిఘా వేయా ల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అన్నది ఇట్టే తెలిసిపోతోంది. వెల్లడైన జాబితా ఊహాజనితమని ఒకసారి, తామేమీ నిర్వహించం, స్ఫైవేర్ ఒకసారి విక్రయించాక, నిర్వహణ అంతా ఆయా దేశాలదే అని మరోమారు ఎన్‌ఎస్‌వో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తోంది.
సంస్కరణలు రావాలి
మన దేశంలో నిఘా వ్యవస్థ నిర్వహణ సరిగా లేదు. సమూల సంస్క రణల అవసరం. వ్యక్తుల గోప్యత హక్కు–దేశ భద్రత మధ్య సమ తూకం సాధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని కేంద్ర గృహమంత్రి అమిత్ షా తాజా వివాద నేప«ధ్యంలో వెల్లడించారు. కానీ, చట్టాలకు అతీతంగా, అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రభుత్వ నిఘా నిర్వాకాలు భంగం కలిగించిన సందర్భాలే ఎక్కువ. ‘వ్యక్తిగత సమాచార సంరక్షణ చట్టం’ దేశంలో ఇంకా తుది రూపు సంతరించుకోలేదు. ‘గోప్యత పౌరుల ప్రాథమిక హక్కే’ అని 2018లోనే సుప్రీంకోర్టు తేల్చింది. పౌరుల వ్యక్తిగత సమాచారంలోకి అనుచితంగా జొరబడే అధికారం ప్రభుత్వానికి, దర్యాప్తు–నిఘా సంస్థ లకి లేదు. సంభాషణల్ని అడ్డగిస్తూ, టెలిఫోన్ ట్యాప్ వంటివి చేయాల్సి వచ్చినా.. చట్టాలకు లోబడి, సుప్రీంకోర్టు వేర్వేరు సంద ర్భాల్లో వెల్లడించిన తీర్పుల స్ఫూర్తిని నిలబెడుతూ జరపాలి. అలా నిఘా వేయాలంటే, ఏయే పరిస్థితులు ఉండాలో 2017లో, 2019లో జస్టిస్ పుట్టుస్వామి ఇచ్చిన తీర్పులే స్పష్టం చేశాయి. ‘నేర ప్రక్రియ çస్మృతి’ (సీఆర్‌పీసీ) సెక్షన్ 92, ‘భారత టెలిగ్రాఫ్ చట్టం’, నిబంధన 419ఎ తో పాటు ‘ఐ.టీ చట్టం’, సెక్షన్లు 69, 69బి కింది నిబంధనల ప్రకారమే ప్రస్తుతం పౌరుల టెలిఫోన్ సంభాషణలు, ఇతర సమా చార–ప్రసార మార్పిడులలో అధికారులు కల్పించుకుంటున్నారు. నిఘా వేస్తున్నారు. విధివిధానాల్లో స్పష్టత లేక, రాజకీయ ప్రయోజ నాలకోసం దురుపయోగం ఎక్కువనేది విమర్శ. హిమాచల్‌ప్రదేశ్‌లో, 2012లో కొత్త ప్రభుత్వం పోలీసు దర్యాప్తు సంస్థలపై దాడి జరిపి నపుడు, వెయ్యి మందికి సంబంధించిన లక్ష సంభాషణలు దొరికాయి. 2009లో సీబీడీటీ–నీరారాడియా వ్యవహారంలో, 2013లో గుజరా త్‌లో అమిత్‌షాపై అభియోగాలు వచ్చిన కేసులో... ఇలా చాలా సంద ర్భాల్లో ఇదే జరిగింది.
పౌరుల హక్కుల భంగంతో పాటు దేశ ప్రతిష్ట విశ్వవేదికల్లో ఇటీవల దిగజారిపోతోంది. అమెరికాకు చెందిన ‘ఫ్రీడమ్ హౌజ్‘ భారత్‌ను స్వేచ్ఛాయుత స్థితి నుంచి పాక్షిక స్వేచ్ఛా దేశంగా వెల్లడిం చింది. ‘వి–డెమ్’ అనే స్వీడన్ సంస్థ అతిపెద్ద ప్రజాస్వామ్యమే కాదు, మనది ‘ఎన్నికల నియంతృత్వం’ అని తన వార్షిక నివేదికలో అభివ ర్ణించింది. ‘ప్రజాస్వామ్య సూచిక’లో భారత్ ‘లోపభూయిష్ట ప్రజా స్వామ్యం’గా ముద్రపడి 53వ స్థానానికి పడిపోయింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 142 (180 దేశాలకు) స్థానానికి దిగజారి పోయాం. నిర్హేతుకమైన నిఘా, వ్యక్తిగత గోప్యతపై దాడి జరిగిన తాజా వివాదంపై నిష్పాక్షికమైన, స్వతంత్ర దర్యాప్తు జరగాలి. నిజాలు నిగ్గుతేలాలి. అప్పుడే, పౌరులకు రక్ష, మన ప్రజాస్వామ్యానికి విలువ.
దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment