
ఐఫోన్ యూజర్లకు ఆపిల్ హెచ్చరించింది. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో పొంచి ఉన్న ముప్పును తప్పించుకునేందుకు గాను ఆపిల్ ముఖ్యమైన అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. వెంటనే యూజర్లు ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. సౌదీకి చెందిన ఆక్టివిస్ట్‌పై పెగాసస్‌తో నిఘా ఉంచినట్లు పరిశోధకులు గుర్తించారు. టోరంటో విశ్వవిద్యాలయం ల్యాబ్ పరిశోధకులు ప్రస్తుతం ఐఫోన్‌లోని ఐవోఎస్ 14పై ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పెగాసస్‌తో దాడులు జరుగుతున్నట్లు గుర్తించారు.
చదవండి: Apple: మాకు ఎవరీ సహాయం అక్కర్లేదు..!
ఐఫోన్లలోని ఐమెసేజ్ యాప్‌కు వచ్చే హానికరమైన లింక్‌పై యూజర్లు క్లిక్ చేసినప్పుడు హ్యకర్లు యూజర్లపై నిఘా ఉంచడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. మీరు ఐఫోన్ యూజర్ అయితే, మీ ఐఫోన్‌లో సాఫ్ట్‌వేర్‌ని ఐవోఎస్ 14.8 కి అప్‌డేట్ చేయాలని ఆపిల్ నిర్ధేశించింది. అదేవిధంగా, ఐప్యాడ్ వినియోగదారులు సాఫ్ట్‌వేర్‌ను కూడా ఐప్యాడ్‌వోఎస్ 14.8 కి అప్‌డేట్ చేసుకోవాలని ఆపిల్ సూచించింది.
సీవీఈ-2021-30860 అని పిలవబడే హ్యకర్ల బృందం సౌదీ అరేబియాలోని, ఇతర దేశాలలో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్ అభివృద్ధి చేసిన పెగాసస్ సాఫ్ట్‌వేర్‌తో ప్రముఖ వ్యక్తులపై నిఘా ఉంచుతుందనే విషయాలను వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను పెగాసస్ సాఫ్ట్‌వేర్ కుదిపేసింది. భారత్‌లో కూడా పెగాసస్ అంశంపై పార్లమెంట్‌లోప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే.
చదవండి: iPhone 13 Launch: ఐఫోన్-13 సిరీస్..14 సిరీస్ ట్విస్ట్ ఉంటుందా? ధరలు ఇవే! లైవ్ చూడడం ఎలాగంటే..
Comments
Please login to add a commentAdd a comment